వాస్తు శాస్త్రంలో దిశల యొక్క ప్రాముఖ్యత

వైద్యాలయాలలో వైద్యులు ప్రధానంగా మనిషి శరీరంలో గుండెకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. గుండె పదిలంగా ఉంటే మిగతా విషయాలలో తమ శక్తి మేరకు శ్రమించి ప్రాణం నిలపవచ్చు అనేది వైద్యుల ఆలోచన. అలాగే వాస్తు శాస్త్రంలో “దిక్కులకు” అంత ప్రాముఖ్యత కలదు. దయచేసి ప్రతి ఒక్కరూ ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. దిక్కులు లేనట్లయితే వాస్తు శాస్త్రం లేదు. దిక్కులపై ఆధారపడి మాత్రమే వాస్తు శాస్త్రం పనిచేస్తుంది అనగా ఒక గృహమునకు వాస్తు చూడాలి అంటే మొట్టమొదటిగా దిక్కులను గమనించాలి. గృహము ఏ దిక్కుకు ఉన్నదో తెలుసుకోకుండా ఆ గృహం యొక్క వాస్తు చూడడం అనేది అవివేకం, మరియు శాస్త్ర విరుద్ధం.

ఈ ప్రపంచంలోని ఏ వాస్తు శాస్త్రవేత్త అయినా మొదటిగా ఒక గృహమును వాస్తు శాస్త్ర రీత్యా పరిశీలన చేయాలనుకున్నప్పుడు, ముందుగా దిక్కులు పరిశీలన చేస్తాడు. అనగా ఆ గృహ ముఖ ద్వారం ఏ దిశలో, లేదా ఏ దిక్కుగా ఉంది అనేది మొట్టమొదటిగా గమనించి ఆ తర్వాత మాత్రమే మిగిలిన విషయాలను గమనిస్తాడు. దిక్కులను గమనించకుండా ఏ వాస్తు శాస్త్ర వేత్త కూడా గృహపరిశీలన పూర్తి చెయ్యలేడు. దిక్కులు తెలుసుకోకుండా ఆ ఆస్తి యొక్క పరిశీలన ఎలా చెయ్యగలడు. ఇది దాదాపుగా అసాధ్యం.

మీకు ఆంగ్లం చదవడం వచ్చినట్లయితే ఈ లింక్ నందు, వివరణాత్మకంగా దిక్కుల గురించి వివరించడం జరిగింది. Detailed information on Directions in Vastu మీకు సమయం ఉన్నప్పుడు మరియు వీలు కుదిరినప్పుడు నిదానంగా చదవగలరు.

"దిక్కుల" విషయంలో అత్యంత ముఖ్యమైన విషయాలు :

ప్రధానంగా దిక్కులు గురించి మాట్లాడాల్సి వస్తే ఇందులో మొత్తం ఎనిమిది దిక్కులుగా తెలుసుకోవచ్చు. వాస్తు శాస్త్రం లో, ఈ ఎనిమిది దిక్కులూ అత్యంత అధీకృతమైన స్థానమును సంపాదించుకున్నాయి. అందులో

1. తూర్పు దిశ

2. పశ్చిమ దిశ

3. ఉత్తర దిశ

4. దక్షిణ దిశ

5. ఈశాన్య దిశ

6. ఆగ్నేయ దిశ

7. వాయువ్యదిశ

8. నైరుతి దిశ

ఈ ఎనిమిది దిశల లేదా అష్ట దిశల  గురించి సంపూర్ణంగా తెలుసుకున్నవారు, వాస్తు శాస్త్రం పై బాగా పట్టు  సాధించుకున్నట్లుగా అర్థం చేసుకోవచ్చు. వాస్తు శాస్త్రం అనేది ప్రాచీన భారతీయ నిర్మాణ కళ యొక్క శాస్త్రీయ అధ్యయనం. ఈ శాస్త్రం ప్రకారం, ఒక భవనం యొక్క నిర్మాణం ఎనిమిది దిశలు లేదా అష్ట దిశలు అనే అంశాన్ని గుర్తించి దానిని అనుసరించి చేయాలి. ఈ దిశలు అనగా తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం, ఆగ్నేయం, వాయవ్యం, నైఋతి దిశలుగా ఉంటాయి. ప్రతి దిశకు ఒక విశేష ప్రాధాన్యత ఉంటుంది మరియు దానిని దృష్టిలో ఉంచుకొని తగిన నిర్మాణాలు చేసి జీవితాన్ని ప్రశాంతత, ఆనందమయం, సుఖమయం చేసుకోవాలి.

