మనసుకు హత్తుకుపోయే కబుర్లు

వాస్తు శాస్త్రం వెబ్‌సైట్‌లో “ఈ కబుర్లు” అనే ప్రస్తావన ఎందుకు ఉంటుంది? వీటిని చదవడం వల్ల మన సమాజానికి నిజంగా ఏమైనా ఉపయోగం ఉందా? ఇవి చదవడం ద్వారా మా సమయం వృథా అవుతుందా, లేక నా జీవితాన్ని మెరుగుపరుచుకుని ఒక ఉత్తమమైన, అద్భుతమైన భవిష్యత్తును నిర్మించుకునేందుకు సహాయపడతాయా? చదవండి మీకే అన్ని విషాయాలు తెలుస్తాయి.

మనిషి బ్రతికే ఉన్నాడు, మనసు చనిపోయింది

పసి పిల్లలకు మొబైల్ ఫోన్లు ఇవ్వరాదుభవిష్యత్తులో ఇటువంటి ఒక కాలం వస్తుందని బహుశా మనం ఊహించి ఉండం, ఏమి కాలమిది, ఏమి వైపరీత్యమిది, మనిషికి మనిషి తోనే పని లేకుండా పోతున్నది, ఎదురుగా మనిషి ఉన్నాడనే ధ్యాస నశించిపోతోంది, ఏమి సాధించడానికి ఈ ఆవిష్కరణలు, భారతీయులు ఎంత బలహీన మనస్కులు అయిపోయారు, విదేశాలలో ఏ కొత్తది ఆవిష్కరణ జరిగినా, వెనకా ముందు చూడకుండా దానిని పాటించడమేనా, కొంచమైనా ఆలోచన చేసేది లేదా, మన సంప్రదాయాలు ఏమిటి, మన పద్ధతులు ఏమిటి, మన పరిమితులేమిటి, అనే ఆలోచన వద్హా, విదేశాలలో ఏది కొత్తగా ఆవిష్కరణ అయిందో వెంటనే దాన్ని పాటించడం, అదే జీవితం అనుకోవడం.
చిన్నపిల్లలను మనం వదిలించుకోవడానికి, ఫోన్ ఇస్తే వారు ఆడుకుంటారు అని వారిని బలిపశువులను చేస్తున్నాము. బయట చూస్తే ఎంతో మంది తల్లితండ్రులు తమ పిల్లలకు ఫోన్ ఇచ్చి, వారు ఇతర పనులు చేసుకోవడం మనం చూస్తున్నాము. దీని వల్ల భవిష్యత్తులో ఆ పిల్లలు ఎంత ఇబ్బందులను ఎదుర్కుంటారో మనం ఆలోచన చెయ్యం. వారి భవిష్యత్తు మనకు అవసరం లేదా ?, ఇక ఎవరికోసం బ్రతుకుతున్నాము.

నేటి తరం ఎదుర్కొంటున్న అసలైన సవాలు ఏమిటి?

ఈ తరం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఏమిటి అని ఎవరిని అడిగినా.. ఉద్యోగాల కొరత, పెరిగిపోతున్న పోటీ లేదా వేగంగా మారుతున్న జీవనశైలి గురించి చెబుతారు. ఇవన్నీ నిజమే అయినప్పటికీ, మన రోజువారీ జీవితంలో మరింత లోతైన ప్రభావం చూపుతున్న మరో అంశం ఉంది. అది బయటకి కనిపించదు, కానీ మన ఆలోచనలను, అలవాట్లను మారుస్తూ మనల్ని ఒక ప్రమాదకరమైన వ్యసనంలోకి నెట్టేస్తోంది. అదే డిజిటల్ వ్యసనం.

అసలు ముప్పు టెక్నాలజీ కాదు - ఆకర్షణలే!

టెక్నాలజీ అనేది మనిషి సృష్టించుకున్న ఒక అద్భుతమైన సాధనం. సమస్య టెక్నాలజీతో లేదు, దాని వల్ల కలిగే ఆకర్షణలతోనే ఉంది. మనం ఫోన్‌ను వాడుతున్నామని అనుకుంటాం, కానీ మన సమయం, దృష్టి, మనశ్శాంతి ఆ ఫోన్ ప్రభావంలోకి జారిపోతున్నాయి. ఉదయం లేవగానే స్క్రీన్, రాత్రి పడుకునే ముందు స్క్రీన్.. ఈ అలవాటు మనల్ని మెల్లగా తన అదుపులోకి తీసుకుంటుంది.
లిఫ్ట్ కోసం వేచి ఉన్న ఆ ఒక్క నిమిషం కూడా ఫోన్ చూడకుండా ఉండలేకపోతున్నామంటే, మనం మన అదుపులో లేనట్లేనని అర్థం. మన మనసు మన మాట వినడం లేదనే విషయాన్ని ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. ఇది గమనించకపోతే భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఇన్‌స్టంట్ గ్రాటిఫికేషన్ - వెంటనే ఫలితం కోరే మనస్తత్వం

ప్రస్తుతం మనకు ప్రతిదీ క్షణాల్లో జరిగిపోవాలి. షార్ట్ వీడియోలు, రీల్స్ చూడటం వల్ల మన మెదడు తక్కువ సమయంలో ఎక్కువ వినోదాన్ని కోరుకుంటోంది. దీనివల్ల ఏదైనా ఒక పనిపై ఎక్కువ సేపు దృష్టి పెట్టడం కష్టమవుతోంది. కష్టపడి సాధించాల్సిన లక్ష్యాల పట్ల సహనం తగ్గిపోతోంది.
నేడు 10 నిమిషాల్లో డెలివరీ అనే కాన్సెప్ట్ రావచ్చు, రేపు అది 5 నిమిషాలకు తగ్గవచ్చు. దీనివల్ల మనకు సౌకర్యంగా అనిపించినా, మానసికంగా మనం ఎంతటి అసహనానికి గురవుతున్నామో ఆలోచించాలి. ఎదుటివారి విజయాలు చూసి అసూయ పడటం కంటే, వారు ఆ స్థాయికి చేరడానికి పడిన శ్రమను గుర్తించడం ముఖ్యం.

సోషల్ మీడియా: భ్రమ vs వాస్తవం

డిజిటల్ ప్రపంచంలో కనిపించే జీవితం తరచుగా ఎంపిక చేసిన క్షణాల సమాహారం మాత్రమే. అక్కడ అందరూ సంతోషంగా ఉన్నట్టే కనిపిస్తారు. అది చూసి మన సాధారణ జీవితాన్ని వారితో పోల్చుకుని బాధపడటం మొదలుపెడతాం. కానీ గుర్తుంచుకోండి, డిజిటల్ వేదికలపై కనిపించే రంగురంగుల జీవితాలు ఎప్పుడూ పూర్తిగా నిజమైనవి కావు. కష్టపడకుండా ఏదీ రాదు అనే నిజాన్ని మనం మర్చిపోకూడదు.

FOMO - ఏదో కోల్పోతున్నామనే భయం

లోకంలో ఎక్కడో ఏదో జరుగుతోంది, అది నేను చూడకపోతే వెనుకబడిపోతానేమో అన్న భయం (Fear of Missing Out) మనల్ని నిరంతరం ఒత్తిడికి గురి చేస్తోంది. వేరొకరి అప్‌డేట్స్ చూస్తూ మనల్ని మనం తక్కువ చేసుకోవద్దు. ప్రతి ఒక్కరి ప్రయాణం వేరుగా ఉంటుంది. స్క్రీన్ మీద కనిపించేది మొత్తం కథ కాదు అనే అవగాహన పెంచుకోవాలి.

మల్టీటాస్కింగ్ - సామర్థ్యమా లేక భ్రమనా?

ఒకేసారి పది పనులు చేస్తున్నామని మనం మురిసిపోతుంటాం. కానీ మానవ మెదడు సహజంగా ఒక సమయంలో ఒక పనిపై మాత్రమే పూర్తి ఏకాగ్రత పెట్టగలదు. పదే పదే దృష్టి మారుస్తూ ఉంటే చేసే పనిలో నాణ్యత తగ్గుతుంది. మన పెద్దలు చెప్పినట్టు "రెండు గుర్రాల మీద స్వారీ చేయలేము". గమ్యం చేరాలంటే ఏకాగ్రత ఒక్క దానిపైనే ఉండాలి.

డోపమైన్ ప్రభావం - లైక్స్ వెనుక పరుగు

మన ఫోన్‌కి వచ్చే నోటిఫికేషన్లు, లైకులు, మెసేజ్‌లు మన మెదడులో 'డోపమైన్' అనే రసాయనాన్ని విడుదల చేసి తాత్కాలిక ఆనందాన్ని ఇస్తాయి. మెల్లగా మనం వీటికి బానిసలవుతాం. దీనివల్ల నిశ్శబ్దంగా కూర్చోవడం మనకు బోర్ కొడుతుంది. అనవసరమైన నోటిఫికేషన్లు మనల్ని లక్ష్యం వైపు కాకుండా గందరగోళం వైపు లాగుతాయి. అత్యవసరమైన ఆఫీస్ పనులు లేదా వ్యాపార విషయాలు తప్ప, మిగిలిన అనవసర విషయాల మీద ఏకాగ్రతను వ్యర్థం చేసుకోవద్దు. ఎవరి సంపాదన కోసమో మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు.

ఇన్ఫర్మేషన్ ఓవర్‌లోడ్ - సమాచార గందరగోళం

అవసరానికి మించిన సమాచార ప్రవాహం మన మెదడును అలసటకు గురిచేస్తుంది. ఏది ముఖ్యం, ఏది కాదు అనే స్పష్టత కోల్పోతాం. అతిగా సమాచారాన్ని తలకెక్కించుకోవడం వల్ల అసలైన ఆలోచనలు మరుగున పడిపోతాయి. కొన్నిసార్లు తక్కువ సమాచారంతో ఉండటమే మన మనసుకి ప్రశాంతతను, స్పష్టతను ఇస్తుంది.

సమతుల్యతే అసలైన పరిష్కారం

టెక్నాలజీని వదిలేయమని ఎవరూ చెప్పడం లేదు, దాన్ని మన అదుపులో ఉంచుకోవాలని మాత్రమే చెబుతున్నాం. ఒకప్పుడు మనకు కనీసం 50 ఫోన్ నంబర్లు గుర్తుండేవి. కానీ ఇప్పుడు మన సన్నిహితుల నంబర్లు కూడా గుర్తుంచుకోలేకపోతున్నాం. అంటే మన జ్ఞాపకశక్తిని టెక్నాలజీకి తాకట్టు పెడుతున్నాం.
పని వేళల్లో ఫోన్‌ను పక్కన పెట్టండి. నిద్రకు కనీసం గంట ముందు డిజిటల్ విరామం తీసుకోండి. ఫోన్ మాట్లాడటానికి మాత్రమే వాడండి. సాధ్యమైతే మీ ఫోన్‌ను మీకు ఓ 6 అడుగుల దూరంలో ఉంచండి. ఈ చిన్న మార్పులు మీ జీవితంలో పెద్ద మార్పుకు దారితీస్తాయి.

టెక్నాలజీ కేవలం ఒక సహాయకుడు మాత్రమే

టెక్నాలజీ మన జీవితాన్ని సులభతరం చేయాలి తప్ప, అది మనల్ని శాసించకూడదు. ఈ కాలంలో తెలివైన వారి కంటే, ఎక్కువ ఏకాగ్రత (Focus) ఉన్నవారే విజేతలుగా నిలుస్తారు. అతిగా ఫోన్ వాడితే అద్భుతమైన ఆలోచనలు చేసే శక్తిని కోల్పోతాం. మేల్కోకపోతే భవిష్యత్తులో శారీరకంగా, మానసికంగా బలహీనపడిపోతాం.

మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి

ప్రతిరోజూ మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి: "ఈరోజు నేను నా ఫోన్‌ను ఎంతసేపు ఉపయోగించాను? అది నన్ను ఎంతసేపు తనలో నిమగ్నం చేసింది?" ఈ ప్రశ్నకు మీరు ఇచ్చే నిజాయితీ గల సమాధానమే మీ జాగ్రత్త జీవనానికి ఆరంభం అవుతుంది.

మీకొక ఛాలెంజ్!

మీకు ఆత్మవిశ్వాసం ఉంటే ఈ ఛాలెంజ్‌ను స్వీకరించండి: "ప్రతిరోజూ ఉదయం 9 గంటల వరకు మొబైల్ ఫోన్‌ను తాకకుండా ఉండగలరా?" ఒకవేళ మీరు దీన్ని సాధించగలిగితే, మీ వివరాలను మాకు ఈమెయిల్ చేయండి. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మీ ఫోటోతో సహా మీ అనుభవాన్ని మా వెబ్‌సైట్‌లో ప్రచురిస్తాము. మీ విజయం ఇతరులకు స్ఫూర్తినిస్తుంది. మీరు ఇతరుల అభివృద్ధిని కోరుకుంటే, భగవంతుడు మీ అభివృద్ధిని కోరుకుంటాడు.

ఇక్కడ మీ ప్రశ్నలకు సమాధానములు ఆశించవచ్చు

Contact SubhaVaastuగౌరవనీయులైన గృహస్థులకు ఏమైనా ప్రశ్నలు ఉంటే ఈ లింక్ ద్వారా పంపవచ్చు. సంబోధన గౌరవప్రదంగా ఉంటే “5 నిమిషాల” నుండి “24 గంటల” లోపు మా ప్రత్యుత్తరాన్ని ఆశించవచ్చు. .

హాయిగా నవ్వుకునే సరదా తెలుగు జోక్స్- SubhaVaastu.com

మన Vastu Shastra Website లోని మరో ముఖ్యమైన మరియు ఉపయోగకరమైన లింక్. మీ కోసం దాదాపుగా 200 తెలుగు జోక్స్‌ను సమీకరించాము. ఈ దినం / ప్రతి దినం మీ జీవితమంతా ఆనందంగా, సరదాగా, హాయిగా గడవాలని భావిస్తూ, మీకు నవ్వులు పంచే ఈ తెలుగు జోక్స్‌ను ఇక్కడ ప్రచురించాము. హాయిగా నవ్వుకోండి, మీ జీవితం అంతా సంతోషంగా గడవాలి. 😊
బట్టలు బాగా ఉతుకుతావు - ఒక తెలుగు జోక్
నన్ను మాత్రం నిద్ర లేపద్దు - ఓ తెలుగు జోక్
వెంగళప్ప తెలుగు జోక్స్
ఫ్రీ డెలివరీ
చిరునవ్వుల బాటలో తీసుకెళ్లే తెలుగు వినోదం
హాస్యంతో మనసు పులకరించే తెలుగు కంటెంట్
చిరునవ్వులతో హృదయాన్ని హాయిగా చేసే వినోదం
సరదా హాస్యంతో రోజు మధురం చేసే తెలుగు మాటలు
నవ్వులతో మనసును నింపే తెలుగు ఆనందం

సుబ్బారావా! మజాకా!

ఒకరోజు సుబ్బారావు విజయవాడలో ఒక బారులోకి వెళ్లి డ్రింక్స్ ఆర్డర్ ఇచ్చాడు, చక్కగా తాగి బయటికి వచ్చి చూసేసరికి తన కారు కనబడలేదు.

వెంటనే బారులోనికి పరిగెత్తుకు వచ్చి జేబులోంచి ఒక కత్తి తీసి టేబుల్ మీద బలంగా గుచ్చాడు, కోపంతో రెచ్చిపోతూ బారు ఓనర్ తో వాదనకు దిగాడు, నా కారు తీసుకెళ్లిన వాడిని నేను ఇంకొక డ్రింక్ ఫినిష్ చేసే లోపల మర్యాదగా అక్కడ పెట్టమను, లేకపోతే హైదరాబాదులో జరిగిందే ఇక్కడ మళ్లీ జరుగుతుంది, జాగ్రత్త అని కోపంతో గుడ్లురిమి, తన టేబుల్ దగరకు వెళ్ళిపోయి, తనకు వచ్చిన డ్రింక్ తాగి బయటకు వచ్చి చూసేసరికి తన కారు అక్కడే ఉంది.

సుబ్బారావు బారులోకి వెళ్లి బిల్లు పే చేసి బయటకు వస్తుండగా బారు ఓనరు ఎంతో వినయ విధేయతలతో భయంతో సుబ్బారావును ఇలా అడిగాడు "సార్ హైదరాబాదులో ఏమైంది"!!!

దానికి సుబ్బారావు నేను ఇంటికి ఆటోలో వెళ్లాల్సి వచ్చింది.

జుట్టు జోక్
భార్య జోక్
వనభోజనాలు జోక్
పెళ్లి యోగం పై తెలుగు సరదా జోక్
నిద్రపోయే గాడిద తెలుగు జోక్
జీప్ కీప్ తెలుగు జోక్
జీవక్రియ జోక్
దోశ తెలుగు జోక్స్
భార్య భర్తల తెలుగు జోక్స్
మందు బాబుల జోక్
అంతా అనుమానమే
క్యారెట్ తెలుగు జోక్
చిరునవ్వులతో మనసును రంజింపజేసే వినోదం

ఒక్క రూపాయి ... వామన్ రావు!

గుడిలో అభిషేకం హడావుడి మామూలుగా లేదు. జనాల తోపులాట, మంత్రాల ఘోష... అబ్బో, ఒకటే రష్! పూజారి గారు అభిషేకం ముగించుకుని, హారతి పళ్లెంతో భక్తుల వైపు వచ్చారు.

వామన్ రావు గారు లైన్లో నిలబడి, తన జేబులో "పరిశోధన" మొదలుపెట్టాడు. అటూ ఇటూ వెతికితే ఒక ₹1 బిళ్ళ, ఒక ₹2 బిళ్ళ, ఒక ₹5 బిళ్ళ దొరికాయి. క్షణం కూడా ఆలస్యం చేయకుండా, ఆ ₹2 బిళ్ళ, ₹5 బిళ్ళలను జాగ్రత్తగా జేబులో దాచేసి... లోక కళ్యాణం కోసం ఆ ₹1 బిళ్ళను తీసి హారతి పళ్లెంలో వదిలాడు.

సరిగ్గా అప్పుడే వెనక నుంచి ఎవరో వామన్ రావు భుజం తట్టి, ఆయన చేతికి ఒక ₹2000 నోటు అందించారు.

