పశ్చిమ దిశ గృహ వాస్తు వివరణ - పడమర దిక్కు ఫలితాలు
పశ్చిమ దిక్కును పడమర దిశ లేదా సూర్యాస్తమయ దిశ (అరుదుగా) అని కూడా అంటారు. దిక్సూచిలో పశ్చిమ దిశ 270° స్థానాన్ని సూచిస్తుంది. పశ్చిమ దిక్కు వాయువ్య మరియు నైరుతి దిశల మధ్య భాగంలో ఉంటుంది. పశ్చిమ దిశకు అధిపతి వరుణుడు కాగా, గ్రహాధిపతి శని మహాత్ముడు. సాధారణంగా పశ్చిమ భాగానికి సంబంధించిన ఫలితాలు ఇంటిలోని పురుషులపై ఎక్కువగా ప్రభావం చూపవచ్చును. వాస్తుశాస్త్ర రీత్యా పశ్చిమ దిశ గృహాన్ని నిర్మిస్తే కుటుంబ సభ్యులు ఆరోగ్యవంతులుగా, దృఢంగా, ఆర్థిక పరిపుష్టి కలిగి, మానసికంగా బలంగా ఉంటారు. అలాగే వీరు చేసే వృత్తి, ఉద్యోగం, వ్యాపారములలో స్థిరత్వాన్ని పొందవచ్చు. అంతేకాకుండా, అద్భుతమైన ప్రగతిని సాధించే అవకాశాలు ఉండవచ్చును. If you can read English, explore our comprehensive guide with illustrations on West Direction Vastu Shastra - Benefits, Rules, and Remedies.గౌరవనీయ పాఠకులకు ఒక విజ్ఞప్తి. ఈ వెబ్‌సైట్‌లో మాకు తెలిసిన విషయాలు, అనుభవాలు మరియు పరిజ్ఞానాన్ని ప్రచురించాము. విషయాలను వివరించేప్పుడు కొన్ని అనుభవాలను దృష్టిలో ఉంచుకొని, అనుభవాల ద్వారా పొందిన పరిజ్ఞానాన్ని సమీకరించుకొని, కొన్ని పరిస్థితుల రీత్యా వాస్తు ప్రభావం గురించి మంచి లేదా చెడును తెలుపుతూ పరిజ్ఞానాన్ని పంచుకున్నాము. ప్రతి సందర్భంలోనూ యథాతథంగా ఇలాగే జరగాలనే నిబంధన లేదు. విషయ పరిజ్ఞానం మరియు అవగాహన కోసం మాత్రమే ఇక్కడ సమాచారమును ప్రచురించడం జరిగినది. అంతేకానీ ఈ పేజీలో లేదా ఈ వెబ్‌సైట్‌లో ప్రచురించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని గృహస్తులు స్వతంత్రంగా ఏ నిర్ణయం తీసుకోరాదని మా ప్రత్యేక విజ్ఞప్తి.
పశ్చిమ ముఖద్వార గృహాన్ని ఎలా గుర్తించాలి?
పశ్చిమ ముఖద్వార గృహం అనగా ప్రధాన ప్రవేశ ద్వారం లేదా గృహం ఎదురుగా ఉన్న రహదారి పశ్చిమ దిశలో ఉన్న గృహాన్ని పశ్చిమ ముఖద్వార గృహం అని అంటారు. ఈ చిత్రంలోని గృహమునకు ఎడమవైపున ఒక రహదారి కలదు. దాని పైన “పశ్చిమ రహదారి” అని చూపించబడింది. అనగా ఈ గృహం పశ్చిమ వీధికి ఎదురుగా ఉన్నది. కావున ఈ గృహం పశ్చిమ వీధి గృహం లేదా పశ్చిమ దిశ గృహం అవుతుంది. అంతర్జాతీయ దిక్సూచి నియమాల ప్రకారం పైభాగం ఉత్తర దిశ, క్రింది భాగం దక్షిణ దిశ, ఎడమవైపు పశ్చిమ దిశ మరియు కుడివైపు తూర్పు దిశగా పరిగణించబడుతుంది. ఈ చిత్రంలో ఎడమవైపున పశ్చిమ దిశను చూపించడం జరిగినది. కావున ఇటువంటి గృహాన్ని పశ్చిమ ముఖద్వార గృహం, పశ్చిమ దిశ గృహం లేదా పశ్చిమ వీధి గృహం అని పిలుస్తారు.పశ్చిమ దిశ గృహం కొంటే ఏమైనా సమస్యలు వస్తాయా?
పశ్చిమ దిశ గృహం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి?
పశ్చిమ ముఖద్వార గృహం వల్ల ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయి?
1. వాస్తుశాస్త్రం ప్రకారం పశ్చిమ ముఖద్వార గృహాలు అనేక ప్రయోజనాలను అందించగలవు. సంఖ్యల వారీగా జాబితా చేయబడిన కొన్ని ముఖ్యమైన శుభ ఫలితాలను ఇక్కడ తెలియజేయడమైనది. ముఖ్యంగా ప్రధాన ద్వారం పశ్చిమ దిశలోని అనుకూల స్థానంలో ఉన్నప్పుడు, అటువంటి గృహాలు నివాసులకు శ్రేయస్సు, అభివృద్ధి మరియు విజయాన్ని అందించగలవు. సాధారణంగా అమెరికా దేశంలోని అనేక రాష్ట్రాలలో పశ్చిమ ముఖద్వార గృహాలను నిర్మించినప్పుడు ఇంటి ముందు భాగంతో పోలిస్తే వెనుక భాగంలో ఎక్కువ ఖాళీ స్థలం లభించడం సాధారణంగా కనిపించే అంశం. పశ్చిమ ముఖద్వార గృహానికి వెనుక భాగం తూర్పు దిశలో ఉంటుంది. వాస్తుశాస్త్ర రీత్యా తూర్పు దిశలో ఎక్కువ ఖాళీ స్థలం ఉండటం అనుకూలంగా పరిగణించబడుతుంది. అందువల్ల అటువంటి గృహాలలో నివసించే వారికి అనేక సందర్భాలలో శుభ ఫలితాలు కలిగే అవకాశాలు అధికం.దయచేసి ఇక్కడ ఒక విషయాన్ని శ్రద్ధగా గమనించండి. గృహమునందలి వాస్తు బాగా ఉన్నా, “పరిసర వాస్తు” సరిగా లేకపోతే ఫలితాల విషయంలో చాలా మార్పులు వచ్చే అవకాశం ఉంది. సాధారణ గృహస్థులు “పరిసర వాస్తు” ప్రభావాలను అంత సులభంగా నిర్ణయించలేరు, బాగా అనుభవం కలిగిన వాస్తు నిపుణులు మాత్రమే తగిన సూచనలను ఇవ్వగలరు. కావున స్థలం కొనుబోయేముందు లేదా గృహం కొనుబోయేముందు ఒక మంచి వాస్తు నిపుణుని సంప్రదించండం వల్ల భవిష్యత్తులో గృహస్థులకే సర్వవిధాలా లాభం. 100 రూపాయలను జాగ్రత్తగా కాపాడుకోవాలంటే కొన్ని పైసల ఖర్చుకు వెనకాడరాదు. ఇస్తే వస్తుంది, ఈ చిన్న సూత్రం పాటించే గుజరాతీయులు అధిక ధనవంతులయ్యారు.
