ఈ వెబ్‌సైట్ నిర్మాణదశ లో వున్నది. 31 అక్టోబర్ 2023 లోపుగా నిర్మాణం పూర్తి కావచ్చును.
ఓం శ్రీ గణేశాయ నమః
1992 వ సంవత్సరము నుండి వాస్తు శాస్త్ర పరిశోధనలు కావిస్తూ 2003 వ సంవత్సరము లో మన శుభవాస్తు డాట్ కామ్ వెబ్సైటు ను స్థాపించి తద్వారా సమాజం లోని గౌరవనీయులైన గృహస్థులకు సేవ చేసుకొనే భాగ్యం కలిగింది. ఇది మాకు లభించిన వరంగా భావిస్తున్నాము. ప్రస్తుతం మన భారతీయ భాషలలో వాస్తు శాస్త్రమును వివరంగా విపులీకరించాలని తలిచాము. సమాజం లోని ప్రతి గృహస్థులూ సంతోషకరమైన జీవితం అనుభవించడానికి ఇది ఓ మానవ ప్రయత్నం. మీ అందరి ఆధారాభిమానములు నిండు మనసుతో
ఎల్లవేళలా ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము.


శుభవాస్తు తెలుగు వెబ్ సైట్ కు సుస్వాగతం

సమాజంలో ఎందరో గృహస్తులు తమ జీవితాన్ని గౌరవప్రదంగా కొనసాగించడానికి సర్వ శక్తులా పోరాడుతూ ఉంటారు. ఇందులో గెలిచిన వారి కంటే ఓటమిపాలైన వారి శాతం ఎక్కువగా ఉండవచ్చు. పంటిబిగువున తమ బాధలను అనుభవిస్తూ ఇతరులతో తమ కష్టాలను చెప్పలేక, జీవిత సమరంలో గెలుపు కోసం అహర్నిశలు పోరాటం చేస్తున్న ఎందరో ఉన్నతాశయం కలిగిన మగధీరులకు, స్త్రీ మూర్తులకు, ఈ వాస్తు శాస్త్రం వల్ల కాస్త సహాయం లభించి వారి లక్ష్యాన్ని సులభరీతిలో అందుకోవడానికి చేస్తున్న ఒక “మానవ” ప్రయత్నమే “శుభవాస్తు తెలుగు అంతర్జాల సమాచార శ్రవణి”. ఈ మహాద్భుతమైన వాస్తుశాస్త్రమును మనకు అందజేసిన దైవ సమానులైనటువంటి మహర్షులకు, మహిమాన్విత మహానుభావులకు సర్వదా మేము రుణపడి ఉంటాము. పూర్వకాలంలో భారత దేశ మహర్షులచే విరచితమైన మన పురాతన భారతీయ వాస్తు శాస్త్రం తరువాత కాలంలో ఎన్నో పరిశోధనలకు నోచుకొని ప్రస్తుతం అద్వితీయమైన సంస్కరణలకు ఆవిష్కృతమై, జనరంజకమైన విధానాలను పాటిస్తూ జన హృదయాలలో సజీవంగా నిలవటం మన సత్పురుషుల గొప్పతనం. ప్రజా శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని మన భారత దేశ పురాతన వాస్తుశాస్త్ర అభివృద్ధి కోసం నిరంతరం వివిధ పరిశోధనలు చేస్తూ మానవాళికి మహోపకారాన్ని ఒనగూరుస్తున్న సౌమ్యులు, మహౕనుభావులు, అతిరధ మహౕరధులైన ప్రతి వాస్తు శాస్త్ర వేత్తకు ఈ వెబ్ సైట్ ను గౌరవ ప్రపత్తులతో అంకితం చేస్తున్నాము. మానవ సేవే మాధవ సేవ. మానవులకు సేవ చేస్తున్న వీరందరూ మాకు మాధవునితో సమానం. హరి ఓం తత్ సత్.