వాస్తులో ప్రతి దిశకు ఒక అద్వితీయమైన శక్తి ఉంటుంది. ఉదాహరణకు, ఈశాన్యం దిశ, జ్ఞానం మరియు ప్రశాంతతను ప్రసాదించే సంపదల దిశగా పరిగణించారు, ఇక్కడ పూజ గది ఉండటం శుభప్రదంగా భావించబడుతుంది. ఆగ్నేయం దిశ అగ్ని అంశంతో సంబంధించి ఉండి, వంటగదికి అనుకూలంగా ఉంటుంది. ఉత్తరం దిశ సంపద మరియు వృద్ధికి సూచించబడుతుంది, అక్కడ ధనానికి సంబంధించిన అంశాలు ఉంచడం ఉత్తమం. అష్టదిక్కుల సరైన జ్ఞానం మరియు వాటిని ఎలా సమయ సందర్భాన్ని అనుసరించి ఉపయోగించేవారు వాస్తు శాస్త్రంలో మంచి పట్టు సాధించినట్లుగా తెలుసుకోవాలి. సరైన దిశలో, మంచి వాస్తు పట్టు కలిగిన నిర్మాణాలు చేసినప్పుడు, జీవన వాతావరణంలో సమతుల్యత మరియు సానుకూలత ఉంటాయి, ఇది గృహస్థుల సామర్థ్యాలను, సమాజంలో వారి గౌరవాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

ఈ వాస్తు వెబ్సైటు లో లభించే ఇతర విషయములు

దిక్కులను ఎలా గుర్తించాలి?

అంతర్జాతీయ ప్రామాణికం ప్రకారం పై వైపున ఉత్తరం ఉంటుంది (ఈ పటములో చూపినట్లుగా ), కుడివైపున తూర్పు, ఎడమ వైపున పశ్చిమం, క్రింద వైపున దక్షిణం వస్తుంది. సాధారణంగా ఏ ఆర్కిటెక్ట్ తయారుచేసిన ఇంటి నమూనా చిత్రములను చూసినా, ఉత్తరమును చిత్రమునకు పై వైపున చూపిస్తారు. అంతెందుకు, మీరు ప్రపంచ పటమును చూసినట్లయితే ఉత్తరం పై వైపున ఉంటుంది. అయితే అవసరాన్ని బట్టి, స్థల కొరతను బట్టి, ఒక్కొక్కసారి చిత్రముల నందు ఈ దిక్కులను ఆర్కిటెక్ట్ లేదా వాస్తు సిద్ధాంతాలు మార్పు చేస్తుంటారు. గమనించ ప్రార్థన. మీరు వాస్తు చిత్రములను గమనించే సమయంలో, దయచేసి ఉత్తరం ఎటువైపు వున్నదో ముందుగా చూసుకొని మిగిలిన విషయాలను తదుపరి అవగాహన చేసుకోవాలి. ముందుగా ఉత్తరం ఏ వైపున వున్నదో గమనించుకోవాలి.

తెలుగు భాషలో దిక్కుల గురించి వివరణ

పరిశోధన ఫలితాలు - ప్రతి శాస్త్రవేత్త కు వేల కోటి నమస్కారములు

ఏ శాస్త్రమైననూ పరిపూర్ణమైన ఫలితాలను ఇవ్వాలంటే అందులో తగిన పరిశోధనలు కావించాల్సిందే. సరైన పరిశోధనలు చేయకుండా ఏ శాస్త్రం కూడా సంపూర్ణమైన ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది అనుకోలేము. పూర్వకాలం సమాచారాన్ని ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి చేరవేయాలనుకున్నప్పుడు పావురాలను వాడేవారు. మీరు కూడా పాతతరం సినిమాలలో ఈ విషయాన్ని బాగా గమనించి ఉంటారు.