పశ్చిమ ముఖద్వార గృహం వల్ల కలిగే అశుభ ఫలితాలు ఏమిటి?
సమ్మేళన ఫలితాలు - Combination Effects
పశ్చిమ దిశలో ఏ గదులను నిర్మించుకోవాలి మరియు ఏమేమి ఉంచుకోవచ్చు?

ఈశాన్యం పెరిగిన మూడు రకాల స్థలాలు
ఈ క్రింద మూడు చిత్రాలను అందించడం జరిగింది. ఈ మూడు చిత్రాలు ఒకేలా కనిపించినప్పటికీ, ప్రతి చిత్రంలో స్వల్పమైన వ్యత్యాసం ఉంటుంది. అందువల్ల వాటిని ఒకటికి రెండుసార్లు చాలా జాగ్రత్తగా పరిశీలించినప్పుడు మాత్రమే ఆ మార్పులను స్పష్టంగా గుర్తించగలరు. మొదటి చిత్రంలో ఉత్తర ఈశాన్య భాగం పెరిగి ఉంటుంది, రెండవ చిత్రంలో తూర్పు ఈశాన్య భాగం పెరిగి ఉంటుంది, మూడవ చిత్రంలో పూర్తిగా ఈశాన్య భాగం పెరిగి ఉంటుంది.
ఉత్తర ఈశాన్యం పెంపు కలిగిన పశ్చిమ దిశ గృహాలు మంచి ఫలితాలను ఇస్తాయా?
ఈ చిత్రంలో ఉత్తర ఈశాన్య భాగం పెరిగి ఉన్నట్లు స్పష్టంగా చూడవచ్చు. మీ అవగాహన కోసం మరో ముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తున్నాము. ఈ గృహం యొక్క ప్రహరీ గోడ నాలుగు మూలలను జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, ఉత్తర ఈశాన్య భాగం పెరిగి ఉన్నట్లు మరింత స్పష్టంగా అర్థమవుతుంది. సాధారణంగా ఉత్తర ఈశాన్యం పెంపుకలిగిన గృహాలు మంచి ఫలితాలను గృహస్థులకు అందిస్తాయి. ఒకవేళ పశ్చిమ దిశ గృహానికి ఉత్తర ఈశాన్యం పెంపు ఉన్నట్లయితే ఆ గృహం, గృహస్థులకు ఎన్నో విషయాలలో అనుకూలమై, ఉత్తమ ఫలితాలను ఇవ్వగలదు, ఉత్తర ఈశాన్యం పెంపు వల్ల గృహస్థులకు అధిక ఆదాయం లభించవచ్చు, మంచి ఆరోగ్యం, భాగ్యం, భోగం, భవిష్యత్తు బంగారుమయం, బ్రతుకు, భవితవ్యం భద్రం, ఆనందకరమైన జీవితము లభించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.తూర్పు ఈశాన్యం పెరిగిన పశ్చిమ దిశ గృహాలను కొనవచ్చునా?
ఈ చిత్రాన్ని పరిశీలించినప్పుడు తూర్పు ఈశాన్య భాగం పెరిగి ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. మీకు సులభంగా అర్థమయ్యే విధంగా మరో ముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తున్నాము. ఈ గృహం యొక్క ప్రహరీ గోడ నాలుగు మూలలను జాగ్రత్తగా గమనిస్తే, తూర్పు ఈశాన్య భాగం ఇతర దిశలతో పోలిస్తే విస్తరించి ఉన్నట్లు మరింత స్పష్టంగా గుర్తించవచ్చు. గృహానికి తూర్పు ఈశాన్య దిశలో స్థలం వృద్ధి చెందితే సాధారణంగా గృహస్థులకు శుభ ఫలితాలు లభిస్తాయి. పశ్చిమ దిశ గృహానికి తూర్పు ఈశాన్యం పెంపు ఉన్నట్లయితే ఆ గృహం, గృహస్థులకు ఎన్నో విషయాలలో అనుకూలమై, ఉత్తమ ఫలితాలను ఇవ్వగలదు. మగ సంతానం కలిగే అవకాశం అధికంగా ఉంటుంది.పశ్చిమ ద్వారం గృహానికి ప్రహరీలో ఈశాన్యం పెరిగితే మంచి ఫలితాలు వస్తాయా?
తెలిసో తెలియకనో జీవితంలో మనం చేసిన కొన్ని పుణ్య కార్యక్రమాల, కర్మ ఫలితాల వల్ల ఒక్కొక్కసారి మనకు తెలియకనే కొన్ని శుభ పరిణామాలు సంభవించే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైనా సరే మీరు ఉన్న స్థలానికి ఈశాన్యం పెరిగినా, లేక ఈశాన్యం పెంచుకునే అవకాశం వచ్చింది అంటే జీవితంలో గృహస్థులకు యోగం మొదలవుతోందని తెలుసుకోవాలి. జీవితంలో అరుదుగా ఇటువంటి అవకాశాలు వస్తుంటాయి. ఇటువంటి అవకాశాలను ఏనాటికీ వదులుకోవద్దు. ఈ చిత్రంలో చూపినట్టుగా పశ్చిమ గృహనికి ఈశాన్యం పెరిగినప్పుడు (ఈ చిత్రంలోని గృహానికి ఉత్తర ఈశాన్య భాగం మరియు తూర్పు ఈశాన్య భాగం రెండూ పెరిగి ఉన్నట్లు స్పష్టంగా గమనించవచ్చు.) , గృహస్థులకు యోగం మొదలైందని అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఉంటున్న గృహానికి ఈశాన్యం పెరిగినా లేక పెరిగిన ఈశాన్యం యొక్క స్థలాన్ని కొనుగోలు చేసినా భవిష్యత్తులో ఆ గృహస్తులు చాలా ప్రశాంతకరమైన జీవితాన్ని అనుభవించే అవకాశం అధికము.ఉత్తర ఈశాన్యం పెరిగిన పశ్చిమ ముఖద్వార గృహాన్ని కొనుగోలు చేయవచ్చా?