గృహ నిర్మాణ వాస్తు
మానవులకు సమస్త సర్వ అనుభూతులను తాము నివసిస్తున్న గృహం కలుగ చేస్తుంది. కొందరికి ఉత్తమ ఫలితాలు, మరి కొందరికి అశుభ ఫలితాలు రావచ్చు. గృహములో ఏ ప్రభావం వల్ల ఇలా జరగవచ్చు?

దిక్కుల వివరణ
దిక్కులు అనగా ఏమిటి, మొత్తం ఎన్ని దిక్కులు వున్నాయి. వాటి నామములు ఏమి? ఈ దిక్కుల ప్రాముఖ్యత ఏమిటి, వీటి ప్రభావం గృహస్థులపై ఎలా ఉంటుంది?, ప్రతి దిశ గురించి సంపూర్ణంగా ఎలా తెలుసుకోవాలి?

వీధిపోట్ల ఫలితములు
వీధి పోట్లు అనేవి వాస్తు శాస్త్రంలో నిజంగా ఉన్నాయా, ఈ వీధి పోట్ల ప్రభావం గృహములపై, ఇతర నిర్మాణముల పై ఎలా ఉంటుంది. వీటిలో మంచి, చెడు ఫలితాలు ఇచ్చేవి ఉన్నాయా. నివారణ విధానమేంటి?

పరిసర వాస్తు
వాస్తు శాస్త్రం గురించి విన్నాము మరి పరిసర వాస్తు అనగా ఏమిటి? ఈ పరిసర వాస్తు అనేది భారతీయ పురాతన వాస్తు శాస్త్రంలోని ఒక భాగమా లేదా నూతనంగా ఆవిష్కరించబడినదా? దీని ప్రభావం ఉంటుందా?
శుభవాస్తు పుస్తకాలు చదివిన తర్వాత, నిరాశక్తిగా, నిర్లక్ష్యంగా, జీవచ్ఛవంలా బ్రతుకుతున్న ఒక అత్యంత సామాన్య వ్యక్తి కూడా ఒక నాయకుడిలా ఎదగడానికి తన సర్వశక్తులు కూడబలుక్కొని, తనంటే ఏమనేది ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నాన్ని ప్రస్ఫుటంగా చేస్తున్నాడు. శుభవాస్తు పుస్తకాలు చదివిన వారు ఇతరులను చూసి ప్రేరణ పొందడం లేదు, వారే ఇతరులకు ప్రేరణ అవుతున్నారు – ఆనంద్ – విశ్రాంత సైన్యాధికారి – భాగ్యనగరం – తెలంగాణ.
వాస్తు శాస్త్రంలో దిశల యొక్క ప్రాముఖ్యత

తూర్పు ముఖ ద్వార గృహ వాస్తు
ప్రతి తూర్పు గృహం, అందు నివసించే గృహస్థులకు సర్య సౌఖ్యాలనూ, సకల భోగాలను, కీర్తి ప్రతిష్టలను అందిస్తుందా? ఇది వాస్తవమైన విషయమేనా? ఈ తూర్పు దిశ గృహములలో నివసించే ప్రతి ఒక్కరూ మహాద్భుతమైన, ఆనందకరమైన జీవితాన్ని పొందుతున్నారా, ఇంతకీ ఈ తూర్పు గృహం ద్వారా కలిగే లాభాలు ఏమిటి మరియూ నష్టాలు ఏమిటి? ప్రతి తూర్పు గృహం సర్వ విధాలా గృహస్థులకు ఆనందాన్ని కలుగచేస్తాయా. ఈ తూర్పు ముఖ ద్వార గృహంలో నష్టపోయిన వారు ఎవ్వరూ లేరా. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారా? ఈ తూర్పు ముఖ ద్వార గృహ వాస్తు అనుబంధ సమాచార పుట లో ఎన్నో విషయాలను పొందుపరిచాము.