మహారాజులు ఒక రహస్య సమాచారాన్ని లేదా ఏదైనా ఒక సమాచారాన్ని ఇంకొక ప్రదేశానికి పంపాలనుకున్నప్పుడు పావురాల కాళ్లకు చర్మంపై రాసిన లేఖను కట్టి తగిన దిశలో వదిలేవారు. అది ఆ స్థానానికి వెళుతుందా లేదా, సరైన వారికి ఆ సమాచారం అందుతుందా లేదా, అనేది గాలిలో పెట్టిన దీపమే, అంతా దైవాదీనమే. దీని తర్వాత వార్తాహారులని ( ప్రస్తుత కాలం లో కొరియర్ సర్వీస్ లాగ ) క్రమేపి వీరి గాలి వీచింది, ఆ కాలంలో వీరికి విపరీతమైన ఆదరణ ఉండేది. అంతేకాకుండా రాజులు, ధనవంతులు, ప్రజలు తగిన గౌరవాన్ని మరియు ప్రతిఫలాన్ని అందించేవారు.

అంటే ఒక సమాచారాన్ని ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి చేరవేయాలనుకున్నప్పుడు ఆనాడు ఎంతో కష్టతరమైన దారులను ఎంచుకొని సమాచారాన్ని అందిపుచ్చుకునేవారు. పరిశోధనలు కావించి కావించి ఉత్తరాలు అంటూ వచ్చాయి ఆ తర్వాత క్రమేపి టెలిఫోన్ అనగా దూరశ్రవణం దాని తర్వాత మొబైల్ ఫోన్లు వచ్చాయి. ఇది ఒక విప్లవమనే చెప్పుకోవాలి. పరిశోధనలు చేయకపోతే నేటికీ మనం పావురాలను లేదా వార్తాహారుల పై మాత్రమే ఆధారపడవలసి వచ్చేది. ఒక విషయాన్ని మనం అందరం గట్టిగా గుర్తుపెట్టుకోవాలి, ఏ రంగంలోనైనను పరిశోధన చేయకుండా అభివృద్ధి సాధించడం అనేది ఒక కల మాత్రమే.

పరిశోధన అనేది నిరంతర ప్రక్రియ, ఇది ఏ రోజుకి, ఎప్పటికీ ఆగదు. నేడు మనం సమాచారాన్ని మొబైల్ ఫోన్ ద్వారా చేర వేసుకుంటున్నాము. భవిష్యత్తులో ఇంకా ఎన్నో గొప్ప గొప్ప పరిశోధనలు జరిగి చిత్రవిచిత్రమైనటువంటి సమాచార శ్రవణి ఏర్పడవచ్చు. ఎవరు ఊహించారు . . . . ఒక క్షణంలో మనం ఏమి మాట్లాడాలనుకుంటున్నామో ఆ విషయాన్ని అమలాపురం నుంచి అమెరికా దాకా చేరవేస్తున్నాం కదా, ఒక వంద సంవత్సరాల క్రితం ఈ విషయాన్ని ఎవరైనా చెప్పి ఉంటే అతనిని ఒక పిచ్చివాడు లాగా చూసేవారెమో. అయితే ప్రస్తుతం ఇప్పుడు అది సాధ్యమైనది కదా. ఎలా !

అలాగే ఒకానొకనాడు మనము గుంటూరు లో ఒక పెట్టెలో కూర్చుని అమెరికాలోని ఇంకొక పెట్ట ద్వారా బయటికి రావడానికి పరిశోధనలు జరగవచ్చు, సత్ఫలితాలను కూడా ఇవ్వవచ్చు, ఎవరు చెప్పొచ్చారు, ఏమైనా జరగవచ్చు.

ఈ వాస్తు శాస్త్రంలో నేటి నవీన వాస్తు శాస్త్ర పండితులు మహాద్భుతమైన పరిశోధనలు గాపించి అత్యుత్తమమైన ఫలితాలను సమాజానికి అందించారు, వీరికి ఎల్లవేళలా మనం రుణపడి ఉండాలి. ప్రజల శ్రేయస్సు కోరి సమాజ ఉన్నతిని ఆకాంక్షించి నిరంతర పరిశోధనలు కావిస్తూ మానవజాతికి అమోఘమైన సేవలను నిరంతరాయంగా అందిస్తున్నందుకు, ప్రతి ఒక్క మహానుభావుడికి సర్వదా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము.