ఈ చిత్రంలో పశ్చిమ ముఖద్వార గృహానికి ఉత్తర ఈశాన్య భాగం పెరిగి ఉన్న విధానాన్ని స్పష్టంగా గమనించవచ్చు. సాధారణంగా ప్రహరీ గోడ ఉన్న పశ్చిమ ముఖద్వార గృహానికి ఉత్తర ఈశాన్య భాగం పెరిగి ఉన్నట్లయితే, వాస్తుశాస్త్ర రీత్యా శుభ ఫలితాలు కలిగే అవకాశాలు మెరుగుపడవచ్చు. ముఖ్యంగా ఆర్థికాభివృద్ధి, కొత్త వ్యాపార అవకాశాలు, ధన నిల్వ పెరగడం, కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడడం వంటి ఫలితాలు కనిపించవచ్చు. అలాగే కొంతమందిలో మితవ్యయ ధోరణి, పొదుపు స్వభావం మరియు ఖర్చు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించే అలవాటు కూడా కనిపించే అవకాశం ఉంటుంది.తూర్పు ఈశాన్యం పెరిగిన పశ్చిమ ముఖద్వార గృహాన్ని కొనుగోలు చేయవచ్చా?
ఈ చిత్రంలో పశ్చిమ ముఖద్వార గృహానికి తూర్పు ఈశాన్య భాగం పెరిగి ఉన్న విధానాన్ని స్పష్టంగా గమనించవచ్చు. కొన్నిసార్లు ఇటువంటి గృహాలను చూసినప్పుడు, "ఆయనకేమి, ఏది పట్టుకున్నా బంగారమే అవుతుంది" అని అదృష్టవంతుల గురించి పెద్దలు చెప్పే సామెత గుర్తుకు వస్తుంది. సాధారణంగా ప్రహరీ గోడ ఉన్న పశ్చిమ ముఖద్వార గృహానికి తూర్పు ఈశాన్య భాగం పెరిగి ఉన్నట్లయితే, వాస్తుశాస్త్ర రీత్యా శుభ ఫలితాలు కలిగే అవకాశాలు మెరుగుపడవచ్చు. ముఖ్యంగా ఆర్థికాభివృద్ధి, విద్యా ప్రగతి, కొత్త అవకాశాలు లభించడం, కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొనడం మరియు గృహస్థులు తలపెట్టిన కార్యక్రమాలలో విజయాన్ని సాధించే అవకాశాలు పెరగవచ్చు. అలాగే గృహస్థులలో దూరదృష్టి, ప్రణాళికాబద్ధమైన ఆలోచనా విధానం ఉంటుంది.ఈశాన్యం పెరిగిన పడమర గృహాన్ని కొనుగోలు చేయవచ్చా?
ఈ చిత్రంలోని గృహానికి ప్రహరీలో ఈశాన్య భాగం పెరిగి ఉన్నట్లు స్పష్టంగా గమనించవచ్చు. సాధారణంగా ఇటువంటి గృహాలు వాస్తుశాస్త్ర రీత్యా గృహస్థులకు శుభ ఫలితాలను అందించే అవకాశాలు మెరుగుపడవచ్చు. ముఖ్యంగా కుటుంబంలో శాంతియుతమైన వాతావరణం నెలకొనడం, తృప్తికరమైన జీవనాన్ని అనుభవించడం, పిల్లలు విద్యారంగంలో మంచి పురోగతి సాధించడం, సమాజంలో గౌరవం మరియు మంచి పేరు ప్రతిష్ఠలు లభించడం, అలాగే ఆరోగ్యపరంగా అనుకూల పరిస్థితులు ఏర్పడడం వంటి ఫలితాలు కనిపించే అవకాశం ఉంటుంది.ఈశాన్యం తెంపు కలిగిన పశ్చిమ దిశ గృహాన్ని కొనవచ్చా?
ఇది పశ్చిమ ముఖద్వార గృహము. ఈ గృహమునకు ప్రహరీలో ఈశాన్య తెంపు కలదు, అనగా ఈశాన్య భాగము కోతకు గురైనది. సాధారణంగా ఈశాన్య భాగము ఈ విధంగా తెంపుకు గురైనప్పుడు గృహస్తులు కోరుకున్న అభివృద్ధిని పొందడం కష్టమవుతుంది. అనేక విషయాలలో వీరు ఇతరుల కంటే వెనుకబడే అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా పిల్లల విద్యాభ్యాసంలో ఆటంకాలు కలిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇటువంటి గృహాలలో నివసించే పిల్లలు చెడు వ్యసనాలకు లోనయ్యే "అవకాశమూ" ఉంటుంది. పిల్లల అభివృద్ధిలో ఆటంకాలు ఏర్పడవచ్చు. అంతేకాకుండా ఇతర సమస్యలు కూడా బలంగా ఉంటాయి. భారతదేశంలో ప్రస్తుతం చాలా మందికి వాస్తు గురించి అవగాహన పెరిగిన కారణంగా, ఇటువంటి గృహాలను సులభంగా కొనుగోలు చేయడానికి ముందుకు రారు.3. అమెరికా దేశంలోని టెక్సాస్ రాష్ట్రం లో గల డల్లాస్ నగరంలో కుమార్ అనే వ్యక్తి నివసించేవాడు. తనకు పశ్చిమ ముఖద్వార గృహాలలో గతంలో అద్భుతమైన ఫలితాలు రావడంతో, ఈ చిత్రంలో కనిపిస్తున్నటువంటి పశ్చిమ ముఖద్వార గృహాన్ని కొనుగోలు చేశాడు. (అయితే కుమార్ కొనుగోలు చేసిన గృహం ఇలాంటిదే కాకపోయినా, దానికి ప్రహరీ మరియు నిర్మాణ పరంగా అనేక మార్పులు ఉన్నాయి). కుమార్ గారి ఇంటికి కార్ గరాజ్ పశ్చిమ నైరుతిలో ఉండడం గమనించవచ్చు.