"వామ్మో! ఎవరో పుణ్యాత్ముడు వెనక నుంచి ఇంత పెద్ద నోటు ఇచ్చాడంటే, ఇది దైవ సంకల్పమే!" అని, ఆ ₹2000 నోటును కూడా హారతి పళ్లెంలో వేసేశాడు.

గుడి బయటకు వచ్చాక, వామన్ రావు కి మనసు ఆగలేదు. వెనక్కి తిరిగి ఆ నోటు ఇచ్చిన వ్యక్తిని చూసి సంతోషంతో ఇలా అన్నారు:

వామన్ రావు: "అయ్యా! మీరు మామూలు మనిషి కాదండి... సాక్షాత్తు ఆ దేవుడే మిమ్మల్ని పంపాడు. అంత పెద్ద ₹2000 నోటును ప్లేటులో వేయడానికి ఎంత పెద్ద మనసు ఉండాలండి? మీ దానగుణానికి జోహార్లు!"

ఆ వ్యక్తి అయోమయంగా చూస్తూ... "అదేంటండి అలా అంటారు?" అని అడిగాడు.

వామన్ రావు: "అదేనండి, ఇందాక నా చేతికి ₹2000 నోటు ఇచ్చారు కదా... హారతి పళ్లెంలో వేయమని!"

అప్పుడు ఆ వ్యక్తి నెమ్మదిగా నవ్వి ఇలా అన్నాడు: "అయ్యో... అది దానం కాదండి బాబు! మీరు మీ జేబులో డబ్బుల కోసం వెతుకుతున్నప్పుడు, మీ జేబులోనుంచి ఆ రెండు వేల నోటు కింద పడిపోయింది. అది మీదేనని మీ చేతికి ఇచ్చాను... అంతే!"

​బ్యాంకు మేనేజర్ తెలుగు జోక్స్​
చిరునవ్వులతో మనసును రంజింపజేసే వినోదం
హాస్యంతో రోజుకు ఉత్సాహం పోసే కంటెంట్
​నవ్వులతో హృదయాన్ని తాకే తెలుగు సరదా జోక్స్
​ తెలుగు జోక్స్​
​ సరదా, ఫన్నీ తెలుగు జోక్స్
​వినోదాత్మక తెలుగు హాస్యం

హాస్య ప్రియులందరికీ నమస్కారం

1. ప్రస్తుతం మనమందరం అనేక బాధ్యతలు, కార్యక్రమాలు మరియు ఒత్తిళ్ల మధ్య జీవిస్తూ, మానసిక అలసటను అనుభవిస్తున్నాము. ఇలాంటి సమయంలో కొద్దిగా అయినా మానసిక ఉల్లాసం కలగడం మన జీవితానికి ఎంతో అవసరం. హాస్యం మన మనస్సును తేలికపరుస్తుంది, ఉత్సాహాన్ని పెంపొందిస్తుంది, అలాగే మనశ్శాంతిని నిలుపుకోవడంలో సహాయపడుతుంది.
2. ఈ భావనతోనే, ప్రతి ఒక్కరూ హాయిగా నవ్వేందుకు మరియు కొద్దిసేపైనా ఒత్తిడిని మర్చిపోవడానికి “తెలుగు జోక్స్” అనే ఈ పేజీని తెలుగు వాస్తు శాస్త్రం వెబ్సైటు లో రూపొందించాము. జీవితంలో హాస్యం లేకపోతే ఈ ఆధునిక కాలంలో మనశ్శాంతిగా జీవించడం చాలా కష్టం. అందుకే హాస్యానికి మన జీవితంలో ప్రత్యేక స్థానం ఉంది.
3. అదే విధంగా, మీకు తెలిసిన మంచి, ఆరోగ్యకరమైన జోకులను కూడా మీరు మాతో పంచుకుంటే ఎంతో ఆనందంగా వాటిని ఈ పేజీలో ప్రచురిస్తాము. ముఖ్యంగా రచయితలకు తగిన గౌరవం ఇవ్వడం మా బాధ్యతగా భావిస్తున్నాము. అందువల్ల, మీరు పంపే ప్రతి జోక్‌తో పాటు దాని రచయిత పేరు కూడా దయచేసి తెలియజేయండి. రచయిత పేరుతో హాస్యాన్ని పంచుకోవడం ద్వారా, వారి సృజనాత్మకతకు మనం తగిన గుర్తింపును అందించినట్లవుతుంది.
4. ఈ హాస్యాన్ని పండించడంలో ఎంతో మంది మహానుభావులు తమ మేధస్సును వినియోగించి, సృజనాత్మకంగా హాస్యాన్ని అందించారు. అందుకు వారు నిజంగా మహానుభావులే. హాస్యాన్ని పండించిన కొంతమంది రచయితల పేర్లను క్రింద పేర్కొంటున్నాము. అతి త్వరలో మిగతా ప్రతి ఒక్కరి పేరును కూడా ఇక్కడ తెలియజేస్తాము.
5. క్రింద చూపబడిన కొన్ని జోకులకు రచయితల పేర్లు అందుబాటులో లేవు. ఒకవేళ ఆ జోకుల రచయితలు మీకు తెలిసి ఉంటే, దయచేసి వారికి సమాచారం అందించి, వారి అసలైన (ఒరిజినల్) జోకులను మాకు పంపించాలని కోరుతున్నాము. అలా పంపినట్లయితే, వాటిని రచయిత పేరుతో పాటు మళ్లీ ప్రచురిస్తాము. సృజనాత్మకంగా హాస్యాన్ని సృష్టించిన ప్రతి రచయితకు తగిన గౌరవం ఇవ్వడం మనందరి బాధ్యత.
6. ఇందులో ప్రచురించిన "కొన్ని" జోక్ లకు నవ్వు పెద్దగా రాకపోవచ్చు, మనం అనుకున్నట్టుగా హాస్యం పండించలేకపోయిఉండవచ్చు. అయితే ఆ రచయిత చిత్రాలను ఎంత అద్భుతంగా గీశారంటే, వాటిని చూస్తేనే కడుపు నిండిపోతుంది. అందుకే కొన్ని జోక్ లకు నవ్వు రాకపోయినా కూడా ఇక్కడ ప్రచురించడం జరిగింది. పెద్ద మనసుతో మీరు అర్థం చేసుకున్నందుకు ధన్యవాదములు.

హాస్యాన్ని పండించిన రచయితలు

1. మల్లిక్ : - మల్లిక్ గారు కొన్ని దశాబ్దాలుగా తమ హాస్యంతో ప్రజలను హాయిగా నవ్విస్తూ, అపారమైన ఆనందాన్ని పంచుతూ వస్తున్నారు. తన అసాధారణ సృజనాత్మకతతో కనీవినీ ఎరుగని అద్భుతమైన హాస్యాన్ని సృష్టించి, హాస్యప్రియుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు. వీరికి సంబంధించిన అనేక జోక్స్ పుస్తకాలు మార్కెట్లో లభ్యమవుతూ, ఇప్పటికీ విస్తృత ఆదరణ పొందుతున్నాయి. ప్రజలందరికీ నవ్వుల్ని పంచిన ఈ మహానుభావునికి మనస్ఫూర్తిగా వేల వేల కృతజ్ఞతలు.
2. వాడ్రేవు : - ఇంటర్నెట్ వేదికలపై తమ హాస్యాన్ని పంచుకుంటూ, ప్రతి ఒక్కరినీ నవ్వులతో అలరిస్తున్నారు. వీరు అందించే కొత్త జోక్స్ ఎప్పుడెప్పుడు వస్తాయోనని ఆతృతగా ఎదురుచూస్తున్నాము. హాస్యప్రియుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదిస్తున్నారు.
3. లేపాక్షి : - ఆన్‌లైన్ మాధ్యమాల ద్వారా తమ హాస్యాన్ని పంచుతూ, అందరికీ నవ్వుల్ని అందిస్తున్నారు. వీరి నుంచి వచ్చే కొత్త జోక్స్ కోసం మేము ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాము. తమ హాస్యంతో హాస్యప్రియులను ఆకట్టుకుంటున్నారు.
4. భగవాన్ : - డిజిటల్ మాధ్యమాల ద్వారా తమ హాస్యాన్ని అందిస్తూ, హాస్యప్రియుల మనసులను గెలుచుకుంటున్నారు. వీరు తీసుకువచ్చే తాజా జోక్స్ కోసం నిరంతరం ఎదురుచూపులు చూస్తున్నాము..
5. సరసి : - వీరు ఆన్‌లైన్ వేదికల ద్వారా తమ జోకులను ప్రచురిస్తూ, మనకు హాస్యాన్ని అందిస్తున్నారు. వీరి సృజనాత్మకత నుంచి పుట్టే కొత్త జోక్స్ కోసం ఆసక్తితో ఎదురుచూస్తున్నాము. తమ హాస్యంతో హాస్యప్రియుల హృదయాల్లో నిలిచిపోతున్నారు.
6. పైడి శ్రీనివాస్ : - డిజిటల్ వేదికలపై తమ హాస్యాన్ని పంచుతూ అందరి ముఖాల్లో చిరునవ్వులు నింపుతున్నారు. వీరి తాజా జోక్స్ కోసం ఆసక్తితో ఎదురు చూస్తున్నాం. తమ వినోదంతో హాస్యాన్ని ఇష్టపడే వారందరినీ అలరిస్తున్నారు.
7. రాగతి పండరి : - అద్భుతమైన హస్యానికి వీరు ఒక చిరునామా, అయితే ఈ మధ్యకాలంలో వీరి జోక్స్ కనిపించడం లేదు.
8. వినోద్ : - వీరు డిజిటల్ వేదికల ద్వారా తమ జోకులను పంచుకుంటూ, మనంధరినీ హాస్యంతో అలరిస్తున్నారు. వీరి కొత్త జోక్స్ మళ్లీ ఎప్పుడు వినిపిస్తాయో అన్న ఆతృతలో ఉన్నాము.
9. శర్మ : - ఆన్‌లైన్ మాధ్యమాల ద్వారా తమ హాస్యాన్ని పంచుతూ, అందరికీ నవ్వుల్ని అందిస్తున్నారు.
10. గుత్తుల శ్రీనివాసరావు : - ఆన్‌లైన్ వేదికల సహాయంతో తమ హాస్యాన్ని అందరికీ అందిస్తున్నారు.
11. వినయ్ రామ్ : - డిజిటల్ మాధ్యమాల ద్వారా తమ హాస్య సృష్టిని మనతో పంచుకుంటున్నారు.
12. రామ కృష్ణ : - అద్భుతమైన హాస్యాన్ని పండిస్తారు వీరు. హాస్యప్రియులందరూ, రామకృష్ణ గారి జోకులు ఎప్పుడెప్పుడు వస్తాయో అని ఎదురు చూస్తూ ఉంటారు
13. అత్యంత ముఖ్యమైన విషయం : - కొన్ని జోకులకు రచయితల పేర్లు లేవు. మేము ఇంటర్నెట్ ద్వారా, WhatsApp ద్వారా ఈ జోకులను తీసుకోవడం జరిగినది. ఒకవేళ మీకు ఆ రచయితల పేర్లు తెలిసి ఉంటే దయచేసి వారికి విషయం తెలియజేసి, ఒరిజినల్స్ పంపిస్తే మేము వారి పేరు మీదుగా ఆ జోకులను తిరిగి ప్రచురింపగలము. రచయితలకు తగిన గౌరవం ఇవ్వడం అనేది మనందరి భాద్యత.

ఇక్కడ అందిస్తున్న జోక్స్ అన్నీ సరదాగా హాయిగా నవ్వించడానికి మాత్రమే, ఇందులో విద్వేషానికి, అశ్లీలతకు ఎలాంటి స్థానం లేదు.

​water joke

తోలు వలిచేసేవాడు

ఉదయమే పరీక్ష ఫలితాలు వచ్చాయి.

ఫలితాలు చూసుకున్న చింటూ కు తను ఫెయిల్ అయ్యాడని తెలిసింది. ఈ విషయం తన తండ్రికి తెలిస్తే చావబాదేస్తాడని తెలుసు, వెంటనే ఒక ఉపాయం ఆలోచించి తన నాన్నగారి దగ్గరకు వెళ్లాడు.

చింటూ: నాన్నా, మీ నాన్న మిమ్మల్ని కొట్టేవారా?

తండ్రి: అయ్యో! చితకబాదేవాడు.

చింటూ: మరి మీ తాతయ్య, మీ నాన్నను కొట్టేవారా?

తండ్రి: తోలు వలిచేసేవాడు.

చింటూ: ఇంతకాలంగా కొనసాగుతున్న ఈ రౌడీయిజాన్ని, ఈ దుర్మార్గాన్ని మనం ఆపేద్దాం నాన్నా!, భవిష్యత్తులో మీరు ఉత్తమ నాన్న అవార్డు పొందాలి.

తండ్రి: (యధాలాపంగా) సరే, నీ మాట ఎందుకు కాదనాలి? అలాగే చేద్దాం. ఇకనుంచి నేను నిన్ను కొట్టను.

చింటూ: అయితే ఇదిగో నాన్నా... నా పరీక్ష ఫలితాలు!

తప్పు, తప్పు లెంపలేసుకోండి!

ఒక స్త్రీ.....
మీ మాట 5 నిమిషాల్లో వింటే ఆవిడ మీ అమ్మగారు అయ్యుంటారు.
ఒక స్త్రీ....
మీ మాట 15 నిమిషాల్లో వింటే ఆవిడ మీ సోదరి అయ్యుంటారు
ఒక స్త్రీ....
మీ మాట 30 నిమిషాల్లో వింటే ఆవిడ మీ కూతురు అయ్యుంటారు
అదే ఒక స్త్రీ ,
మీరు అరిచి గోలపెట్టి గగ్గోలు పెట్టినా వినడం లేదంటే ...
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
...
..
.
.
...
...
..
.
.
...
..
.
.
.
.
ఆమె....
చెవిటిది అయ్యుంటుందండి!
ప్రతి దానికి భార్యలను ఆడిపోసుకోకూడదు
తప్పు, తప్పు లెంపలేసుకోండి!
​ హాయిగా నవ్వించే తెలుగు జోక్స్
​ వినోదాత్మక తెలుగు జోక్స్ సేకరణ​
మీ నోళ్ళల్లో మన్ను పొయ్యా ! ప్రీ వెడ్డింగ్ షూట్లా! నిజంగా చచ్చారనుకొని పూడ్చేసుండే వాణ్ణి!!
​ సరదా మరియు ఫన్నీ తెలుగు జోక్స్​

తెలుగు జోక్స్ నవ్వుల ప్రపంచం - వాట్సాప్ ఛానల్

వినోదం కోసం తెలుగు జోక్స్ నవ్వులకు హద్దులు లేవు… హాయిగా నవ్వుకుందాం! ఇప్పుడే మన WhatsApp ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి రోజూ తాజా తెలుగు జోక్స్‌తో ఒత్తిడిని మరిచి, కాసేపు హాయిగా నవ్వుకుందాం. నవ్వులతో మీ దినమంతా మరింత సరదాగా, ఉల్లాసంగా, ఆనందంగా గడుస్తుంది! Follow the "Telugu Laugh Club" - "హాయిగా నవ్వే తెలుగు జోక్స్" WhatsApp channel : “తెలుగు జోక్స్ వాట్సాప్ ఛానల్"
​ సరదా తెలుగు జోక్స్
​ నవ్వులు పంచే తెలుగు జోక్స్
​ హాస్యంతో నిండిన తెలుగు జోక్స్
​ పులిహోర జోక్
​ వర్క్ ఫ్రమ్ హోమ్ జోక్
​ whatsapp-joke
​ ప్రతి ఒక్కరిని నవ్వించే తెలుగు జోక్స్
​ సరదా క్షణాలు అందించే తెలుగు జోక్స్
​ సింపుల్ మరియు శుభ్రమైన తెలుగు జోక్స్
​ రోజువారీ వినోదం కోసం తెలుగు జోక్స్
​ హాయిగా నవ్వేలా చేసే తెలుగు జోక్స్
​ కుటుంబంతో కలిసి బాగా చదవదగిన జోక్స్
​ వినోదాత్మక హాస్య తెలుగు జోక్స్

బస్తాడు బియ్యం - బస్తాడు మినప్పప్పు

కొత్తగా పెళ్లైన అమ్మాయి వాళ్ల నాన్నకు ఫోన్ చేసింది.

"డాడీ.... ఒక బస్తాడు బియ్యం, బస్తాడు మినప్పప్పు పంపిస్తావా..?"

"ఎందుకు తల్లీ.. మీరిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు కదా. నెలకు లక్షకు పైగానే వస్తాయి. బియ్యం, పప్పులు ఎందుకు? జీతం రావట్లేదా.. అక్కడ బియ్యం, పప్పులు దొరకట్లేదా?"

"అదేం లేదు డాడీ.....! మాకు ఈ మధ్య ఇడ్లీలు ఇంట్లోనే చేసుకుని తినాలనిపిస్తోంది."

"ఓహో... ఐతే రేషన్ బియ్యం పంపమంటావా...?"

"అది కాదు డాడీ.... ఇద్దరం ఇందాక యూట్యూబ్‌లో దోశలు, ఇడ్లీలు ఎలా చెయ్యాలో చూశాం. దాంట్లో నాన్న బెట్టిన బియ్యం, నాన్న బెట్టిన మినప్పప్పు మిక్సీలో వేసి రుబ్బాలని ఉంది డాడీ......"

"నువ్వూ, అల్లుడు గారు ఇద్దరూ ఇంగ్లీష్ మీడియమే కదమ్మా చదివింది?"

"అవును కదా డాడీ.... దానికీ దీనికీ ఏం సంబంధం?"

"నువ్వు అర్జెంటుగా ఫోన్ పెట్టకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు మీ దుంపలు తెగ...... నాన్న పెట్టిన బియ్యమూ, నాన్న పెట్టిన మినప్పప్పూ నా?... నీ మొహం మండా... ఇంతకు ఎవరి నాన్న పెట్టాలో యూట్యూబ్‌లో లేదా తల్లీ...? నానపెట్టిన బియ్యమూ, నానపెట్టిన మినప్పప్పూ అంటే ముందురోజు నీటిలో నానపెట్టిన అని అర్థం తల్లీ...!!!"