ఆగ్నేయ ముఖ ద్వార గృహ వాస్తు
ఆగ్నేయ దిశ భాగంలో ఎన్ని రకాలైన గృహములు కలవు, వాటి ప్రభావం అందు నివసించే గృహస్థులపై ఏ రీతిన ఉంటుంది? ఆగ్నేయంలో నిర్మించిన గృహాన్ని కొనుగోలు చేసినట్లయితే జీవితం నాశనం అవుతుందా? నివారణ లేదా? ప్రతి ఒక్క ఆగ్నేయ ముఖ ద్వార గృహము, అందు నివసించే గృహస్థులకు ఇబ్బందులను కలుగ చేస్తుందా, గృహస్థులపై ప్రభావములు ఎలా ఉంటాయి? ఆగ్నేయ ముఖ ద్వార గృహము కొనడం అంటే జీవితాన్ని నాశనం చేసుకోవడమేనా? ఇందలి గృహస్తులు నరకాన్ని చూస్తున్నారా? ఆగ్నేయ ముఖ ద్వార గృహమును కొనటం ప్రమాదమా? ఈ దిశ శుభ, అశుభ ఫలితాలు ఏమిటి?

దక్షిణ ముఖ ద్వార గృహ వాస్తు
దక్షిణ ముఖ ద్వార గృహము, ఈ పేరు వినగానే కొందరు అయిష్టత చూపిస్తారు, మరికొందరు ఆనందంగా స్వీకరిస్తారు. దక్షిణ ముఖ ద్వార గృహము కొనవచ్చునా ! లేదా?, కొందరు దక్షిణముఖ ద్వార గృహము బాగా కలిసి వచ్చింది అని తెలుపుతారు. మరికొందరు దక్షిణముఖ ద్వార గృహంలో వేదన పొందాము, ఇబ్బందులు పడ్డాము అని చెబుతుంటారు. ఏ నిర్మాణ వ్యత్యాసం వల్ల ఇటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఈ దిశ గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలని ఎంతోమంది గృహస్తులు కోరికతో ఉంటారు. అటువంటి వారి కోసం ఈ బంధం లో దక్షిణ ముఖ ద్వార గృహం యొక్క శుభ అశుభ ఫలితాలను విడమర్చి తెలియజేయడం జరిగినది.

నైరుతి ముఖ ద్వార గృహ వాస్తు
నైరుతి ముఖ ద్వార గృహం అనగానే, కొందరు గృహస్తులు ఉలిక్కిపడతారు. అయితే ఎన్నో పరిశోధనలు కావించిన తర్వాత ఎక్కువ శాతం, నైరుతి ముఖ ద్వార గృహంలో నివసించు గృహస్తులకు అనేక శుభములు కలగడం, వారు ఆనందంగా జీవితాన్ని గడపడాన్ని గమనించడం జరిగినది. ఇక్కడ ఒక్క విషయం అయితే మనం మరచిపోకూడదు. వాస్తు శాస్త్ర రీత్యా గృహం నిర్మాణమైనప్పుడు, అందు నివసించే గృహస్తులు తమ జీవితాన్ని సంతోషదాయకంగా మలుచుకుంటారు. వాస్తుకు బాగుగా లేని గృహం, అది ఏ దిశలో, లేదా ఏ దిక్కుకు ఉన్నను అందు నివసించే గృహస్తులు అష్ట కష్టాలు పడడం జరుగుతూనే ఉన్నది.

పశ్చిమ ముఖ ద్వార గృహ వాస్తు
పశ్చిమ ముఖ ద్వార గృహ శుభ అశుభ ఫలితాలు ఏమిటి. ముఖ్యంగా ఈ పశ్చిమముఖ ద్వార గృహ లక్షణాలను తెలుసుకోవాలని ఎంతమంది గృహస్థుల అభిలాష. పశ్చిమ ముఖ ద్వార గృహము తీసుకున్నట్లయితే అందులో నివసించే గృహస్తులు ఆనందకరమైన జీవితాన్ని అనుభవిస్తారా లేదా ఇబ్బందులకు గురి అవుతారా? ఏ పరిస్థితుల వల్ల ఈ పశ్చిమముఖ ద్వార గృహము యందలి నివసించే గృహస్తులు ఉన్నతులు అవుతారు లేదా ఇబ్బందులకు గురి అవుతారు? ఈ గృహం యొక్క నిర్మాణ కార్యక్రమం ఎలా చేయాలి? ఏ విధంగా ఈ గృహమును నిర్మించుకున్నట్లయితే అద్భుతమైన ఫలితాలను గృహస్తులు పొందగలరు?