4. కుమార్ స్నేహితుడు శ్రీనివాసమూర్తి, వాస్తు శాస్త్రవేత్త పరిశీలన లేకుండా గృహాన్ని కొనవద్దని ఎన్నిసార్లు చెప్పినా, కుమార్ ఆ మాటలను పెద్దగా పట్టించుకోలేదు. అయితే కుమార్ భార్య మరియు మామగారు ఇద్దరూ పట్టుదలగా చెప్పడంతో, చివరకు ఒక వాస్తు శాస్త్రవేత్తను సంప్రదించడానికి ముందుకు వచ్చాడు.
5. వాస్తు నిపుణుడు గృహాన్ని పరిశీలించి కొన్ని సవరణలు సూచించినట్లు కుటుంబ సభ్యులకు తెలియజేయబడింది. ఆ తరువాత కుమార్ ఆ గృహాన్ని కొనుగోలు చేశాడు. ముఖ్యంగా కుమార్‌కు వాస్తు శాస్త్రంపై పెద్దగా నమ్మకం లేకపోవడం, అలాగే గతంలో పెద్దగా చెడు అనుభవాలు లేకపోవడం వల్ల ఇతరులు చెప్పిన హెచ్చరికలను అంతగా పట్టించుకోలేదు.
6. ఆ సమయంలో కుమార్‌కు ఒక కుమార్తె మరియు ఒక కుమారుడు ఉన్నారు. ఈ గృహంలోకి వచ్చినప్పుడు కుమారుడి వయస్సు కేవలం మూడు నెలలు మాత్రమే. కాలం గడుస్తూ మూడు సంవత్సరాలు పూర్తయ్యే సరికి, ఆ బాలుడికి ఆటిజం సమస్య ఉన్నట్లు తెలిసి కుటుంబ సభ్యులంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
7. అదే సమయంలో కుమార్ ఉద్యోగాన్ని కూడా కోల్పోయి ఐదు నెలలు గడిచిపోయాయి. చివరికి 11 నెలలు పూర్తయ్యే సరికి, కుటుంబ ఖర్చులు, గృహ రుణం మరియు ఇతర బాధ్యతలన్నింటినీ భార్య చేస్తున్న చిన్న కాంట్రాక్ట్ ఉద్యోగం ద్వారా వచ్చే స్వల్ప ఆదాయంతోనే నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఖర్చులు రోజురోజుకు పెరుగుతుండటంతో, మొదట కుమార్ మామగారు ఐదు లక్షల రూపాయలు సహాయం చేశారు. దురదృష్టవశాత్తు తరువాత కుమార్ భార్య ఉద్యోగం కూడా పోయింది. ఫలితంగా, 11 నెలల కాలంలో మామగారు అందించిన సహాయం మొత్తం దాదాపు 45 లక్షల రూపాయలకు చేరుకుంది.
8. ఈ కష్టకాలంలో అకస్మాత్తుగా కుమార్ తండ్రి మరణించారు. దీంతో కుటుంబమంతా కలిసి భారతదేశానికి ప్రయాణించాల్సి వచ్చింది. ఇది సరిపోదన్నట్లుగా, తమ్ముడితో ఆస్తి సంబంధిత వివాదాలు భరించలేని స్థాయికి చేరుకున్నాయి. తప్పని పరిస్థితుల్లో కుమార్ తన స్నేహితుల వద్ద నుండి దాదాపు 35 వేల డాలర్లు అప్పుగా తీసుకోవాల్సి వచ్చింది. చివరికి హైదరాబాద్ నగరం లో నెల అద్దె వస్తున్న తమ ఫ్లాట్‌ను కూడా అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది.
9. ఇక ఆలస్యం చేయడం మంచిది కాదని భావించి, చివరకు ఈ ఇంటి వాస్తు విషయాన్ని పూర్తిగా పరిశీలించడానికి ముందుకు వచ్చారు. అప్పుడు అసలైన వాస్తవాలు బయటపడ్డాయి. ప్రహారీలో ఈశాన్య దోషం ఉండటమే కాకుండా, గృహంలో కూడా ఈశాన్య దోషాలు బలంగా ఉండటంతో కుమార్ గారు ఇన్ని సమస్యలను ఎదుర్కొనాల్సి వచ్చింది. ప్రహరీ లో ఉన్న ఈశాన్యం కోత దోషం ఇంత పెద్ద సమస్యలను ఇవ్వదు. అంతేకాకుండా గృహంలో కూడా "ఈశాన్య దోషాలు బలంగా ఉన్నాయి".
10. దాదాపుగా 2007 / 2008 సంవత్సరం వరకు గృహస్తులు వాస్తు శాస్త్రవేత్తలు ఎలా చెబితే అలాగే పాటించేవారు. తర్వాత మార్కెట్లో వాస్తు పుస్తకాలు దొరకడం ఎక్కువైన తర్వాత వారే వాస్తు విజ్ఞానాన్ని బాగా ఔపాసనపట్టి సొంత నిర్ణయాలు తీసుకొని జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటున్న కుటుంబాలను ఎంతోమంది “అనుభవజ్ఞులైన” వాస్తు శాస్త్రవేత్తలు చూస్తూనే ఉంటారు. చెబితే వినరు. ఎవరి కర్మలను ఎవరు మార్చగలరు. అయితే నిజమైన విద్యావంతులు మాత్రం పొరపాటున కూడా సొంత నిర్ణయాలు తీసుకోరు. వాస్తు వృత్తిలో అనుభవజ్ఞులను గుర్తించి, వారి సలహా మరియు పరిశీలన ఆధారంగానే తగిన నిర్ణయం తీసుకుంటారు. అందుకే వారిని "విద్యావంతులు" అని అంటారు.
