తూర్పు దిశ గృహ వాస్తు వివరణ మరియు ఫలితాలు

తూర్పు దిశ గృహమును ఎలా తెలుసుకోవాలి?

ఒక “స్థలమునకు” తూర్పు దిశన రహదారి ఉన్నచో ఆ స్థలమును తూర్పు స్థలము, లేదా తూర్పు దిక్కు స్థలం అని అంటారు. ఉదాహరణకు ఈ పటంలో తూర్పు దిశ స్థలమును చూడవచ్చును. ఇక్కడ ఒక స్థలమునకు తూర్పు వైపున రహదారి కలదు, ఇటువంటి స్థలమును తూర్పు దిశ స్థలము అని అంటారు. కొన్ని ప్రాంతాలలో “పూర్వ దిశ స్థలం” అని కూడా పిలుస్తారు.  ఆంగ్లంలో East Facing Plot అని అంటారు. ఈ స్థలం యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి, మరియు మనం ఈ స్థలాన్ని కొనుగోలు చేసే ముందు పాటించవలసిన జాగ్రత్తలు ఏమిటి అనే విషయాలను ఈ వ్యాసంలో తెలుసుకుందాము.

విజ్ఞప్తి : ఇక్కడ ప్రచురించిన అంశాలు కొన్ని నిర్దిష్ట పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. కొన్ని ప్రత్యేక అంశాలు లేదా విభిన్న పరిస్థితులలో, ఫలితాలలో అనుకోని మార్పులు సంభవించవచ్చు. వాస్తు శాస్త్రం ఒక జటిలమైన విషయం, ఎన్నో అంశాలతో, చిక్కుముడులతో ముడిపడి ఉంది. వినడానికి చేదుగా ఉన్నా, వాస్తవం ఏమిటంటే, వాస్తు పుస్తకాలు, వీడియోలు చూసి, మార్పులు చేసుకొని బాగుపడినవారికన్నా నష్టపోయిన వారే అధికం. స్వంత నిర్ణయాలు మాని, నిపుణుల సలహా తీసుకొని మాత్రమే నిర్ణయాలు తీసుకోండి. విషయ పరిజ్ఞానం కోసం కొన్ని విషయాలను తెలియచేసామే కానీ, పాటించమని కాదు, “ద య చే సి” గమనించగలరు.

దిక్సూచి లో తూర్పు దిక్కు ఏ వైపు ఉంటుంది?

వాస్తు శాస్త్రం గురించి తెలియజేయడం కోసం కొన్ని చిత్రపటములను చూపించాల్సి ఉంటుంది, అంతేకాకుండా వాటికి వివరణ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ క్రమంలో దిక్సూచి (Compass) గురించి చూపించడం చాలా ప్రాముఖ్యమైన విషయము. ఈ పటములో ఒక నారింజ రంగు బాణం లాంటి గుర్తు చూపిస్తున్న దిక్కును తూర్పు దిక్కుగా భావించాలి. క్రింది పటములలో కుడివైపున రోడ్డును “తూర్పు రహదారి” అని చూపించడం జరిగినది. అనగా ఇది తూర్పు దిక్కు అని అర్థము కదా.  కుడివైపుగా ఉన్నది తూర్పు దిక్కు, చిత్రం పై భాగంలో ఉన్నది ఉత్తరము, క్రింద దక్షిణము, ఎడమవైపున పశ్చిమము అని మీకు తెలుసు. క్రింద కొన్ని చిత్రములలో దిక్సూచి నమూనాను కనపరచక పోయుండవచును. గమనించగలరు.

వాస్తు లో తూర్పు దిక్కు

ఈ తూర్పు దిశ గురించి ఆంగ్ల భాషలో తెలుసుకోవాలనుకున్న వారు ఈ లింక్ East Facing House Vastu ద్వారా సంపూర్ణంగా తెలుసుకోవచ్చు ఈ బంధంలో ఎన్నో విషయాలను విపులంగా వివరించాము. అంతేకాకుండా దాదాపుగా 50 ప్రశ్నలకు సమాధానాలను పొందుపరిచాము. ఈ తూర్పు దిక్కు గృహం లో గృహస్థులు అనుభవించిన అనుభవాలను ఎన్నింటినో ఇక్కడ ప్రచురించడం జరిగినది. మీకు అవకాశం ఉన్నప్పుడు ఈ పై లింకు ద్వారా మీరు సమగ్ర సమాచారాన్ని పొందవచ్చును.

తూర్పు దిశ గురించి కొంత సమాచారం 

సాంప్రదాయ దిక్సూచి (కంపాస్) ప్రకారం తూర్పు దిశ 90 డిగ్రీలు ఉంటుంది. తూర్పు దిశకు గ్రహాధిపతి సూర్యుడు, పాలకుడు ఇంద్రుడు, వాహనము ఐరావతము అనగా ఏనుగు. తూర్పు భాగమునకు పాలకుడైన ఇంద్రుడు దేవతలకు అధిపతి, అనగా ఆధిపత్యం, కీర్తి, గౌరవము, అధికారము, భాగ్యం, భోగం, రాజయోగం. అంటే, వాస్తు రీత్యా తూర్పు గృహం నిర్మాణం అయినట్లయితే అందలి గృహస్తులు, పై శుభ ఫలితాలను అనుభవించేందుకు ఎక్కువగా అవకాశం ఉంటుంది. వాస్తు రీత్యా గృహాలు నిర్మాణం కానప్పుడు, లేదా బలమైన వాస్తు దోషాలు ఉన్నప్పుడు, ఈ పై వాటి విషయంలో కూడా గృహస్తులు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చును. 

తెలుగులో తూర్పు దిశ వాస్తు

తూర్పు దిశ ప్రభావం ఎవరిపై ఎక్కువగా ఉంటుంది మరియు ఏఏ విషయాల్లో ప్రభావితంగా ఉంటుంది?

తూర్పు దిశ యొక్క ప్రభావం సాధారణంగా ఇంటి లోని మగవారిపై ఉంటుంది. కుటుంబ కీర్తి ప్రతిష్టలపై, గౌరవ మర్యాదలపై, విద్య, ఉద్యోగ అర్హతలపై, వ్యాపార అభివృద్ధిపై, ఆరోగ్యం పై, సమాజంలో కుటుంబ స్థితిగతులపై ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. పరిసర వాస్తు ప్రభావం ఆధారంగా ఒక్కోసారి కొన్నివిషయాలలో మార్పులు సంభవించవచ్చును. ఇదమిత్తంగా ఇలాగే జరగాలి అని చెప్పేంత పరిశీలనలు చేసే అవకాశం లేకపోవడం వల్ల ఎన్నో విషయాలు గోప్యంగా ఉండిపోతున్నాయి.

వాస్తు పరిశోధనలకై  ప్రభుత్వాలు సహకరించక పోతే భారీ ఎత్తున ప్రయోగాలు చేయలేము. తగిన ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడం, ఆర్థిక సహకారం లేకపోవడం వల్ల, విమర్శకులు విపరీతంగా పెరిగిపోయి, సద్విమర్శలు కాకుండా కువిమర్శలు చెయ్యడంతో, ఒక భయోత్పాత వాతావరణం ఉండటం వల్ల, సంపూర్ణంగా మనసుపెట్టి పరిశోధనలు చేసే వారు కరువైపోయారు. ఇవ్వన్నీ ఒకయెత్తు, సాటి వాస్తు సిద్థాంతుల అవహేళనలు ఒకఎత్తు, ఏ పరిశోధనలు చేసినా మనస్సు కృంగదీసేలా అవహేళనలు చేస్తుంటే, ఏ శాస్త్రాలు అభివృద్ధికి నోచుకుంటాయి. ఇటువంటి పరిస్థితులలో కూడా, ఇంత అద్భుతంగా ఈ శాస్త్రాన్ని, ఈ కాలం తగ్గట్టుగా రూపుదిద్దిన వాస్తు శాస్త్రవేత్తలు ఎందరో అన్ని అవమానములను ఓర్చుకొని, ఆర్థిక పరిపుష్టి లేకపోయినా, ఆర్థిక సహకారం లేకపోయినా, తమ స్వంత ఆస్తులు కరగదీసుకొని, కడుపు మాడ్చుకొని ఎన్నో కొత్త విషయాలను సమాజం ముందు ఉంచారు. వారందరికీ పాదాభివందనాలు.

ఒకవేళ 100% సంపన్నుల సహకారం, కాస్త ప్రభుత్వ సహకారం ఉంటే, ఈ శాస్త్రమును ఊహించని విధంగా ప్రస్తుత కాలానికి తగిన విధంగా ఖచ్చితత్వంతో రూపొందించవచ్చు. పూర్వకాలం రాజులు తలచుకోబట్టే శాస్త్రాలు రూపుదిద్దుకున్నాయి. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. కాల ప్రభావమును ఎవ్వరూ మార్చలేరు. ఎదురీత ఎక్కువ కాలం చేయలేము కదా. ఒక్కసారి ఈ లింక్ నందలి విషయాలన్నింటినీ పరిశీలనగా చదవండి, చదవడానికే మీకింత సమయం పడితే, ఇక తయారు చెయ్యడానికి మాకెంత సమయం పట్టివుంటుంది?. అద్దాల మేడ నిర్మించడం చాలా కష్టం, కొన్ని రాళ్లు విసిరి దానిని నాశనం చెయ్యడం అత్యంత సులభం. సమాజం అభివృద్ధి వైపుగా వెళ్ళాలి, వినాశనం దిశగా వెళ్ళకూడదు. విద్యావంతులు ఎదుటివారి కష్టాన్ని చూస్తారు, వారిని తగిన రీతిలో గౌరవిస్తారు. దుష్టస్వభావం ఉన్నవారు అగౌరవ పరచాలని, అవహేళన చెయ్యాలని శతవిధాలా ప్రయత్నాలు చేస్తారు. ఇదే తేడా.

వాస్తవంగా ప్రతి ఒక్క తూర్పు దిశ గృహం అద్భుతంగా కలిసి వస్తుందా?

1. ప్రతి ఒక్క తూర్పు గృహము అద్భుతమైన ఫలితాలను ఇవ్వదు. అనవసరంగా అపోహలకు గురి అయ్యి స్థోమతకు మించి తూర్పు గృహాలను కొనవద్దు. వాస్తు బాగా ఉంటే మంచి ఫలితాలు వస్తాయి, వాస్తు బాగా లేక పోతే మంచి ఫలితాలు రావు. కొన్ని సంఘటనలు తెలిస్తే, తూర్పు గృహమే కొనరాదనుకుంటాము, అంత భయంకరమైన సంఘటనలు కొందరికి జరిగాయి. ఉదాహరణలు చాలా చెప్పే ప్రయత్నం చేస్తాము. ప్రతి ఒక్క సంఘటనను విడమర్చి చెప్పడానికి అవకాశం తక్కువగా ఉన్నందువల్ల కేవలం మీకోసం కొన్ని సంఘటనలను తెలియజేయడం జరుగుతున్నది. తర్వాత నిదానంగా మరికొన్ని సంఘటనలను చెప్పుకుందాం. బాగా “అనుభవం కలిగిన వాస్తు సిద్ధాంతులు” ఎన్నో సంఘటనలను చూసుంటారు. 

2. ఈ తూర్పు దిశ గృహం నిర్మించు సమయంలోనే తగిన వాస్తు జాగ్రత్తలు తీసుకున్నచో కుటుంబం మొత్తం కీర్తి ప్రతిష్టలతో, సుఖసంతోషాలతో, భోగభాగ్యాలతో, ఆరోగ్యంతో,  విద్యాబుద్ధులు నేర్చిన సంతానముతో విరాజిల్లుతూ అద్భుతంగా రాణిస్తుంది. సమాజంలో ఈ గృహస్థులకు గౌరవం బాగా పెరుగుతుంది. ముఖ్యంగా ఈ గృహస్థులకు సమాజంలో ఎల్లప్పుడూ గౌరవం లభిస్తూ ఉంటుంది. మనకు ఒక విషయం బాగా తెలుసు, ప్రాణం కన్నా గౌరవం ముఖ్యం. ఒకరి జీవితంలో గౌరవం పోయిన తర్వాత ఇక బ్రతికి ఏమి ప్రయోజనం. సాధారణంగా ఈ తూర్పు దిశ గృహం ఈ స్థలం ఇంటియందలి మగవారిపై సమాజంలోని కుటుంబ కీర్తి ప్రతిష్టలపై అధికంగా ప్రభావము చూపిస్తూ ఉంటుంది.

3. మన జాతకము బలహీనమైనను లేదా మనం నివసిస్తున్న గృహంలో వాస్తు బలం లేకున్నానూ,  మన శత్రువులు / దుర్మార్గపు లక్షణాలు కలిగిన వారి ప్రయత్నాలు సఫలం అవుతాయి. అదే మంచి వాస్తు పట్టు ఉన్న గృహంలో నివాసం ఉన్నట్లయితే, ఇటువంటి దుర్మార్గుల ప్రయత్నాలకు ఎల్లప్పుడూ గండి పడుతూ ఉంటుంది. ఒక నాలుగైదు సార్లు బలమైన ప్రయత్నాలు చేసి ఇక అవి సఫలం అవ్వకపోతే వీరు కూడా ఆ ప్రయత్నాలను విరమించి మన అభివృద్ధిని చూస్తూ లోపల కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ ఉంటారు. అనగా మీకు తెలియకుండానే మీరు వారిని చావు దెబ్బ తీసినట్టు అవుతుంది. వాస్తు బలం అంటే అలా ఉంటుంది.

4. మన గౌరవాన్ని దెబ్బతీయడానికే కదా ఎల్లవేళలా మన పక్కనే బంధువుల రూపంలో,  మిత్రుల రూపంలో కొందరు పొంచి ఉంటారు. వాస్తు రీత్యా నిర్మాణం లేని తూర్పు దిశ గృహంలో నివాసం ఉంటే, కొన్నిసార్లు బంధువులూ, మిత్రులూ, ఏ మాత్రం దయా దాక్షిణ్యం లేకుండా గౌరవానికి భంగం కలిగించడానికి, అవమానం చెయ్యడానికీ, అన్ని దారులను వెతుక్కుంటూ ఉంటారు. మేము తూర్పు దిశ గృహంలో ఉన్నాము, మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు అనుకుంటే అది పొరపాటు అవుతుంది, వాస్తు కు సరిలేని గృహాలు ఏవైనా కానీ అందలి ప్రభావమును గృహస్థులు అనుభవించాలి.

