వాస్తు శాస్త్రంలో వీధి పోటు అంటే ఏమిటి? వీధి చూపు ప్రభావాలు మరియు ఫలితాలు
వీధి పోట్ల రకాలు
ఈశాన్య వీధి పోటు (Northeast Street Focus)
అత్యంత శుభప్రదమైన పోటుగా పరిగణించబడుతుంది.
ధనసంపద, విద్యాభివృద్ధి, శాంతి, ఆనందం కలుగుతాయి.
ఆగ్నేయ వీధి పోటు (Southeast Street Focus)
ఇది కొన్ని పరిస్థితుల్లో శుభం (Southern Southeast ), కొన్ని సందర్భాల్లో సమస్యలు తెస్తుంది, ఎన్నో రకాలైన ఇబంధులను ఎదుర్కోవలసిరావచ్చును.
వాయవ్య వీధి పోటు (Northwest Street Focus)
ఇది సాధారణంగా మిశ్రమ ఫలితాలు ఇస్తుంది.
ప్రయాణాలు ఎక్కువ అవ్వడం, వాణిజ్య లాభాలు ఉండడం(Western Northwest), కానీ కుటుంబంలో అస్థిరత కలిగే అవకాశం ఉంటుంది (Northern Northwest).
నైరుతి వీధి పోటు (Southwest Street Focus)
ఇది ఎక్కువగా అశుభంగా పరిగణించబడుతుంది.
ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, మనశ్శాంతి లోపం కలగవచ్చు.
వీధి పోట్ల ప్రభావం
శుభప్రదమైన వీధి పోట్లు ఉంటే ఇంటిలో అభివృద్ధి, సుఖశాంతులు కలుగుతాయి.
అశుభ వీధి పోట్లు ఉంటే ఆర్థిక నష్టాలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.
ప్రతి వీధి పోటును ఒకే విధంగా చూడరాదు; అది ఇంటి దిశ, రహదారి దిశ, మరియు స్థల పరిమాణం ఆధారపడి ఫలితాలు మారుతూ ఉంటాయి.
నివారణ మార్గాలు
వాస్తు దోషం ఉన్న వీధి పోట్లు ఉంటే, సరైన వాస్తు పరిహారాలు (remedies) చేయడం ద్వారా సమస్యలను తగ్గించుకోవచ్చు. ఉదాహరణకు:
సరైన కంపౌండ్ వాల్, గేటు సర్దుబాటు, చెట్లను పెంచడం, రహదారి రూపకల్పన వంటి మార్పులు చేయవచ్చు.
ఏదిఏమైనా వాస్తు నిపుణుడి సలహా తీసుకోవడం చాలా అవసరం.