పూర్వకాలం మహారాజులు తమ రాజ్యం లోని కవులను, పండితులను, శాస్త్రవేత్తలను, పోషించేవారు. అంతే కాకుండా, పక్క రాజ్యం నుండి  పండితులు వచ్చిననూ తగిన గౌరవ మర్యాదలు, పారితోషికములు బహూకరించేవారు. ఈనాడు ఆ పరిస్థితులు లేవు కదా, మరి ప్రస్తుతం ఈ శాస్త్రవేత్తలు తగిన పోషణ లభించకపోయినా ఎలా పరిశోధనలు చేస్తున్నారు !! ఎలా జీవనం కొనసాగిస్తున్నారు !! ,  ఇది చిన్న విషయం కాదు కదా. అయినా పరిశోధనలు ఆగడం లేదు కదా.  దీనికి కారణం  నేటికీ ఎంతో “ఉదార స్వభావం కల గౌరవనీయ గృహస్థులు” ఉండడం వలన, ఈ శాస్త్రం లో తగిన పరిశోధనలు జరుగుతూనే వున్నాయి, సరికొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయి. జరుగుతూనే ఉంటాయి. 

హతోస్మి . . . ఇది నమ్మగలమా

కొన్నిసార్లు ఏదైనా ఒక విషయాన్ని తెలపాలి అనుకున్నప్పుడు ఆ విషయాన్ని పాఠకులు నమ్ముతారని కూడా ఊహించలేము. అంత విచిత్రమైన సంఘటనలు ఎదురు అవుతుంటాయి. ఇక్కడ మీరు నమ్మమని చెప్పట్లేదు, అయితే ఒక విషయాన్ని ఇక్కడ మీతో పంచుకోవాలని భావించి తెలియజేయడం జరుగుతున్నది.

చెన్నై పట్టణానికి “దాదాపుగా” 200 కిలోమీటర్ల దూరంలో ఒక నగరం కలదు. ఆ నగరంలో ఒక “భ్రమ” సిద్ధాంతి ( పేరు మార్చడం జరిగినది ) వాస్తు శిక్షణా తరగతులను నడుపుతూ ఉంటాడు. ఇతను దాదాపుగా 1996వ సంవత్సరములో ఈ శిక్షణా తరగతుల కార్యాలయమును ఏర్పాటు చేసి విద్యార్థులకు వాస్తు లో శిక్షణ ఇస్తూ ఉంటాడు. ఒకసారి ఈయన చెన్నై పట్టణానికి విచ్చేసినప్పుడు, ఒక గృహ పరిశీలన నిమిత్తం తన కార్యక్రమము కొనసాగిస్తున్నప్పుడు గృహస్థులను ఈయన స్వయంగా ఒక ప్రశ్న అడిగాడు.

“తూర్పు దిక్కు ఎటు అని”

వారు చెప్పిన సమాధానాన్ని దృష్టిలో ఉంచుకొని మొత్తం గృహాన్ని అంతా వాస్తు పరిశీలన కావించాడు. దాదాపుగా 27 సంవత్సరాల అనుభవం ఉంచుకొని దిక్కులు తనే సొంతంగా తెలుసుకోకుండా గృహస్తులను తూర్పు దిక్కు ఎటు అని అడిగాడు. ఆ గృహస్థులు ఎంత భాగ్యవంతులో ఎంత అదృష్ట జాతకులో అర్థమవుతున్నది. ఈయన 2019వ సంవత్సరములో ఒక గృహమును చూడడానికి 350 రూపాయలు తీసుకోవడం జరిగినది ఇంత చిన్న మొత్తానికి ఎవరు మాత్రం వెనుకంజ వేయగలరు. ఒకటే దినం 8 గృహాలకు వాస్తు చూసి తన ఊరికి వెళ్ళిపోయాడు. అతను సంపాదించిన మొత్తం 2,800 రూపాయలు. తనకు వచ్చిన ఖర్చులు మొత్తం 525 రూపాయలు. తనకు మిగిలినది 2,275 రూపాయలు. ఆయన వెళ్లే సమయంతో ఆయన ముఖాన ఆనందం కొట్టొస్తున్నట్టుగా కనిపిస్తున్నది. ఒక లేడికూన ఎంతగా చెంగుచెంగున ఎగురుతూ ఉంటుందో, తనకు ఆ మొత్తం ముట్టిన తర్వాత ఆయన హుషారు చూస్తూ ఉంటే ఈయన తన జీవితకాలంలో అంత డబ్బు చూడలేదేమో అనే అనుమానం కలిగినది.