తూర్పు దిశ గృహం యొక్క లక్షణాలు : – 

1. సాధారణంగా వాస్తు శాస్త్ర రీత్యా తూర్పు దిక్కుకు నిర్మాణమైన గృహము యొక్క లక్షణాల గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాము. తూర్పు దిక్కులో నిర్మించిన గృహమునకు మంచి వాస్తు పట్టు కలిగిన నిర్మాణం కావించినట్లయితే, సాధారణంగా ఆ గృహస్థులకు మగ సంతతి కలిగి ఉంటుంది. ఒకవేళ ఇటువంటి ఉత్తమమైన గృహము లో గత నాలుగు సంవత్సరాలుగా కాపురం చేస్తూ మగసంతతి లేనట్లయితే తప్పనిసరిగా ఆ ఇంటిలో ఏదో ఒక వాస్తు దోషం బలంగా ఉండే అవకాశం ఉంది. ఏ వాస్తు దోషము లేనట్లయితే ఈ గృహమునందు మగసంతానము ఉంటుంది అనగా వంశోద్ధారకులు జనిస్తారు. వంశ అభివృద్ధి అనేది మానవ జీవితానికి అవసరమైనదే కదా. అయితే కొన్ని కారణాల రీత్యా  మగ పిల్లల కన్నా, ఆడపిల్లలే తల్లిదండ్రులను చాలా బాగా చూసుకుంటున్నారని ఒక నానుడి సమాజంలో బాగా విస్తరిస్తున్నది. అది వేరే విషయం.

2. ఈ గృహస్థులకు సమాజంలో బాగా గుర్తింపు ఉంటుంది. వీరిని వారి కుల సంఘములలో కానీ లేదా సమాజంలో కానీ లేదా వారు చేస్తున్న వృత్తి, ఉద్యోగాలలో కానీ వీరికంటూ ఒక నాయకత్వ లక్షణాలు బాగా ఉంటాయి. వీరి మాటకు గణనీయమైన మద్దతు లభించే అవకాశం బాగా ఉంటుంది. దయచేసి గమనించండి మనం ప్రస్తుతం మాట్లాడుకుంటున్న ఈ  లక్షణాలు అన్నియూ వాస్తు రీత్యా నిర్మాణమైన గృహాల గురించి మాత్రమే. 

3. బంధువులలో వీరి కంటూ ఒక గుర్తింపు ఉంటుంది. అంతో ఇంతో  వీరి మాటకు బంధువులందరూ ఒక విలువను ఆపాదిస్తారు, మరియు ఆదరిస్తారు. సాధారణంగా వీరిని బంధువులు ఇష్టపడతారు. 

4. వాస్తు శాస్త్ర రీత్యా నిర్మితమైన తూర్పు గృహంలో ఉన్న పిల్లలకు వారు చదువుతున్న పాఠశాలలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. ఇటువంటి పిల్లలకు ఆటల పోటీలలో బహుమతులు వచ్చే అవకాశం అధికం. 

5. వాస్తు శాస్త్ర రీత్యా నిర్మితమైన తూర్పు గృహంలో ఉన్న నివాసితులకు ఆరోగ్య విషయంలో చెప్పుకోదగ్గ చెడు ప్రభావములు ఉండకపోవచ్చు. మంచి ఆరోగ్యంతో ఆనందంగా జీవించడానికి అవకాశం ఎక్కువగా ఉంది.

6. వాస్తు రీత్యా కట్టుకున్న ఇంటి యందలి గృహస్తులు తాము తలపెట్టిన ఏదైనా కార్యక్రమము నిర్విఘ్నంగా చేయడానికి తగిన అవకాశాలు బాగా లభిస్తాయి. అంతేకాకుండా ఆ కార్యక్రమాలను సంపూర్ణంగా విజయం తో అభివృద్ధిలోనికి తీసుకురావడానికి సత్తా కలిగి ఉంటారు, ఈ సత్తా అనునది వాస్తు రీత్యా నిర్మితమైన గృహం అందించే అవకాశం ఎక్కువ.

7. ఈ గృహస్తులు చవకబారుగా ప్రవర్తించరు. చాలా ఉన్నతంగా జీవితాన్ని గడపాలని ప్రయత్నిస్తారు. దీనికోసం కాస్త ఖర్చు ఎక్కువ అయినను వెనకాడరు. ఉదాహరణకు, తాము నివాసముంటున్న గృహానికి మేడపైన ఇంకొక వాటా నిర్మించుకోవాలనుకున్నట్లయితే, ఒకవేళ వాస్తు సిద్ధాంతాలను పిలిపించుకోవాల్సి వస్తే అందుకు ఎంత ఖర్చు అయినను వెనకాడరు అంతేకాకుండా వాస్తు సిద్ధాంతాలు అడిగిన దానికన్నా ఎక్కువ ఇచ్చి వారి ఆశీర్వాదములను పొందుతారు. ప్రతి ఒక విషయంలోనూ గౌరవం పెంచుకుంటూ పోతూ ఉంటారు. ఏ విషయంలో అయినా వీరి గౌరవానికి భంగం కలగకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. సాధారణంగా ఇటువంటి గృహస్తులు ఇతరుల గురించి తక్కువ చేసి మాట్లాడరు, ఎంతో ఉన్నతంగా మాట్లాడుతూ తమ కీర్తిని ద్విగుణీకృతం చేసుకుంటారు. ఇటువంటి ఇంటియందలి గృహస్థులు, చిల్లర మనస్తత్వం కలిగిన వారంటే అసహించుకుంటారు. చావకబారుగా చిల్లరగా ప్రవర్తించే వారంటే వీరికి ఏ మాత్రం పడదు. 

8. తూర్పు వాస్తు ఇండ్లలో వున్న గృహస్థులకు ఉన్నత విద్యా ప్రాప్తి ఉండవచ్చును. వీరు మనసు పెట్టి చదవాలి కానీ, తప్పకుండా వీరు అనుకున్నది సాధిస్తారు. ఉన్నత విద్య అంటే మక్కువ. ఎప్పుడూ బాగా చదువుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. వీరికి తగిన ప్రోత్సాహం లభిస్తే విద్య లో ఉన్నత శిఖరాలను అందుకుంటారు.

9. వాస్తు రీత్యా నిర్మితమైన తూర్పు గృహాలలో నివసించే నివాసితులు ఒకవేళ విదేశీ ప్రయాణాలు చేయాలనుకుంటే వారి ప్రయత్నాలు సాధారణంగా సఫలం అవుతాయి. ఒకవేళ విదేశీ ప్రయాణాలకు విగ్నములు ఏర్పడుతూ ఉంటే తప్పకుండా వాస్తు లోపం ఉన్నట్టుగా భావించాలి, ఒకవేళ వీరికి వాస్తు దోషాలు వున్నట్లుగా తెలిస్తే యుద్ధ ప్రాతిపదికన వాస్తు దోషాలను నివారించుకోవడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తారు. పట్టినపట్టు వదలరు.

– : వాస్తు శాస్త్ర రీత్యా నిర్మాణమైన తూర్పు గృహ సత్ఫలితాలు : –

1. తూర్పు దిశ గృహము “వాస్తు శాస్త్ర రీత్యా నిర్మాణమైనప్పుడు” తద్వారా వచ్చే సత్ఫలితాల గురించి మాట్లాడుకుందాం. ఈ గృహస్తులు అభివృద్ధి చెందడమే కాకుండా సమాజానికి అంతో ఇంతో మంచి చేయడానికి ఎల్లవేళలా తాపత్రయపడుతూ ఉంటారు. మంచి ఆరోగ్యం కలిగి ఉంటారు, సంపద బాగా చేరుకుంటుంది, భాగ్యం ఇంటిలో తాండవం చేస్తుంది, ధనం బాగా వస్తుంది, సమాజంలో వీరికి ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది, వీరంటే చాలామంది బాగా ఇష్టపడతారు, వీరి పిల్లలు ఉన్నత విద్యావంతులవుతారు, ఆటల పోటీలలో ఖ్యాతి లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది, వివిధ పోటీలలో వీరికి గుర్తింపు లభించే అవకాశం ఎక్కువ, విదేశీ ప్రయాణాలు ఉండవచ్చును, రాజకీయాలలో పోటీ చేస్తే గెలిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ఇంట శాంతి నెలవై ఉంటుంది. మంచి వాక్చాతుర్యం ఉంటుంది. ఏ విషయంలోనైనా వీరు చక్కటి వ్యాఖ్యానం చేయగలరు, యోగం అనుభవిస్తారు, తర్వాత తరాలు కీర్తి ప్రతిష్టలతో సమాజంలో గౌరవాన్ని పొందుతారు, మగ సంతానం అధికంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది, దాన ధర్మాలు చేస్తారు, పాపభీతి ఉంటుంది. సాదరంగా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వెళ్ళరు. వృత్తులలో ఉన్న వారికి గొప్ప గుర్తింపు రావచ్చును. 

దయచేసి ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి కొందరు గృహస్తులు తమకు తెలిసిన కొద్దిపాటి వాస్తు పరిజ్ఞానాన్ని ఉపయోగించి వారే సొంతంగా గృహ నిర్మాణాన్ని చేస్తుంటారు. ఆనక భవిష్యత్తులో వచ్చే కష్టాలను భరించలేక మిడిమిడి జ్ఞానం కలిగిన వాస్తు వ్యక్తుల ద్వారా తమ గృహాలను పరిశీలింప చేయించుకుని తిరిగి కొత్త సమస్యల లో కూరుకొని పోతూ ఉంటారు, తదుపరి తీరికగా వాస్తు శాస్త్రం పనిచేయదని అది కొందరికే పని చేస్తుందని, వాస్తు సిద్ధాంతులు అంత తెలివైన వారు ఈ కాలంలో లేరని చాలామందికి వాస్తు గురించి సరైన అవగాహన కూడా లేదని ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. తాము చేసిన పొరపాటును ఒప్పుకోవటానికి మనసు రాదు. ఇక ఇతరుల ముందైతే తమ తప్పిదాలను ఎటువంటి పరిస్థితుల్లోనూ ఒప్పుకోరు. ఎప్పుడు కూడా వాస్తు సిద్ధాంతులను నిందించటానికే  సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. అనుభవించే యోగం లేనప్పుడు వీరి ఆలోచనలు ఇలాగే తప్పుదారిలో వెళుతూ ఉంటాయి. దీనినే మన పెద్దలు తలరాత అంటూ ఉంటారు.

ఉత్తమ ఫలితాలు ప్రసాదించే తూర్పు దిక్కు గృహము

2. ఈ చిత్రంలో చూపిన విధంగా గృహమునకు ప్రహరీలో తూర్పు మరియు ఉత్తరం లో ఎక్కువ ఖాళీ స్థలము ఉండి, ప్రహారియందలి పశ్చిమ దక్షిణ భాగాలలో తక్కువ ఖాళీ స్థలం ఉన్నట్లయితే ఈ గృహం నందు నివసించు వారు కీర్తి ప్రతిష్టలను కలిగి ఉంటారు, ధన ధాన్యాలతో, సుఖసంతోషాలతో, భోగభాగ్యాలతో, నిత్య కళ్యాణం పచ్చ తోరణం లాగా వారి జీవితం సంతోషంగా కులాసాగా సరదాగా గడిచిపోతుంది. ఈ గృహస్థులకు ఏవైనా సమస్యలు వచ్చిననూ అవి త్వరగా సమసిపోతాయి. ఈ గృహస్థులకు సాధారణంగా మంచి సంఘటనలే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. పశ్చిమ మరియు దక్షిణ భాగపు ఖాళీ స్థలంలో అధిక బరువులను ఉంచుకోవడం వల్ల ఆరోగ్యం బాగుగా ఉంటుంది, అంతేకాకుండా ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది. జీవితం ఆనందంగా గడిచిపోతుంది. గౌరవం రెట్టింపు అవడానికి అవకాశం ఎక్కువ. పిల్లలు మంచి విద్యావంతులవుతారు. వ్యాపారం బాగా జరుగుతుంది. మంచి సంస్కారవంతులై వుంటారు.  

ఉత్తమమైన తూర్పు గృహం

దీర్ఘ చతురస్రాకారపు తూర్పు దిక్కు గృహము

3. మీరు ఈ చిత్రంలో చూస్తున్నది తూర్పు దిక్కుకు వున్న దీర్ఘ చతురస్రాకారపు స్థలము. తూర్పు పడమర కొలత, ఉత్తర దక్షిణ కొలత కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ దీర్ఘ చతురస్రాకారపు స్థలములో గృహము నైరుతి భాగమున నిర్మించడం జరిగినది. ఉత్తర భాగమున తక్కువ ఖాళీ స్థలము ఉన్ననూ, తూర్పు భాగాన, అధికమైన ఖాళీ స్థలము లభించింది. సామాన్యంగా ఇటువంటి గృహములు మంచి ఫలితాలను ఇస్తాయి. ఉదాహరణకు, మగ సంతానం అధికంగా ఉండే అవకాశం ఎక్కువ, వంశాభివృద్ధి, ధనాభివృద్ధి ఉంటుంది. కీర్తి ప్రతిష్టలకు పుట్టినిల్లు, గౌరవం ద్విగుణీకృత మవుతుంది. సంతానం వల్ల కుటుంబీకులకు సమాజంలో ఉన్నత స్థితి కలగి, మంచి పేరు ఆయాచితంగా వస్తుంది. మంచి ప్రతిష్ట లభిస్తుంది. పిల్లలు మంచి ప్రయోజకులవుతారు, ఉన్నత విద్యావంతులవుతారు, వీరికి అభివృద్ధి బాగా కలిసి వస్తుంది. విదేశీ ప్రయాణాలు ఉండవచ్చును. ఈ ఇంటి వారి మాటకు విలువ ఉంటుంది.

దీర్ఘ చతురస్రాకార తూర్పు స్థలము

తూర్పు దిక్కు గృహానికి తూర్పు పల్లంగా ఉండటం మంచిదా?