12. బుద్ధిః కర్మానుసారిణీ. మనసు మన ప్రధాన సంపద. అది సకారాత్మకంగా ఉపయోగించుకున్నామా, లేక నాశనాత్మకంగానా అనేది మన చేతుల్లోనే ఉంది. మనసును మిత్రుడిగా మార్చుకోగలిగిన వారికి విజయాలు తధ్యం. అయితే, మనసును శత్రువులా మార్చుకున్న వారు నాశనానికి గురికావచ్చు. మన ప్రవర్తన, మన ఆలోచనలపై ప్రభావం చూపే మన మనస్సు, మనకు మార్గదర్శిగా ఉండగలదు.
13. పాజిటివ్ దృక్పథంతో మనసును నియంత్రించడం మన చేతిలో ఉన్న శక్తి. ఇంద్రియాలను అదుపులో ఉంచి, వాటి ఆకర్షణలను విజయంగా మార్చుకోవడం మన జీవితంలో కీలకం. మనమే మన జీవితంలో విజయాలకు, వైఫల్యాలకు కారణం. మనం మన మనసును ఎలా నడిపిస్తామో ఆ ప్రకారంగానే మన జీవితం ఆకారం తీసుకుంటుంది. పరిస్థితులను మార్చుకోగల శక్తి మనలోనే ఉంది.
గుండ్రంగా ఈశాన్యం తెంపు కలిగిన పశ్చిమ ముఖద్వార గృహం మంచి ఫలితాలు ఇస్తుందా?
ఈ చిత్రంలో పశ్చిమ ముఖద్వార గృహానికి ఈశాన్య భాగం గుండ్రంగా తెంపు కలిగిన విధానాన్ని చూపించడం జరిగింది. సాధారణంగా ఈశాన్య భాగం వాస్తుశాస్త్రంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన దిశగా పరిగణించబడుతుంది. అందువల్ల ఈశాన్య భాగంలో ఇటువంటి గుండ్రని తెంపు లేదా కోత ఏర్పడినప్పుడు గృహంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అనేది గృహ నిర్మాణం, పరిసర వాస్తు మరియు ఇతర వాస్తు అంశాలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇటువంటి గృహాలను కొనుగోలు చేయడానికి లేదా నిర్మించడానికి ముందు అనుభవజ్ఞుడైన వాస్తు నిపుణుడి సలహా తీసుకోవడం మంచిది.తూర్పు ఆగ్నేయం పెరిగిన పశ్చిమ ముఖద్వార గృహం శుభ ఫలితాలు ఇస్తుందా?
ఈ చిత్రంలోని పశ్చిమ ముఖద్వార గృహానికి తూర్పు ఆగ్నేయ భాగం పెరిగి ఉన్నట్లు గమనించవచ్చు. ఇటువంటి నిర్మాణాన్ని "తూర్పు ఆగ్నేయం పెరిగిన పశ్చిమ ముఖద్వార గృహం" అని అంటారు. సాధారణంగా ఈ విధమైన గృహాలు అనుకూలమైన ఫలితాలను ఇవ్వకపోవచ్చు. జీవితంలో అసంతృప్తి, విద్యలో ఆటంకాలు, అధిక ఖర్చులు, కుటుంబ ఘర్షణలు, అనుకోని సంఘటనలు, పిల్లలు మాట వినకపోవడం, చెడు స్నేహాలు లేదా చెడు అలవాట్ల వైపు ఆకర్షితులవడం, అలాగే అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అదనంగా, ఈ గృహంలో ఇతర వాస్తు దోషాలు కూడా ఉన్నట్లయితే, ప్రతికూల ఫలితాలు మరింత అధికంగా ఉండే అవకాశం ఉంది.ఆగ్నేయ భాగం నేరుగా పెరిగిన పశ్చిమ ముఖ గృహం - వాస్తు ఫలితాలు
ఈ చిత్రంలో చూపినట్లుగా పశ్చిమ ముఖ గృహానికి ఆగ్నేయ (Southeast) భాగం నేరుగా పెరిగి ఉంది. వాస్తు శాస్త్రంలో ఆగ్నేయ దిక్కు అగ్ని తత్వానికి సంబంధించినది. ఈ దిశ సమతుల్యత కోల్పోయి అధికంగా పెరిగితే గృహంలోని శక్తి ప్రవాహంలో అసమతుల్యత ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి స్థలాల్లో నివసించే వారికి శ్రమకు తగిన ఫలితాలు ఆలస్యంగా రావడం, ఆర్థిక వ్యవహారాల్లో అనుకోని ఖర్చులు పెరగడం, కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడడం వంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. వ్యాపారులు లేదా ఉద్యోగస్తులు కూడా ఆశించిన స్థిరమైన పురోగతిని పొందడంలో ఇబ్బందులు అనుభవించవచ్చు. కొన్నిసార్లు పరిష్కారం కాని సమస్యల వలయంలో గృహస్తులు చిక్కుకుపోయే అవకాశం కూడా ఉంటుంది.నైరుతి తెంపు కలిగిన పశ్చిమ ముఖద్వార గృహం అశుభ ఫలితాలను ఇస్తుందా?
ఈ చిత్రంలో పశ్చిమ ముఖద్వార గృహానికి ప్రహరీలో నైరుతి భాగం తెంపుకు గురైన విధానాన్ని స్పష్టంగా గమనించవచ్చు. వాస్తుశాస్త్ర రీత్యా నైరుతి దిశ స్థిరత్వం, ఆర్థిక బలం, కుటుంబ బాధ్యతలు మరియు జీవన స్థైర్యానికి సంబంధించిన ముఖ్యమైన దిశగా పరిగణించబడుతుంది. అందువల్ల ఈ భాగంలో ఇటువంటి తెంపు ఉన్నప్పుడు గృహస్థులు కొన్ని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక స్థిరత్వంలో హెచ్చుతగ్గులు, కుటుంబ వ్యవహారాలలో ఇబ్బందులు, నిర్ణయాలలో అస్థిరత్వం మరియు మానసిక ఆందోళనలు కనిపించే అవకాశాలు ఉండవచ్చు. అయితే గృహం లోపలి వాస్తు, పరిసర వాస్తు మరియు ఇతర నిర్మాణ అంశాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాత మాత్రమే తుది నిర్ణయానికి రావడం సముచితం.పడమర ముఖ ఇంటికి ఉత్తర వాయవ్యం క్రాస్ గా పెరిగితే ఎలాంటి ఫలితాలు ఉంటాయి?