 తర్వాత విచారించగా తను సంవత్సరానికి ఒక్కసారి లేదా రెండు సార్లు చెన్నై పట్టణానికి వాస్తు చూడడానికి వస్తుంటానని తెలిపాడు. ఒక వ్యక్తి ఒక గృహానికి వాస్తు చూడడానికి కేవలం 350 రూపాయలు తీసుకుంటూ, సంవత్సరానికి ఒక్కసారి, అతి దగ్గరలో గల ఒక మహా పట్టణానికి విచ్చేస్తున్నారంటే వేరే వాళ్ళు చెప్తే నమ్మబుద్ధి కాలేదు.

2019వ సంవత్సరంలో ఒక గృహానికి వాస్తు చూడడానికి 350 రూపాయలు తీసుకోవడం అంటే అతను ఎలా బ్రతుకుతాడో అర్థం కాలేదు. అయితే ప్రజలకు ఇంత తక్కువ ధరలో తను సేవలు అందించడం అనేది అద్భుతమైన విషయంగా చెప్పాలి. ఒక నమ్మలేని వాస్తవమైన విషయం ఏమిటంటే,  దయచేసి మీరు నమ్మాలని మేము చెప్పడం లేదు.

ఆయనకు కంపాస్ చూడడం రాదు.  దానిని ఎలా చూడాలి అనేది తెలియదు. గత 27 సంవత్సరాలుగా వాస్తు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నాడంటే, చెప్పడానికి మాటలు రావడం లేదు. అసలు ఈ సమాజంలో ఏమి జరుగుతోంది.

మీరు ధైర్యంగా ఉంటాం, భయపడం అంటే ఇంకో విషయం . . . .

కంపాస్ ఎలా చూడాలో తెలియని ఈ “భ్రమ” సిద్ధాంతి, వాస్తు శాస్త్రం పై 2 పుస్తకాలు వ్రాసారు.

తను కేవలం ఒక్క గృహాన్ని చూడడానికైతే చెన్నై పట్టణానికి రాడు, కనీసం ఐదు గృహాలైనా ఉన్నట్లయితే మాత్రమే చెన్నై పట్టణానికి వస్తాడు. అంటే, దాదాపుగా ఖర్చులు పోనూ 1150 రూపాయలు. అదీ 2019 వ సంవత్సరంలో.

ఉదాహరణకి : 27 సంవత్సరాల అనుభవం కల డాక్టర్ కి, “స్టెతస్కోప్ ఎలాచూడాలో తెలియకపోయినా” కూడా ఆ డాక్టర్ గారితో తమ ఆరోగ్యాన్ని చూపించుకోవడానికై అడపా దడపా రోగులు వస్తున్నారంటే, వర్ధిల్లు, సమాజమా వర్ధిల్లు.

కంపాస్ ఎలా చూడాలో తెలియని 27 సంవత్సరాల అనుభవం కలిగిన “భ్రమ” సిద్ధాంతి తో వాస్తు చూపించుకోవడానికి గృహస్థులు ఇంకా ముందుకు వస్తున్నారంటే, దాని అర్థం అతి తక్కువ ధరలో “పని” అయిపోవాలి. అనగా వీరికి “నిజాయితీగా”, కష్టపడి పనిచేసే వాస్తు సిద్ధాంతి అవసరం లేదు. అత్యంత తక్కువ ధర లో “ఏదో ఒక పని” అయిపోతే చాలు. తరువాత తీరికగా వాస్తు ను నిందిస్తూ ఉండవచ్చు, లేదా వాస్తు శాస్త్రవేత్తలను నిందిస్తూ కాలం గడపవచ్చు. అందుకే కాబోలు సమాజంలో ఎంతో మంది వాస్తు సిద్ధాంతులకు మంచి పేరు కన్నా చెడ్డ పేరు ఎక్కువగా ఉంటుంది. 