"ఇక ఉంటానమ్మా తల్లీ, నీ మాటలకు తలతిరిగిపోతోంది... కాస్త కాఫీ పడాల్సిందే....!!!!"

​ మనసుకు సంతోషాన్ని ఇచ్చే తెలుగు జోక్స్
​హాస్యప్రియుల కోసం ప్రత్యేక తెలుగు జోక్స్
​కుటుంబంలో అందరూ కలిసి చదవదగిన జోక్స్
​ ఫన్నీ తెలుగు జోక్స్ చిత్రాలు​
​మనసుకు సంతోషం ఇచ్చే తెలుగు హాస్యం
​ఆఫీస్ స్ట్రెస్ తగ్గించే తెలుగు జోక్స్
​స్నేహితులతో పంచుకునే సరదా తెలుగు జోక్స్
​హాయిగా నవ్వించే శుభ్రమైన తెలుగు జోక్స్
​పిల్లలు పెద్దలు అందరూ చదవగల తెలుగు జోక్స్

పుట్టింటికి వెళ్లిన భార్య, భర్త వాట్సాప్ కు ఇలా మెసేజ్ పంపింది

పనిమనిషికి (maid ) జీతం ఇచ్చేశాను. నేను తిరిగి వచ్చే వరకు పనిమనిషి రాదు. ఆమె బదులుగా వాళ్ల అమ్మ (76 ఏజ్ ) పనికి వస్తుంది.
10 దినాలు వైఫై ఆపేయమని ప్రొవైడర్‌కు చెప్పేశాను. కాబట్టి పెందలాడే పడుకోండి. మీ external HDD కేబుల్ కోసం వేతకావద్దు … అది నాతో పాటు హ్యాండ్‌బ్యాగ్‌లో ఉంది.
మీరు ఇప్పటికే చాలా హెల్దీగా ఉన్నారు. మాటిమాటికీ ఆ లేడీ డాక్టర్ దగ్గర చెకప్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు.
మీ కోతి మూకను ఇంటికి పిలవకండి. గతసారి సోఫాపై సిగరెట్ పొడి పోసి వెళ్లారు… క్లీన్ చేయడానికి రెండు రోజులు పట్టింది. పైగా పిజ్జా బిల్లులు కూడా చాలానే దొరికాయి.
మీ మరదలు పుట్టినరోజు గత నెలలోనే అయిపోయింది. మనిద్దరం కలిసి వెళ్లి వచ్చాం. అర్ధరాత్రి వెళ్లి “బిలేటెడ్ బర్త్‌డే విశెస్” చెప్పాల్సిన పని లేదు. మా మరిది కరాటే నేర్చుకుంటున్నాడట… అది మీ కోసమేనని నాకు బలమైన నమ్మకం.
పక్కింటి వాళ్లను పొద్దునే లేపి “పేపర్ వచ్చిందా? పాలు వచ్చాయా?” అని విసిగించకండి.
అల్మారాలో కుడి వైపు మీ చడ్డీలు ఉన్నాయి. ఎడమ వైపు ఉన్నవి పిల్లాడివి. గతసారి ఆఫీసు నుంచి వచ్చి ఏదో ఇబ్బందిగా ఉందని హడావిడి చేసిన విషయం గుర్తుందా?
మొబైల్ ఫోన్‌ను బాత్రూమ్‌లోని సోప్ బాక్స్‌లో పెట్టి, రెండు రోజులు ఇల్లంతా వెతికారు పోయినసారి. కళ్లజోడు ఫ్రిజ్‌లో దొరికింది కూడా మర్చిపోకండి.
మరి… అంత ఎక్కువగా స్మార్ట్‌గా తయారవ్వకండి…!!!! మన వీధిలో ఉండే మిసెస్ రాధిక, జ్యోతి, స్వాతి, ముగ్గురూ ఊర్లో లేరు.
షరా : - మామూలుగా నేను ఎప్పుడయినా తిరిగి వచ్చే అవకాశం ఉండనే ఉంది.
​నవ్వులతో మనసును తేలికపరిచే తెలుగు జోక్స్
​ఫన్నీ మరియు వినోదాత్మక తెలుగు జోక్స్ చిత్రాలు
​హాస్యంతో నిండిన క్లాసిక్ తెలుగు జోక్స్

ఈ కుక్క ఎవరిది?

మధ్యాహ్నం పడుకుందామని మెయిన్ గేటు వెయ్యబోతుండగా ఒక పెంపుడు కుక్క గబగబా లోపలి వచ్చింది. కుక్కలు ఏమైనా తరుముతున్నాయేమో అని అటూ ఇటూ చూశాను. ఏమీ లేవు. పోన్లే అని దానిని లోపలి రానిచ్చాను. అరుగు మీద పడుకుంది.
నేను తలుపు వేసుకుని లోపల పడుకున్నాను. సాయంత్రం అయ్యింది. నేను తలుపు తీశాను. కుక్క నా దగ్గరకి వచ్చి తోక ఊపుతూ నాకేసి చూస్తోంది. బయటకు వెళ్లి పోతుందేమో అని గేటు తీశాను. వెంటనే వెళ్లి పోయింది. ఇలా గత 6 రోజులుగా జరుగుతోంది. మధ్యాహ్నం రావడం, పడుకోవడం, సాయంత్రం వెళ్ళిపోవడం.
ఆ పెంపుడు కుక్క ఎవరిదీ?
నిన్న ఒక చీటీ రాసి దాని మెడకు తగిలించి పంపాను. అందులో ఇలా రాశాను. "ఏమండీ ! మీ కుక్క ప్రతి రోజూ మధ్యాహ్నం అయ్యేసరికి మా ఇంటి దగ్గరకి వచ్చి పడుకుంటోంది. నాకు ఇబ్బంది ఏమీ లేదు గానీ, మీరు వెతుక్కుంటారు అని రాస్తున్నాను."
ఇదిగో ఇవాళ దాని మెడలో ఒక కాగితం ఉంది.
"ధన్యవాదాలు! మా ఇంట్లో భోజనాలు కాగానే మా ఆవిడ సంగీతం అభ్యాసం చేస్తుంది, మా కుక్కను నిద్రపోనివ్వకుండా చేస్తున్నందు వలన మీ ఇంటికి వచ్చి పడుకుంటోంది. మా కుక్క ఈ మధ్యే కాస్త సుఖ పడుతోంది. మీరు అనుమతిస్తే నేను కూడా మీ ఇంటికి వచ్చి అరుగు మీద కాసేపు నిద్రపోదాం అనుకుంటున్నాను. దయతో అంగీకరించగలరు."
​సరదా మాటలతో నవ్వించే తెలుగు జోక్స్
​తెలుగు హాస్యాన్ని ప్రేమించే వారికోసం జోక్స్
​సోషల్ మీడియాలో పంచుకోదగిన తెలుగు జోక్స్
​దేవుడిచ్చిన సొమ్ము
​మీడియాలో పంచుకోదగిన తెలుగు జోక్స్
​మనసుకు ఆనందం ఇచ్చే తెలుగు జోక్స్

రావుగారు - 20 లక్షలు

రావుగారు రిటైర్ అయ్యారు. పెద్ద మొత్తంలో రిటైర్మెంట్ అమౌంట్ వచ్చింది. . అందులో రూ.20 లక్షలు, తన మరియు భార్య జాయింట్ అకౌంట్లో ఉంచి, ఆమెకు ఎటిఎం కార్డు పిన్ కూడా చెప్పారు.
ఒకసారి పనిమీద గంట సేపు బయటకు వెళ్లాక ఫోన్ మర్చిపోయానని గుర్తుకొచ్చింది. వెంటనే ఇంటికి వచ్చారు. . సోఫాలో పడి వున్న ఫోన్ చూసి కుదుటపడ్డారు. . సోఫాలో కూర్చొని "ఫోన్ వచ్చిందా?" అని అడిగారు.
"అవునండి. బ్యాంకు నుంచి ఫోన్ వచ్చింది జాయింట్ అకౌంట్ సమాచారాన్ని అప్డేట్ చేయమని "
రావుగారికి చెమటలు పట్టి సోఫాలో కూలబడ్డాడు. భయాందోళనతో "ఒ.టి.పి.. ఇచ్చావా ?" అని అడిగాడు.
భార్య: అవును. బ్యాంకు మేనేజర్ స్వయంగా నాకు ఫోన్ చేయగా నేను అతనికి ఇచ్చాను.
రావుగారు ఇంకా కుప్పకూలిపోయాడు. తల తిరుగుతున్నట్టు అనిపించింది. తన మొబైల్ ఫోన్లో బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేశాడు. ఇందులో రూ.20 లక్షలు అలాగే ఉన్నాయి.
"ఏ ఓటీపీ ఇచ్చావు" అని అడిగారు.
భార్య అమాయకంగా చెప్పింది "ఓటీపీ 484888 గా వచ్చింది. మనది జాయింట్ అకౌంట్ కదా. నా వంతు ఓటీపీ 242444 ఇచ్చాను.
రావుగారికి పోయిన ప్రాణం వచ్చినట్లు అనిపించింది.
అందుకనే కదా అర్ధాంగి అంటారు. !.

ఆధ్యాత్మిక చింతన - భార్య కేకలు

భార్య భర్తల జోక్స్
ఒక వ్యక్తి తెల్లవారు జామున ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోయి.. తనలో తాను ఇలా ప్రశ్నించుకోసాగాడు:
నేను ఎవరిని?
ఎక్కడి నుంచి వచ్చాను?
ఎందుకు వచ్చాను?
ఎక్కడికి వెళ్తాను?
ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుంటూ కళ్ళు మూసుకుని తీవ్రంగా ఆలోచిస్తుండగా.. కొద్ది సమయం తరువాత వంట గదిలో నుంచి అతడి భార్య కేకలు వినిపించాయి:
"మీరున్నారే.. నంబర్ వన్ బద్ధకస్తులు! నా ఖర్మ కొద్దీ మీరు నాకు దొరికారు. నా జీవితాన్ని ఇలా పాడు చేస్తారని తెలియక మావాళ్ళు మిమ్మల్ని నాకు ఇచ్చి కట్టబెట్టారు. మొద్దులా కూర్చుంది చాలు కానీ, వెళ్లి స్నానం చేసి తగలడండి!'
ఆ మాటలు వినగానే, అతడికి తన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు దొరికినట్లు అనిపించి, టక్కున కళ్ళు తెరిచాడు! 😂🤣
 
హాయిగా నవ్వే సరదా తెలుగు జోక్స్
ఒక యువకుడు తాలూకా ఆసుపత్రిలోకి వెళ్లి డాక్టర్ తో తనకు వాసెక్టోమీ ఆపరేషన్ చెయ్యమన్నాడు.
డాక్టర్ ఆతగాడి వివరాలు రాసుకుంటూ "పిల్లలెంతమంది" అనడిగాడు.
" పిల్లలేమిటి డాక్టర్. నాకసలు పెళ్లే కాలేదు"
" మరయితే ఆపరేషన్ ఎందుకు?" ఆశ్చర్యపోతూ అడిగాడు డాక్టర్.
" ఏం చెప్పమంటారండీ! మా ఊళ్లో పెళ్లయిన మగవాళ్లందరికీ ఆపరేషన్ అయిపోయింది. పెళ్లి కావలసిన వాడిని నేనొక్కడినే. ఏ పాపమూ ఎరుగను. కానీ ఎవరి పెళ్ళాం నెలతప్పినా వచ్చి నన్నే తంతున్నారు" భోరుమంటూ చెప్పాడతను.
​సరదా మాటలతో నవ్వించే తెలుగు జోక్స్
​ఆరోగ్యకరమైన హాస్య తెలుగు జోక్స్
​పిల్లలు పెద్దలు అందరూ చదవగల తెలుగు జోక్స్
​వినోదంతో నిండిన తెలుగు జోక్స్
​మంచి మూడ్ కోసం తెలుగు జోక్స్
​కొవ్వలి తెలుగు జోక్స్
​ప్రతి ఒక్కరిని నవ్వించే తెలుగు జోక్స్
​సరదా క్షణాలు పంచే తెలుగు జోక్స్
​నవ్వులతో మనసును తేలికపరిచే తెలుగు జోక్స్
​హాస్యప్రియుల కోసం ప్రత్యేక తెలుగు జోక్స్
​కుటుంబంతో కలిసి చదవదగిన తెలుగు జోక్స్
​రోజువారీ నవ్వుల కోసం తెలుగు జోక్స్
​వినోదాత్మక తెలుగు హాస్య జోక్స్
​తెలుగు హాస్యాన్ని ప్రేమించే వారికోసం జోక్స్
హాయిగా నవ్వే ఫన్నీ తెలుగు జోక్స్
హాస్యంతో మనసును, హృదయాన్ని తేలిక పరిచే తెలుగు జోక్స్
సరదాగా నవ్వించే తెలుగు జోక్స్
తెలుగు హాస్యంతో నిండిన సరదా జోక్స్
నవ్వులు తెప్పించే తెలుగు మాటల జోక్స్
సాధారణ జీవితంపై ఆధారిత తెలుగు హాస్యం
చదువగానే నవ్వొచ్చే తెలుగు జోక్స్
హ్యాపీ తెలుగు హాస్యం
హ్యాపీ తెలుగు జోక్స్
ఆనందాన్ని పంచె హాస్యం
మహదానందాన్ని అందించే తెలుగు వారి హాస్యం
కడుపుబ్బా నవ్వించే తెలుగు వారి హాస్యం
జోకుల పండుగ
ఆరోగ్యకరమైన తెలుగు జోక్స్
మిమ్మల్ని మురిపించే తెలుగు జోక్స్
మనందరినీ మురిపించే తెలుగు జోక్స్
తెలుగు జోక్స్,  మంచి మూడ్ కోసం
హాస్యప్రియుల కోసం ప్రత్యేక హాస్యం
బొంగు లో సైకాలజీ
మీ కోసం ప్రత్యేక హాస్యం
మిమ్మల్ని మురిపించే తెలుగు హాస్యం
మిమ్మల్ని నవ్వించే తెలుగు వినోదం
నవ్వులతో మనసును హాయిగా చేసే తెలుగు వినోదం
చిరునవ్వులు తెప్పించే తెలుగు సరదా
హాస్యంతో మనసు తేలికపరిచే తెలుగు కంటెంట్
రోజంతా అలసట మర్చిపోయే తెలుగు నవ్వులు
మనసుకు ఉల్లాసం ఇచ్చే తెలుగు హాస్యం
చదువుతూనే నవ్వేలా చేసే తెలుగు వినోదం
హాయిగా నవ్వించే తెలుగు సరదా క్షణాలు
సంతోషాన్ని పంచే తెలుగు హాస్య వినోదం
నవ్వుల మోత మోగించే తెలుగు కంటెంట్
చిరునవ్వులతో మూడ్ మార్చే తెలుగు సరదా
హాస్యంతో హృదయాన్ని తాకే తెలుగు వినోదం
రోజువారీ ఒత్తిడికి విరామమిచ్చే తెలుగు నవ్వులు
నవ్వులతో నిండిన తెలుగు సరదా ప్రపంచం
మనసుకు ఆనందం చేకూర్చే తెలుగు హాస్యం
హాస్యప్రియులకు నచ్చే తెలుగు వినోదం
చదివితే నవ్వకుండా ఉండలేని తెలుగు సరదా
చదివితే నవ్వకుండా ఉండలేని తెలుగు సరదా

చైనా ఫ్రెండ్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది :

స్టాక్ మార్కెట్ మనుషులనే కాదు, పెంపుడు జంతువులపై కూడా ఎలా ప్రభావితం అవుతుందో చూడండి:
గత నెల స్టాక్ మార్కెట్ బాగున్నప్పుడు:
నేను ఏం తిన్నానో, నా కుక్క కూడా అదే తినింది (రాజభోగం).
పోయిన వారం స్టాక్ మార్కెట్ పడిపోయినప్పుడు:
నా కుక్క ఏం తినిందో, నేను కూడా అదే తిన్నాను (గతి లేక).
నిన్నటి దినం మార్కెట్ కుప్పకూలింది:
నా కుక్కను నేను తినేశాను!

8 Directions Vastu Links

East
North
South
Northeast
Southeast
Southwest
Northwest
bedroom
నవ్వుల అలలతో ముంచే తెలుగు కంటెంట్
సరదా మాటలతో నవ్వించే తెలుగు వినోదం
సరదా మాటలతో నవ్వించే తెలుగు వినోదం
సరదా మాటలతో నవ్వించే తెలుగు వినోదం
హాస్యంతో రోజును హాయిగా చేసే తెలుగు క్షణాలు
నవ్వుల ద్వారా సంతోషం పంచే తెలుగు సరదా
హాయిగా నవ్వేలా చేసే తెలుగు హాస్య ప్రపంచం
మనసుకు తృప్తినిచ్చే తెలుగు నవ్వులు
నవ్వులతో జీవితాన్ని తేలిక చేసే తెలుగు వినోదం
హాస్యంతో మనసును ఆకట్టుకునే తెలుగు కంటెంట్
సరదా నవ్వులతో ఉత్సాహం నింపే తెలుగు వినోదం
నవ్వులతో రోజు వెలిగించే తెలుగు సరదా
హాస్యంతో హృదయాన్ని హాయిగా చేసే వినోదం
చిరునవ్వులు పూయించే తెలుగు నవ్వుల కంటెంట్
మనసుకు ఊపిరి పోసే తెలుగు హాస్య క్షణాలు
నవ్వులతో రోజును మధురంగా చేసే తెలుగు సరదా
హాయిగా నవ్వేలా చేసే తెలుగు హాస్య ప్రపంచం
చిరునవ్వుల వర్షం కురిపించే తెలుగు వినోదం
నవ్వుల తోరణం కట్టే తెలుగు సరదా మాటలు
ఉల్లాసం పంచే తెలుగు హాస్య సన్నివేశాలు
నవ్వులతో మూడ్ మార్చే తెలుగు వినోదం
సరదా మాటలతో చిరునవ్వులు తెప్పించే కంటెంట్

 

హాస్యంతో హృదయాన్ని తాకే తెలుగు క్షణాలు
నవ్వుల బాటలో నడిపించే తెలుగు సరదా
మనసును హాయిగా చేసే తెలుగు హాస్య వేదిక
ఉత్సాహం నింపే తెలుగు నవ్వుల ప్రపంచం

ఈలతో ఆమె చూపును . . . . .