ఈ చిత్రంలో మీరు పశ్చిమ ముఖద్వార గృహాన్ని చూడవచ్చు. ఈ గృహానికి సంబంధించిన ప్రహరీ (కాంపౌండ్ వాల్) ఉత్తర-వాయువ్యంలో కోణంగా పెరిగినట్లు మీరు గమనించవచ్చు. ఇటువంటి కోణంగా పెరిగిన పశ్చిమ ముఖద్వార గృహాలను దయచేసి కొనకండి. ఒకవేళ ఇప్పటికే కొని ఉంటే, తప్పనిసరిగా ఒక అనుభవజ్ఞుడైన వాస్తు శాస్త్రవేత్తచే పరిశీలింపజేసి, తగిన మార్పులు చేసుకోండి. ఒకవేళ మీకు అందుబాటులో వాస్తు పండితులు లేనట్లయితే... పెరిగిన ఉత్తర-వాయువ్యాన్ని కోత పెడుతూ, ఈశాన్య భాగం నుంచి పశ్చిమ గోడ వైపుకు ఒక కొత్త గోడ నిర్మాణం చేయడం లేదా గ్రీన్ ట్రెల్లిస్ (Green Trellis) వంటిది ఏర్పాటు చేయడం మంచిది.1. ఉద్యోగం, వ్యాపారం మరియు ప్రయాణాలు:
ఉత్తర-వాయువ్య భాగం కోణీయంగా పెరిగిన (NNW Extension) ఇళ్లలో నివసించే వారికి తరచూ ఉద్యోగ మార్పులు, అవాంఛిత బదిలీలు, ప్రయాణాలు లేదా నివాస స్థల మార్పులు సంభవించే అవకాశం ఉంది. అంతేకాకుండా, వ్యాపార వ్యవహారాలలో జాప్యం జరగడం లేదా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో చంచలత్వం ఏర్పడవచ్చు. నష్టాలు వచ్చే అవకాశం కూడా అధికంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు (Partnerships) కలసిరావు, గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువ. మానసిక ప్రశాంతత లోపిస్తుంది.
2. కుటుంబ వాతావరణం:
ఈ రకమైన ఉత్తర-వాయువ్య కోణ విస్తరణ కారణంగా కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు, అపార్థాలు లేదా సంబంధాలలో స్థిరత్వం లోపించడం వంటి పరిస్థితులు తలెత్తవచ్చు. అయితే ఈ ప్రభావాలు ఇంటిలోని ఇతర దిశల వాస్తు అమరికలపై కూడా ఆధారపడి ఉంటాయి. కుటుంబ సభ్యులకు మనశ్శాంతి కరువవుతుంది. ఒకరిపై ఒకరు నిందలు వేసుకునే అవకాశం పెరగడమే కాకుండా, ఆర్థిక నష్టాలను కూడా చూడవలసి రావచ్చు.
3. ఆర్థిక పరిస్థితి:
కొన్ని సందర్భాలలో ఊహించని ఖర్చులు పెరగడం, ఆదాయానికి తగినట్లుగా పొదుపు లేకపోవడం లేదా ఆర్థిక లావాదేవీలలో ఆలస్యం ఎదురుకావడం వంటి అననుకూలతలు కనిపించవచ్చు. అప్పులు అయ్యే అవకాశం అధికంగా ఉంటుంది, అయితే విచిత్రంగా ఈ గృహస్థులకు హలోఅప్పులు ఇచ్చేవారు సదా సిద్ధంగా ఉంటారు.
4. ఆరోగ్యం మరియు మానసిక ప్రశాంతత:
ఇలాంటి నిర్మాణాలలో నివసించే వారికి మానసిక ఒత్తిడి, ఆందోళన లేదా నిర్ణయాలలో తీవ్రమైన అస్థిరత అనిపించే అవకాశాలు ఎక్కువ. మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. కుటుంబ సభ్యులలో ఒకరిపై ఒకరికి అసహ్యం లేదా ఏవగింపు కలిగే అవకాశం కూడా ఉంటుంది.
5. యువత మరియు అవకాశాలు:
వాయువ్యం ప్రయాణాలకు సంకేతం కావడం వల్ల, కొన్ని సందర్భాలలో ఇంట్లోని యువతకు విదేశీ విద్య, విదేశీ ఉద్యోగాలు లేదా స్వస్థలానికి దూరంగా కొత్త అవకాశాలు లభించే సూచనలు కనిపించవచ్చు. అయితే ఇది కేవలం ఒకే వాస్తు అంశం ఆధారంగా ముగించలేని విషయం.
6. వాస్తు పరిష్కారాలు:
సాధ్యమైనంత వరకు కోణీయంగా పెరిగిన భాగాన్ని (Extension) కాంపౌండ్ వాల్ ద్వారా వేరుచేసి, ప్రధాన స్థలాన్ని ఖచ్చితమైన చతురస్రాకారం లేదా దీర్ఘచతురస్రాకారంలోకి (Rectify) తీసుకురావడం ఉత్తమ పరిష్కారం. అది వెంటనే సాధ్యం కాకపోతే, ఆ విస్తరించిన భాగంలో పక్కా నిర్మాణాలు చేయకుండా ఓపెన్-టు-స్కై (Open-to-sky) ప్రదేశంగా లేదా చిన్న పచ్చిక బయలు/గార్డెన్‌గా మాత్రమే ఉపయోగించాలి. అలాగే ప్రధాన భవనం చుట్టూ ఉత్తరం మరియు తూర్పు వైపులా ఎక్కువ ఖాళీ స్థలం ఉండేలా చూసుకోవడం శ్రేయస్కరం.
దక్షిణ నైరుతి భాగం పెరిగిన ప్రహరీ గోడతో గృహం - వాస్తు ఫలితాలు
ఈ చిత్రాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ గృహానికి అన్ని దిక్కులా ప్రహరీ గోడ ఉంది. మనం ఇంతకుముందే చెప్పుకున్నట్లుగా, ప్రహరీ ఉన్నప్పుడు ఒక విధమైన ఫలితం, ప్రహరీ లేనప్పుడు మరో విధమైన ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ గృహాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే, ప్రహరీని దక్షిణ నైరుతి భాగం పెరిగే విధంగా నిర్మించడం జరిగింది. ఈ విధంగా నిర్మాణం చేయడం సరైనది కాదు. సాధారణంగా ఈశాన్య భాగం మినహా ఇతర ఏ దిశలోనూ మూల భాగం ఈ విధంగా పెరిగి ఉండటం మంచిది కాదని వాస్తు సంప్రదాయాలు పేర్కొంటాయి.