జ్ఞానంతో జీవిస్తూ ఉన్నవారు, చదువుకొన్నవారూ, పండితులు, ప్రజ్ఞావంతులు, విద్యావంతులు, అక్షరాస్యులు, ఒక వాస్తు సిద్దాంతికి కంపాస్ చూడడం రాదు అని తెలిసిన తరువాత, “పొరపాటున” కూడా “భ్రమ” సిద్ధాంతి లాంటి వారితో తమ గృహాలను పరిశీలింపచేయించుకోరు. ఈ కాలంలో ఒక్కపూట సినిమాకు వెళితే, ఇంత కంటే ఎక్కువ ఖర్చు అవుతోంది కదా. మరి జీవితకాలం ఉండే గృహం విషయంలో ప్రజలు ఇంతలా ఎందుకు రాజీపడుతున్నారు, మనకైతే ఎప్పటికీ అర్థం కాదు. తక్కువ ధర కోసం చూడటం మంచిదే, అయితే ఏ విషయంలో అనేది కూడా గమనించుకోవాలి కదా.

విదేశాలలో స్థిరపడిన భారతీయులు ఒకవేళ వారు ఆ దేశంలోనే గృహ నిర్మాణం కావిస్తున్నా, లేదా గృహం కొంటున్నా, లేదా వారి తల్లిదండ్రులకు లేదా అతి దగ్గర బంధువులకు భారతదేశంలో ఇల్లుకొంటున్నట్లయితే వారు ఏ మాత్రం రాజీపడక అందరికన్నా అత్యుత్తమమైన ఫలితములు ఇచ్చే వాస్తు సిద్ధాంతితో మాత్రమే వారి ఆస్తులను పరిశీలింప చేయించుకుంటారు. వీరు “పొరపాటున” కూడా నాణ్యత విషయంలో రాజీపడరు. వీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ ధరలను బేరీజు వేసుకోరు. మరియు తక్కువ ధర కదా అని ముందడుగు వేయరు.  ఎందుకంటే వీరికి ఏ విషయంలో నైనా విశిష్టమైన నాణ్యత కావాలి. ఎంత ధర అయినా వెనుకంజవేయరు. ఎవరైనా చాలా  తక్కువ ధర తీసుకుంటున్నారంటే వారిని “బాగా” దూరం పెడతారు. ఎందుకంటే తక్కువ ధరలలో ఉండే “మర్మం” వీరికి బాగా తెలుసు.

మనం ఇక్కడ ఒక విషయం గమనించాలి. చాలామంది ఉచితంగా వాస్తు చూస్తూ ఉంటారు. కొందరు ఉచితంగా వాస్తు చూస్తూ అద్భుతమైన ఫలితాలను గృహస్థులకు అందిస్తూ ఉంటారు. వీరు భగవత్ సమానులు. ఇటువంటి వారు ఈ కాలంలో లభిస్తే, మీరు వీరి సేవలను పొందడమే కాకుండా, మాకు కూడా తెలియచేయండి, తగిన విచారణ కావించి, వారి పేరును ఇతర వివరాలను, ఇక్కడ ప్రచురిస్తాము. అంతే కాకుండా మీకు తెలిసిన అందరికీ ఇటువంటి వారి గురించి తెలియచేయండి. చాలా అరుదుగా లభించే ఇటువంటి వారిని అసలు వదులుకోవద్దు.

వాస్తు శాస్త్ర పరిశోధకులు ఎల్లవేళలా గృహస్థుల ఉన్నతిని ఆశిస్తారు.