😃మూడు ఈలలు వేస్తే…🙂
ఒక ఈలతో స్త్రీ ఏకాగ్రతను చెడగొట్టడం..
రెండో ఈలతో ఆమె చూపును తనవైపు తిప్పుకోవడం…
మూడో ఈలతో , ఎక్కడ ఉన్నా పరుగున తన దగ్గరకు వచ్చేలా చేయటం….
ప్రెషర్ కుక్కర్ కే చెల్లింది!!!!!! 😃😃😃😃😃
 
చిరునవ్వులతో జీవితం తేలిక చేసే వినోదం
నవ్వుల అలలతో ముంచే తెలుగు సరదా
నవ్వుల అలలతో ముంచే తెలుగు సరదా
హాస్యంతో రోజుకు రంగులు అద్దే తెలుగు కంటెంట్
నవ్వులతో మనసును రిఫ్రెష్ చేసే వినోదం
బైక్ - జోక్
సరదా క్షణాలతో ఆనందం పంచే తెలుగు హాస్యం
చిరునవ్వుల మేళవింపుతో నిండిన తెలుగు వినోదం
 
నవ్వుల జల్లులతో రోజు హాయిగా చేసే వినోదం

 

పేషెంట్ గోల . . . .

డాక్టర్ గారూ.. డాక్టర్ గారూ... చాలా అర్జంట్.. ఒకామె నన్ను బైక్ తో గుద్దింది.. దెబ్బలు బాగా తగిలాయి.. “నన్నెలాగైనా బ్రతికించండి..”
పేషెంట్ గోల తట్టుకోలేక హడావిడిగా పరిశీలించిన డాక్టర్... అవి చిన్న దెబ్బలే, ప్రమాదం లేదని గ్రహించాడు. వెంటనే బుర్రకు పదును పెట్టాడు.
ఆపై అన్నాడు . . “ఏమయ్యా.. నిజంగానే సీరియస్ దెబ్బలే. వెంటనే ఆపరేషన్ చేయాలి... చాలా డబ్బు ఖర్చవుతుంది మరి.”
“బాబోయ్.. నన్నెలాగైనా బ్రతికించండి.. డబ్బు ఎంతైనా పర్లేదు.”
“దొంగ రాక్షసి.. గుద్దించి నేను పడిపోతే చచ్చాననుకుని అలాగే వదిలి వెళ్ళిపోయింది...” అంటూ పేషెంట్ లబో దిబో అన్నాడు.
ఈలోగా డాక్టర్ ఫోన్ రింగ్ అయింది.
అటునుంచి డాక్టర్ భార్య మాట్లాడింది . .
“ఏవండీ.. ఇందాక నేను మార్కెట్ నుండి వస్తుంటే ఒక తలమాసిన వెధవ నా స్కూటర్ కి అడ్డంపడ్డాడు. మీద నుండి తీసుకుపోయా.. చచ్చాడేమో.. ఇప్పుడేం చేయాలి?”
డాక్టర్ బుర్ర వేడెక్కింది... అయినా పాదరసంలా పని చేసింది.
“ఓహ్.. నువ్వేనా ఆ ఆక్సిడెంట్ చేసింది.. ఇంతకీ వాడు ఏ బట్టలు వేసుకున్నాడో చెప్పు?”
“గ్రీన్ కలర్ టీ షర్ట్...”
“వాడి శవం పోలీసులు నా దగ్గరకు తెచ్చారు. ఊరంతా గాలిస్తున్నారు నిందితుడి కోసం...”
బయపడిపోయిన భార్య . . “వామ్మో.. నేనేం చేయాలి ఇప్పుడు?”
“ఒక పని చేయి.. సైలెంట్ గా పుట్టింటికెళ్లి ఒక 2,3 నెలల తర్వాత రా.. అంతా సద్దుమణిగే వరకు.”
“ఇప్పుడే బయల్దేరుతున్నా...” లైన్ కట్.
డాక్టర్ పేషెంట్ కు ఉత్తుత్తి ఆపరేషన్ చేసేశాడు. 3 లక్షలు బిల్.
భార్య పుట్టింటికి జంప్.
పేషెంట్ ఇంటికి జంప్.
డాక్టర్ తన గర్ల్ ఫ్రెండ్ తో సింగపూర్ జంప్.
నవ్వులతో హృదయాన్ని ఉల్లాసంగా చేసే సరదా
హాస్యపు చిలిపితనంతో అలరించే తెలుగు కంటెంట్

యాదగిరి - అమెరికా ట్రిప్

 అమెరికాకు వెళ్లిన ఒక హైదరాబాదీ కథ
అమెరికాలో ఉంటాడు మన హైదరాబాదీ ఒకాయన.. తన పేరు యాదగిరి ... పన్ను నొప్పి భరించలేక ఓ డెంటిస్టు దగ్గరకు వెళ్లాడు...
ఎందుకైనా మంచిదని ముందే అడిగాడు, ఎంత తీసుకుంటారు అని...!
1200 డాలర్లు తీసుకుంటాను అన్నాడు డాక్టర్...
అబ్బే, మరీ ఎక్కువ అన్నాడు యాదగిరి...
అనస్తీషియా ఇచ్చి, జాగ్రత్తగా పన్ను పీకేయాలి, సో, రేటు ఎక్కువే అని చెప్పాడు డాక్టరు...
ఇంకేమైనా చౌకగా పని పూర్తయ్యే మార్గం లేదా డాక్టర్ అనడిగాడు యాదగిరి... సుల్తాన్‌బజార్ బేరం తరహాలో...
డాక్టర్‌కు ఈ బేరం చిర్రెత్తి, అనస్తీషియా ఇవ్వకుండా పీకేస్తా, నొప్పి భరించగలిగితే వెంటనే వచ్చి ఈ కుర్చీలో కూర్చో, 300 డాలర్లు ఇవ్వు చాలు అన్నాడు కోపంగా...
వోకే, దానిదేముంది, హైదరాబాద్ రోడ్ల మీద టూవీలర్ నడిపిన వాడిని, ఈ నొప్పులు గిప్పులు జాన్తానై అంటూ యాదగిరి వెంటనే కుర్చీలో కూర్చున్నాడు,..
డాక్టర్ పన్ను పీకేశాడు, అంతసేపూ యాదగిరి అలాగే నిర్వికారంగా కూర్చున్నాడు తప్ప కిమ్మనలేదు... నొప్పి కలుగుతున్న ఫీలింగ్ కూడా లేదు మొహంలో... పైగా ఒకటీరెండుసార్లు చిరునవ్వినట్టు కూడా అనిపించింది...
డాక్టర్ మహాశ్చర్యపోయాడు...
మిస్టర్ యాదగిరీ, నొప్పిని నియంత్రించుకోవడంలో, భరించడంలో మీ నేర్పు, ఓర్పు సూపర్బ్... ఎంతో సాధన మీద గానీ సాధ్యపడదు... మీరు 300 డాలర్లు ఇవ్వనక్కర్లేదు, మిమ్మల్ని అభినందిస్తూ నేనే మీకు 100 డాలర్లు ఇస్తున్నాను అన్నాడు ఆ డెంటిస్ట్... ఇచ్చాడు.
యాదగిరి డాక్టర్ వంక అదోలా చూస్తూ వెళ్లిపోయాడు...
సాయంత్రం డాక్టర్ గారు ఎప్పటిలాగే ఓ క్లబ్బులో తోటి డెంటిస్టులతో మాట్లాడుతూ... ‘‘అలాంటి అసాధారణ వ్యక్తుల్ని నేనెప్పుడూ చూడలేదు’’ అంటూ యాదగిరి నొప్పిరహిత పన్నుపీకుడు ఎపిసోడ్ మొత్తం చెప్పాడు...
వెంటనే మరో డెంటిస్టు అదిరిపడి ఇలా చెప్పాడు...
వార్నీ, వాడు అసాధ్యుడురా బాబూ... ముందు నా దగ్గరకు వచ్చాడు... అడిగిన రేటు ఇచ్చేస్తానన్నాడు... అనస్తీషియాకు 100 డాలర్లు కట్టాడు, బయట అరగంట కూర్చోమన్నాను... ఆ తరువాత పిలిస్తే రాలేదు, బయటకొచ్చి చూస్తే లేడు . . . . .
సరదా మాటలతో సంతోషం పంచే తెలుగు ప్రపంచం
చిరునవ్వులతో జీవితం మధురం చేసే హాస్యం
నవ్వుల స్పర్శతో మనసు తేలిక చేసే వినోదం
హాస్యపు తళుకులతో అలరించే తెలుగు సరదా
వానలు జోక్
వ్రతాలు పూజలు జోక్
నవ్వులతో రోజును వెలిగించే తెలుగు క్షణాలు
సరదా క్షణాలతో ఆనందం పంచే తెలుగు హాస్యం

గోదావరి తీరం

మూర్తి: నేను మొదట రాజమండ్రికి వచ్చినప్పుడు, గోదావరి తీరంలో బటానీలు అమ్మడం ప్రారంభించాను. ఆ సంపాదనతో ప్రధాన రోడ్డుపై చిన్న హోటల్ ప్రారంభించగలిగాను.
శ్యామ్: “అబ్బా నిజంగా? చాలా బాగుంది… తర్వాత ఏమైంది?”
మూర్తి: ఆ హోటల్ లాభాలతో నేను పెద్ద హోటల్ ప్రారంభించాను.
శ్యామ్: “అద్భుతం… జై శ్రీరామ్! తర్వాత?”
మూర్తి: “ఆ సమయంలో ఒక సినిమా నిర్మాతతో నాకు పరిచయం ఏర్పడింది…”
శ్యామ్: “వావ్… చాలా బాగుంది… తర్వాత?”
మూర్తి: “తర్వాత ఆ నిర్మాతతో కలిసి నేను సినిమాలు కూడా నిర్మించాను.”
శ్యామ్: “అయ్యో అద్భుతం! నిజంగా మీ అదృష్టం గొప్పది… తర్వాత?”
మూర్తి: ఇప్పుడు మళ్లీ గోదావరి తీరంలో బటానీలు అమ్ముకుంటున్నాను.
 

త్వరగా బెడ్ రెడీ చెయ్

డాక్టర్ అసిస్టెంట్ తో
ఈ బెడ్ మీద పడుకున్నవాడి ప్రోబ్లం యేమిటి?
అసిస్టెంట్: ఈయన ఉద్యోగంలో చేరిన కొత్తలో బంగారం తులం పాతిక రూపాయలుండేదిట. అప్పుడు ఒక కేజీ బంగారం కొనుక్కోలేకపోయొనే అని బాధపడుతూ చిక్కి సగమయ్యాడు.
డాక్టర్: ఓఁ, మరి యీ రెండో బెడ్ మీద పేషెంట్ సంగతేమిటి?
అసిస్టెంట్: ఈయన ఉద్యోగంలో చేరిన కొత్తలో గజం పది రూపాయలకి రెండువేల గజాల స్థలం ఆఫర్ వచ్చిందిట. అంత దూరంలో నాకెందుకని వదిలేసాడు. ఇప్పుడది గజం లక్ష రూపాయలు అయిందిట. కుళ్ళి కుళ్ళి యేడుస్తున్నాడు.
డాక్టర్: ఈ మూడో బెడ్ మీదివాడి సంగతేమిటి?
అసిస్టెంట్: ఈయన బియీడీ చేసి బ్యాంకు గుమాస్తా ఉద్యోగం గొప్పగా వుంటుందని జాయిన్ అయ్యాడట. వాడితో పాటు చదివి టీచరైన ఫ్రెండు లెక్చరర్ గా రిటైరయి లక్షలలో పెన్షన్ తీసుకుంటూవుంటే తన కొచ్చే పెన్షన్ చూసుకుని బావురుమంటున్నాడు.
డాక్టర్: ఇది మరీ బాగుంది. ఆ ప్రక్కనే ఒక బెడ్ నాకు రెడీ చెయ్యి.
అసిస్టెంట్: ఆశ్చర్యంతో మీకెందుకుసార్.
డాక్టర్: ఏమీ లేదయ్యా. నేను డాక్టరైన కొత్తలో ఒకాయన బియిడీ చేసిన వాళ్ళమ్మాయిని నాకిచ్చి పెళ్ళి చేయడానికి రెండెకరాల భూమి, అరకేజీ బంగారం కట్నం యిస్తానన్నాడు. నేను ఫోజు కొట్టి వద్దన్నాను..
అసిస్టెంట్: పోన్లెండి సార్.
డాక్టర్: పోన్లెండేమిటయ్యా. ఆయన ఇస్తానన్న ఆ రెండెకరాలు యీరోజు హైటెక్ సిటీ మధ్యలో వుంది. బంగారమా కొండెక్కింది. ఆ అమ్మాయి ప్రొఫెసర్ గా రిటైరయి ఆరంకెల పెన్షన్ డ్రా చేస్తోంది.
నేనో: వెర్రోడిలా యీ హాస్పిటల్ లో నైట్ షిఫ్ట్ డాక్టర్ గా పని చేస్తున్నాను. తలుచుకుంటే కడుపులో బాధ పైకెగతన్నుతోందయ్యా.
ఊఁ త్వరగా బెడ్ రెడీ చెయ్.
జీతంపై తెలుగు సరదా జోక్
చిరునవ్వుల మేళవింపుతో నిండిన తెలుగు వినోదం
 

యమధర్మరాజు - కాఫీ రుచి ప్రభావం

ఒక రోజు యమధర్మ రాజు ఒక యువకుడి దగ్గరకు వచ్చి ఇవ్వాళ నీకు ఆఖరి రోజు పద వెళ్తాం అనగానే యువకుడు అయ్యో అదేలా అవుతుంది నేను రెడీగా లేను అన్నాడు.
అందుకు యమధర్మ రాజు తప్పదు ఇవ్వాళ నా లిస్టులో మొదటి పేరు నీదే ఉంది.
నా ధర్మం నేను నిర్వర్తించాలి పద వెళ్తాం అన్నాడు. యువకుడు సరే యమధర్మ రాజా నా చివరి కోరికగా.. ఒక కప్పు కాఫీ కలిసి తాగుదాం తర్వాత మీతో నేను వచ్చేస్తాను అన్నాడు.
యమ ధర్మ రాజు అంగీకరించి యువకుడు తెచ్చిన కాఫీ తాగాడు.
అందులో యువకుడు నిద్ర మాత్రలు కలపడం వలన యముడు నిద్ర లోకి జారుకున్నాడు.
ఇంతలో యువకుడు లిస్టులో తన పేరు మొదటి నుంచి చివరకు మార్చాడు.
నిద్ర నుంచి మేలుకున్న యముడు నీ అద్భుతమైన ఆతిధ్యానికి నా ధన్యవాదాలు.
ఇవ్వాళ మొదట నిన్ను తీసుకువెళ్ళడం ఇష్టం లేదు. అందుకే లిస్టులో చివరనుంచి నా పని మొదలుపెడతా అని తాను వచ్చిన పని పూర్తి చేసి వెళ్ళిపోయాడు.
 

మహానుభావుడు

హాస్యపు చిలిపితో అలరించే తెలుగు క్షణాలు
బయాలజీ సార్ "సెల్ " అంటే ..కణం అంటాడు ..
ఫిజిక్స్ సార్ "సెల్ " అంటే బ్యాటరీ అంటాడు ...
ఎకనామిక్స్ సార్ "సెల్ " అంటే అమ్మకం అంటాడు .
హిస్టరీ సార్ "సెల్ " అంటే జైలు గది అంటాడు ..
ఇంగ్లీష్ సార్ "సెల్ " అంటే ఫోన్ అంటాడు ..
చదువు చెప్పే సార్లకే స్పష్టత లేదు అందుకే మా పిల్లగాణ్ణి స్కూల్ మాన్పించేస్థా మంటే, మా పిల్లగాడు స్కూల్ కే వెళతానని మారాం చేస్తుంనాడెందుకు. !!!!!!!. . .
 