4. గృహము ప్రహరీ భాగంలో తూర్పు భాగము పల్లమైనట్లయితే (బాణం గుర్తు చూపించిన విధంగా తూర్పు భాగము పల్లమైనప్పుడు) ఆ ఇంట సకల ఐశ్వర్యాలు పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే తూర్పు స్థలము సాధారణమైన ఇంటి యొక్క నేల భాగము కన్నా, ఇది బాగా లోతుగా ఉన్నప్పుడు ఆ గృహస్తులు చాలా ఉన్నత స్థితికి వెళ్లగలరు, వీరు చేసే ఏ వృత్తిలోనైనా కూడా శుభ ఫలితాలు బాగా వస్తాయి. ఉదాహరణకి రాజకీయంలో ఉండే వారికి మంచి గుర్తింపు లభించి అయాచితంగా పదవి లభించే సదవకాశాలు మెండు. ఆరోగ్యం బాగా ఉంటుంది, ఐశ్వర్యం సిద్ధిస్తుంది, జీవితం కులాసాగా గడిచిపోతుంది. ముఖ్యంగా జీవితంలో ప్రశాంతత ఉంటుంది. సంతృప్తికరమైన జీవితాన్ని అనుభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విదేశీ ప్రయాణాలు ఉండవచ్చు. 

తూర్పు దిక్కున పల్లంగా ఉండడం మంచిదేనా

కొందరు వ్యక్తులు చెబుతున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది గృహస్తులు తూర్పు గృహమును మాత్రమే కొనడానికి మక్కువ చూపుతూ ఉంటారు. వీరి కోసం ప్రత్యేకంగా ఇక్కడ ఒక విషయాన్ని చెప్పదలచాము. సాధారణంగా కొన్ని దేశాలలో, ఉదాహరణకు అమెరికా దేశంలో ఇంటి ముందు భాగము (Frontyard ) తక్కువ ఖాళీ స్థలం ఉండడము, మరియు ఇంటి వెనుక భాగము (Backyard ) ఎక్కువ ఖాళీ స్థలం ఉండడం అనేది సర్వసాధారణమైన విషయం. అనగా ఒకవేళ పశ్చిమ ముఖ ద్వార గృహం తీసుకున్నట్లయితే, ఇంటి వెనుక ఎక్కువ ఖాళీ స్థలం రావడం అనేది అమెరికాలో సాధారణమైన విషయం.

ప్రపంచంలో ఏ భారతీయ మూలాలున్న వాస్తు సిద్ధాంతిని అడిగినా కూడా తూర్పు ఎక్కువ ఖాళీ స్థలం ఉండడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి అనే చెబుతారు. దీన్నిబట్టి ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. మీరు కొనబోయే ఇల్లు పశ్చిమ ముఖమైనా కూడా, ఒకవేళ ఇంటి వెనక భాగము లేదా ఇంటి పెరడు (అనగా తూర్పు దిశ) ఎక్కువ ఖాళీ స్థలం ఉన్నట్లయితే ఈ పశ్చిమ ముఖద్వార గృహము తూర్పుముఖ ద్వారం మాదిరిగానే ప్రభావం చూపే అవకాశం ఎక్కువ, అనగా దాదాపుగా తూర్పు గృహం లాంటి ఫలితాలే ఈ గృహస్తులకు కూడా వస్తాయి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మంచి అనుభవం కలిగిన వాస్తు వ్యక్తి ద్వారా మాత్రమే తగిన సూచనలు అందుకొని నిర్ణయం తీసుకోండి, అంతేకానీ ఎవరో ఏదో చెప్పారు కదా అని దాన్ని పాటించడం అనేది ముదావహం కాదు. మీ వరకు కూడా కాస్త పరిశీలన చేయడం మంచిది. 

తూర్పు ముఖ ద్వార గృహానికి తలుపు ఏ దిశలో ఉండాలి?

5. ఈ చిత్రంలో ఒక బాణం గుర్తు గృహం యొక్క తలుపును సూచిస్తున్నది. ఈ తలుపు అక్షరాల 90 డిగ్రీలకు ఉన్నది. అనగా ఈ తలుపు తూర్పు దిశను చూస్తున్నది. ఇటువంటి తలుపులు గృహానికి ఉత్తమ ఫలితాలను ఇచ్చే అవకాశం అధికం. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోండి తలుపులకు ఉన్న ప్రాముఖ్యత  అంతా ఇంతా కాదు, ఏ చిన్న పొరపాటు చేసినా అది ఆ గృహస్థులకు వివిధ రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేయవచ్చు, కాబట్టి పొరపాటు చేయక తలుపుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. తూర్పు దిక్కుకు ఉన్న ముఖద్వారం కానీ లేదా ఇంటి లోపల ఉన్న ఇతర తూర్పు ద్వారాలు కానీ ఒకవేళ తూర్పును కాకుండా ఈశాన్యం దిక్కుకు చూస్తున్నట్లుగా ఉంటే గృహంలో సుఖసంతోషాలు నెలవై ఉంటాయి, వంశము చక్కగా అభివృద్ధి అవుతుంది, ఆర్థికంగా గృహస్తులు సంపన్నులయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దయచేసి ఒక విషయాన్ని గమనించండి, తలుపులు ఈశాన్యం దిక్కుకు చూస్తున్నట్టుగా చేయడం అనేది అంత చిన్న విషయం కాదు. ఏ చిన్న పొరపాటు జరిగినా దానివల్ల వచ్చే దోషాలు అధికంగా ఉండవచ్చును.

తూర్పు ముఖ ద్వారం

తలుపులు ఈశాన్యం చూస్తున్నట్లుగా ఉంటే మంచిదని భావించి తలుపులు ఈశాన్యం పక్కగా తిప్పటం వల్ల, ఒక్కొక్కసారి ఈశాన్యం కోత పడి, ఆగ్నేయం హెచ్చు అయ్యే అవకాశం కూడా అధికంగా ఉంటుంది, అనగా మనం తలుపులు నిర్మించే సమయంలో ఒకటి లేదా రెండు డిగ్రీల లోపుగా ఈశాన్యమును చూస్తున్నట్టుగా ఉంచుకున్నట్లయితే చాలును. ఇంతకన్నా ఎక్కువగా తిప్పటం అంత మంచిది  కాకపోవచ్చు. ఒక్కోసారి, స్థలం/గృహం దిక్కుననుసరించి (అనగా డిగ్రీస్ ను బట్టి ), కాస్త ఎక్కువగా ఈశాన్యం దిక్కుకు తిప్పిననూ మంచి జరగకపోవచ్చును. ఇవన్నీ ఒక అనుభవజ్ఞుడైన వాస్తు సిద్ధాంతి పర్యవేక్షణలో మాత్రమే జరగాలి. స్వంత నిర్ణయాలు నష్టపరిచే అవకాశం అధికం. 

తూర్పు ముఖ ద్వారం గృహానికి ప్రహరీ ఎలా నిర్మించుకోవాలి?

6. ఈ చిత్రంలో కొన్ని బాణం గుర్తులను చూపించడం జరిగినది జాగ్రత్తగా గమనించినట్లయితే ఇవి పశ్చిమ, దక్షిణ, తూర్పు, ఉత్తర ప్రహరీ గోడ భాగాలను సూచిస్తున్నాయి. ఇందులో పశ్చిమ మరియు దక్షిణము యొక్క ప్రహరీ గోడలు వెడల్పుగా, మందంగా, బలీయంగా, ఎత్తుగా, నిర్మాణం చేసుకోవడం చాలా ప్రశస్తమైనది. అందుకే, ఈ పశ్చిమ, దక్షిణ ప్రహారీ గోడలను మందంగా చూపించాము. తూర్పు, ఉత్తర ప్రహరీ గోడలను కాస్త తక్కువ మంధంలో, ఎత్తు తక్కువగా, నిర్మించుకోవాలి, చిత్రం లో ఈ రెండు గోడలూ కాస్త తక్కువ మందంతో చూపించాము. మీరు బాగా శ్రీమంతులైతే మరియూ నిర్మాణం చేసే అవకాశం ఉన్నట్లయితే పశ్చిమ మరియు దక్షిణం ప్రహరీ గోడలను నాలుగు అడుగుల వెడల్పుతో నిర్మాణం చేసుకొని, తూర్పు మరియు ఉత్తరం ప్రహరీ గోడలను రెండు అడుగుల మందంతో నిర్మించుకోండి. 

తూర్పు దిక్కు గృహ ప్రహరీ నిర్మాణ విధానం

ఒకవేళ ఇది సాధ్యం కాకపోతే పశ్చిమ మరియు దక్షిణ ప్రహరీ గోడలను రెండు అడుగుల వెడల్పుతో నిర్మించుకొని, తూర్పు మరియు ఉత్తరం ప్రహరీ గోడలు ఒక అడుగు వెడల్పుతో నిర్మించుకోండి. ఒక విషయాన్ని గుర్తుంచుకోండి ఏప్పుడైతే పశ్చిమం మరియూ దక్షిణం ప్రహరీ గోడలను ఎంత బలంగా నిర్మించుకుంటారో ఫలితములు అంత అద్భుతంగా ఉండే అవకాశం ఉంది.

ప్రహారీ ఎత్తు విషయంలో ఉదాహరణ : 1 : – పశ్చిమ మరియూ దక్షిణ ప్రహారీ గోడలు 6′ అడుగుల ఎత్తులో వున్నాయి అనుకుందాము, అలాంటప్పుడు, తూర్పు, ఉత్తర ప్రహారీ గోడలు 5′ అడుగుల ఎత్తులో నిర్మించుకోవడం మంచిది. లేదా, 5′.6″ అడుగుల ఎత్తులో నిర్మించుకోవడం చెయ్యవచ్చును. అవసరమనుకుంటే, అన్ని గోడలూ, సమమైన ఎత్తులో వుండవచ్చును. అంతేకాని, పశ్చిమ దక్షిణ గోడల ఎత్తుకన్నా తూర్పు ఉత్తర గోడలు ఎత్తుగా ఉండరాదు. 

ఉదాహరణ : 2 : – పశ్చిమ మరియు దక్షిణ ప్రహరీ గోడలు 4′-0″ అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు తూర్పు మరియు ఉత్తర ప్రహరీ గోడలు మూడు అడుగులు ఎత్తులో ఉండడం మంచిది. లేదా, 3′.6″ అడుగుల ఎత్తులో కూడా ఉండవచ్చు, లేకపోతే 3′.9″ అడుగుల ఎత్తు కూడా ఉండవచ్చు అలా కూడా కాకపోతే నాలుగు అడుగుల ఎత్తు కూడా ఉండవచ్చు. అంతేకానీ పశ్చిమ దక్షిణ ప్రహరీ గోడల ఎత్తుకన్నా తూర్పు మరియు ఉత్తర ప్రహరీ గోడలు ఎత్తుగా నిర్మించుకోకూడదు.

తూర్పు దిక్కు గృహానికి వాడుక నీరు బయటకు ఏ దిక్కున వెళ్ళాలి?

7. ఇంటిలోని వాడుక నీరు తూర్పు ఈశాన్యం ద్వారా బయటకు వెళితే ఆరోగ్యం, ఐశ్వర్యం బాగా వృద్ధి అగును. అంతే కాకుండా మనశాంతి జీవితం లభించే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ చిత్రంలో చూపిన విధంగా మొదటిది గృహం యొక్క ఉత్తర ఈశాన్యం వైపుగా వెళ్లి అటు నుండి తూర్పు ఈశాన్యం ద్వారా బయటకు వెళుతున్నాయి, ఇక ఇదే చిత్రంలోని రెండవ ప్రాంతములో వాడుక నీరు ముందుగా తూర్పు దిక్కుగా ప్రయాణం చేసి తర్వాత ఈశాన్యం వైపుగా బయటకు వెళుతున్నాయి. ఈ పద్ధతి కూడా సరైన విధానం. ఒకవేళ ఈశాన్యం కాకుండా ప్రహరీ లో తూర్పు వైపుగా కూడా వాడుక నీరు బయటకు వెళ్ళవచ్చు. కొన్నిసార్లు “అవకాశాలు లేనప్పుడు” ఇతర దిశలలో కూడా వాడుక నీరును బయటకు పంపే ఏర్పాట్లు చేసుకోవచ్చు. అయితే నైరుతి దిశగా వాడుక నీరు బయటకు వెళ్లడం అనేది సరైన విధానం కాదు. నైరుతి దిక్కుగా వాడుక నీరు వెళుతోందంటే, నైరుతి పల్లమైనట్లే కదా, నైరుతి పల్లం కావడం మంచిది కాదని మీకు తెలుసు. 

తూర్పు గృహం నుంచి వాడుక నీరు ఎలా బయటకు వెళ్ళాలి

తూర్పు దిక్కు ఇంటికి ఉత్తరంలో ప్రహరీ లేకపోతే ఏం చేయాలి?

8. ఈ చిత్రమును పరిశీలనగా గమనించండి పక్కింటి గృహము (2 సంఖ్యతో సూచిండమైనది ) ప్రహరీ లేకుండానే 1 సంఖ్యతో సూచించిన ఇంటి యొక్క ప్రహరీ పై నిర్మించారు అనుకుందాం. 2 సంఖ్య వారు దక్షిణం ప్రహరీ లేకుండా డైరెక్ట్ గా గృహాన్ని నిర్మించడం జరిగినది. ఇటువంటి పరిస్థితులలో ఉత్తరాన ప్రత్యక్షంగా (డైరెక్టుగా) ఇతరుల గృహం ఉన్నప్పుడు అంత మంచి ఫలితాలు రాకపోవచ్చును. 2 సంఖ్య గృహం 1 సంఖ్య ఉత్తరం పై ప్రత్యక్షంగా నిర్మించడం వల్ల ఉత్తరం భారమై ధననష్టం లేదా ఆరోగ్య నష్టం లేదా మానసిక సమస్యల తో ఇబంది పడే అవకాశం వుంది. ఇటువంటి పరిస్థితులలో ఉత్తరంవైపున ఆరు ఇంచుల స్థలం వదిలి 1 సంఖ్య గృహం వారు ఇంకొక ప్రహారి నిర్మించుకోవడం వల్ల ఉత్తరం యొక్క భారం తగిపోయి, మంచి జరిగే అవకాశం వున్నది. చదివేవారికి ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఉదయించవచ్చు. మీరు నిరభ్యంతరంగా మీ ప్రశ్నలు ఏమిటో కింద కాంటాక్ట్ లింకు ద్వారా పంపగలరు. సంభోదన పద్ధతి ప్రకారం ఉన్నవాటికి తప్పకుండా మా నుంచి సమాధానము వస్తుంది, సరైన సంబోధన లేని ఇమెయిల్స్ కు సమాధానము పంపడం జరగదు.