వాయవ్య ముఖ ద్వార గృహ వాస్తు
వాయువ్య దిశ ముఖ ద్వార గృహం గురించి ప్రస్తుతం మనం తెలుసుకుంటున్నాము. ఈ వాయువ్య దిశలో మొత్తం ఎన్ని రకాలైనటువంటి గృహములు కలవు. ఇది వాయువ్య దిశ గృహమును మనము కొనవచ్చునా? ఈ దిశ గృహము అందు నివసించే గృహస్థులకు ఎటువంటి ఫలితాలను ఇస్తుంది. ఈ వాయువ్య దిశ గృహం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి. ఈ గృహం వల్ల కలిగే ఇబ్బందులు ఏమిటి నష్టములు ఏమిటి?, ఈ గృహం నందు నివసించే గృహస్తులు ఎటువంటి లాభములను ఆశించవచ్చును అనగా ఎటువంటి ఉత్తమ ఫలితాలను పొందవచ్చును. ముఖ్యంగా ఈ దిశ గృహము ఆర్థిక, మానసిక, ఆరోగ్య ఫలితాలపై ప్రభావములు చూపిస్తుందా?

ఉత్తర ముఖ ద్వార గృహ వాస్తు
ఉత్తర దిశ గృహం అనగానే చాలామంది గృహస్తులు ఎగిరి గంతులు వేస్తారు. ఉత్తర దిశ గృహంలో ఉంటే, విపరీతమైన ధనాదాయము ఉంటుందని, ఏ కష్టము లేకుండా ధనార్జన కావించవచ్చని కొందరు ఈ నిర్ణయానికి వచ్చి ఉంటారు. ఈ గృహములో ధన సంపాదన కోసం ప్రయాస తక్కువగా ఉంటుందని, కష్టం తక్కువ లాభం ఎక్కువ అని, అనుకుంటూ ఉంటారు. అయితే, వాస్తు శాస్త్ర రీత్యా ఏ గృహమైనా నిర్మించినట్లయితే అందలి గృహస్థులు, మంచి ధన సంపాదన చేయగలరు. వాస్తు శాస్త్ర రీత్యా నిర్మాణం కాని ఏ దిశాగృహమైననూ, అందు నివసించే గృహస్థులపై చెడు ప్రభావం చూపించగలదు. గమనించగలరు.