2. సాధారణంగా ఇటువంటి గృహాలలో నివసించే గృహస్తులకు అనారోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.
3. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది.
4. పరిస్థితులు తమ చేతుల్లో లేకుండా పోయినట్లు అనిపించి, మానసిక ఆందోళనను అనుభవించే అవకాశం ఉంటుంది.
5. ప్రవర్తనలో కొన్ని లోపాలు ఏర్పడే అవకాశం ఉంటుంది.
6. అనేక కష్టనష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చే పరిస్థితులు ఏర్పడవచ్చు.
7 . సాధారణంగా వచ్చే ఖర్చుల కన్నా అధికంగా ఖర్చులు వచ్చే అవకాశం ఉంది.
8. ప్రహరీలో ఈ దక్షిణ నైరుతి పెరగడంతో పాటుగా, గృహం లోపల ఏమైనా ఇతర వాస్తు సమస్యలు ఉన్నట్లయితే, ఒక్కొక్కసారి పోలీస్ స్టేషన్కు వెళ్లి రావాల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చు. లేదా న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి కూడా రావచ్చు.
వాస్తు పరిష్కారాలు:
సాధ్యమైనంత వరకు కోణీయంగా విస్తరించిన భాగాన్ని (Extension) మరొక కాంపౌండ్ వాల్ ద్వారా ప్రధాన స్థలం నుంచి వేరుచేసి, స్థలాన్ని ఖచ్చితమైన చతురస్రాకారం లేదా దీర్ఘచతురస్రాకారంలోకి తీసుకురావడం (Rectify) ఉత్తమ పరిష్కారంగా పరిగణించవచ్చు. వెంటనే అలా చేయడం సాధ్యం కాని పరిస్థితుల్లో, విస్తరించిన భాగంలో స్టోర్ రూమ్ను నిర్మించుకోవచ్చు. అలాగే, ప్రధాన భవనం చుట్టూ ముఖ్యంగా ఉత్తరం మరియు తూర్పు వైపులా తగినంత ఖాళీ స్థలం ఉండేలా చూసుకోవడం శ్రేయస్కరం.
నైరుతిలో నిర్మించిన తూర్పు ఉత్తరం ఖాళీ స్థలం కలిగిన పశ్చిమ ముఖ ద్వార గృహము
ఈ చిత్రంలో పశ్చిమ ముఖద్వార గృహానికి తూర్పు మరియు ఉత్తర భాగాలలో విశాలమైన ఖాళీ స్థలం, అలాగే దక్షిణ మరియు పశ్చిమ భాగాలలో తక్కువ ఖాళీ స్థలం ఉన్న విధానాన్ని స్పష్టంగా గమనించవచ్చు. సాధారణంగా వాస్తుశాస్త్ర రీత్యా తూర్పు మరియు ఉత్తర దిశలలో తగినంత విశాలమైన ఖాళీ స్థలం ఉండడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇటువంటి నిర్మాణం కలిగిన గృహాలు గృహస్థులకు శుభ ఫలితాలను అందించే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. అయితే గృహానికి కలిగే తుది వాస్తు ఫలితాలు కేవలం ఈ ఒక్క అంశంపై మాత్రమే ఆధారపడవు. గృహం లోపలి వాస్తు, ప్రహరీ నిర్మాణం, స్థల ఆకారం, నేల ఎత్తుపల్లాలు, నీటి వనరుల స్థానం, ప్రధాన ద్వారం మరియు పరిసర వాస్తు వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాత మాత్రమే సరైన నిర్ణయానికి రావాలి.పడమర దిశ గృహ వాస్తు పై కొన్ని ప్రశ్నలు మరియు సమాధానాలు
గృహానికి పశ్చిమ దిశలో బావులు, చెరువులు, కుంటలు, వాగులు, కాలువ ప్రవాహాలు ఉండడం మంచిదేనా?
వాస్తు శాస్త్ర రీత్యా గృహములకు పశ్చిమ దిశలో లోతైన ప్రాంతాలు ఉండడం మంచిది కాదు. ఇంటికి పశ్చిమ దిశలో వాగులు, కుంటలు, నీటి ప్రవాహాలు, ఉండడం వల్ల అశుభ లక్షణాలు కనిపించవచ్చు. ఉదా : - ఆరోగ్యం నాశనమైపోవడం, పెద్ద పెద్ద అనారోగ్యాలతో భాదలను అనుభవించడం, ధనం కోల్పోవడం, సంపద ఆవిరైపోవడం, ఆనందం లేకుండా పోవడం, జీవనోపాధి కోల్పోవడం, మానసిక అశాంతి, కావలసిన స్నేహితులు, బంధువులు, దూరమైపోవడం, ఆసుపత్రికి తరచూ వెళ్లడం, అపజయం, పట్టుకున్న కార్యక్రమాలు సజావుగా జరగకపోవడం, శత్రువులు పెరగడం, కిరాయి సరిగా రాకపోవడం, లేక కిరాయి కట్టే స్థోమత కూడా లేకుండుట, జీవనాధారం కోల్పోవడం, అనుకున్న పనులు జరగకపోవడం, ఇత్యాది విషయాలు అనుభవం లోకి రావచ్చును.పశ్చిమ భాగంలో అధిక ఖాళీ స్థలం ఉంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి?