తండ్రి తన కుమారుడు చాలా అద్భుతంగా అభివృద్ధి లోకి రావాలని ఎల్లవేళలా కోరుకుంటాడు. అలాగే ఒక వైద్యుడు వైద్యం కోసం వచ్చే రోగి ఎల్లవేళలా ఆరోగ్యంతో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాడు. అలాగే ఒక వాస్తు సిద్ధాంతి ఒక గృహస్థుడు చాలా అద్భుతంగా రాణించాలని భవిష్యత్తులో ఎన్నో అభివృద్ధి మెట్లు ఎక్కాలని ఎల్లవేళలా తాపత్రయపడుతూ ఉంటాడు.

అయితే కుమారుడు తండ్రిని తప్పుగా అర్థం చేసుకోవచ్చు, అలాగే ఒక రోగి డాక్టర్లును తప్పుగా అర్థం చేసుకోవచ్చు, అలాగే ఒక గృహస్థుడు వాస్తు కన్సల్టెంట్ ను తప్పుగా అర్థం చేసుకోవచ్చు, కానీ ఇందులోని ప్రధాన విషయం ఏమిటంటే ఈ చెప్పే వారందరూ మన మంచి కోరేవారు. ఎల్లవేళలా మనం చాలా బాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. అయితే నిజాలు ఎప్పటికీ చేదుగా ఉంటాయి.

కేవలం ఒక్క నిర్ణయం ఎన్నో జీవితాలను మారుస్తుంది. ఉత్తమమైన ఫలితాలను పొందాలంటే మొదట్లో కొంచెం కష్టపడక తప్పదు. అయితే భవిష్యత్తు చాలా బాగా ఉంటుంది.

ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటే మనం ఏ తప్పు చెయ్యము. మీరు ఎల్లవేళలా అద్భుతమైన జీవితాన్ని అనుభవించాలని మనస్పూర్తిగా పైవారు ఆశిస్తారు. మేము చెప్పే విషయాలు, లేదా నిర్ణయాలు గృహస్థులకు చేదుగా ఉండవచ్చు. అయితే మీ మంచి కోరుతూ వాస్తు సిద్ధాంతులు ఎల్లప్పుడూ ఉత్తమమైన నిర్ణయాలు తీసుకుంటారు. కొందరికి నచ్చకపోవచ్చును.

వాస్తు శాస్త్ర రీత్యా మీరు తీసుకోబోయే స్థలం లేదా గృహం బాగా ఉంటే ప్రతి వాస్తు సిద్ధాంతి వెంటనే ఒప్పుకుంటారు. అయితే భవిష్యత్తులో బలమైన సమస్యలు వస్తాయని తెలిస్తే మాత్రం ఏ పరిస్థితుల్లో కూడా అంగీకరించరు. మీరు మనసులో వారి గురించి ఏమనుకున్నా కూడా లెక్క పెట్టరు. ఎల్లవేళలా మీరు మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా సుఖసంతోషాలతో భోగభాగ్యాలతో గడపాలని వారు హృదయ పూర్వకంగా కోరుకుంటారు. ఇది నిజమైన వాస్తు సిద్ధాంతి తాపత్రయం. 

వాస్తు సిద్ధాంతుల మని చెప్పుకునే వారి గురించి ఇక్కడ మనం చర్చించడం అనవసరం. ఇతర వాస్తు సిద్ధాంతులను “నిందించడమే” వీరి పని.  వారి నైజాన్ని మార్చలేకపోవచునేమో. నిజమైన వాస్తు సిద్ధాంతి ఎల్లవేళలా గృహస్థుల ఉన్నతిని కోరుకుంటారు. ఇది మాత్రం వాస్తవం. నిజమైన సిద్ధాంతి లేదా వాస్తు శాస్త్రంలో గణనీయమైన పరిశోధనలు కావించే వారు ఇతర వాస్తు సిద్ధాంతుల గురించి తప్పుగా లేదా చెడుగా మాట్లాడరు. నిరంతరం వీరు ప్రజల శ్రేయస్సు కోరి వాస్తు శాస్త్రంలో వివిధ రకాలైనటువంటి పరిశోధనలు కావిస్తూ కొత్త కొత్త విషయాలను ఆవిష్కరిస్తారు. అంతే కానీ, ఇతరులను నిందిస్తూ, శునకానందం పొందరు.

- : ప్రత్యేక ధన్యవాదములు : - పి కోటేశ్వర రావు - హైదరాబాద్