ఈశాన్య ముఖ ద్వార గృహ వాస్తు
ఈశాన్య దిశ గృహం అనగానే వెనకా ముందు చూడకుండా ఎంత ధనమైననూ వెచ్చించి, వెంటనే గృహమును/స్థలమును కొనడానికి చాలామంది గృహస్తులు తమ సాయశక్తులా ప్రయత్నం చేస్తారు. ఈ ఒరవడి ఉత్తర అమెరికా దేశంలో శిఖరాగ్రానికి చేరింది. చాలామంది నమ్మకపోవచ్చు కానీ, 17% అధికంగా ధర వెచ్చించి గృహమును కొన్న వారిని చూసాము. దురదృష్టం ఏమిటంటే, ఈయన ఆ ఇంటిని భారీ నష్టానికి అమ్ముకొని వెళ్ళిపోయాడు. ఇంత సొమ్ము అధికంగా చెల్లించి గృహము కొన్న అతను, వాస్తు శాస్త్ర సలహాను పొందడానికి కేవలం చిన్నపాటి రుసుమును చెల్లించి ఎవరితోనైనా సలహా పొంది ఉంటే, ఈ కష్టం వచ్చేదా.
బహుళ అంతస్తుల గృహ సముదాయము
బహుళ అంతస్తుల గృహ సముదాయ భవనము. ఆంగ్లంలో వీటినే “అపార్ట్మెంట్లు” అంటుంటారు. సాధారణంగా ఇటువంటి అపార్ట్మెంట్లలోని ఫ్లాట్లకు వాస్తు చూడడం కాస్త అనానుకూలమైనా, మార్పులు చేర్పులు చేయటం అంత సులభతరమైన విషయం కాదు. ఇటువంటి అపార్ట్మెంట్ ఫ్లాట్ల నందు ఏమైనా మార్పు చేయదలిస్తే ఉదాహరణకు ఒక తలుపును ఒక స్థానం నుండి ఇంకొక స్థానమునకు మార్చడం అంత సులభమైన విషయం కాదు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని ఫ్లాట్ ను కొనే ముందే ఒక అనుభవమున్న వాస్తు స్థపతి ద్వారా తగిన సలహా పొందడం శ్రేయస్కరం, శుభకరం, శోభాయమానం.
ఆరోగ్యం మరియు వాస్తు
వాస్తు ద్వారా ఆరోగ్యాన్ని పొందవచ్చునా ఇది నమ్మదగ్గ విషయమేనా! 100 సంవత్సరాల క్రితం మన చేతిలో మొబైల్ ఫోన్ వస్తుందని దాని ద్వారా ఇతర దేశాల వారితో మాట్లాడవచ్చని ఎవరైనా తెలిపితే, ఆనాటికి అతడు పిచ్చోడు. “నేడు” మొబైల్ ఫోన్ ద్వారా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని నడుచుకుంటూ మాట్లాడుతూ వెళుతూ ఉంటే చూసేవాళ్లకు విడ్డూరంగా అనిపించట్లేదు. ఇదే, ఒక 50 సంవత్సరాల క్రితం ఒకరు మాట్లాడుకుంటూ రహదారిలో వెళుతూ ఉంటే అతడు పిచ్చోడని నవ్వుకునేవాళ్లం. ఏదైనా పరికరం సృష్టింపబడి అది వాడుకలోకి వచ్చాక విశ్వసిస్తాము. “మా మాట “, వాస్తు మార్పుల ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోగలం.
కబుర్లు
ఒక వ్యక్తి ఇంటిలో పని చేస్తూ కాలం గడిపేస్తుంటే అతనికి బయట ప్రపంచం విషయాలు ఏమంత గొప్పగా తెలియకపోవచ్చు, ఇదే వ్యక్తి ఉదయం నడకకు వెళ్ళినప్పుడు లేక సాయంత్రం వ్యాహ్యాళి కి వెళ్ళినప్పుడు, అక్కడ ఓ పదిమందితో కలిసినప్పుడు ఎన్నో విషయాలు తెలుస్తాయి, అటువంటి విషయాలు ఇక్కడ మనం మాట్లాడుకుందాం. ఇక్కడ నొక్కండి – కబుర్లు

వృక్ష దేవత
ఏ గృహంలోనైతే వృక్షములను భారీగా పెంచుతారో అటువంటి గృహములందు అభివృద్ధి అనేది అధికంగా వచ్చే అవకాశం గోచరిస్తున్నది. ప్రకృతికి మందు ప్రకృతి మాత్రమే, వాస్తు శాస్త్రం అనేది పంచభూతములను ఆధారం చేసుకుని పని చేస్తుందనే విషయం మీ అందరికీ తెలిసినదే. ఈ పంచభూతములు మరియు ప్రకృతి కూడా విశ్వంలో ఒక భాగమే. పచ్చదనం ఎక్కడైతే అధికంగా ఏర్పాటు చేసుకుంటారో, అటువంటి గృహముల నందు అభివృద్ధి శాతం ఎక్కువగా ఉంటుంది, ఈ గృహములలో శాంతం ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది, సంపద వృద్ధి అవుతుంది, పిల్లలు బాగా చదువుకుంటారు. ఆరోగ్యం బాగా ఉంటుంది. ఇన్ని లాభాలను పెట్టుకుని చెట్ల విషయంలో మనము నిర్లక్ష్యం వహిస్తున్నాము. అవకాశం ఉన్నచోట చెట్లను పెంచండి.