ఉత్తర దిశగా ఉన్న పక్కింటి వారి తూర్పు ముఖ ద్వారా గృహము

మీరు మమ్మల్ని సంప్రదించే ముందుగా ఈ క్రింది చిత్రపటాలను మరియు వాటి గురించి రాసిన విషయాన్ని చదవండి ఒకవేళ మీకంటూ ఏమైనా ప్రశ్నలు మిగిలి ఉంటే మమ్మల్ని తప్పకుండా సంప్రదించవచ్చు.

ప్రహరీలు లేని తూర్పు ముఖ గృహాలు?

9. ఈ చిత్రంలో ఒకటి రెండు మూడు అను సంఖ్యలతో మూడు గృహములను చూపించడం జరిగినది. ఈ మూడు గృహములకు ప్రహరీ లేదు. స్థలం మొత్తం నిర్మాణమే వున్నది. ఉదాహరణకు రెండవ గృహం తీసుకున్నప్పుడు, (మధ్య గృహం) ఉత్తరం ప్రహరీ లేదు మరియు ఖాళీ స్థలం లేదు, అలాగే దక్షిణ వైపున కూడా ప్రహరీ లేదు ఖాళీ స్థలం లేదు, ఇటువంటిప్పుడు ఇంటి లోపల భాగంలో వాస్తు సరి చేసుకొని నిర్మాణం చేసినప్పుడు బాగా యోగిస్తుంది. ఉత్తరం ఖాళీ స్థలం లేదు కదా అని యోచన చేయవద్దు, ఎందుకంటే దక్షిణభాగం కూడా ఖాళీ స్థలం లేదు, కావున ఏ ఇబందులూ రాకపోవచ్చును. కొన్ని గృహాలను చూసినప్పుడు ఇవి అన్నియు ఒకే రీతిలో కట్టారు కదా మరి మాకు ఎందుకు సరిగా జరగడం లేదు వారికి ఎందుకు బాగా జరుగుతుంది అని కొందరు గృహస్థులకు అనుమానాలు వస్తూ ఉంటాయి. ఏ చిన్న వాస్తు మార్పు జరిగిననూ దాని ప్రభావం గృహస్థులపై ఉంటుంది. ఈ క్రింది పటం గమనించినట్లయితే మీ అనుమానాలు సంపూర్ణంగా నివృత్తి కాగలవు. 

తూర్పు ముఖ ద్వారానికి రెండు వైపులా గృహములు

తూర్పు ముఖ గృహాలకు ప్రహరీలు లేకపోయినా మంచి ఫలితాలు వస్తాయా?

10. ఈ చిత్రంలో మొత్తం మూడు గృహములు మరియు మూడు రహదారులు చూపించడం జరిగినది. చదువరులకు అర్థం కావటానికి, ఈ గృహములకు ఒకటి, రెండు, మూడు అని సంఖ్యలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఒకటో నెంబర్ గృహం కు, తూర్పు రోడ్డు మరియు ఉత్తరం రోడ్డు కలవు. రెండవ నెంబర్ గృహమునకు తూర్పు రోడ్డు మాత్రం కలదు. మూడో నెంబర్ గృహమునకు తూర్పు రోడ్డు మరియు దక్షిణం రహదారి కలవు. ఒకటో నెంబర్ గృహమునకు, రెండవ నంబరు గృహము పరిసర వాస్తు ప్రకారం దక్షిణభాగం మొత్తం 2వ నెంబర్ గృహంతో నిండిపోవడం వలన, ఒకటవ నంబర్ గృహమునకు అద్భుతమైన ఫలితాలను పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రెండవ నెంబర్ గృహమునకు ఉత్తరం వైపున ప్రహరీ స్థలం లేకనే గృహం రావటం వలన ఉత్తరం ఖాళీ స్థలం లేదు, అంతేకాకుండా దక్షిణ భాగం కూడా ప్రహరీ స్థలము ఏర్పాటు చేయక హద్దు పైనే నిర్మాణం జరిగినది. 

తూర్పు ముఖ ద్వార గృహమునకు రెండువైపులా గృహములు, రహదారులు

దీనిని బట్టి స్థలము మొత్తం గృహమును ఏర్పాటు చేసుకోవడం జరిగినది ఎవరు కూడాను ప్రహరీకి స్థలములు ఏర్పాటు చేయలేదు. ఇక్కడ రెండవ నెంబర్ గృహమునకు మద్యస్థముగా ఫలితములు రాగలవు. ఇంటిలోపల అద్భుతమైన వాస్తు నిర్మాణం చేస్తే ఫలితాలు  చాలా మెరుగ్గా ఉండగలవు.

మూడవ నెంబర్ గృహమునకు ఉత్తరభాగం హద్దు పైనే నిర్మాణం ఉండడం అలాగే దక్షిణ భాగం రహదారి రావటం వలన ఖాళీ స్థలం ఉండడం వల్ల ఈ మూడు గృహాలపైకి, ఈ మూడవ నంబరు గృహమునకు ఫలితములు అనుకున్న రీతిలో రాకపోవచ్చు. లేదా చేదు ఫలితములు రావచ్చును.

ఒక చిన్న మార్పు కూడా వాస్తు శాస్త్రంలో ఫలితముల విషయంలో ఎన్నో హెచ్చుతగ్గులను ఇచ్చే అవకాశం కనిపిస్తున్నది. ప్రతి ఒక విషయము కూలంకషంగా గమనించి తదుపరి మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. ఏ చిన్న పొరపాటు చేసినా కూడా దాని ప్రభావమును గృహస్తులు అనుభవించాలి.

కొందరు ఇలాగా అంటూ ఉంటారు, మాది తూర్పు గృహం అయితే మాకు ఏమీ మంచి ఫలితాలు రాలేదు, ఈ వాస్తు ఏమి పని చేయలేదు, ఈ కాలంలో బాగా వాస్తు చూసే వారు లేరు, పూర్వకాలం బాగా ఉండేవాళ్ళు, నేడు సమాజంలో మంచి వాస్తు సిద్ధాంతాలు దొరకడం లేదు, అనే మాట అప్పుడప్పుడు అక్కడక్కడ వింటూ ఉంటాం. ఇప్పుడు గమనించండి, ఈ పైనున్న ఈ చిన్న చిత్రంలోని మూడు గృహాలకి మూడు విధాలైనటువంటి ఫలితాలు వచ్చినప్పుడు, కొన్ని లక్షల తూర్పుముఖ గృహాలు ఉన్నప్పుడు ఎన్ని చిత్ర విచిత్రమైనటువంటి ఫలితాలు రావాల్సి ఉంటుంది. అనడం చాలా సులభం, ఆచరించడం చాలా కష్టం.

కష్టపడి ప్రజలకు మంచి ఫలితాలు ఇవ్వాలని చూసే వాస్తు సిద్ధాంతులు సమాజంలో ఎంతో మంది వున్నారు. అయితే వీరు కొద్దిగా అధిక ధనం తీసుకోవడం వల్ల చాలామంది గృహస్తులు, వీరిని కాదని, ఎవరైతే తక్కువగా డబ్బు తీసుకుంటారో వాళ్ళని మాత్రమే ఎంచుకోవడం వల్ల కొన్ని ఇబంధులు రావచ్చును. అయితే, తక్కువ ధనం తీసుకున్నవారి నుంచి ఎక్కువ ఫలితాలు ఆశించడం సరైనదా?

ఐదు తూర్పు దిక్కు గృహాల గురించి వివరణ

11. ఇక్కడ ఒకే ప్రహారీలో మొత్తం 5 గృహములు కలవు. ఈ ప్రహరీకి కేవలం ఒక మెయిన్ గేట్ ఉంది. కొన్ని అనివార్య కారణాలవల్ల ఈ నిర్మాణం జరిగిన పట్టణం పేరు, గృహస్థుల పేర్లు తెలియచెయ్యలేము, ఒక కథ లాగా చదువుకుందాం. వాస్తు శాస్త్రంలో ఫలితాల విషయంలో ఒక చిన్న మార్పు ఎంతటి చిత్ర, విచిత్రమైనటువంటి సంఘటనలను కలుగచేస్తుందో, ఈ గృహస్థుల అనుభవాలను చూస్తే అర్థమవుతుంది. 1 మరియూ 5 సంఖ్యల గృహాలకు మాత్రమే వాటి ప్రక్క భాగంలో ఖాళీ స్థలములు కలవు. ఇక మిగిలినవి అంటుడు మిద్దెలే (attached homes). ఈ 5 గృహాలూ తూర్పు ముఖ గృహాలే అయితే వీటికున్న చిన్నపాటి తేడాల వల్ల ఎంతటి బలీయమైన మార్పులు వస్తాయో తెలుసుకుందాం.

తూర్పు దిక్కున గల ఐదు గృహములు

కొంతమంది అంటారు కదా మేముంటున్నది తూర్పు గృహము అయితే మాకు ఫలితాలు బాగా రావట్లేదు, కానీ పక్క వాళ్ళకి బ్రహ్మాండంగా వాస్తు ఫలితాలు వస్తున్నాయి, వాస్తు శాస్త్రం కొంతమందికి మాత్రమే పనిచేస్తుంది, అందరికీ పనిచేయదని అనవచ్చు. ఈ ఐదు గృహాల గురించి మనం తెలుసుకుంటే ఇటువంటి అనుమానాలు నివృత్తి కాగలవు.

ఈ 5 వ సంఖ్య గృహస్థులకు జీవితము సాదాసీదాగా గడిచింది, ఏమంత గొప్పగా చెప్పుకునే జీవితం అయితే కాదు. ఈ గృహస్థులకు తూర్పు ఖాళీ స్థలం, దక్షిణం ఖాళీ స్థలం, అలాగే పశ్చిమం కూడా ఖాళీ స్థలం ఉంది. ఉత్తరాన నాలుగు ఇళ్ళ హద్దులు కలవు, వాస్తవంగా చెప్పాలంటే కాస్త కఠినమైన, ఇబ్బందికరమైన జీవితం ఉండాలి, అయితే అదృష్టవశాత్తు ఈ గృహస్థులకు మొత్తం ప్రహారీకి గల మెయిన్ గేటు తూర్పు ఈశాన్యంలో రావటం వల్ల చెడు ఫలితాలు మరియు మంచి ఫలితాలు అటు ఇటు జరుగుతూ రావడం వల్ల వీరికి కాలం గడిచిపోయింది. అంతేకానీ తూర్పు ఈశాన్య గేట్ వల్ల మహాద్భుతమైన ఉత్తమ ఫలితాలు రాలేదు, అలాగని ఈ గృహ లక్షణాల వల్ల బీభత్సమైన చెడు ఫలితాలు అనుభవించలేదు, దీన్నిబట్టి మనం ముఖ ద్వారం యొక్క ప్రాముఖ్యతను గమనించవచ్చు.

ఇక నాలుగవ నంబరు గృహస్థులకు జీవితము అద్భుతంగా గడిచింది. వీరికి దక్షిణము ఖాళీ స్థలం లేదు అంతేకాకుండా తూర్పు ఖాళీ స్థలం మరియు పశ్చిమం కూడా ఖాళీ స్థలం కలదు, అయితే తూర్పు భాగం ఎక్కువ ఖాళీ స్థలం రావడం మరియు తూర్పు ఈశాన్యంలో మెయిన్ గేట్ రావడం వల్ల ఈ గృహస్తులు ఈ ఐదు ఇళ్లపైకి అద్భుతమైన ఫలితాలను పొందడం జరిగినది. ఆరు సంవత్సరాల కాలంలోనే ఒక రాజభవనం లాంటి గృహాన్ని కొన్నారు. అంతేకాకుండా పిల్లలు కనీవినీ ఎరుగని రీతిలో తాము చదివే విద్యా సంస్థల యందు గొప్ప పేరు సాధించుకొని అద్భుతమైన ఉద్యోగాలు పొందడం జరిగినది. తాము ఉన్న ఆరు సంవత్సరాల లోనే ఊహించనంత గొప్ప ఫలితాలను ఆ గృహంలో సాధించుకున్నారు వీరికి మాత్రమే అంతా బాగా జరిగింది.

ఇక మూడవ నంబరు గృహస్థులకు జీవితం సాదాసీదాగా గడిచినది. జీవితంలో బలమైన ఆటుపోట్లు లేకుండా ఒక రీతిలో జీవితము గడిచిపోయింది, అయితే చిన్నపాటి రెండు మూడు సంఘటనలు వీరికి కూడా జరిగాయి. దానితో తమ జీవితంలో అడ్వెంచర్స్ చేయడం ఆపారు. ఈ గృహస్థులకు తమ ఇంటి ఎదురుగానే మెయిన్ గేటు రావడం జరిగినది. వీరికి జీవితంలో స్థిరత్వం ఏర్పడినది, అయితే వారు కన్న కలలు మాత్రం సంపూర్ణంగా జరగలేదు. పిల్లలకు విద్యాభంగం జరగలేదు, బాగానే చదువుకున్నారు. ఇంటి వారికి ఉద్యోగంలో సమస్యలు లేకుండా, పదోన్నతి పొందడం కూడా ఈ గృహం లో జరిగింది. అయితే, వీరికి చెడుకన్నా మంచి ఎక్కువగా జరిగింది. 