చిరునవ్వుల జాదూతో ఆకట్టుకునే వినోదం

ద్విగవాక్ష శయనం - తెలుగు ఉపాధ్యాయుడు

ఉమాపతి ఒక తెలుగు ఉపాధ్యాయుడు. అతను ఆంగ్ల పదాలను మక్కికి మక్కి అనువాదం చేసి మాట్లాడుతుంటాడు.
ఉమాపతి సెల్ మోగుతోంది. అతను అది ఎక్కడవుందో కనపడక వెతుకుతూ, "నా చరవాణి ఎక్కడ? చరవాణీ ఎక్కడున్నా వే?" అని గట్టిగ అరుస్తూ వుంటే,
కిచన్ లో కిచిడీ చేస్తున్న భార్య కనకం కోపంగా "చరవాణా, అదెవత్తీ?" అంటూ చేతిలో గరిటతో సహా వచ్చింది.
"అదేనే కనకం! నా సెల్ ఫోను"
అలా అఘోరించ వచ్చుగా! మీ చొక్కా జేబులో వుంది, అనిచెప్పి వెళ్లిపోయింది.
వెంటనే తెచ్చుకొని ఆకుపచ్చ మీట నొక్కి ఎవరూ? అన్నాడు
నేను బావా! రమాపతిని. మా అబ్బాయి గణపతికి ఈ నెల పదో తేదీన ఉపనయనం చేస్తున్నాము. మీరూ, చెల్లి తప్పకుండా రావాలి. ఏ ట్రైన్ కి వస్తారో చెప్తే స్టేషన్ కి కారు పంపిస్తాను.
సరే వస్తాంలే బావా! అని సెల్ పెట్టేసి, కనకం! యిటురావోయ్ అని భార్యను పిలిచాడు.
మీ అన్న కొడుకు ఉపనయనం అట. తప్పక రమ్మన్నాడు. అంచేత 'దరిద్రరథం'లో రెండు శయనాలు పుస్తకం చెయ్యమని సంతోషకర ప్రయాణాల వాడికి నీ చరవాణిలో చేప్పేయ్ అన్నాడు.
కనకం నెత్తి కొట్టుకుంటూ "మీ భార్య నైన పాపానికి 'దరిద్ర రథం' అంటే 'గరీబ్ రథ్' అనీ 'శయనాలు' అంటే 'బెర్త్స్' అనీ అర్థమయింది. ఆ పుస్తకం చెయ్యడమేమి టో? ఆ సంతోష ప్రయాణాల వాడెవడో? మీరే వివరించండి".
"అదేనే! మన వెనక వీధిలో ఉన్న ఆనంద్ ట్రావెల్స్ వాడికి బుక్ చెయ్యమని చెప్పు.
ట్రైన్ ఎక్కి కూచున్న తర్వాత, "కనకం! అసలే నీది ద్విగవాక్ష శయనం, మెళ్ళో నగలూ గట్రా జాగ్రత్త" అన్నాడు ఉమాపతి.
"ఈ ద్విగవాక్ష శయనం ఏమిటండీ?" అంటే "సైడ్ లోయర్ బెర్త్" అని వివరించాడు.
కనకం నిట్టూర్చి "నా రవ్వల గాజులూ, చంద్రహారం పక్కింటి పంకజం దగ్గర జాగ్రత్త చెయ్యమని ఇచ్చివచ్చాను. మిగతావి నా బాగులో జాగ్రత్తగా వున్నాయిలెండి" అంది.
"అయ్యో! ఏ లెక్కాపత్రం లేకుండా వాళ్ళింట్లో ఎందుకు పెట్టావే? రేప్పొద్దున ఆవిడ నా దగ్గర పెట్టలేదంటే ఏమి చేస్తావే? అసలే ఆమె మొగుడు మన్మథరావు పానబోతూ, పరిభ్రమణ బోతూనూ" అన్నాడు.
"పానబోతూ, పరిభ్రమణబోతూ ఏమిటండీ?" అంటే
"తాగుబోతూ, తిరుగుబోతూ" అని వివరించాడు ఉమాపతి.
"మహానుభావా! ఇంగ్లీషు పదాలకే అనుకున్నా తెలుగు పదాలకు కూడా పర్యాయపదాలు కనిపెడుతున్నారా?" అని తల బాదుకుంది.
అది సరే కానీ! మనకు ఆ తెలుగుఖాతా కార్యాలయంలో తాళపేటిక ఒకటి విలపించింది కదా! అందులో పెట్టి రావలిసింది అన్నాడు.
కాసేపు ఆలోచించి "ఓహో! ఆంధ్రాబ్యాంక్ లో లాకర్ ఒకటి ఏడిచింది కదా!" అని అర్థం చేసుకొని "మీరే పెట్టి వచ్చి ఉండవచ్చు కదా!" అని దబాయించేసరికి నోరు మూసుకొని పడుకున్నాడు.
పొద్దున్నే హైదరాబాద్ చేరారు.
మీ అన్న చతుశ్చక్రవాహనం(కారు) పంపిస్తానన్నాడు. పంపలేదు చూశావా?" అని సరే "ఈ త్రిశ్చక్ర వాహనం లో వెడదాం" అంటూ(ఆటో) మాట్లాడాడు.
ఫంక్షన్ హాల్ దగ్గర దిగి లోపలికి వెళ్లి "దరిద్రరథంలో వస్తానని దూరవాణిలో చెప్పాను కదా! చతుశ్చక్ర వాహనం పంపలేదేమిటీ?" అని బావమరిదిని నిలదీశాడు. రమాపతి తెల్లబోయి చూస్తూవుంటే కనకం వివరించింది.
"సారీ బావా! మా అబ్బాయి కారు తీసుకొని వెళ్ళాడు. సమయానికి కారు యింట్లో లేదు" అన్నాడు రమాపతి.
ఈ లోపల తమకిచ్చిన గదిలో సామాను సర్దేసి, కనకం త్వరగా స్నానం చేసి కనకాంబరం పట్టుచీర కట్టుకొని ముస్తాబై, నేను పెళ్లిమండపంలోకి వెళ్తున్నాను" అంటూ, త్వరగా తయారై వెళ్ళిపోయింది.
ఉమాపతి తయారై "అరే నా ఉపలోచా నాలు(కళ్ళజోడు) ఎక్కడ?" అని కళ్ళ జోడు కోసం వెతికాడు. కనపడలేదు.
అలాగే తడుముకుంటూ మండపంలోకి వెళ్ళాడు. అంతా మసకమసకగా వుంది. ఎవరూ సరిగ్గా కనపడడం లేదు.
భార్య కోసం వెతుకుతున్నాడు.
'కనకం ఎక్కడుందీ?' అనుకుంటూంటే, అక్కడే కనకాంబరం చీర కనపడింది. అదిగో కనకం ఇక్కడేవుంది అనుకుంటూ వెళ్లి కొంగుపట్టుకొని లాగాడు.
ఆవిడ ఉమాపతి గూబ గుయ్యిమని పించింది. "ఏమిటీ తిక్కతిక్కగా వుందా?" అని అంటే
ఏమైందంటే నా ఉపనయనాలు కనపడలేదు" అని ఉమాపతి ఏదో చెప్పబోతూంటే
ఆవిడ భర్త వచ్చి కాలర్ పట్టుకొని "ఉపనయనానికి వచ్చి ఉపనయనాలు కనబడలేదంటా వేమిటి?" అంటూ కొట్టబోతుంటే,
కనకం చూసి పరిగెత్తుకొచ్చి ఆపి "అన్నయ్యగారూ!ఆయన మా ఆయనండీ క్షమించండి. ఏదో పొరబాటు అయింది" అంటూ "ఏమిటండీ! ఇదీ" అంటే,
కనకం, నీవు కనకాంబరం చీర కదా! కట్టుకుంది. చీర ఎప్పుడు మార్చావు? నా ఉపనయనాలు కనపడక నేను చస్తుంటే?" అన్నాడు.
"అబ్బా! ఫంక్షన్ లో గంటకొక చీర మారుస్తాము. ఇంతకీ ఉపనయనా లేమిటి?" అంది.
నా కళ్ళజోడు కనపడలేదు అన్నాడు ఉమాపతి.
కనకం నెత్తి బాదుకొని "నిన్నరాత్రి రైల్లో నాబాగులో పెట్టారు కదా!" అని తీసి కళ్ళకు తగిలించి, అందరికీ సారీలు చెప్పి వెళ్ళింది.
ఊరికి బయల్దేరి వెళ్ళేటప్పుడు, రమాపతి బావగారిని ఆటపట్టిస్తూ "బావా! ఈ సారి వచ్చేటప్పుడు ఉప ఉపనయనాలు దగ్గరుంచుకో! అంటే స్పేర్ కళ్ళజోడు అన్నమాట అన్నాడు.

ఈ లింక్ ద్వారా మీరు తెలుగు జోక్స్ ని పంపవచ్చు

Contact SubhaVaastuమీకు తెలిసిన జోక్స్ ఏవైనా ఉంటే మాతో పంచుకుంటే మన వారందరికీ హస్యాన్ని పంచుదాం. మనం ఒకటే నవ్వడం కన్నా మిగతా వారిని కూడా నవ్విస్తే చాలా బాగుంటుంది కదా. ఇది మా ఇమెయిల్ అడ్రస్ This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

తెలుగు జోక్స్ నవ్వుల ప్రపంచం - వాట్సాప్ ఛానల్

వినోదం కోసం తెలుగు జోక్స్ నవ్వులకు హద్దులు లేవు… హాయిగా నవ్వుకుందాం! ఇప్పుడే మన WhatsApp ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి రోజూ తాజా తెలుగు జోక్స్‌తో ఒత్తిడిని మరిచి, కాసేపు హాయిగా నవ్వుకుందాం. నవ్వులతో మీ దినమంతా మరింత సరదాగా, ఉల్లాసంగా, ఆనందంగా గడుస్తుంది! Follow the "Telugu Laugh Club" - "హాయిగా నవ్వే తెలుగు జోక్స్" WhatsApp channel : “తెలుగు జోక్స్ వాట్సాప్ ఛానల్"

 

గృహస్థులపై వాస్తు శాస్త్రం ఎలా పనిచేస్తుంది – SubhaVaastu

వాస్తు శాస్త్రం పని చేసే విధానంవాస్తు శాస్త్రం మానవులపై ఎలా తన ప్రభావమును చూపిస్తుందో తెలుసుకుందాం. ఒకే గృహం లో కొందరికి అద్భుతంగా జరుగుతుంది, మరొకరికి ఏమాత్రం బాగా జరగదు. ఇలా ఎందుకవుతున్నది అనే విషయం తెలుసుకుందాం. ఏ శాస్త్రమైననూ పరిశోధన చేయకపోతే కొత్త విషయాలు ఆవిష్కరణకు నోచుకోవు. ఉదాహరణకు, ఒకప్పుడు మనం వాడే వాహనాలు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి!, ఒకప్పుడు మన వారికి ఏదైనా విషయం తెలపాలనుకుంటే ఉత్తరాలు వ్రాసేవారము. ఇప్పుడు, క్షణాలలో విదేశాలలో వున్నవారికి కూడా వెంటనే విషయాన్ని తెలియచేస్తున్నాము. ఇదంతా పరిశోధన ఫలితాలే కదా. ప్రతి విషయంలో కూడా పరిశోధన జరగాలి, అలాగే వాస్తు శాస్త్రాన్ని కూడా పరిశీలించాలి, అధ్యయనం చేయాలి, అప్పుడే మాత్రమే కొత్త కొత్త విషయాలు లోతైన రహస్యాలు తెలుస్తాయి. కొత్త కోణాలు, కొత్త విషయాలు వెలుగులోకి వస్తుంటాయి.
1. విద్యావంతులకు ఎదుటివారు ఏం చెబుతున్నారో బాగా అర్థమవుతుంది, విద్య లేనివారు ఎదుటివారు ఏమి చెబుతున్నారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మధ్యస్థం వాళ్లు ఎదుటివారు ఏమి చెప్పినా కూడా విమర్శ మాత్రమే చేస్తారు. విశ్లేషణ చేసే వ్యక్తి భవిష్యత్తులో బాగా ఎదుగుతాడు. విమర్శించే వ్యక్తి భవిష్యత్తులో దిగజారిపోతాడు. ఎటు ప్రక్క మొగ్గుతారో మీరే నిర్ణయించుకోండి.
2. వాస్తు శాస్త్రం కొందరికి మాత్రమే పనిచేస్తుందా అందరికీ పని చేయదా. ఏ విషయంలోనైనా పరిశోధనలు చేయకపోతే అభివృద్ధి ఉండదు. ప్రస్తుతం మనం అనుభవిస్తున్న ప్రతి వస్తువు వెనుక పరిశోధన ఉంది. ఉదాహరణకు మన చేతిలో ఉన్న మొబైల్ ఫోన్‌ను తీసుకోండి. పూర్వకాలంలో పావురాల ద్వారా సమాచారాన్ని పంపేవారు. పరిశోధన లేకపోతే నేటికీ అదే పరిస్థితి ఉండేది.
3. తరువాత కాలంలో వార్తాహారులు ప్రవేశించారు. ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి వార్తలు చేరవేయడం వీరి పని. ఈ పద్ధతి రాజులు, సామంతులు మరియు అత్యంత ధనికులకే పరిమితమైంది. ఇది శ్రమతో కూడిన, ఖరీదైన విధానం. అంతేకాకుండా ఇందులో ఖచ్చితత్వం తక్కువగా ఉండేది, అనగా సమాచారం తప్పకుండా చేరుతుందనే హామీ ఉండేది కాదు. మధ్య దారిలో ఏదైనా జరగవచ్చు.
4. అనేక దేశాలలో ఈ విధానాలు కొనసాగాయి. తరువాత ఉత్తరాల బట్వాడా ప్రారంభమై సమాచార వ్యవస్థలో విప్లవాత్మక మార్పు వచ్చింది. అనంతరం టెలిఫోన్ కనుగొనబడింది.
5. 1965–1995 మధ్యకాలంలో దూరప్రాంతాలకు ఫోన్ చేయాలంటే టెలిఫోన్ ఆఫీస్‌లో గంటల తరబడి వేచి ఉండాల్సివచ్చేది. ప్రస్తుతం క్షణాల్లో ప్రపంచంలోని ఎక్కడున్న వారితోనైనా మాట్లాడగలుగుతున్నాం. దయచేసి గమనించండి, ఇదంతా పరిశోధన ఫలితం
6. చేతి గడియారాలు కూడా పరిశోధనల వల్ల అభివృద్ధి చెంది నేటి ఆధునిక రూపాన్ని పొందాయి. లేకపోతే ప్రతిరోజూ గడియారానికి "కీ" ఇవ్వాల్సి వచ్చేది.
7. పూర్వకాలంలో ఎద్దుల బండ్లపై ప్రయాణాలు నరకయాతనలాగా ఉండేవి. పరిశోధనల ఫలితంగా నేడు ఏసీ కార్లలో సాఫీ రహదారులపై ప్రయాణిస్తున్నాం. పరిశోధన లేకపోతే ఈ మార్పు సాధ్యమా?
8. వంట కోసం బొగ్గులు ఊది అగ్ని రాజేసే రోజులు గడిచిపోయాయి. నేడు గ్యాస్ స్టవ్ ద్వారా క్షణాల్లో వంట పూర్తవుతోంది. ఇవన్నీ పరిశోధనల వల్లే.
9. ఒకప్పుడు నీటి కోసం చేదబావుల వద్దకు వెళ్లి బిందెలు మోసేవారు. ఇప్పుడు స్విచ్ వేయగానే నీరు వస్తోంది. పరిశోధనలు లేకపోతే ఇదంతా సాధ్యమయ్యేదా?
10. ప్రతి శాస్త్రం అభివృద్ధికి పరిశోధన అవసరం. వాస్తు శాస్త్రం కూడా అనేక పరిశోధనల ద్వారా సంపూర్ణత సాధించే దశలో ఉంది. కానీ దురదృష్టవశాత్తు ఈ శాస్త్రానికి తగిన ప్రోత్సాహం లభించడం లేదు.
11. ప్రోత్సాహం బదులు విమర్శలు ఎదురైతే ఏ శాస్త్రమైనా అభివృద్ధి చెందదు. పరిశోధకులు ముందడుగు వేయలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
12. విదేశాలలో పరిశోధకులకు గౌరవం, సహకారం లభిస్తుంది. అందుకే ఎక్కువ పరిశోధనలు అక్కడే జరుగుతుంటాయి. ఈ విషయం మీకు బాగా తెలుసు. మన దేశంలో మాత్రం అసూయ, ఈర్ష్య కారణంగా పరిశోధనలను, ప్రతిభను, అణచివేస్తున్నారు. మనం ఎదగకపోయినా పర్వాలేదు ఎదుటి వాళ్ళు ఎదగకూడదు అనేది మన దేశంలో అత్యంత స్పష్టంగా కనిపిస్తుంది. మన పక్క వారు ఏ పరిశోధనలు చేసిన అవహేళన చేయడం అవమానానికి గురి చేయడం నిరుత్సాహపరచడం గొడవలకు దిగడం ఇతరులకు పితురీలు చేసి తరువాత పరిశోధనలు జరగకుండా ఆపడం ఇటువంటివన్నీ ఒక నీచ మనస్తత్వం కలిగిన వారు ఎప్పుడు పోరాడుతూనే ఉంటారు.
13. దయచేసి అసూయను జయించండి. భారతదేశానికి అపారమైన వనరులు, మేధస్సు ఉన్నాయి. మానసికంగా అయినా పరిశోధకులకు సహాయం చేస్తే దేశం అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది. మన మహర్షులు మన సమాజంపై ప్రేమతో అందించిన ఈ వాస్తు శాస్త్రాన్ని మరింతగా అధ్యయనం చేసి, లోతైన పరిశీలనలు చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో ఎన్నో కొత్త విషయాలను కనుగొనే అవకాశాలు ఉన్నాయి. అందుకే ప్రతి ఒక్కరూ తమ మద్దతును తెలియజేస్తూ, తగిన రీతిలో సహకరిస్తే ఈ శాస్త్రాన్ని అన్ని కోణాలలో లోతుగా పరిశీలించి, అనేక కొత్త ఆవిష్కరణలను వెలికి తీయవచ్చు. అలా సమాజానికి, మన దేశానికి ఉపయోగపడే విధంగా అందరం చేతులు కలిపి ముందుకు సాగితే, ఈ దేశాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ దేశంగా నిలుపగలుగుతాము.
14. ఇక వాస్తు శాస్త్ర పరిశోధనల విషయానికి వస్తే ఒక ప్రధాన ప్రశ్న ఉత్పన్నమవుతుంది. వాస్తు శాస్త్రం కొందరికే పనిచేస్తుందా? లేక అందరికీ సమానంగా ఫలితాలు ఇస్తుందా? అనే సందేహం చాలా మందిలో కనిపిస్తుంది.
15. ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే ముందుగా సమాజాన్ని మూడు వర్గాలుగా విభజించుకోవాలి. అవి : 
1. అదృష్ట జాతకులు.
2. మధ్యమ జాతకులు.
3. అధమ జాతకులు.
1. అదృష్ట జాతకులు. ఈ అదృష్ట జాతకుల వర్గాన్ని మళ్లీ రెండు ఉపవర్గాలుగా విభజించవచ్చు.  మహా అదృష్ట జాతకులు (సహజ భాగ్య జాతకులు) మరియు అదృష్ట జాతకులు (సాధన భాగ్య జాతకులు)   వీరిలో కొందరు సహజంగానే అనుకూల పరిస్థితులతో జన్మిస్తారు (మహా అదృష్ట జాతకులు / సహజ భాగ్య జాతకులు), మరికొందరు తమ కృషి మరియు సరైన మార్గదర్శకత్వం వల్ల అదృష్టాన్ని సంపాదించుకుంటారు.