వైద్యశాలలు - వాస్తు
వైద్యశాలలను సాధారణంగా "హాస్పిటల్" లేదా ఆసుపత్రి అని పిలుస్తాము. ఈ హాస్పిటల్ వాస్తు శాస్త్ర రీత్యా నిర్మాణం కానట్లయితే అందలి ముఖ్య వైద్యునికి, లేదా, నిర్వహణ యాజమాన్యం కు ఇబ్బందులు కలిగే అవకాశం ఏమైనా ఉందా! ఆసుపత్రిని తప్పనిసరిగా వాస్తు శాస్త్ర నియమ నియబంధనలతో నిర్మించాలా, ఒకవేళ అలా జరగకపోతే, ఏ ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది? హాస్పిటల్ నిర్మాణమునకు ఎంత ఖర్చు అవుతుంది, దీనిని బెరీజు వేసుకుంటే, వాస్తు కోసం చేసే ఖర్చు అత్యల్పము. గమనిస్తే ఉత్తమము. ఆసుపత్రి మరియు వాస్తు శాస్త్ర నిర్మాణ విధివిధానాల గురించి ఇక్కడ తెలియచేయడం అయినది. తీరికగా ఉన్నప్పుడు లాప్టాప్ లో మాత్రమే చదవగలరు, మొబైల్ ఫోన్ వాడవద్దు.
కరోనా వచ్చిన తరువాత గృహము నుండి కార్యాలయ కార్యక్రమములు చేయటం అధికమైనది. సత్ఫలితాల కోసమై వాస్తు శాస్త్ర రీత్యా మంచి ఫలితాలను ఇచ్చే గదిలో కూర్చోవడం వల్ల ఒత్తిడి నశించి, మానసిక శాంతి కలిగి కార్యాలయ నిర్వహణ కార్యక్రమములు సజావుగా జరిగే అవకాశం అధికం.
సత్ఫలితాలు మరియు దుష్ఫలితాలు
అనాది కాలము నుండి, మానవుడు ఉన్నత స్థితికి ఎదగడానికి తన సాయ శక్తులా, బలమైన ప్రయత్నాలు కావించి అహోరాత్రులు శ్రమించి అనేక పరిశోధనలు చేసి, వివిధ రకాలైనటువంటి పరికరాలను సృష్టించాడు. అలాగే భారతీయ సనాతన మహర్షులు ప్రసాదించిన వాస్తు శాస్త్రంలో కూడా అనేకమంది నవీన వాస్తు శాస్త్రవేత్తలు ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ఎన్నో పరిశోధనలు కావించి కొత్త కొత్త విషయాలను మన ముందు ఉంచారు. వాస్తు బాగా లేకపోతే వచ్చే దుష్పరిణామాలను విపులంగా విడమర్చి విరిచితపరిచారు. వాస్తు మార్పులు ఎలా చేసుకుంటే సత్ఫలితాలు వస్తాయో తెలియజేశారు. పరిశోధనల నిమ్మితం, శ్రమించిన ప్రతి ఒక్క మహానుభావుడికి తలవంచి నమస్కారం చేస్తున్నాము.


వాస్తు శాస్త్ర పుస్తకములు
పుస్తక పఠనం అంటే ప్రీతి. పుస్తకాలు చదవడం వాటిపై చర్చలు కావించడం ఇవన్నీ అప్పట్లో మనం ఉద్యానవనాలలోనూ, గ్రంథాలయముల బయట గమనించేవాళ్లం. ఎక్కువ శాతం జనం చేతిలో పుస్తకాలు పట్టుకొని కనిపించేవారు. అవకాశం దొరికితే పుస్తకం చదవాల్సిందే. తెలిసినవారు పుస్తకాల పురుగని గుసగుసలాడే వాళ్ళు. అయితే ఈనాటి తరం వాళ్లు పుస్తకాలను వదిలేసి మొబైల్ ఫోన్లు పుచ్చుకొని మెదడులతో పని లేకుండా యంత్రానికి బానిసై జీవితంలో శాంతిని కోల్పోతున్నారు. ఎన్నో వాస్తు పుస్తకాలు ప్రచురించి ప్రజలతో హృదయపూర్వక ఆశీర్వాదాలు పొందడం బహుదానందం. ప్రజలు వేన్నోళ్ళ పొగుడుతూ ఉంటే ఆ ఆనందమే బ్రహ్మానందం.