ఇక రెండవ నెంబర్ గృహం గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఈ ఇంటి గురించే ఇక్కడ విశ్లేషణ అవసరమయ్యే ఈ చిత్రమును చూపించడం జరిగినది. ఈ గృహస్థులు బంగారు వ్యాపారం చేస్తారు. ఒకసారి ఈ గృహస్థుడు మరియు ఒకటవ నంబరు గృహస్థుడు ఇరువురు కలిసి వాహనంపై ఏదో పని మీద వెళుతుండగా ఎదురుగా వచ్చిన వాహనము గుద్దడంతో ఇరువురు కింద పడిపోయి బలమైన దెబ్బలు తగిలాయి. ఈ రెండవ నంబర్ గృహస్థుడు మూడు నెలల తర్వాత తీసుకొని, తీసుకొని చనిపోయాడు, విపరీతమైన దానం ఖర్చు అయింది. ఒకటవ నంబర్ గృహస్థుడు మాత్రం రెండు ఫ్యాక్చర్లతో బ్రతికి బట్ట కట్టాడు. ఈ సంఘటన రెండవ నెంబర్ గృహాన్ని సంపూర్ణంగా మార్చివేసింది. తండ్రి చనిపోవటంతో కుమారుడు పూర్తిగా అంగడి కే పరిమితమయ్యాడు. తండ్రి చనిపోయిన దుఃఖంలో ఉండగానే ఆరు నెలల లోపుగా దొంగ బంగారం కొన్నాడని ఇతన్ని చాలా దూరప్రాంతం నుంచి వచ్చిన పోలీసులు విచారణ నిమిత్తం తీసుకెళ్లి కేసు పెట్టడం జరిగినది. ముందుగానే ఇంటిపెదను కోల్పోయి, కుంగిపోయిన జీవితంలో ఇది ఒక బలమైన, దారుణమైన సంఘటననే చెప్పాలి. అతి కష్టం మీద వచ్చి, తిరిగి వ్యాపారం మొదలుపెట్టాడు. అయితే నాలుగు నెలలు గడవక ముందే ఇంకొకసారి దొంగ బంగారు కొన్నాడని పోలీసులు తీసుకెళ్లిపోయారు. దీనితో ఊరిలోని వారందరికీ ఈ కుటుంబం మీద ఒక స్థిరమైన చెడు అభిప్రాయం ఏర్పడినది. తప్పు చేశాడా లేదా అనేది కాదు ఇక్కడ ప్రశ్న, అత్యంత భయంకరమైన గౌరవభంగం జరిగినది. ఇది ఇలా ఉండగానే వీరి అబ్బాయి కోతులను అదిలించబోయి తను పట్టుకున్న స్టీల్ రాడ్ తో ఎలక్ట్రిక్ లైన్ లకు తగిలి అబ్బాయి చూస్తుండగానే కాలిపోయాడు. అయితే ప్రాణం పోలేదు సంవత్సరాలు పోరాడిన తర్వాత తిరిగి ఆపై కోలుకున్నాడు, అయితే విపరీతమైన ధన నష్టం సంభవించినది. ఇక కూతురు మొబైల్ ఫోన్ లో పొరపాటున చేసిన పనికి, బ్యాంకు లోని, 8 లక్షల సొమ్మును ఆన్లైన్ దొంగలు దోచేశారు. జీవితంలో సమృద్ధిగా కల సంపద సర్వనాశనం అయిపోయింది, అప్పుల పాలు అయ్యారు, గౌరవం పోయింది, కుటుంబ పెద్ద అయిన తల్లి ఆరోగ్యం క్షీణించిపోయింది, ఇంటిలోనే మరణించింది. ఇక మిగిలినది కుమారుడు కోడలు వారి కుమార్తె మరియు కుమారుడు మొత్తం నలుగురు మాత్రమే. జీవచ్ఛవం లా జీవితం గడుపుతున్నారు, పిల్లల కోసం మాత్రమే బ్రతుకును వెళ్లదీస్తున్నారు. వ్యాపారం జరుగుతూనే వుంది, సమాజం వీరి ఇంటిపేరుకు “దొంగ బంగారం” అనేది కలిపారు. ఈ విషయం వీరిని బాగా కృంగదీసింది. వీరిది కూడా తూర్పు ముఖ ద్వారమే కదా, అయితే ఈ ఐదు ఇళ్లలో జరిగినటువంటి దారుణమైన సంఘటనలు ఈ ఇంటి వారికే ఎందుకు జరిగాయి? “ముఖ్యంగా ఈ ప్రహారికి గల ముఖ ద్వారము ఈ ఇంటి వారికి తూర్పు ఆగ్నేయం కావడం” మరియు ఉత్తర గృహం భారం కావడం కారణాలవల్ల ఈ చెడును వీరు అనుభవించడం జరిగినది. బాధ కలిగించే విషయం ఏమిటంటే, ఈ రెండవ నంబర్ గృహస్థునికి ఈ ఐదు గృహాల నిర్మాణం ముందు ఒక ఛాయిస్ ఉంది. ముందే ఒకటి మరియు ఐదు నెంబర్ గల గృహాలు ఇతరులు కొనడం జరిగినది, ఇక మిగిలినది రెండు మూడు నాలుగు నెంబర్ గృహాలు మాత్రమే. ఈ గృహస్థుడు వాస్తు బాగా చూపించుకొని మాత్రమే ఈ గృహాన్ని కొనడం జరిగినది. బాగా బేరమాడి బేరమాడి చాలా తక్కువ ధరకు ఒక వాస్తు సిద్ధాంతిని  పిలుచుకొని వచ్చి వాస్తు సలహాలు పొందడం జరిగినది. ఈ విషయం పక్కన పెడితే ఈ గృహంలో కొన్ని బలమైన చెడు సంఘటనలు జరిగిన తర్వాత వీరి కుమారుడు కూడా ముగ్గురు వాస్తు సిద్ధాంతులను బాగా బేరమాడి పిలుచుకుని వచ్చి మొత్తం 16 లక్షల రూపాయల దాకా గృహంలో ఖర్చులు పెట్టాడు. అయితే ఏ శుభ ఫలితాలు రాక చెడు ఫలితాలు మాత్రమే పొందడం జరిగినది. ఏ విషయంలో ధనం మిగుల పెట్టుకోవాలి అనేది ఇంగిత జ్ఞానానికి సంబంధించిన విషయము. తలరాతను ఎవరూ మార్చలేరు అనడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ, చెడు కాలం సంప్రాప్తించినప్పుడు కొందరికి ఇటువంటి ఆలోచనలే వస్తూ ఉంటాయి. ముందే తగిన జాగ్రత్తలు తీసుకొనివుంటే ఈ ధుసంఘటనలు జరిగేవి కాదేమో !. ఏదైనా వస్తువు కొనే సమయంలో బేరమాడవచును, జీవిత సమరం విషయంలో బేరాలు ఆడటం అంటే, ఏమి చెప్పుకోవాలి, ఎలా చెప్పుకోవాలి. కర్మలను అనుభవించాల్సినదే. అది ఎవరైనా సరే. బుద్ధికి కాస్త పదును పెడితే, వాస్తవాలు అర్థమవుతాయి. భవిష్యత్తులో జాగ్రత్తలు తీసుకోవచ్చును. కష్టాలను, ఇబ్బందులను బాగా తగ్గించుకోవచ్చు.

చివరిగా ఒకటవ సంఖ్య గృహం గురించి మాట్లాడుకుందాం. ఈ గృహమునకు తూర్పు ఖాళీ స్థలము, ఉత్తరం ఖాళీ స్థలము, పశ్చిమం ఖాళీ స్థలము అయ్యి, దక్షిణము హద్దు పై నాలుగు గ్రహముల నిర్మాణం కావడం వల్ల ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందడం సామాజికపరంగా కాస్త మెరుగ్గా జీవితం గడచడం జరిగినది . అయితే మొత్తం ప్రహరీకి గల తూర్పు మెయిన్ గేటు ఈ గృహమునకు కూడా తూర్పు ఆగ్నేయం గేటుగా ఉంది. ఈ మెయిన్ గేటు ప్రభావం వల్ల ఈ గృహస్థుడు ప్రమాదంలో బలంగా గాయపడ్డాడు , అయితే ఇంటికి ఉన్న కొన్ని శుభ లక్షణాల వల్ల బ్రతికి బయటపడ్డాడు. అయితే ఈయన కుమారుడు తను చదివే కాలేజీలో ఒక అమ్మాయి విషయంలో పిల్లల మధ్య గొడవలు జరిగాయని సినిమా స్టైల్ లో ఐరన్ రాడ్స్ తీసుకెళ్లి అవతల వారిని చితకబాచడం జరిగింది, ఈ విషయంగా ఈ చిన్న అబ్బాయి కూడా జైలు జీవితాన్ని చూడడం జరిగింది ఆ తర్వాత ఆ అబ్బాయి కొన్ని చెడు వ్యసనాలకు లోనవ్వడం జరిగింది. 

వీటన్నిటినీ గమనిస్తే వాస్తు శాస్త్రంలో ముఖ ద్వారము / ప్రహరీ ద్వారము ఎంతటి బలమైన మార్పులు తీసుకొస్తుందో స్పష్టంగా అర్థం అవుతున్నది. కావున గృహస్తులు గృహ నిర్మాణమునకు ముందే తగిన జాగ్రత్తలు తీసుకొని జీవితాన్ని అమృతప్రాయం చేసుకోవాలి.

తూర్పు దిక్కు గృహాలకు కూర్చునే అరుగులు ఏ దిశలో నిర్మించుకోవాలి?

12. ఈ చిత్రంలో గృహానికి పశ్చిమ భాగము మరియు దక్షిణ భాగంలో “నలుపు రంగులో” కొన్ని చిహ్నాలు ఏర్పాటు చేయడం జరిగినది. వీటిని కూర్చునే అరుగులుగా భావించగలరు. ఇటువంటి అరుగులను దక్షిణ మరియు పశ్చిమ భాగాలలో ఏర్పాటు చేసుకోవడం వల్ల గృహస్థులకు కొన్ని ఆయాచిత లాభములు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గృహస్థుల బలం పెరిగి శత్రువుల బలం తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శత్రువు మీద విజయం పొందే అవకాశం అధికము. ఆరోగ్యం బాగుగా ఉండగలదు. ఋణ బాధలు కూడా తీరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దనం బాగా వచ్చే అవకాశం మెండు. జీవితంలో స్థిరత్వం ఏర్పడే అవకాశం వుంది.  ఈ అరుగులను ఎంత పెద్దగా నైనా ఏర్పాటు చేసుకోవచ్చు. ముఖ్యంగా కొండ రాళ్లతో కట్టుకునే అరుగులు అధిక శక్తిని కలిగి ఉంటాయి. 

తూర్పు దిక్కు గృహానికి అరుగులు ఎక్కడ నిర్మించుకోవాలి

సాధ్యమైనంతవరకు హోలో బ్రిక్స్ ను (కొన్ని ప్రాంతాలలో లొత్త ఇటుకలు అని అంటారు) వాడవద్దు.  చూడటానికి ఎబెట్టుగా ఉండే రీతిలో ఈ అరుగులను తయారు చేయవద్దు. ప్రతి ఒక పని కుదురుగా ఉండేలాగున చూసుకోవాలి. వాస్తు కు సంబంధించి ఏ విషయంలో కూడా స్వంత నిర్ణయం తీసుకోకూడదు. అనుభవజ్ఞుల మాట వినటం మంచిది. 

తూర్పు దిక్కు గృహాలకు చెట్లు ఏ ప్రాంతాలలో వేసుకోవచ్చు?

13. ఈ గృహం యొక్క ప్రహరీలో ఆకుపచ్చ రంగులో ఒక భాగము మరియు చిన్నగా కనిపిస్తున్న లేత వర్ణం ఆకుపచ్చ రంగుల రెండు భాగాలను చూడవచ్చు. ఆకుపచ్చ వర్ణం కలిగిన స్థలంలో చెట్లను బాగా పెంచుకోవచ్చు లేత ఆకుపచ్చ లేదా పీలిపోయిన రంగులో ఉన్న ఉత్తరము మరియు తూర్పు భాగాలలో కనిపిస్తున్న స్థానముల యందు చిన్నపాటి మొక్కలను నాటుకోవచ్చు. ఉత్తరము మరియూ తూర్పు వైపున రెండు చిన్నపాటి పలకలాంటి ప్రదేశాలలో పూలమొక్కలు వేసుకోవచ్చును. ఇక మిగిలిన ప్రాంతంలో చెట్లు వేసుకోవలసిన అవసరం లేదు. ఒకవేళ ఈ మిగిలిపోయిన ప్రాంతం లో కూడా చెట్లు ఉంటే వాటిని దయచేసి కొట్టి వేయకండి. ఒకవేళ మీరు మరీ ఎక్కువగా వాస్తును పాటించాలని అభిప్రాయం కలిగి ఉంటే ఈ ప్రాంతంలో ఉన్న చెట్ల కొమ్మలను మాత్రం తొలగించుకోండి. ఏ గృహంలోనైతే చెట్లు అధికంగా ఉంటాయో అక్కడ శాంతం బాగా ఉంటుంది, ఒక విధమైనటువంటి పవిత్రత భావం కూడా కలుగుతుంది. వాస్తు పేరు చెప్పి చెట్లను కొట్టివేయడం సరికాదు. 

తూర్పు దిక్కు గృహంలో చెట్లను నాటుకోవచ్చునా

ఏ గృహంలోనైతే చెట్లు అధికముగా పెంచుకుంటారో, లేదా బాగా పరిరక్షించుకుంటారో, లేదా ఏ స్థలములోనైతే చెట్లను గౌరవించి, చక్కగా వాటిని కాపాడుకుంటారో ఆ స్థలంలో అభివృద్ధిని చూడవచ్చు. ఉదాహరణకు, బెంగళూరు, మైసూర్, హైదరాబాద్ నందలి హైదరాబాద్ నందలి జూబిలీ హిల్స్, బంజారా హిల్స్, తదితరములు. పచ్చదనం ఉన్న గృహాలు ఆనందంగానే కాలం వెళ్లదీస్తాయి. చెట్లు ఉన్నంతకాలం, బెంగళూరు పట్టణం ప్రజలు ఆనందంగా వున్నారు, గత 20 సంవత్సరాలుగా software కంపెనీ పేరుతో జనాభా పెరిగి, చెట్లను బాగా కొట్టివేశారు. నేడు బెంగుళూరు లో చల్లదనం మాయమవుతున్నది. వేడి బాగా పెరిగిపోతున్నది. ప్రజలకు సంతోషం దూరం అవుతున్నది. ప్రజలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి ఈ విషయాన్ని ప్రభుత్వాలు గుర్తిస్తే మహా భాగ్యం.

14. మనం ఉన్న గృహమునకు తూర్పు దిశలో ఎక్కువ ఖాళీ స్థలం ఉన్నట్లయితే గృహస్తులు తద్వారా లభించే మంచి ఫలితాలతో ఆనందాన్ని పొందుతారు, ఇక్కడ దయచేసి ఒక విషయాన్ని గమనించండి తూర్పు దిక్కున ఖాళీ స్థలం ఉంది కదా అని పశ్చిమ వైపున కూడా ఎక్కువ కాళీ స్థలం ఉన్నట్లయితే దాని యొక్క చెడు ప్రభావములు కూడా గృహస్తులు అనుభవించాల్సి ఉంటుంది, అందుకే మీరు కొన్నిసార్లు ఇలా వింటుంటారు, ఏమిటంటే, కొందరు గృహస్తులు ఇలా అంటుంటారు మా గృహానికి తూర్పు వైపున ఎక్కువ కాళీ స్థలం ఉంది అయితే మాకు ఏ మంచి ఫలితాలు రాలేదు అని, ఇటువంటి విషయాలను దృష్టిలో ఉంచుకొని మన పెద్దలు మనకు కొన్ని సూచనలు కావించారు మనకు తెలియని విద్య జోలికి వెళ్ళకూడదు, ఎవరైతే, ఈ శాస్త్రం లో అనుభవం గడించివుంటారో వారి ద్వారా తగిన సలహా తీసుకోవడం వల్ల భవిష్యత్తులో మంచి జరుగుతుంది.