మహా అదృష్ట జాతకులు | సహజ భాగ్య జాతకులు

ఈ వర్గానికి చెందిన వ్యక్తులకు వాస్తు అనుకూలంగా ఉన్నా లేకపోయినా జీవితంలో ముందుకు సాగేందుకు అవకాశాలు స్వయంగా లభిస్తూ ఉంటాయి. ఎల్లలు దాటి, దేశాలు దాటి వీరి అభివృద్ధి కొనసాగుతుంది. వారు ఎటువంటి గృహంలో నివసించినా అభివృద్ధిని సాధిస్తూనే ఉంటారు. సాధారణంగా వీరికి అపజయాలు చాలా తక్కువగా ఉంటాయి. ఏమి ముట్టుకున్నా బంగారం అవుతుంది అన్నట్లు, వీరి ప్రయత్నాలు ఫలిస్తాయి.
వ్యాపార కారణాలవల్ల గానీ లేదా ఇతర అవసరాల మేరకు గానీ వీరు గృహం మారాల్సిన పరిస్థితి వచ్చినా, లేదా మరో గృహంలో రెండు మూడు సంవత్సరాలు నివసించాల్సి వచ్చినా, ఒకవేళ ఆ గృహం పూర్తిగా వాస్తుకు అనుకూలంగా లేకపోయినప్పటికీ ఇటువంటి వ్యక్తులు అక్కడ ఎక్కువ కాలం నివసించలేరు. ఆ గృహంలోకి ప్రవేశించిన కొద్ది రోజులలోనే, అనగా మూడు నాలుగు రోజుల్లోనే లేదా ఒక నెలలోపుగా , ఏదో ఒక కారణం చేత అక్కడి నుంచి బయటకు రావాల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చు. వీరి అదృష్టమే వీరిని ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటుంది.
అందువల్ల ఇటువంటి వ్యక్తుల విషయంలో వాస్తు ప్రభావం చాలా స్వల్పంగా మాత్రమే కనిపిస్తుంది.

పరిసర వాస్తు యొక్క అత్యంత ప్రభావాలు - SubhaVaastu.com

వాస్తు శాస్త్రం మన గృహం, స్థలం మరియు నిర్మాణం మాత్రమే కాకుండా, దాని చుట్టూ ఉన్న పరిసరాలను కూడా పరిగణలోకి తీసుకుంటుంది. ఇంటి బయట ఉన్న రహదారులు, పొరుగు ఇళ్ళ స్థితి, చెట్లు, నీటి వనరులు, గుట్టలు, లోయలు వంటి అంశాలు జీవనశైలిపై తీవ్రమైన ప్రభావం చూపుతాయి. దీనినే “పరిసర వాస్తు” అని అంటారు.

పరిసర వాస్తు అంటే ఏమిటి?

వాస్తు శాస్త్రం మన గృహం, స్థలం మరియు నిర్మాణం మాత్రమే కాకుండా, దాని చుట్టూ ఉన్న పరిసరాలను కూడా పరిగణలోకి తీసుకుంటుంది. ఇంటి బయట ఉన్న రహదారులు, పొరుగు ఇళ్ళ స్థితి, చెట్లు, నీటి వనరులు, గుట్టలు, లోయలు వంటి అంశాలు జీవనశైలిపై తీవ్రమైన ప్రభావం చూపుతాయి. దీనినే “పరిసర వాస్తు” అని అంటారు.

రహదారులు మరియు వీధుల ప్రభావం

ఇంటి ముందు రహదారి ఏ దిశనుంచి తాకుతుంది అనేది శక్తివంతమైన ప్రభావాన్ని కలిగిస్తుంది. ఉదాహరణకు, ఈశాన్యం వైపు వీధి తాకితే ధనసమృద్ధి, సుఖశాంతులు కలుగుతాయి. కానీ నైరుతి వైపు రహదారి తాకితే సమస్యలు, ఆర్థిక నష్టాలు సంభవించే అవకాశం ఉంది.

చెట్లు, మొక్కలు మరియు తోటలు

ఇంటి చుట్టూ ఉన్న చెట్లు, తోటలు పరిసర వాస్తులో ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఈశాన్యం వైపు భారీ చెట్లు ఉండకూడదు, ఎందుకంటే అది సూర్యకాంతి ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. దక్షిణం లేదా పడమర వైపు బలమైన చెట్లు ఉండటం మంచిది. అవి చెడు శక్తులను అడ్డుకుంటాయి మరియు ఇంటికి రక్షణ కలిగిస్తాయి.

నీటి వనరుల స్థానం

సమీపంలో ఉన్న చెరువు, బావి, నది లేదా సరస్సు వంటి నీటి వనరులు కూడా వాస్తు ప్రకారం ప్రాముఖ్యం కలిగి ఉంటాయి. ఈశాన్యం వైపు నీటి వనరులు ఉంటే అది కుటుంబానికి శ్రేయస్సును తెస్తుంది. కానీ నైరుతి వైపు నీటి వనరులు ఉంటే అది ఇబ్బందులను తెచ్చే అవకాశం ఉంది.

గుట్టలు, పర్వతాలు మరియు లోయలు

ఇల్లు చుట్టూ ఉన్న గుట్టలు, లోయలు కూడా శక్తుల సమతౌల్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఈశాన్యం వైపు లోయలు, ఖాళీ ప్రదేశాలు ఉండటం శుభప్రదం. అదే సమయంలో నైరుతి వైపు ఎత్తైన ప్రదేశాలు లేదా గుట్టలు ఉండటం ఇంటి స్థిరత్వాన్ని పెంచుతాయి.

పొరుగు ఇళ్ళు మరియు నిర్మాణాలు

పక్క ఇళ్ళ నిర్మాణం కూడా మన గృహ వాస్తుపై ప్రభావం చూపుతుంది. సమీప ఇల్లు నైరుతి వైపు ఎత్తుగా ఉండటం శ్రేయస్సును కలిగిస్తుంది. కానీ ఈశాన్యం వైపు ఇల్లు ఎత్తుగా ఉండటం నష్టదాయకం.

సమాజం మరియు శబ్ద కాలుష్యం

పరిసర వాస్తు కేవలం భౌతిక నిర్మాణాలకే పరిమితం కాదు. ఇంటి చుట్టూ శబ్ద కాలుష్యం, ఫ్యాక్టరీలు, మద్యం దుకాణాలు ఉంటే అవి శక్తి ప్రవాహాన్ని చెడగొడతాయి. అదే విధంగా దేవాలయాలు, పార్కులు, విద్యాసంస్థలు సమీపంలో ఉంటే అది కుటుంబానికి శాంతి, సానుకూల వాతావరణాన్ని కలిగిస్తుంది.

ముగింపు

పరిసర వాస్తు అనేది ప్రతి ఒక్కరూ నిర్లక్ష్యం చేయరాని అంశం. ఇంటిని నిర్మించే ముందు స్థల పరిసరాలను గమనించి వాస్తు నియమాల ప్రకారం ప్రణాళిక వేసుకుంటే శుభఫలితాలు, ఆరోగ్యం, ధనసమృద్ధి మరియు ఆనందం కలుగుతాయి. వాస్తు శాస్త్రం మన జీవనశైలికి కేవలం ఒక శాస్త్రీయ ఆధారం మాత్రమే కాదు, సమతౌల్యమైన జీవన విధానానికి మార్గదర్శకత్వం కూడా.
Featured

ఈశాన్య దిశ గృహ వాస్తు ఫలితాలు | ముఖ్యమైన జాగ్రత్తలు | SubhaVaastu

తెలుగులో ఈశాన్య దిశ పటందిశాత్మక దిక్సూచి (Directional Compass ) రీత్యా ఈశాన్యం దిక్కు 45° లకు ఉంటుంది. ఈ దిక్కు ఉత్తరం మరియూ తూర్పు దిశల మధ్యలో, కోణంలో ఉంటుంది. దీనినే ఈశాన్య మూల లేదా ఈశాన్య కోణం అని అంటారు. అన్ని దిక్కులలోనూ ఈ దిశ సున్నితత్వం కలిగినది మరియూ అత్యంత ప్రభావమంతమైనది. ఈశాన్య దిశ యొక్క ప్రభావములు గృహము యొక్క శాంతి పై ప్రభావం చూపును. ఈశాన్యం బాగా ఉంటే, గృహములో శాంతం ఉంటుంది. ఈశాన్య దిశలో దోషములు వున్నట్లైతే గృహములో అశాంతి ఉండవచ్చును.
If you are familiar with the English language, we have created a detailed guide on Northeast house Vastu. If you have a few minutes, you can explore the link: Comprehensive details of Northeast Facing House Vastu in English, dont miss to visit this link.
దయచేసి మీరు మీ లాప్టాప్ (Laptop) నందు మాత్రమే ఈ లింకులో ప్రచురితమైన విషయాలను చదవండి, మొబైల్ ఫోన్ (Mobile phone) లో చదవడం వల్ల అంత బాగా కనిపించదు, మరియు అచ్చు తప్పులు కనిపించే అవకాశం అధికంగా ఉంటుంది. అదే మీ లాప్టాప్ లో చదివినట్లయితే ఏ సమస్యలు లేకుండా చూడడానికి చాలా బాగా ఉంటుంది, మరియు ఏ అచ్చు తప్పులు కూడా కనిపించవు. చదవడానికి కుతూహలంగా, ఉత్సాహంగా ఉంటుంది.

ఈశాన్య మూల గృహాలను మనం ఎలా కనుక్కోవాలి?

ఈశాన్య మూల గృహముఈ చిత్రం నందు ఒక గృహమును చూపించడం జరిగినది. ఈ గృహమునకు తూర్పు వైపున రహదారి, మరియు ఉత్తరం వైపున రహదారి కలదు. ఇలాగ రెండు వైపులా రహదారులు ఉన్నప్పుడు దీనిని ఈశాన్య మూల గృహము అని చెప్పుకుంటాము. దీనిని ఆంగ్ల భాషలో NORTHEAST CORNER HOUSE అని చెప్పుకుంటాం. సాధారణంగా ఇటువంటి గృహాలు మంచి ఫలితాలను ఇస్తాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని లే అవుట్లు వేసేవారు అధిక ధరకు వీటిని అమ్ముకుంటుంటారు. కొన్ని దేశాలలో, ఉదాహరణకు, ఉత్తర అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా, లాంటి దేశాలలో ఇటువంటి "కొన్ని గృహాలు" మంచి ఫలితాలను ఇవ్వవు. వాటి గురించి తరువాత తెలుసుకుందాం. తొందరపడి ఈశాన్యం మూల గృహము అని అధికధర చెల్లించి కొనవద్దు. నిదానమే ప్రధానం. ఈ పేజీలో ఎన్నో అనుభవాలను పంచుకోవడం జరిగింది. మీరు ఒక్క ఐదు నిమిషాలు మీ సమయాన్ని కేటాయిస్తే ఈ గృహాలపై అవగాహన ఏర్పడుతుంది. తద్వారా తమరు తదుపరి నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.

ఈశాన్య దిశ గృహం తీసుకుంటే జీవితం బాగుంటుందా?

నైరుతి మూల, ఆగ్నేయ మూల వాయవ్య మూల చూస్తూ కట్టిన గృహాలతో పోలిస్తే ఈశాన్య మూల ను చూస్తూ నిర్మించిన గృహం మంచి ఫలితాలను ఇవ్వవచ్చును. ఈశాన్య దిశ గృహము (Northeast facing house) వేరు, ఈశాన్య మూల (Northeast corner house) గృహము వేరు. చాలా మంది, రెండూ ఒక్కటే అనుకొని పొరపాట్లు చేస్తుంటారు. ఈశాన్య దిశ (ఈశాన్య దిక్కుకు తిరిగిన) గృహము తీసుకునే సమయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న పొరపాటు కూడా ఒక్కోసారి విపరీతమైన ఇబ్బందులకు గురిచేస్తుంది. దిశలలో ఉన్న గృహాలకు (అనగా తూర్పు దిశ గృహం, పశ్చిమ దిశ గృహం, ఉత్తర దిశ గృహం, దక్షిణ దిశ గృహాలు) కోణంలో వచ్చిన గృహాలకు (అనగా ఈశాన్య మూల గృహం, ఆగ్నేయ మూల గృహం, నైరుతి మూల గృహం, వాయవ్య మూల గృహాలు) ఎంతో వ్యత్యాసమున్నది. కోణం వేరు, చూపు వేరు. రెండు దిక్కులు కలిస్తే కోణం అవుతుంది. కోణం లలో నిర్మితమైన గృహాలకు, మూలలు చూస్తూ నిర్మితమైన గృహాలకు చాలా వ్యత్యాసం ఉన్నది.

ఈశాన్య దిక్కుకు తిరిగిన గృహాలను మనం ఎలా కనుక్కోవాలి?

ఈశాన్య దిక్కు గృహముఉత్తర దిశ సున్నా డిగ్రీలు లేదా 360 డిగ్రీలకు ఉంటుంది (0° లేదా 360°). తూర్పు దిశ 90 డిగ్రీలకు (90°) ఉంటుంది. ఈ రెండిటికీ మధ్య 45 డిగ్రీలకు (45°) ఈశాన్యం ఉంటుంది. ప్రస్తుతం మీరు చూస్తున్నది ఈశాన్యం దిక్కుగా ఉన్న గృహము. ఈ చిత్రపటంలో ఒక గృహము ఈశాన్యం దిక్కుకు తిరిగి ఉన్నది. ఈ గృహము ముందర ఉన్న రహదారిని ఈశాన్య రహదారి అని అంటారు. అనగా ఈ గృహమునకు ఈ రహదారి ఈశాన్య రహదారి అవుతుంది. ఈశాన్యం మూలలో కట్టిన గృహము (Northeast corner House) వేరు, ఈశాన్యం దిక్కుకు తిరిగి ఉన్న గృహము (Northeast facing house) వేరు, ముందుగా ఈ విషయాన్ని మనము శ్రద్ధగా తెలుసుకోవాలి. ఈశాన్యము మూలలో కట్టిన గృహము సాధారణంగా ఊహించిన ఫలితాలను ఇవ్వవచ్చును. అదే ఈశాన్యము తిరిగిన గృహము అద్భుతమైన ఫలితాలను లేదా ఊహించిన ఫలితాలను ఇస్తుంది అని చెప్పలేము. ఈ విషయం తెలియక ఈశాన్య దిక్కుకు తిరిగిన గృహము అని, అధిక ధరలు పెట్టి గృహాలనుకొంటుంటారు. చివరికి ఇబ్బందులకు గురి  అయ్యి, ఆనక వాస్తు శాస్త్రవేత్తల దగ్గరకు వస్తుంటారు. ఈశాన్యం దిక్కుకు నిర్మితమైన గృహాల విషయంలో ప్రజలు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ చిన్న పొరపాటైననూ అనేక విధాలైనటువంటి సమస్యలను సృష్టిస్తుంది.
ఇటువంటి ఈశాన్యముకు తిరిగిన గృహాలు లేదా స్థలాలు దక్షిణ భారతదేశంలో తక్కువగా ఉండవచ్చు, లేదా ఉత్తర భారత దేశంలో అధికంగా ఉండవచ్చు, అయితే విదేశాలలో ఇటువంటి స్థలాలు లేదా గృహాలు కోకొల్లలు. లెక్కపెట్టలేనంతగా ఇటువంటి గృహాలు ఆ దేశాలలో నిర్మితమై ఉంటాయి. ఉదాహరణకు అమెరికా దేశంలో అయితే, ఈశాన్యము దిక్కుకు తిరిగిన గృహాలు దాదాపుగా లక్షల్లో ఉంటాయి. మన భారతీయులు కూడా అమెరికాలో లక్షల్లో ఉన్నారు కదా, ఈశాన్యము అనగానే వెనకా ముందూ ఆలోచన చేయకుండా అధిక ధరలు వెచ్చించి గృహాలను కొనేస్తుంటారు. ఇక్కడ గృహాలను కట్టే లేదా అమ్మే కంపెనీలు, భారతీయుల ఆలోచనను దృష్టిలో పెట్టుకొని, అత్యంత అధిక ధరలకు ఈ ఈశాన్యము స్థలాలను లేదా గృహాలను అమ్ముకుంటుంటారు.

ఇంటి ఈశాన్య మూల భాగమును చిత్రపటం ద్వారా సులభంగా గుర్తించే విధానం

ఈశాన్య మూల ఎక్కడ ఉంటుంది?ప్రతి ఒక్కరికి అర్థం అయ్యే రీతిలో ఈశాన్య మూల ఎక్కడ ఉందో తెలుపుతూ తయారుచేసిన ఈ చిత్రపటంలో ఉత్తరం అని తెలిపిన ప్రదేశము నుంచి ఒక గీత, మరియు తూర్పు అని తెలిపిన ప్రదేశం నుంచి ఒక గీత, రెండూ ప్రయాణం అవుతూ ఒక మూలభాగంలో కలుస్తాయి. ఈ మూలభాగమునే ఈశాన్యం మూల అని అంటారు. వాస్తు శాస్త్రంలో ఈశాన్య మూలకు లేదా ఈశాన్య భాగమునకు ఒక ప్రశస్తమైన, ప్రభావవంతమైన, విశిష్టమైన, అద్భుతమైన స్థానం ఉన్నది. ఈశాన్యం చెడితే సమస్తము చేసినట్లే అని పెద్దలు చెబుతూ ఉంటారు. గృహస్థుల యొక్క అభివృద్ధికి గృహస్తుల యొక్క ప్రశాంతతకు ఈశాన్య భాగము ఒక కీలక ఘట్టమును పోషిస్తుంది. దానిని దృష్టిలో ఉంచుకొని ఈ రెండు గీతలు కలిసిన ప్రదేశం లో నక్షత్ర ఆకారంలో కొన్ని ప్రత్యక్షమవుతూ ఉంటాయి, అనగా ఈ ప్రాంతము చాలా ప్రత్యేకమైనది మరియు చాలా ముఖ్యమైనది అని తెలుపుట కొరకు ఈ ఏర్పాటు చేయడం జరిగినది.

ప్రతి ఈశాన్య దిక్కు గృహం అద్భుతమైన ఫలితాలను ఇస్తుందా? ఒక ఉదాహరణ . ..