1. ఈ చిత్రంలో చూపించిన గృహానికి నాలుగు వైపులా ప్రహరీ గోడ ఉంది. ప్రహరీ ఉన్నప్పుడు ఒక ఫలితం, ప్రహరీ లేనప్పుడు మరో విధమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ప్రత్యేకంగా గమనించాలి. ఈ ప్రహరీలో ఈ చిత్రంలో చూపించిన గృహం తూర్పు భాగంలో నిర్మించబడి, పశ్చిమ భాగం అంతా అధికమైన ఖాళీ స్థలాన్ని వదిలివేయడం జరిగింది. గృహానికి ఉన్న ప్రహరీకి పెద్ద గేటు ఏర్పాటు చేసినప్పుడు ఒక విధమైన ఫలితం, చిన్న గేటు ఏర్పాటు చేసినప్పుడు మరో విధమైన ఫలితం వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా, ఈ గేట్లను అంటే ప్రవేశ ద్వారాలను ఏ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారు అనే అంశంపై కూడా ఫలితాలు ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకి ప్రస్తుతం ఉన్న గేటు పశ్చిమ భాగంలో ఉన్నది.
2. ఎప్పుడైతే ఒక గృహానికి ప్రహరీ ఉండి, పశ్చిమ భాగంలో అధికంగా ఖాళీ స్థలం ఉండి, తూర్పు భాగంలో చాలా తక్కువగా ఖాళీ స్థలం ఉన్నప్పుడు, గృహస్తుల జీవనోపాధిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. అంటే, ఉద్యోగం కోల్పోవడం లేదా ఉపాధి అవకాశాలు తగ్గిపోవడం, వ్యాపారస్తులకు వ్యాపారంలో భారీగా నష్టాలు రావడం లేదా ఇతరుల ద్వారా మోసానికి గురికావడం వంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది..
3. ఎంత ఆరోగ్యవంతులైనప్పటికీ, ఇలాంటి గృహాల్లో నివసించే వారికి అనారోగ్య సమస్యలు ఎదుర్కోవలసి రావచ్చు. పశ్చిమ భాగంలో ఖాళీ స్థలం అత్యధికంగా ఉన్నప్పుడు ఏ పని చేసుకోలేని అసమర్ధత కల అనారోగ్యానికి దారి తీసే అవకాశం ఉంది.
4. సాధారణంగా ఇలాంటి నిర్మాణం గృహస్తులకు ఆశించిన స్థాయిలో అనుకూల ఫలితాలను అందిస్తుందని చెప్పలేము.
5. పశ్చిమ భాగంలో అధికంగా ఖాళీ స్థలం ఉండటం వల్ల ఆశించిన స్థిరత్వం లేకపోవడం.
6. ఆర్థిక వ్యవహారాల్లో అనవసరమైన ఖర్చులు పెరగడం.
7. ఎంత కష్టపడినా ఆశించిన ఫలితాలు ఆలస్యంగా లభించడం వంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.
8. అలాగే, గృహంలోని పురుష సంతానానికి ప్రతికూల పరిస్థితులు, లేదా చెడు జరిగే అవకాశం ఉంది.
9. గృహస్తులకు అపకీర్తి వచ్చే పరిస్థితులు దాపురించవచ్చు.
10. గృహంలోని వ్యక్తులు అనవసరమైన తగాదాల్లో తలదూర్చి అవమానానికి గురయ్యే అవకాశం ఉంది.
11. కుటుంబంలో దుఃఖకరమైన పరిస్థితులు మరియు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది.
10. పరాయి వ్యక్తులు, ఇతర బంధువులు లేదా స్నేహితులుగా నటించే వ్యక్తులు ఈ గృహస్తుల విషయాల్లో జోక్యం చేసుకుని వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. అంతేకాకుండా, ఈ ఇంటి గృహస్తులకు తప్పుడు సలహాలు ఇచ్చి, తప్పు నిర్ణయాలు తీసుకునేలా చేసే అవకాశం కూడా ఉంది.
రమణ అన్నయ్య గారి అనుభవం
19,000 నుంచి 300 మందికి తగ్గిన ఉద్యోగుల సంఖ్య - ఒక వాస్తు ఉదాహరణ
గృహాన్ని కొనుగోలు చేసే ముందు ఎందుకు జాగ్రత్తగా పరిశీలించాలి?
- : దాతల సమాచారం : -
ఎంతోమంది గృహస్థులకు తమకు జన్మనిచ్చి, ఉన్నతంగా తీర్చిదిద్దిన తమ తల్లిదండ్రుల పేర్లను లేదా తమ పెద్దల పేర్లను చిరస్థాయిగా ఈ సమాజంలో నిలిచిపోయెందుకు భారీ ప్రయత్నాలు చేస్తుంటారు. ఇది చాలా మంచి పరిణామము, మరియు వీరి ఆలోచన అద్భుతం, అపూర్వ సృజనాత్మకత. ఒక వేళ మీకంటూ ఇటువంటి ఆలోచన ఉన్నట్లయితే మీ లోకల్ లాంగ్వేజ్ లో వెబ్సైట్ తయారవుతున్నది. మీరు మీ పెద్దల పేర్లను చిరస్థాయిగా ఈ సమాజంలో నిలిపి ఉంచడానికి, వారి పేర్లు, పేర్లతో పాటుగా చిత్రపటములను కూడా ముద్రిస్తాము. ఈ వెబ్సైటు ఉన్నంతకాలం మీ పేరు, లేదా మీ తల్లితండ్రుల పేర్లు చిరస్థాయిగా నిలిచిపోతాయి. మొత్తం వెబ్ సైట్ అంతయు మీరు స్పాన్సర్ చేయవచ్చు. లేదా ఒక ప్రత్యేకమైన పేజీ ను స్పాన్సర్ చేయవచ్చు. సింగల్ టైం పేమెంట్ మాత్రమే. ప్రతి సంవత్సరం కట్టాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ మీకు స్పాన్సర్ చేయాలని అనిపిస్తే ఈ లింకు ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు, తదుపరి మిగిలిన సమాచారంను అందజేయగలము. https://www.subhavaastu.com/contact-us.html
- : SPONSORSHIP : -
Many residents are committed to honoring the names of their parents, grandparents, or elders, with the aim of keeping their legacy vibrant in their respective societies. This admirable effort is truly heartening. If you feel a connection to this endeavor, our website, thoughtfully crafted in your native language, offers a supportive platform while deeply respecting your sentiments. We are dedicated to helping you ensure that the names of your loved ones are remembered with respect and fondness. You have the option to sponsor either the entire website or a specific page, all with a single payment, freeing you from the concern of annual fees. In doing so, the names of those dear to you will be cherished and celebrated for as long as our website continues to exist. If you’re interested in this meaningful tribute, please contact us for more information.