తూర్పు దీర్ఘ చతురస్రాకార స్థలములు బాగా కలిసి వస్తాయా

– : తూర్పు దిక్కు దుష్ఫలితాలు : –

కొన్నిసార్లు కొంతమంది గృహస్థులు రకరకాలుగా కొన్ని కామెంట్లు చెయ్యటం తమరు వినేవుంటారు, వాస్తు ఏమి పనిచేయదు . . . కొందరికి మాత్రమే పని చేస్తుంది . . . వాస్తు భారత దేశంలో మాత్రమే పనిచేస్తుంది . . . మేముంటున్న దేశంలో పనిచెయ్యదు . . . అంటుంటారు. అంతేకాకుండా ఇంకొందరు, ఈ వాస్తును పాటించాల్సిన అవసరం లేదని అనడం మీరు విని ఉండవచ్చును. మాది కూడా తూర్పు గృహమే, వాస్తు పనిచేసేటట్లయితే మాకు ఎందుకు మంచి ఫలితాలు రావడం లేదంటుంటారు. ఈ లింక్ ను పరిశీలనగా, బాధ్యతగా, వివరంగా చదివితే, మీకు ఎన్నో విషయాలు అర్థమవుతాయి. సంపూర్ణ పరిశీలన చేయకుండా ఏ విషయం పైనైనా ఒక నిర్ణయానికి రావడం అనేది సరైన విధానం కాదు. ప్రతి శాస్త్రం తప్పకుండా పనిచేస్తుంది, అయితే అవగాహన రాహిత్యం వల్ల, భాద్యత లేని పరిశీలన వల్ల, social మీడియా కు బానిసై, ప్రతి విషయంలోనూ వ్యతిరేక ఆలోచనలు ఎక్కువవుతుంటే,  అటువంటి వారికి ఏ శాస్త్రం గొప్పతనం అర్థం కాదు, ఎప్పటికీ . . . 

ఆ వ్యతిరేకతలో, ప్రతి విషయంలోనూ, ఏదో తెలియని కోపం, తెలియని కన్ఫ్యూషన్, స్పష్టత లేనితనం, భాద్యతా రాహిత్యం, ఇవన్నీ మనిషికి శత్రువులే, ఈ వ్యతిరేకతకు అపసవ్యదిశలో వెళితే బాగుంటుంది, అలాకాకుండా వ్యతిరేకతకు సవ్యదిశలో వెళ్ళటం వల్ల తనకు మాత్రమే అన్నీ తెలుసని, ఇతరులకు ఏమి తెలియదనే భావన, ఇత్యాది విషయాలతో మనసు అల్లకల్లోలమై తాము ఏమి చేస్తున్నామో తెలియకుండా ప్రతి విషయాన్ని, నెగటివ్ గా తీసుకొని, సమృద్ధ ఫలమును పొందకుండా, జీవితాన్ని సంపూర్ణం చేసుకోలేకపోతున్నారు. 

ఈ పేజీలోని విషయాన్ని తయారు చేయడానికి మాకు ఒక వారం రోజులు పట్టి ఉండవచ్చు, అయితే ఇదంతా చదవడానికి తమరికి పది నిమిషాలు అయి ఉండవచ్చు. ఇక్కడ మతలబు ఏంటంటే ఇప్పటివరకు తూర్పు ముఖ ద్వార గృహముల గురించి కేవలం ఒక్క శాతం మాత్రమే ఈ పేజీలో చెప్పటం జరిగినది, మిగతా చెప్పవలసినది 99% పై మేరకు ఉంటుంది. దీన్ని గమనంలో ఉంచుకొని గమనించండి, ఈ శాస్త్రం ఎంత పెద్దదో, సాగరాన్ని ఈదవచ్చును, ఈ శాస్త్రాన్ని మాత్రం సంపూర్ణంగా తెలుసుకోలేము. సముద్రమంత పెద్దదైన ఈ శాస్త్రాన్ని సంపూర్ణంగా తెలియజేయడమనేది జరిగే పనేనా !! తెలుసుకోవడం అనేది సాధ్యమయ్యేదేనా !! దాదాపుగా అసాధ్యం. భవిష్యత్తులో సాధ్యం కావచ్చునేమో, భగవంతునికే తెలియాలి.

1. తూర్పు ముఖ స్థలానికి తూర్పు ఎలా కోల్పోతుంది అని ఒక ప్రశ్న మనలో ఉదయించవచ్చును. అటువంటి వారి కోసం ఈ చిత్రం ఏర్పాటు చేయడం జరిగినది. ఇందులో ఒకటో నెంబర్ గృహానికి తూర్పు భాగము కోతబడినది, తద్వారా తూర్పు ఈశాన్యం పెరిగింది, మరియు తూర్పు ఆగ్నేయం పెరిగినట్లు అయినది. తూర్పు ఈశాన్యము పెరగడం మంచిదే, అయితే తూర్పు ఆగ్నేయం పెరగడం గృహస్తులకు మంచిది కాదు. ఇక్కడ ఎన్నో ప్రశ్నలు ఉదయిస్తాయి. ఈ కోల్పోయిన తూర్పు భాగము ఈ గృహస్తుల అధీనంలోనే ఉన్నట్లయితే ప్రమాదం యొక్క శాతం భారీగా తగ్గిపోతుంది లేదా ఏ ప్రమాదము లేకపోవచ్చు. ఒకవేళ ఈ కోల్పోయిన తూర్పు భాగము ఇతరుల ఆధీనంలో ఉంటే మాత్రం ఈ గృహస్తులు సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.

తూర్పు దిశ గృహ దుష్ఫలితాలు

ఒకవేళ ఈ కోల్పోయిన తూర్పు భాగము ఇతరుల ఆధీనంలో ఉంటే మాత్రం ఈ గృహస్తులు సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ప్రస్తుతం ఈ ఒకటో నెంబర్ గృహానికి తూర్పు రహదారి కలదు కదా, ఈ గృహము నిర్మాణంలో తూర్పు కోల్పోయినా సమస్యలు రావు. ఎందుకంటే, వీరికి తూర్పు రహదారి వుంది కాబట్టి. అయితే ఇక్కడ ఒక చిక్కు ఉన్నది, అది ఏమిటో క్రింద పటము ద్వారా తెలుసుకుందాము.

2. ఈ చిత్రంలో గృహానికి తూర్పు భాగం కోల్పోవడం అత్యంత స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ గృహం తూర్పును కోల్పోవడం వల్ల గృహం నందు తూర్పు ఈశాన్యం పెరగడం, మరియు తూర్పు ఆగ్నేయం పెరగడం జరిగినది. అయితే ఈ గృహంలో ఎదురుగా రహదారి ఉండడం వల్ల ఈ తూర్పు కోల్పోయిన భాగము ఈ గృహస్తులకు కీడు చేయదు. అలాకాకుండా ఈ కోల్పోయిన తూర్పు భాగము ఇతరుల ఆధీనంలో ఉంటే ఈ గృహస్తులు వేదనకు గురి కావలసి ఉంటుంది. అనగా, పశ్చిమ ముఖ ద్వారం ఉండి, వెనుకవైపున అనగా తూర్పు భాగమున ఈ చిత్రంలో చూపిన విధంగా తూర్పును కోల్పోయి, ఇతరుల అధీనంలో ఉంటే, వీరు చాలా బాధలను అనుభవించాలి.

తూర్పు కోల్పోయిన గృహమును కొనవచ్చునా?

ఈ క్రింది చిత్ర పటంలో ఈ విషయం గురించి, ఇంకాస్త లోతుగా చర్చించడం జరుగుతుంది.

3. ఈ చిత్రం ద్వారా స్పష్టంగా ఒక విషయాన్ని తెలుసుకోవచ్చు. ఈ గృహమునకు తూర్పు భాగము కోల్పోవడం మీకు తెలిసినదే కదా, తద్వారా తూర్పు ఈశాన్యం పెరగడం మరియూ తూర్పు ఆగ్నేయం పెరగడం జరిగినది. దీనివల్ల అంత చిక్కులేమి రావు అని మనము ఇంతకుమునుపు తెలుసుకున్నాము. అయితే ప్రస్తుతము ఈ గృహస్తులు పెరిగిన ఈశాన్య భాగంను ఇంటి లోపల నుండి వాడుక లేకుండా చేసుకొని, ఒక గోడను నిర్మించి, ఆ ఈశాన్య గదికి బయట నుండి ఒక ప్రత్యేక ద్వారం ఏర్పాటు చేసుకోవడం జరిగినది. తద్వారా ఇంటి లోపల తూర్పు ఆగ్నేయం పెరిగి, ఈశాన్యం కోత పడింది. ఎప్పుడైతే ఈశాన్యం కోత పడటం జరుగుతుందో అప్పుడు సమస్యలను చేజేతుల ఆహ్వానించినట్టు అవుతుంది. వచ్చిన సమస్యలు అంత సులభంగా పరిష్కారం కాకపోవచ్చును. చేజేతులా చేసుకున్న ఇంకొక తప్పిదం ఏమిటంటే, ఈశాన్యం గదిని బంధించారు. అనగా అభివృద్ధిని బంధించారు. ఈ చిన్న మార్పుల వల్ల ఈ గృహస్థులు రకరకాల సమస్యలతో వేగవలసి ఉంటుంది.

తూర్పు దిక్కు గృహంలో ఈశాన్యం గది కోత

4. ఈ చిత్రంలో అదే తరహాలో తూర్పు కోత పడింది మరియూ, తూర్పు ఈశాన్య, తూర్పు ఆగ్నేయాలు పెరిగాయి. అయితే, ఈ గృహస్థులు పెరిగిన ఈశాన్యం లోనికి ఇంటినుండి డైరెక్ట్ గా వెళ్ళడానికి అవకాశం చేసుకున్నారు, వారి అవసరం రీత్యా ఆగ్నేయం దగ్గర గోడ కట్టుకొని, ఆగ్నేయం గదికి ప్రత్యేకంగా ద్వారం పెట్టుకున్నారు. పక్క పక్క గృహాలకు, అంతర్లీనంగా, అతి స్మూక్షంగా ఇంత చిన్న మార్పులుంటే, సాధారణ గృహస్థులు త్వరగా కనుకోలేరు. కానీ జీవితాన్ని మార్చే మార్పులివి. రెండు గృహాలు ఒకే రీతిలో కట్టబడ్డాయి, కానీ ఫలితాలు చాలా తేడాలున్నాయి అని కొందరు అంటుంటారు. ఈ చిత్రాలు చూస్తే, ఇక ఇలాంటి మాటలు అనరు. ఒక పూట కట్టుకునే బట్టలను జాగ్రత్తగా గమనించి పరిశీలన కావించి నిర్ణయం తీసుకుంటాం కొనాలా వద్దా అని. మరి జీవితాంతం ఉండే గృహం విషయంలో ఎందుకు ఈ అలసత్వం ఎందుకు ఈ నిర్లక్ష్యం.  

తూర్పు గృహానికి ఆగ్నేయ భాగం కోత పడడం

వాస్తు శాస్త్రంలో ఒక చిన్న మార్పు చాలు జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కోవటమో లేదా ఉన్నత స్థితికి ఎదగడానికి ఇవే తగిన తోడ్పాటు నందించటం లేదా అవకాశాలను కాలరాయడము చేస్తుంటాయి. ఒక పెన్ తీసుకోవాలంటే రకరకాలుగా చూసి, అన్నీ విచారించుకొని కొంటాము కదా, అదే పెన్ 3 దినాలలో పోగొట్టుకుంటే, ఏమి చేస్తామని, ఇంకో పెన్ కొంటాము. లేదా ఆ పోగొట్టుకున్న పెన్ కోసం కొన్ని ప్రయత్నాలు చేస్తాము. మరి జీవితం మొత్తానికి మంచి మార్పులు తెచ్చే ఇటువంటి అద్భుతమైన భారతీయ పురాతన శాస్త్రం విషయంలో నిర్లక్ష్యం చేయడం తగదు కదా.

– : తూర్పు దిశ గృహ వాస్తు పై కొన్ని ప్రశ్నలు మరియు సమాధానాలు : –

ఇక్కడ తూర్పు దిశ గృహాలపై గృహస్థులకు వచ్చే కొన్ని ప్రశ్నలు మరియు వాటికి సమాధానాలను ప్రచురించడం జరిగినది. ఒకవేళ మీకు తూర్పు గృహాల వాస్తుపై ఏమైనా ప్రశ్నలు ఉన్నట్లయితే మమ్మల్ని నిరభ్యంతరంగా సంప్రదించండి, సంబోధన సంస్కారవంతంగా ఉంటే తప్పకుండా సమాధానం ఇవ్వగలము. ఒకవేళ మీ ప్రశ్న సమాజానికి పనికి వచ్చే రీతిలో ఉన్నట్లయితే ఆ ప్రశ్న మరియు సమాధానం కూడా ఇక్కడ ప్రచురించడం జరుగుతుంది. ఒకవేళ మీకు సమ్మతం అయితే మీ పేరు / ఊరు ప్రచురిస్తాము. మీ ఒప్పుదల లేకుండా మీ పేరు ప్రచురించబడదు.

1. తూర్పు దిశలో బావులు, చెరువులు, కుంటలు, వాగులు, నదులు, ప్రవాహాలు ఉండడం మంచిదేనా?

వాస్తు శాస్త్ర రీత్యా గృహములకు తూర్పు దిశలో లోతైన ప్రాంతాలు ఉండడం మంచి ఫలితాలను ఇస్తుంది. ఇంటికి తూర్పు దిశలో వాగులు, కుంటలు, నీటి ప్రవాహాలు, ఉండడం వల్ల శుభ లక్షణాలు అనుభవించవచ్చు. ఉదా : – అనుకున్న పనులు జరగడం, మంచి పేరు ప్రఖ్యాతులు లభించడం, చక్కటి ఆరోగ్యం, ధనం, సంపద, ఆనందం, విదేశీ ప్రయాణాలు లేదా దూర ప్రయాణాలు, తదితరములు.

తూర్పు ముఖ గృహానికి తూర్పు దిశలో నీరు ఉండటం మంచిదా

2. గృహమునకు తూర్పు దిశలో చెట్లు నాటవచ్చునా?