ఈశాన్యమునకు తిరిగిన గృహం.1. మీరు నమ్మాల్సిన అవసరం లేదు, అయితే ఒక విషయం మీకు తెలియడంవలన ప్రయోజనం ఉండవచ్చునేమోనని ఇక్కడ తెలపడం జరిగినది. మధు అనే వ్యక్తి , ఉత్తర అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం లో గృహాన్ని కొనాలనే ఉద్దేశంతో ఆన్లైన్లో ఒక వాస్తు శాస్త్రవేత్తని సంప్రదించి రెండు గృహాలకు వాస్తు చూపించుకున్నారు. వాస్తు చూపించుకోవడానికి పదేపదే డబ్బు కట్టాలంటే అతనికి మనసు ఒప్పలేదు, ఈ క్రమంలో ఒక బిల్డర్ కొత్తగా వేస్తున్న వెంచర్లో ఈశాన్యం దిక్కుకు తిరిగిన స్థలమని, ఒక లక్షా 19 వేల డాలర్లు అధిక ధనం చెల్లించి స్థలాన్ని (గృహాన్ని) సొంతం చేసుకున్నాడు. ఇది జరిగినది ఫిబ్రవరి నెల, 2018 వ సంవత్సరం. అదే 2018 వ సంవత్సరం నవంబర్ నెలలో ఇతనికి నూతన గృహాన్ని అప్పగించారు. మాకు తెలిసినంతలో ఇది అప్పట్లో ఒక రికార్డు. ఇక్కడ జరిగిన విషయాన్ని ఈ కింద పేరాలలో తెలుపుతున్నాము, మీకు సమయం ఉంటే, దయచేసి మొత్తం చదవండి, ఈ గృహస్థులు చేసిన పొరపాటు అర్థం అవుతుంది.
2. అది 2020 వ సంవత్సరము సెప్టెంబర్ నెల. మధు గారు ఈ గృహాన్ని అమ్ముకొని వేరే గృహానికి వెళ్లాలని బలమైన ప్రయత్నం చేసాడు, విషయం ఏమిటంటే, ఫలితాలు ఏమాత్రం మంచిగా రాకుండా, చెడు ఫలితాలు అధికంగా వస్తున్నాయి, ఎప్పుడు చూసినా ఏదో ఒక నస, ఒకటి పోతే ఒకటి సమస్యలు. ఇంట్లో ఎప్పుడూ వాదులాటలు, 2020 సంవత్సరం జులై నెలలో ఇతని శ్రీమతికి ఉద్యోగం పోయింది. ఒకరి జీతం మీద జీవన పోరాటం చెయ్యాలంటే ఎంత ఇబ్బందో అమెరికాలో ఉన్న వారికి బాగా తెలుసు. భార్యాభర్తలు ఇరువురు కూడా పని చేస్తుంటే ఒకరి జీతం గృహానికి ఉన్న బ్యాంకు కంతు కట్టుకోవడం, ఇతరత్రా ఖర్చులకు పోను, మిగిలిన వారి జీతము అట్టిపెట్టుకోవచ్చు. ఇది సర్వసాధారణంగా అమెరికాలో జరుగుతున్న తంతు. ఎప్పుడైతే తన భార్యకు ఉద్యోగం పోయిందో, అప్పుడు అతనికి వాస్తవం బోధపడింది. తను ఏదో పొరపాటు చేశాడని అప్పుడు గ్రహించాడు. ఇంకేముంది వెంటనే తన గృహానికి వాస్తు చూపించుకున్నాడు. ఆ గృహము ఈశాన్యం దిక్కుకు తిరిగినది, అయితే మంచి ఫలితాలు ఇచ్చే గృహం కాదు.
3. ఇది ఈశాన్యం దిక్కుకు తిరిగిన గృహమని తలచి వెనుకా ముందూ ఆలోచన చేయకుండా లక్ష ఇరవై వేల డాలర్లు "అధికధర" చెల్లించి గృహాన్ని కొన్నాడు, ఇంత అధిక ధర చెల్లించిన గృహస్థునికి, ఒక వాస్తు వ్యక్తికి ఇచ్చే సొమ్ము కోసం ఆలోచన చేశాడంటే ఏమనాలి !!! తెల్లవాళ్లు (local Americans) ఎంతైనా తినవచ్చు, మన భారతీయులు మాత్రం సంపాదన చేసుకోకూడదు అనే ఆలోచన అతనిలో బలంగా కనిపించింది. పీకల మీదికి వచ్చిన తర్వాత వాస్తు కోసం, ఇంటి లోపల చేయాల్సిన మరమ్మత్తుల కోసం ఎంత సొమ్ము అయిననూ వెనకాడక ముందుకు వచ్చేసాడు. తను చేసిన పొరపాటు ఏమిటో చేతులు కాలిన తర్వాత అర్థమైంది.
కొన్ని గృహాలకు వాస్తు గురించి చెప్పే సమయంలో ఇది ఇలా ఉంటే మంచిది అలా ఉంటే చెడ్డది అని చెప్పుకోవచ్చు అయితే మూలలకు తిరిగిన గృహాల గురించి చెప్పాలంటే అంత సులభం కాదు, ఎందుకనగా సంపూర్ణంగా చెప్పాలంటే పుస్తకమే వ్రాయాలి, సంక్షిప్తంగా చెబితే చదివే వారికి అర్థం కాదు. ప్రతి విషయంలోనూ కొన్ని పరిమితులు ఉంటాయి కదా. ఈ లింక్ లోని విషయాలను చదవడానికే కొందరు నొసలు చిట్లిస్తారు, ఒక పుస్తకాన్ని చదవాలంటే చదవగలరా?.

ఇదే ఇంకొక ఈశాన్య గృహం అద్భుతమైన ఫలితాలను ఎలా ఇచ్చింది?

ఈశాన్య ఇంటి ఫలితాలు బాగుంటాయాదయచేసి ఒక్కసారి ఇదే గృహాన్ని పై భాగంలో చూపించడం జరిగింది ఒక్కసారి ఆ చిత్రపటం గమనించండి మరొకసారి ఈ చిత్రపటాన్ని గమనించండి. ఏ మార్పులు జరిగాయో గమనించాలంటే కొంచెం కష్టం. అయితే జాగ్రత్తగా చూసినట్లయితే ఏ మార్పు జరిగిందో తెలుస్తుంది. అమెరికా దేశంలో ఫ్లిప్ మోడల్, స్విచ్ మోడల్, మిర్రర్ ఇమేజ్, అనే పదాలు సర్వసాధారణం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గృహం మధు గారి గృహం తర్వాత నాలుగో ఇల్లు. పేరు శివ. మధు గారు మరియు శివ గారి కుటుంబీకులు మామూలుగా కలవడం జరుగుతుంది, ఇరువురి పిల్లలు బాగా సాన్నిహిత్యం పెంచుకొని ఒకరంటే ఒకరు విడవలేని స్థితికి వచ్చారు. శివ గారు తన గృహం లో బ్రహ్మాండమైన సంతోషాన్ని చూస్తున్నారు, జీవితం బాగా కులాసాగా గడిచిపోతున్నది. మరి మధు గారి గృహానికి ఏమైంది?, ఇంతకీ దోషం ఎక్కడుంది. అసలు కిటుకు అర్థం కావాలంటే కష్టం, అయితే మీరు రెండు చిత్రపటాలను పదే పదే, పదేపదే, చూస్తే మీకు అర్థమవుతుంది ఒక చిన్న పొరపాటు జీవితాన్ని అతలాకుతలం చేసింది.
ప్రతి ఒక్క ఈశాన్య గృహం కూడా బ్రహ్మాండమైన ఫలితాలు / ఊహించిన ఫలితాలు వస్తాయి అని అనుకోకూడదు. ముందుగా ఈశాన్య గృహం కొనాలంటే ఎన్ని డిగ్రీలకు ఉన్నదో చూసుకోవాలి. 45 డిగ్రీలు దాటిన తర్వాత, గృహం తూర్పు ఈశాన్యం పక్కగా తిరుగుతున్నది అని తెలుసుకోవాలి. 45 డిగ్రీల లోపల ఉన్నట్లయితే, గృహం ఉత్తర ఈశాన్యం వైపుగా ఉన్నట్టుగా తెలుసుకోవాలి. 45 డిగ్రీలయితే అది ఖచ్చితమైన ఈశాన్యంగా తెలుసుకోవాలి. ఒకవేళ గృహం రమారమి 65 డిగ్రీల దాకా ఉంటే అప్పుడు బెడ్ రూమ్ ఎక్కడ ఉన్నదో చాలా జాగ్రత్తగా గమనించాలి. మధు గారి గృహం యొక్క బెడ్ రూమ్ దాదాపుగా వాయవ్య భాగమునకు వెళ్ళినది. అదే శివ గారి బెడ్ రూమ్ దాదాపుగా దక్షిణ నైరుతి / నైరుతి ప్రాంతంలో ఉన్నది. అంతేకాకుండా ముఖ ద్వారము, గారేజ్, వాస్తు ఫలితాల విషయం లో ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఇవే కాకుండా ఇంకా ఎన్నో ఇతర విషయాలను గమనించి మాత్రమే మనం ఒక గృహాన్ని కొనాలా వద్దా అనే నిర్ణయానికి రావాలి, అంతేకానీ ఒక గృహం ఈశాన్యం తిరిగింది కదా అని తొందరపాటు పడి గృహం తీసుకున్నట్లయితే భవిష్యత్తులో వచ్చే మంచి లేదా చెడు ఫలితాలను గృహస్థులు మాత్రమే అనుభవించాలి.

వెడల్పుగా నిర్మించిన ఈశాన్య ముఖ గృహం

వెడల్పుగా నిర్మించిన ఈశాన్య ముఖ గృహంఇప్పుడు మీరు చూస్తున్న చిత్రంలోని ఈశాన్య దిక్కుకు నిర్మితమైన ఈ గృహంలో అద్భుతమైన ఫలితాలు వస్తాయి అనడం సమంజసం కాకపోవచ్చును. ఇటువంటి గృహాలు మంచి కన్నా చెడు ఫలితాలే ఎక్కువగా ఇవ్వవచ్చు. ఒకవేళ మంచిఫలితాలు వస్తే, ఇంటి లోపల ఈశాన్య, నైరుతి కొలతలు గల పొడవాటి గదులు ఉండవచ్చును. ఈశాన్య దిక్కుకు గృహము నిర్మిస్తున్నారు అని తెలిసిన తర్వాత భోజనం చేసే వాళ్ళు కూడా మధ్యలో లెగసి ఇంటిని కొనేందుకు లగేత్తే వారు కోకొల్లులు. ఇక వెనుకా ముందూ ఆలోచన చేయరు,  ఈశాన్య దిక్కు అని తెలిస్తే చాలు వెనకంజ వేయక, వెంటనే వెళ్లి అడ్వాన్స్ చెక్కులు ఇచ్చి ఆ స్థలాలను లేదా గృహాలను రిజర్వ్ చేసుకునేవాళ్లు ఉత్తర అమెరికాలో వేలల్లో ఉన్నారు, ఇది వాస్తవము. గృహం చేరిన తర్వాత వచ్చే చెడు ఫలితాలను నిర్మూలించే దానికి మరియు మంచి ఫలితాలను పొందేందుకు వాస్తు శాస్త్రవేత్తల కోసం తాపత్రయపడేవారు చాలామంది ఉన్నారు. అంతే కాకుండా వాస్తు ఏమాత్రం పనిచేయదని, తమ జాతకాలు ఇంతేనని, తాము దురదృష్టవంతులు అని, అమెరికాలో భారతీయ వాస్తు పనిచేయదని, వాస్తు పుస్తకాలలో అనవసరంగా ఈశాన్య వాస్తు గురించి హైప్ చేశారని (అతిగా వివరించారని), ఈశాన్యమంతా ఒక డొల్ల అని, తాము పొరపాటు పడ్డామని, ఇలా అనుకునేవారు పదుల సంఖ్యలో కాదు వందలలో ఉన్నారు. తాము చేసిన పొరపాటును మాత్రం ఒప్పుకోరు. అహం అడ్డు వస్తుంది.

పొడవుగా నిర్మించిన ఈశాన్య ముఖ గృహం

ఈశాన్య దిశలో పొడవుగా నిర్మించబడిన గృహం.ఇప్పుడు మీరు చూస్తున్న చిత్రంలోని ఈశాన్య దిక్కుకు నిర్మితమైన ఈ గృహంలో ఊహించిన ఫలితాలను పొందే అవకాశం అధికంగా ఉన్నది. ఈశాన్య దిక్కుకు నిర్మితమైన గృహాన్ని కొంటే చాలా మంచిదని తలచే వారికి ఇటువంటి గృహము మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం అధికము. సాధారణంగా ఇటువంటి గృహాలు చెడు ఫలితాలను ఇవ్వవు. అయితే ఒక్క విషయం గమనించండి, ఇటువంటి గృహము లోపల మాస్టర్ బెడ్ రూమ్ లో వాయవ్య ఆగ్నేయ కొలతలు అధికంగా ఉండకూడదు, అంతేకాకుండా ఫ్యామిలీ రూమ్ కూడా ఆగ్నేయ వాయవ్య కొలతలు అధికంగా ఉండకూడదు. ఒకవేళ ఇటువంటి కొలతలు కలిగిన మాస్టర్ బెడ్ రూమ్ మరియు ఫ్యామిలీ రూమ్ ఉన్నప్పుడు, గృహస్తులు ఊహించిన మంచి ఫలితాలు రావడం కష్టమే. ఒకవేళ మీరు తీసుకునే గృహానికి మాస్టర్ బెడ్ రూమ్ మరియు ఫ్యామిలీ రూము, ఈశాన్యం నైరుతి కొలతల కన్నా, వాయవ్య ఆగ్నేయ కొలతలు అధికంగా ఉన్నట్లయితే,  దయచేసి బాగా అనుభవం ఉన్న ఒక వాస్తు శాస్త్రవేత్త  ద్వారా మాత్రమే తగిన నిర్ణయాన్ని తీసుకోండి, తొందరపాటు నిర్ణయాల వల్ల భవిష్యత్తులో చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది.
ప్రస్తుతానికి అమెరికాలోని చాలా రాష్ట్రాల నందు గృహాల ధరలు ఎంత చిన్నవి తీసుకున్నా 5 లక్షల డాలర్ల పై మాటే ఉంటున్నాయి, అధిక శాతం 1.2 లేదా 1.5 మిలియన్ డాలర్స్ గా ఉంటున్నాయి. ఇంత ధనం పోసేముందు వాస్తు కన్సల్టెన్సీ కి  అతి చిన్న మొత్తాన్ని కేటాయించడం వల్ల భవిష్యత్తులో మనకు లాభమే కానీ నష్టం కాదు కదా. బాగా ఆలోచన చేసుకుని మంచి నిర్ణయాన్ని తీసుకోండి. ఒకవేళ మీరు వాస్తు శాస్త్రంలో మహా నిష్ణాతులయితే ఇటువంటి గృహాలను కొనవచ్చు.

అర్ధ చంద్రాకారంలో ఈశాన్యం కోల్పోయిన ఈశాన్యం మూల గృహము

ఈశాన్యం కోత పడిన ఈశాన్య గృహంప్రస్తుతం మీరు చూస్తున్నది, ఈశాన్యం మూల గృహము. ఈ గృహములకు కూడా ఉత్తరం రోడ్డు మరియు తూర్పు రోడ్డు కలవు. అయితే ఈ రెండు రహదారులు కోణంగా కలవక, అర్థ చంద్రాకారంలో కలుస్తూ స్థలానికి ఈశాన్యంలో కోత పెడుతున్నాయి. ఈ విషయంగా ఎంతోమంది వాస్తు శాస్త్రవేత్తలు అనేక రకాలైనటువంటి తమ అభిప్రాయాలను తెలుపుతూ వచ్చారు. ఎప్పటికైనా లాజిక్ అనేది అతి ముఖ్యము, ప్రాముఖ్యము. అత్యంత ముఖ్యమైన విషయము తెలియజేస్తున్నాము జాగ్రత్తగా చదవండి. ఇటువంటి స్థలములలో గ్రహములు నిర్మించుకున్నప్పుడు ప్రహరీ గోడ ( దయచేసి మరొకసారి చదువుకోండి ) ఉన్నప్పుడు ఫలితాలు ఒక విధంగా, ప్రహరీ గోడ లేనప్పుడు ఇంకొ విధంగా ఫలితాలు ఉంటాయి. సాధారణంగా విదేశాలలో ముఖ్యంగా అమెరికా లాంటి దేశంలో ఇటువంటి గృహాలకు పూర్తి ప్రహరీ గోడ ఉండదు. అనగా 4 దిక్కులలో ప్రహరీ గోడ ఉండదు. ఇటువంటి పరిస్థితులలో చెడు ఫలితాలు రావడం చాలా అరుదు, ఒకవేళ ఇంటిలో ఏదైనా బలమైన వాస్తు దోషమున్నప్పుడు చెడు ఫలితాలు వస్తాయి, అంతేకానీ ఈశాన్య భాగంలో అర్ధచంద్రాకారంలో ఈశాన్యం కోతపడినదని భావించి కొందరు ఇటువంటి గృహాలను కొనాలా వద్దా అనే  నిర్ణయం తీసుకోలేకపోతున్నారు.
ఒకవేళ మీరు అమెరికాలో ఉన్నట్లయితే, ఇటువంటి స్థలాలకు ప్రహరీ లేనప్పుడు, ఇంటి లోపల అత్యంత బలమైన వ్యతిరేక వాస్తు నిర్మాణం లేనప్పుడు, ఇటువంటి స్థలములు లేదా గృహములను కొనవచ్చును. ఒకవేళ మీరు ఇతర దేశాలలో లేదా భారతదేశంలో ఉండి ఇటువంటి గృహాలకు ప్రహరీ ఉన్నప్పుడు మీరు కొనక పోవడమే మంచిది. ఒకవేళ కొనాల్సిన పరిస్థితి ఏర్పడితే తప్పకుండా ఒక మంచి వాస్తు శాస్త్రవేత్త ద్వారా గృహాన్ని మొత్తం పరిశీలింప చేయించుకుని తర్వాత నిర్ణయం తీసుకోగలరు. అనుభవం గడించిన వాస్తు శాస్త్రవేత్త ఇటువంటి ఆస్తిని గమనించిన పిదప తప్పకుండా కొన్ని ఉపాయములు చెప్పగలరు.