ప్రస్తుతం తూర్పు దిశలో చెట్లు లేకపోతే, కొత్తగా చెట్లు నాటకండి. అక్కడ ఇప్పటికే చెట్లు ఉంటే, పశ్చిమ దిశలో ఒక పెద్ద రాయి వేదికను ( కూర్చునే అరుగులు / platform ) నిర్మించండి, లేదా పశ్చిమ దిశలో బరువైన చెట్లు నాటండి. దయచేసి తూర్పు దిశలో ఉన్న ప్రస్తుత చెట్లను తొలగించవద్దు. స్థలమునకు చెట్లు ప్రాణ సమానం, వృక్షములవల్ల మంచి జరుగుతుంది. మరీ ఇబ్బంది అనిపిస్తే, పెద్దగా ఉన్న కొమ్మలను తొలగించండి.

గృహానికి తూర్పు దిశలో చెట్లు ఉండవచ్చునా

3. తూర్పు దిశలో ఉన్న అపార్ట్‌మెంట్లు లేదా పెద్ద భవనాలు ఏమైనా హాని కలిగిస్తాయా?

సాధారణంగా, తూర్పు దిశలో అపార్ట్‌మెంట్లు లేదా పెద్ద భవనాలు లేదా భారీ నిర్మాణాలు మంచిది కాదు. అందుకే చాలా మంది వాస్తు నిపుణులు గృహాలను వాస్తు సూత్రాలకు అన్వయిస్తూ మరియూ పాటిస్తూ నిర్మించమని బోధిస్తారు. అలా చేస్తే, తూర్పు దిశలో పెద్ద నిర్మాణాలు ఉన్ననూ భవిష్యత్తులో భరించలేనంత ఇబ్బందులు ఎదురు కాకపోవచ్చును. ఎంతోమంది గృహస్తులు తెలిసి తెలియక తూర్పు దిశ గృహం అద్భుతంగా కలిసి వస్తుందనే ఉద్దేశ్యంతో వెనకా ముందూ చూడకుండా ఎంత ధనమునైనా పోసేందుకు సిద్ధపడతారు, వారి తాహత్తుకు మించి గృహాన్ని కొనడానికి సిద్ధపడతారు. 

ఇంటికి తూర్పు దిశలో అపార్ట్మెంట్ ఉంటే ఏమైనా దోషమా

అయితే ఇక్కడ ఒక విషయాన్ని శ్రద్దగా ఆలకించండి, వాస్తు బాగా లేని గృహాలు అది ఏ దిశ నైనా కానివండి, గృహస్థులకు తగిన సహకారాన్ని అందించవు. వాస్తు బాగుగా ఉన్న గృహాలు మాత్రమే గృహస్థులకు అన్ని విధాలా చేదోడు వాదోడుగా ఉండి తగిన సహాయ సహకారములు అందిస్తాయి, వారి ఉన్నతికి తోడ్పాటునందిస్తాయి. కొందరు గృహస్థులు, తూర్పు ముఖం గృహం అనగానే వెనుకా ముందు చూడకుండా  కొనేస్తుంటారు. అటువంటి వారి కోసమే కొన్ని సంఘటనలను, మరియూ తీసుకోవలసిన జాగ్రత్తలను తెలియజేయాలనుకుంటున్నాము. 

4. తూర్పు దిశ గృహాన్ని కొనాలని యోచిస్తున్నాం, ఎదురుగా అనేక ఖాళీ స్థలాలు ఉన్నాయి, ఇది మంచిదేనా?

మనం కోనబోయే గృహానికి ఎదురుగా ఖాళీ స్థలాలు, ఆట ప్రదేశాలు ఉండడం వల్ల తూర్పు భాగం మొత్తం ఖాళీగా ఉండి తద్వారా దాని యొక్క సత్ఫలితాలను ఈ గృహస్తులు అందుకోవడం జరుగుతుంది. కొన్నిసార్లు ఇంటిలోపలి నిర్మాణం వాస్తు కు అనుకూలంగా లేకపోయినా ఇటువంటి గృహాలు బాగా కలిసివస్తాయి. అందుకే చాలాసార్లు పశ్చిమ దిక్కుకు ఉన్న స్థలాలకు వెనుక భాగం అనగా తూర్పు భాగంలో ఖాళీ స్థలాలు ఉన్నప్పుడు ఆ పశ్చిమ గృహాలు మంచి అభివృద్ధిలోకి రావడం గమనించవచ్చు.

 

5. మేము కొనబోయే ఇంటికి ఎదురుగా ఒక పెద్ద నీటి ట్యాంకును చూశాము (8 స్తంభాలపై ఉన్న పెద్ద నీటి నిల్వ నిర్మాణం – Overhead Water Tank), ఇది మంచిదేనా? ఈ ఇంటిని కొనవచునా?

తూర్పు దిశలో నీరు ఉండటం మంచి లక్షణం, కానీ స్తంభాలతో ఉన్న నీటి ట్యాంకు మంచిది కాదు. సాధ్యమైనంతవరకు కొనకపోవటమే మంచిది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితులలో కొనవలసిన సందర్భంలో, ఒక నిపుణుడి ద్వారా తగిన సలహా పొంది మాత్రమే నిర్ణయం తీసుకోండి. లేదా ఒక మధ్యస్థమైన పరిష్కారంగా, ఆ స్తంభాల ప్రాంతంలో అన్నిటిని శుభ్రంగా, స్పష్టంగా ఉంచండి, అక్కడ ఎటువంటి పొదలు ఉండకూడదు, అప్పుడు ఈ చిన్న పని నెగటివిటీని నివారించేలా పనిచేస్తుంది.

 

మేము కొనబోయే ఇంటికి తూర్పులో ఒక పెద్ద నీటి ట్యాంకు ఉంది, ఇది మంచిదేనా?

6. తూర్పు దిశలో సెప్టిక్ ట్యాంకును వేసుకోవచ్చునా?

తూర్పు దిశలో మరుగుదొడ్డి గుంతలు ఏర్పాటు చేసుకోవచ్చు అయితే ఒక్కోసారి చిన్న పొరపాట్లు కూడా విపరీతమైన పరిణామాలకు దారి తీస్తాయి కావున తగిన జాగ్రత్తలు తీసుకొని మాత్రమే వేసుకోండి. మిగతా సమాచారం కోసం ఇక్కడ ప్రయత్నం చెయ్యండి : Septic Tank Vastu Ideas. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే మమ్మల్ని సంప్రదించండి.

తూర్పు దిశలో సెప్టిక్ ట్యాంక్ ఉండవచ్చా

7. మేము కొనాలనుకుంటున్న తూర్పు దిక్కు ఇంటికి తూర్పు వైపున కొండలు ఉన్నాయి ఈ ఇంటిని కొనవచ్చునా?

సాద్యమైనంతవరకు తూర్పు దిశ గృహాలకు ఎదురుగా కొండలు లేదా మిట్టలు లేదా పర్వతాలు ఉన్నప్పుడు అటువంటి గృహాలను కొనకపోవడమే మంచిది. తూర్పు దిశలో ఉన్న ఇల్లు ఎదురుగా కొండలు ఉంటే వాస్తు రీత్యా దాని శుభ లక్షణాలు గణనీయంగా తగ్గుతాయి. సాధారణంగా కొనే స్థలానికి ఎదురుగా తూర్పు వైపున కొండలు ఉండడం వల్ల, ఆ దిశలో సహజ సూర్యుని కాంతి, సహజ శక్తి అవరోధించబడుతుంది, ఇది ఆ స్థలం యొక్క వాస్తు శక్తిని కొంత మేరకు వ్యతిరేక ప్రభావితం చేసి గృహస్థులకు కొన్ని విషయాలలో వ్యతిరేక సంఘటనలు జరిగే అవకాశం ఎక్కువ. 

కొనే గృహానికి తూర్పు దిశలో కొండలు ఉండవచ్చా

దీనివల్ల ఆ స్థలంలో నివాసం లేదా నిర్మాణం చేయడంలో కొంత నిరాశాజనకమైన ప్రభావాలు కలగవచ్చు. ఉదాహరణకు కంటికి సంబంధించిన సమస్యలు, లేదా మెదడుకు సంబంధించిన సమస్యలు, ఏదో ఒక విషయంలో మానసిక ప్రశాంతత లోపించడం తదితరములు. కాబట్టి, ఈ రకమైన గృహాలను కొనుగోలు చేయడం అనేది అంత మంచిది కాకపోవచ్చును. తప్పనిసరి పరిస్థితులలో కొనదలిస్తే ముందుగా వాస్తు నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం. ఉదాహరణకు గుజరాత్ లోని గాంధీ నగర్ దగ్గర కొన్ని ప్రాంతాలు, కర్ణాటక లోని మల్నాడు ప్రాంతం మరియు కాలిఫోర్నియా రాష్ట్రం లో ఇటువంటి పరిస్థితులను ఎక్కువగా చూడవచ్చును.

8. తూర్పు దిశలో విద్యుత్ పవర్ పోల్స్ మరియు ట్రాన్స్‌ఫార్మర్లు ఉండటం మంచిదా, కాదా?

సాధారణంగా తూర్పు దిశలో ఉన్న ఎలక్ట్రికల్ పోల్స్ వల్ల ఏ నష్టము లేదు అనవసరమైన భయాలు పెంచుకోవలసిన అగత్యం లేదు. చిన్న చిన్న ఎలక్ట్రికల్ పోల్స్ వల్ల ఏ సమస్యలూ రావు. అయితే తూర్పు దిశలో ఉన్న పెద్ద పెద్ద ఎలక్ట్రికల్ పోల్స్ ఉదాహరణకు ఈ చిత్రంలో చూపినట్టుగా ఉన్నట్లయితే వాటి వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం కనిపిస్తున్నది. ఇకపోతే తూర్పు వైపున ఉన్న ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ల వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ ఇలా ఉంటే కొంచం నెమ్మదించి, అనుభవజ్ఞుల మాటను ఆచరించి కొనాలా వద్దా అనేది ఆలోచించుకోవాలి. తొందరపాటు వలదు.

తూర్పు దిశలో విద్యుత్ శక్తి స్తంభాలు మరియు ట్రాన్స్‌ఫార్మర్లు ఉండటం మంచిదేనా?

9. తూర్పు దిశలో భూగర్భ నీటి నిల్వ ట్యాంక్‌ను కలిగి ఉండటం మంచిదా?

కొన్ని గృహాలకు తూర్పు దిశకు నీటి బావులు గాని లేదా నీటిని నిల్వ చేసుకునే భూగృహ నీటి నిల్వ కేంద్రాలు గాని ఉంటాయి, సామాన్యంగా తూర్పు వైపున ఉన్న అండర్ గ్రౌండ్ స్టోరేజ్ వాటర్ ట్యాంక్ వల్ల గృహస్థులకు మంచి ఫలితాలే వస్తాయి. చాలా తక్కువ సార్లు మాత్రం కొంచెం తేడా గా ఫలితాలు వచ్చే అవకాశం ఉండవచ్చును, దాదాపుగా అరుదుగా చెడు ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నది, ఇందుకు ఎన్నో కారణాలు తోడు కావాలి. ఏమైతేనేమి ఒక్కసారి ఈ విషయంలో మాత్రం అనుభవజ్ఞుల మాట మేరకు నిర్ణయం తీసుకోవడం మంచిది. తొందరపాటు వద్దు.

తూర్పు దిశలో భూగర్భ నీటి నిల్వ ట్యాంక్‌ ఉండటం మంచిదా?

10. తూర్పు గృహాన్ని అద్దెకు తీసుకుంటే అద్భుతంగా కలిసి వస్తుందా?

కొందరు గృహస్తులు గృహములు అద్దెకు తీసుకోవాలనుకుంటే కేవలం తూర్పు గృహాన్ని మాత్రమే తీసుకోవడానికి ఇష్టపడతారు, వీరి ఉద్దేశం ఏమిటంటే, కేవలం తూర్పు గృహాలు మాత్రమే అద్భుతంగా కలిసి వస్తాయని ఇతర గృహాలు బాగా కలిసి రావనే అభిప్రాయంతో ఉంటారు. అయితే ఒక విషయాన్ని మనం గమనించాలి, ఏ దిక్కు గృహమైననూ వాస్తు కు బాగా వున్నపుడే ఫలితాలు మంచిగా ఉంటాయి, అంతేకానీ, ప్రతి ఒక్క తూర్పు గృహం కూడా బ్రహ్మాండంగా యోగిస్తుంది అనుకోవడం పొరపాటు. కాస్త నిదానంగా అలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. తొందరపాటు నిర్ణయాలు భవిష్యత్తులో మనశ్శాంతి లేకుండా చేయవచ్చు.

తూర్పు గృహాన్ని అద్దెకు తీసుకుంటే బాగా కలిసి వస్తుందా?

11. తూర్పు గృహానికి భూగృహం నిర్మించుకోవచ్చా?

బేస్మెంట్ నే రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. కొన్ని ప్రదేశాలలో ఈ బేస్మెంట్ ను, నేలమాళిగ, భూగ్రహం, సెల్లార్, అండర్ గ్రౌండ్ రూమ్, లోయర్ గ్రౌండ్ ఫ్లోర్, లాంటి పదాలతో పిలుస్తూ ఉంటారు. ప్రస్తుత పరిస్థితులకు జనాభా పెరుగుదల అధికంగా ఉండడం, దానికి తగ్గట్టుగా స్థలం పెరగకపోవడం, ఉన్న స్థలములలోనే అన్ని అనుకూలాలు చేసుకోవాలని ప్రజలు భావిస్తారు, ఇందులో ఏ తప్పూ లేదు. అవసరం అనేదానికి ప్రత్యామ్నాయం లేదు. అవసరం అనేది ఎప్పటికీ అధిక ప్రాధాన్యత కలిగిన అంశమే. అయితే వాస్తు వేరు అవసరాలు వేరు. ఈ విషయాన్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి.

తూర్పు గ్రహానికి నేలమాళిగ వేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయా?

మీకు అర్థం కావటం కోసం ఇక్కడ ఒక చిత్రాన్ని చూపించడం జరిగినది ఈ చిత్రం లో పై భాగంలో సాధారణ గృహం, మరియూ క్రింద భాగంలో  ఒక భూగ్రహం ఉండడాన్ని చూడవచ్చు. వాస్తు పరిశోధనలు చేసినప్పుడు ఎన్నో కొత్త విషయాలు బయటపడ్డాయి. పట్టణాలలో బేస్మెంట్ వేసుకోవడం అనేది సాధారణమైన విషయం. బేస్మెంట్ వేసుకోకుండా నిర్మాణం చేస్తే వాహనాలు నిలుపుకునే ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకోవడం అంటే అంత చిన్న విషయం కాదు, దీనిని ఒక సవాలు గానే భావించాలి. కాబట్టి తప్పనిసరిగా పట్టణాలలో నిర్మాణాలకు బేస్మెంట్ ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఉదాహరణకు మనము తూర్పునిర్మాణాలను తీసుకున్నప్పుడు, మన పక్క నిర్మాణాలకు కూడా భూగ్రహం ఉన్నప్పుడు, మన నిర్మాణానికి కూడా భూగ్రహం వేసుకున్నప్పుడు కొత్తగా ఏ సమస్యలు రావు, అలా కాకుండా పక్క స్థలాల వారు లేదా పక్క నిర్మాణాల వారు భూగ్రహం వేసుకోనట్లయితే దయచేసి మీరు ఒక వాస్తు నిపుణుడిని సంప్రదించి తగిన సలహా పొందవలసిందిగా కోరడమైనది. అంతేకానీ స్వంత నిర్ణయం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు.

ఒకవేళ మీరు ఉన్న ఊరు పట్టణం కాకుండా, చిన్న ఊరు అయినట్లయితే మీ తూర్పు ముఖ నిర్మాణానికి తప్పనిసరిగా బేస్మెంట్ వేసుకునే పరిస్థితులు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఒక వాస్తు సిద్ధాంతిని సంప్రదించి తగిన నిర్ణయం తీసుకోవలసిందిగా కోరడమైనది. ఎందుకంటే ఒక మోస్తరు చిన్నపాటి పట్టణానికి ప్రతి ఒక్క తూర్పు ముఖ నిర్మాణాలకు బేస్మెంట్ వేసుకుంటారు అని చెప్పలేము, ఎన్నో నిర్మాణాలకు బేస్మెంట్ లేకుండా కట్టుకుంటుంటారు ఎందుకంటే వారికి విపరీతమైన ట్రాఫిక్కు ఉండకపోవచ్చు. ఇలా పక్క గృహాలకు లేదా నిర్మాణాలకు బేస్మెంట్ లేనట్లయితే మీరు హుషారుగా ఉండి తగిన నిర్ణయం తీసుకోవాలి, తొందరపాటు కూడదు.

ఊరి బయట నిర్మాణాలకు, ఊరిలోపల నిర్మాణాలకు కొన్ని వాస్తు నియమాల వ్యత్యాసాలు ఉంటాయి. పట్టణాలలోని నిర్మాణాలకు,  గ్రామాలలోని నిర్మాణాలకు,  కొన్ని ప్రత్యేక మైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు రావచ్చు. మన స్థలం యొక్క చుట్టుపక్కల పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కొన్ని నియమాలలో సడలింపులు లేదా అదనపు చేర్పులు చేసుకోవలసిన పరిస్థితులు ఉండవచ్చును. అంతేకానీ ప్రతి ఒక్క రోగానికి ఒకే మందు అనడం సరికాదు కదా. పరిసరాల ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకోకుండా నిర్మాణం చేయడం అంత సరైన విధానం కాదు.

14. తూర్పు దిక్కు గృహానికి తూర్పులో కార్ షెడ్ లేదా కార్ గ్యారేజీని నిర్మించవచ్చునా, తూర్పులో వాహనాలను నిలుపుకోవచునా?

తూర్పు ముఖ ద్వార గృహమునకు తూర్పు వైపున వాహనాలు నిలిపి ఉంచు కారు గ్యారేజ్ వేసుకోవడం వల్ల శుభ ఫలితాలు రాకపోవచ్చును. ఉదాహరణకు ఈ చిత్రంలో చూపినట్టుగా కారు గ్యారేజ్ ను తూర్పు దిక్కున వేసుకోవడం వలన అంత బలమైన శుభ ఫలితాలు వచ్చే అవకాశం తక్కువ. ఒకవేళ ఆగ్నేయ భాగంలో కూడా ఏదైనా నిర్మాణం ఉన్నప్పుడు తూర్పు వైపున ఇటువంటి కారు గ్యారేజ్ రావడం వల్ల అంత చెడు ఫలితాలు రాకపోవచ్చు. అయితే ఈశాన్య భాగము చెడిపోకుండా జాగ్రత్త వహించాలి. ఈశాన్యంలో నిర్మాణాలు రావడం అంత శుభప్రదం కాదు.

 

తూర్పు దిక్కున కార్ గ్యారేజ్ ఉండవచ్చా

తూర్పు దిక్కులో వాహనాలు నిలపడం వల్ల ఏ సమస్యలు రావు. అయితే నిర్మాణాల వల్ల మాత్రమే సమస్యలు వచ్చే అవకాశం అధికంగా ఉంది. ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవశ్యం. మన జాగ్రత్తలే మనకు శ్రీరామరక్ష. ఒకవేళ తూర్పు గ్రహానికి తూర్పు వైపున వాహనాలు నిలిపించు కారు షెడ్ వచ్చినట్లయితే సాధారణంగా గృహస్థులకు కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది లేదా మెదడుకు సంబంధించిన సమస్యలు కూడా ఒక్కొక్కసారి రావచ్చు. పిల్లల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది, అభివృద్ధి కోసం పిల్లలు తాపత్రయపడతారు, అయితే వారు విజయాన్ని అంత సులభంగా అందుకోలేకపోవచ్చు, గృహస్థులకు కూడా అపజయాలు వచ్చే అవకాశం కాస్త కనిపిస్తున్నది. అవమానములు జరుగకుండా చూసుకోవాలి. ఈ చిత్రంలోని కార్ గ్యారేజ్ గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాము, అంతేకానీ ఈ చిత్రం లోని ఇతర వాస్తు విషయాల గురించి చర్చించడం లేదు దయచేసి గమనించగలరు. 

14. గృహమునకు తూర్పు ముఖ ద్వారం మంచి ఫలితాలను ఇస్తుందా?

మనం గమనించినట్లయితే పూర్వకాలంలో ఎక్కువ శాతం ప్రజలు తమ గృహములకు దిక్కులకు సరిపోయే విధంగా ముఖ ద్వారమును ఏర్పాటు చేసుకునేవారు, అది ఏ దిక్కు అయినా ముఖ ద్వారమును మాత్రం దిశ కు అనుకూలంగా మాత్రమే ఏర్పాటు చేసుకునేవారు. నేటికీ మనం గ్రామాలకు వెళితే ఎన్నో గృహాలకు ఇటువంటి తూర్పు ముఖ ద్వారములను గమనించవచ్చును. వాస్తుకు గృహము సరైన విధానంలో ఉన్నప్పుడు తూర్పు ముఖ ద్వారం గృహస్థులకు మంచి ఫలితాలను ఇస్తుంది, అయితే గృహము ఖచ్చితంగా తూర్పు దిశకు ఉన్నప్పుడు అనగా 90° ఉన్నప్పుడు ఫలితాలు చాలా బాగా ఉంటాయి.

తూర్పుముఖ ద్వారం వాస్తు రీత్యా మంచి ఫలితాలను ఇస్తుందా

ఒకవేళ గృహము నిర్మించే స్థలం తూర్పు దిశకు కాకుండా ఆగ్నేయ దిశకు తిరిగినట్లయితే  ఫలితాలు కొంచం తారుమారు కాగలవు. కొంచం చేదు ఫలితాలు రావచ్చును.​ ఒకవేళ స్థలము ఈశాన్యం వైపునకు తిరిగినట్లయితే ఫలితాలు బాగా ఉంటాయి.

14. తూర్పు దిశలో గృహ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవచ్చునా?

గృహం నందు మన స్వంత కార్యాలయమును తూర్పు వైపున ఏర్పాటు చేసుకోవచ్చును, అయితే, గృహమునకు మరియు కార్యాలయమునకు మధ్యలో తలుపు ఉండవలెను. ఈ తలుపు కూడా వాడుకలో ఉండవలెను. తలుపు లేకపోయినా, లేక, ఉన్న తలుపు వాడుకలో లేకపోయినా మంచి ఫలితాలు రావు. ఒక్కొక్కసారి ఒక చిన్న పొరపాటు చేసినా మంచి ఫలితాలు రావు. మంచి ఫలితాలు రానప్పుడు, వాస్తును లేక వాస్తు సిద్థాంతులను నిందించడం కన్నా, చేసిన, చేస్తున్న తప్పులను సరిచేసుకుంటే జీవితం సాఫీగా సాగిపోతుంది కదా!

గృహమునందు తూర్పు వైపున కార్యాలయమున ఏర్పాటు చేసుకోవచ్చునా

15. పూజా గృహమును తూర్పు గదిలో ఏర్పాటు చేసుకోవచ్చునా?

మనం “నిర్మించుకోబోతున్న” గృహమునందు కానీ లేక మనం “కొనబోతున్న” గృహమునందు దేవుడి గదిని తూర్పు వైపున ఏర్పాటు చేసుకోవచ్చును. తూర్పు దిక్కులో దేవుడి గదిని నిరభ్యంతరంగా ఏర్పాటు చేసుకోవచ్చును. అయితే కొన్ని నియమాలను పాటించడం వల్ల శుభకరమైన ఫలితాలు అధికంగా ఉండే అవకాశం ఎక్కువ. ఇతర గదుల నిర్మాణములతో సంబంధం లేకుండా తూర్పు దిక్కులో ఒంటరిగా ఉన్న దేవుడి గది వల్ల ఇబ్బందులు ఏర్పడవచ్చు. అనగా తూర్పు దిశలో నిర్మాణమైన దేవుడి గదికి ఉత్తర గోడకు మరియు దక్షిణ గోడకు ఏ ఇతర నిర్మాణములు లేకుండా ఉన్నట్లయితే ( చిత్రంలో చూపిన విధంగా, ఒంటరిగా / isolated ), మంచి ఫలితములు ఇవ్వకపోవచ్చును. దేవుడి గది దక్షిణ గోడకు ఇతర నిర్మాణము ఏదైనా కానీయండి తగులుతూ వున్నట్లైతే, మంచి ఫలితాలు వస్తాయి.

తూర్పు దిక్కులో దేవుని గది ఫలితాలు

దారుణమైన ఫలితాన్ని ఇచ్చిన రావు గారి తూర్పు దిశ గృహం

(నిజమైన పేరు మరియు నివాస ప్రాంతాన్ని మార్చడం జరిగింది). మనం చిన్నప్పుడు పిల్లల కథల పుస్తకాలని, నవల లని, వారపత్రికలంటూ, మాసపత్రికలంటూ, బేతాళ కథలు అంటూ, చందమామ అంటూ, బొమ్మరిల్లు అంటూ, ఎన్నో కథలు చదివే వాళ్ళం అలాంటిదే ఇది ఒక కథలాగా భావించి చదవగలరు. ప్రతి ఒక్క గృహస్థుని వివరాలను మనము గోప్యంగా ఉంచడం మన ధర్మం, వారి ఇంట జరిగిన దారుణాతి దారుణమైన సంఘటనలను మనం బహిరంగపరిచి వారి పేర్లు బయట పెట్టడం మంచిది కాదానే ఉద్దేశంతో ఈ మాట తెలియజేయడం జరుగుతున్నది, దయచేసి పెద్ద మనసు చేసుకొని ఒక కథ లాగా ఈ సంఘటనలు చదువుకోమని ప్రార్థన. అతి త్వరలో రావు గారు తన జీవితంలో చేసిన అత్యంత పెద్ద పొరపాటు మరియు ఆయన అనుభవించిన బాధలను ఇక్కడ ప్రచురించడం జరుగుతుంది. కొన్ని అనివార్య కారణాలవల్ల ఇప్పటికిప్పుడే ఈ విషయాన్ని తెలియజేయలేము, కాస్త ఆలస్యం అవుతుంది.

– : దాతల సమాచారం : –

ఎంతోమంది గృహస్థులకు తమకు జన్మనిచ్చి, ఉన్నతంగా తీర్చిదిద్దిన తమ తల్లిదండ్రుల పేర్లను లేదా తమ పెద్దల పేర్లను చిరస్థాయిగా ఈ సమాజంలో నిలిచిపోయెందుకు భారీ ప్రయత్నాలు చేస్తుంటారు. ఇది చాలా మంచి పరిణామము, మరియు వీరి ఆలోచన అద్భుతం, అపూర్వ సృజనాత్మకత. ఒక వేళ మీకంటూ ఇటువంటి ఆలోచన ఉన్నట్లయితే మీ లోకల్ లాంగ్వేజ్ లో వెబ్సైట్ తయారవుతున్నది.  మీరు మీ పెద్దల పేర్లను చిరస్థాయిగా ఈ సమాజంలో నిలిపి ఉంచడానికి, వారి పేర్లు, పేర్లతో పాటుగా చిత్రపటములను కూడా ముద్రిస్తాము. ఈ వెబ్సైటు ఉన్నంతకాలం మీ పేరు, లేదా మీ తల్లితండ్రుల పేర్లు చిరస్థాయిగా నిలిచిపోతాయి. మొత్తం వెబ్ సైట్ అంతయు మీరు స్పాన్సర్ చేయవచ్చు.  లేదా ఒక ప్రత్యేకమైన పేజీ ను స్పాన్సర్ చేయవచ్చు. సింగల్ టైం పేమెంట్ మాత్రమే. ప్రతి సంవత్సరం కట్టాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ మీకు స్పాన్సర్ చేయాలని అనిపిస్తే ఈ లింకు ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు, తదుపరి మిగిలిన సమాచారంను అందజేయగలము. https://www.subhavaastu.com/contact-us.html

– : SPONSORSHIP : –

Many residents are committed to honoring the names of their parents, grandparents, or elders, with the aim of keeping their legacy vibrant in their respective societies. This admirable effort is truly heartening. If you feel a connection to this endeavor, our website, thoughtfully crafted in your native language, offers a supportive platform while deeply respecting your sentiments. We are dedicated to helping you ensure that the names of your loved ones are remembered with respect and fondness. You have the option to sponsor either the entire website or a specific page, all with a single payment, freeing you from the concern of annual fees. In doing so, the names of those dear to you will be cherished and celebrated for as long as our website continues to exist. If you’re interested in this meaningful tribute, please contact us for more information : https://www.subhavaastu.com/contact-us.html

- : ప్రత్యేక ధన్యవాదములు : - పి కోటేశ్వర రావు - హైదరాబాద్