తూర్పు - ఉత్తర రహదారుల కోణంలో ఉన్న ఈశాన్య  ఇల్లు – వాస్తు విశేషాలు

తూర్పు మరియు ఉత్తర రహదారులు కలుస్తున్న ఈశాన్య మూల స్థలాన్ని కొనడం సబబేనా?ఇప్పుడు మీరు చూస్తున్న ఈశాన్య స్థలము పైన చెప్పుకున్న అర్థచంద్రాకారంలో కోతబడిన ఈశాన్య స్థలము కన్నా, ఇది ఉత్తమమైనది. ఉత్తరం రహదారి మరియు తూర్పు రహదారి, రెండూ కూడా ఈశాన్య కోణంలో కలుస్తున్నాయి, తద్వారా ఈ స్థలమునకు లేదా గృహమునకు ఈశాన్యము కోత పడలేదు, ఈశాన్య దోషం లేదు. ఇటువంటి స్థలములలో గృహం నిర్మించుకునే సమయంలో ప్రహరీ గోడ ఉన్నా, ప్రహరీ గోడ లేకపోయినా, పెద్ద మార్పులు ఏమీ ఉండవు, అవసరాన్ని బట్టి ప్రహరీ గోడను ఏర్పాటు చేసుకోండి, అవకాశం, అవసరం లేకపోతే ప్రహారి గోడ నిర్మించుకోవడాన్ని విరమించుకోండి. మామూలుగా ఇటువంటి గృహాలు, స్థలాలు గృహస్తులకు వ్యతిరేక ఫలితాలను ఇవ్వవు. జాతకం అద్భుతంగా ఉందని వచ్చే నెలలో పరీక్షలకు సరిగా చదవకపోతే ఫలితాలు ఎలా ఉంటాయో మీకు అందరికీ తెలుసు కదా!! అలాగే మనం తీసుకున్న స్థలం అద్భుతంగా ఉందని నిర్మాణం విషయంలో నిర్లక్ష్యం చేస్తే ఫలితాలు అనుకున్న రీతిలో రాకపోయి వాస్తు శాస్త్రం మీద మరియు వాస్తు శాస్త్రవేత్తల మీద అపనమ్మకం ఏర్పడే అవకాశం ఉంది. తదుపరి తమరి ఇచ్ఛ మరియూ దైవేచ్ఛ.

వాయవ్య ఆగ్నేయం పెరిగిన ఈశాన్య మూల గృహం

వాయవ్య ఆగ్నేయ పెంపు కలిగిన ఈశాన్య మూల ఇల్లుఎంతోమంది ఈశాన్యం గృహం అనగానే వెనుకా ముందూ చూడకుండా మంచి - చెడూ విచారించకుండా వెంటనే వెళ్లి స్థలానికి / గృహానికి అడ్వాన్స్ పేమెంట్ కట్టి ఆనక తీరిగ్గా విచారిస్తూవుంటారు. ఒక్కసారి చిన్న పొరపాటు చేస్తే అది దాదాపుగా రెండు తరాలను ముప్పు తిప్పులు పెట్టవచ్చు. ఈ స్థలము లేదా గృహం కూడా ఈశాన్య మూల ఇంటి గానే పరిగణిస్తారు. అయితే ఈ గృహమునకు వాయవ్యము మరియు ఆగ్నేయము పెరిగి ఉన్నాయి.  తద్వారా గృహమునకు ఈశాన్యము కోత పడినట్లే కదా. మామూలుగా చూసినట్లయితే ఈశాన్యంలో ఏ కోత లేనట్లుగా కనిపిస్తుంది, ఎప్పుడైతే వాయవ్య ఆగ్నేయాలు పెరుగుతాయో దాని అర్థం ఈశాన్యము కోతపడినట్లు అనుకోవాలి (అంతే కాకుండా ఇంకో సమస్య కూడా వుంది లెండి). అలా అనుకోవడానికి మనసు ఒప్పుకోకపోతే, వాయవ్య, ఆగ్నేయాలు పెరిగిన గృహంగానే దీన్ని పరిగణించాలి. ఎక్కువగా  వాదులాడుకోవడం వల్ల సమయం వ్యర్థమవుతుంది. తూర్పు రహదారి ముందుకు వెళుతూ వెళుతూ, అనగా ఉత్తరానికి వెళుతూనట్లు కనిపిస్తుంది, అయితే జాగ్రత్తగా గమనించినట్లయితే తూర్పు రహదారి వాయవ్యానికి వెళుతున్నట్టుగా స్పష్టంగా అర్థం అవుతుంది. అలాగే ఉత్తర రహదారి తూర్పు వైపునకు వెళుతున్నట్టుగా అనిపిస్తుంది. 
తీక్షణ దృష్టితో పరికించినట్లయితే, ఉత్తర రహదారి ఆగ్నేయమునకు వెళుతున్నట్టుగా అర్థమవుతుంది. ఇటువంటి స్థలములు కొనడం వల్ల లేదా ఇటువంటి గృహములను కొనడం వల్ల గృహస్థులకు వారు ఊహించిన విధంగా ఫలితాలు వస్తాయి అనుకోవడం కల్ల, కొన్ని రకాలైనటువంటి తీవ్రమైన ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది, అయితే కాస్త వెసులుబాటు ఉండవచ్చు. ఇటువంటి గృహాలు కొనే ముందు తప్పనిసరిగా ఒక అనుభవజ్ఞుడైన వాస్తు శాస్త్రవేత్త ద్వారా తగిన సలహాను పొంది తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోవడం వల్ల, జీవితము స్థిరంగా, భద్రత కలిగిన విధంగా ఉంటుంది.

మహోన్నత హృదయం గల మహాఇల్లాలిని ముప్పుతిప్పలు పెట్టిన ఈశాన్య గృహం

వాయవ్య ఆగ్నేయ పెంపు కలిగిన ఈశాన్య మూల ఇల్లు1. సింధూరి గారు దక్షిణ భారతీయులు, చాలా గౌరవప్రదమైన కుటుంబానికి చెందినవారు. 2009వ సంవత్సరంలో అమెరికాకు వెళ్లి అక్కడనే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. 2011వ సంవత్సరం లాస్ ఏంజెల్స్ లో ఒక నూతన గృహాన్ని కొన్నారు. వీరికి గ్రీన్ కార్డు కూడా ఉంది. ఆ తర్వాత కొన్ని కారణాలవల్ల 2016 సంవత్సరంలో Folsom city కి వెళ్లిపోయారు. ముందుగా ఒక కిరాయి గృహాన్ని తీసుకోవడం జరిగింది. 2017 జూన్ నెలలో ఒక గృహమును కొందామనే ఉద్దేశంతో, రకరకాలైన ఇళ్లను చూశారు. అప్పటికే వాస్తు గురించి ఒక అభిప్రాయం ఉండడంతో మంచి వాస్తు గలిగిన గృహాన్ని తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. సింధూరి గారు ఏ విషయంలో కూడా రాజీపడరు, ఉత్తమ మనసు ఉన్న గృహిణి. 4 గృహాలను చూసి, అందులో ఒకటి తీసుకోవాలనే ఉద్ధేశ్యంతో, సరిగ్గా వాస్తు శాస్త్రవేత్తకి డబ్బు కట్టే పరిస్థితులలో ఉండగా, తన భర్త నాన్నగారికి (మామ గారు) ​ విషయం తెలిసి తను కలగజేసుకొని, ఇండియాలో ఉచితంగా చూసే ఎంతోమంది నాకు తెలిసిన వాస్తు శాస్త్రవేత్తలు ఉన్నారు, వారికి చూపించి మీకు ఒక గంటలోపు నేను విషయం చెప్తానని, ఈ గృహాన్ని చివరికి ఫైనలైజ్ చేశారు.
2. కొన్ని రిపేర్లు (దక్షిణం ప్రహారీ లోని ఆకుపచ్చ రంగులో వున్న గీత గురించి క్రింద పేరాలలో చెప్పుకుందాం. ) చేయించుకొని 2017 ఆగస్టు నెలలో గృహప్రవేశం చేశారు. 2019 ఫిబ్రవరి లో కవల పిల్లలు పుట్టారు. ఇద్దరూ అమ్మాయిలే. వీరిలో ఒకమ్మాయికి బ్రెయిన్ ఎదగలేదని తరువాత వైద్యులు చెప్పారు. వీరికి అప్పటికే ఒక అమ్మాయి ఉంది. 2020 లో సింధూరి గారికి తన గృహంలో ఏదో జరుగుతోందని స్పష్టంగా అర్థం అయిపోయింది. ముగ్గురు పిల్లలను ఎల్లవేళలా చూసుకోవడం గగనమైపోయింది, అందులోనూ ఒకమ్మాయి ఉలుకూ లేదు పలుకూ లేదు. కేవలం మూడు సంవత్సరాల లోనే ఊహించనంతటి అనానుకూలతలు గృహంలో ఏర్పడ్డాయి, ఎప్పుడు చూసినా అసంతృప్తి, అది ఏమిటో తెలియదు, విపరీతమైన మానసిక క్షోభ, ప్రతి ఒక విషయాన్ని పదే పదే ఆలోచన చేయడం, చిన్నగా భర్తతో వాదులాటలు, అవి పెరిగి, పెరిగి, చెయ్యి దాటిపోయే పరిస్థితులకు వచ్చేసాయి.
3. చివరికి సింధురి గారే ఇండియాలోని తన మామగారికి ఫోన్ చేసి, ఈ గృహం లోకి వచ్చిన తరువాత తాము అనుభవిస్తున్న విపరీతమైన ఇబ్బందులను తెలిపారు, ఈ ఇంటిలో ఏదో పొరపాటు జరిగింది, దయచేసి మీరు కలగజేసుకొని దీనికి పరిష్కారం చూపమని కోరడంతో, మామగారు వెంటనే 200 రూపాయలు తీసుకున్న ఆ శాస్త్రవేత్తని పట్టుకొని, ఏం జరిగిందో విచారించారు. ఇల్లు అద్భుతంగా ఉంది మీ కోడలు జాతకం బాగాలేదని, మీ అబ్బాయి జాతకం చాలా బాగుందని తెలిపి చేతులు దులుపుకున్నాడు. ఈ విషయం సింధూరి భర్తకు తెలియడంతో, గృహంలో ఉండే అగ్గి కాస్త దావాలనంలా ఎగసి కుటుంబాన్ని రెండు ముక్కలు చేసే స్థితికి తీసుకొచ్చింది.
4. ఇవన్నీ కాదని, సింధూరి గారు అమెరికా లో గృహాలను చూసే అనుభవమున్న ఒక వాస్తు శాస్త్రవేత్త ద్వారా తన ఇంటిని చూపించుకోవడంతో, అసలైన విషయం బయటపడింది. ఈ గృహానికి ప్రహారి రూపంలో ఉత్తర వాయవ్యం, ఆగ్నేయం పెరగడం, ( అమెరికా దేశంలో ప్రహరీలు సంపూర్ణంగా ఉండవు, సాధారణంగా వెనుక భాగంలో మాత్రమే ప్రహరీలు వేసుకుంటూ ఉంటారు) ఇది కాస్తా వికృత రూపాన్ని సంతరించుకొని, గృహస్థులకు నరకం చూపించింది. ఒక్కసారి ఈ గృహాన్ని పరీక్షించండి. ఈ ప్రహరీ వల్ల ఈ గృహానికి ఉత్తర వాయవ్యము మరియు ఆగ్నేయ భాగాలు పెరిగి చిత్రవిచిత్రమైనటువంటి సమస్యలను సృష్టించాయి. ఒకే ఒక్క పొరపాటు, మొత్తం 3 కుటుంబాలు ఎన్నో నిద్రలేని రాత్రులను చూశాయి.
5. శ్రీమతి సింధూరి గారు వచ్చినది ఒక గౌరవప్రదమైన కుటుంబం నుంచి, ఒక గృహమునకు నెలకు 2,750 డాలర్ల కిరాయి కట్టే వారికి వాస్తు శాస్త్రవేత్తలకిచ్చే సంభావన గురించి ఏమాత్రం ఆలోచన చేసే మనస్తత్వం తనకు లేదు. అయితే తన మామగారు ఏదో కుమారుడికి మిగులపెట్టాలని యోచించాడు. అంతేకాకుండా తనకు తెలిసిన వాస్తు సిద్దాంతులు 100 రూపాయలు, లేదా 200 రూపాయలు మాత్రమే తీసుకునేవారు, ఈ చిన్న మొత్తాలను దృష్టిలో పెట్టుకొని ఆయన కూడా పొరపాటు పడ్డారు. అంతేకానీ, కక్కుర్తి మనిషి అయితే కాదు, వీరు కూడా మంచి ఉన్నత మనస్కులు, గౌరవస్తులు.
6. మామగారి తరపున వాస్తు చూసిన శాస్త్రవేత్తకి ఈ గృహంలోని మార్పులన్నీ తెలిపి ఆయన సరే అన్న తరువాత మాత్రమే, ఆర్కిటెక్ట్ ద్వారా కొటేషన్ తీసుకొని, మార్పులు చేయించారు. మీరు చూస్తున్న ప్రహారి లోని దక్షిణం లో వున్న గ్రీన్ కలర్ లైన్ అనేది పూర్వం వున్న ప్రహారి భాగము. సింధూరి వారు, కొన్ని అవసరాల రీత్యా, HOA వారితో మాట్లాడి, ప్రత్యేకమైన అనుమతి తెచ్చుకొని, ఆగ్నేయం కలుపుకున్నారు.
7. విదేశాలలో నివసించే భారతీయులకు 100 / 200 రూపాయల కన్సల్టెన్సీ గురించి బాగా తెలుసు, అయితే మామగారి మాటకు అడ్డు చెప్పలేక, పాపం శ్రీమతి సింధూరి గారు, ఆ గృహం లో నరకం చూసారు. విదేశాలలో ఉన్న భారతీయులు పొరపాటున కూడా వాస్తు శాస్త్రవేత్తలకు ఎంత ఇచ్చారో ఇండియాలో ఉన్న తమ కుటుంబీకులకు ఎటువంటి పరిస్థితులలోను తెలియజేయరు, ఒకవేళ తెలిస్తే అంతెందుకు ఇచ్చావు, ఇంతెందుకు ఇచ్చావు, ఇక్కడ వంద రూపాయలే కదా లేదంటే 200 రూపాయలు కదా, నీవు మాకు పంపించి ఉంటే మేము చక్కగా చూపించి పెట్టే వాళ్ళం కదా, ఇలాంటి మాటలు వస్తాయని వీరికి బాగా తెలుసు. విదేశాల్లో నివసించే భారతీయులు, ఎల్లవేళలా అభివృద్ధి చెందాలనే చూస్తారు, అంతే తప్పా, పొరపాటుగానైనా ఇటువంటి విషయాలలో తక్కువ ధరకు వచ్చే వారిని అస్సలు నమ్మరు. వీరు విద్యావంతులు, కష్టపడి విదేశాలకు వెళ్లారు, కొరివితో తలగ్గొకోరు.
8. ఒక్క సంఘటనకు ఇంత చెప్పుకోవాలా, అంత అవసరం ఉన్నదా అని కొందరికి ఒక ప్రశ్న ఉదయించవచ్చు. అవును, ఖచ్చితంగా, ఇంకా వివరాలు ఇవ్వాలి, అయితే కొన్ని పరిస్థితులలో (Search Engine Page Limitations) ఇంతకన్నా ఎక్కువ చెప్పలేకపోతున్నాము. శుభవాస్తు వెబ్సైటు ను గాలికి తిరిగే వారు చదవరు. సమాజంలో అత్యంత బాధ్యత కలిగిన వారు, గౌరవనీయ కుటుంబసభ్యులు, విద్యావంతులు, అభివృద్ధిని నిండుగా కోరేవారు, ఎల్లవేళలా ఇతరుల శుభములు కోరేవారు, సమాజం పట్ల బాధ్యత కలిగిన వారు, ఎప్పుడెప్పుడు ఇతరులకు సహాయం చేద్దామా అని ఎదురు చూసేవారు, కార్యదీక్షాపరులు, అకుంఠిత భావం కలిగిన వారు, మంచి హృదయం కలిగిన వారు ఈ వెబ్సైటును చదువుతారు.
9. ఇటువంటి ఎన్ని సంఘటనలైననూ ఎంతో ఓర్పుతో చదివేవారు ఈ శుభవాస్తు వెబ్సైట్ కు తరచుగా వస్తూ ఉంటారు. అటువంటి వారిని దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఈ వెబ్ సైట్ తయారు చేయడమైనది. అంతేకానీ, ఇతరులను నిందిస్తూ కాలం గడిపే వారి కోసం, సాధ్యమైనంత వరకు సోషల్ మీడియాలో సమయం గడిపేస్తూ ఈ భూమికి భారంగా నిలిచిన వారికోసం, ఏ కార్య దక్షత లేకుండా, జీవితాశయం లేకుండా, సమయాన్ని వ్యర్థపరుస్తూ ఇతరులను నిందిస్తూ కాలం వెళ్ళబుచుతున్న గాలి గాళ్ళ కోసం ఈ వెబ్సైట్ ను తయారు చేయలేదు. గమనించ ప్రార్థన.

ఈశాన్య గృహమునకు ఉత్తర వాయవ్యం పెరిగితే ఎటువంటి ఫలితాలు వస్తాయి?

ఉత్తర వాయవ్యము పెరిగిన ఈశాన్య దిశ గృహం – ఆర్థిక సమస్యలు కలిగించే వాస్తు లోపంఈ చిత్రంలోని ఇల్లు కూడా ఈశాన్య గ్రహమే. ఈ ఇంటికి కూడా ఉత్తరం రహదారి మరియు తూర్పు రహదారి కలవు. అయితే ఈ గృహమునకు ఉత్తర వాయవ్యము బాగా పెరిగినది. తద్వారా గృహస్తులు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఇలాగా కోణంగా ఉత్తర వాయవ్యము పెరిగిన గృహాల నివాసితులు అనేక ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సివుంటుంది. మానసికక్షోభలు ఉండవచ్చు. ఒకవేళ ఇటువంటి ఇంటిలో ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి వారు షేర్ మార్కెట్ లోకి వెళ్ళవద్దు. ఇటువంటి గృహాలలో ఉన్నవారికి షేర్ మార్కెట్ ఏమాత్రం కలిసి రాదు. అంతేకాకుండా ఇటువంటి ఇంట్లో నివసించే వారికి వ్యాపారాలు ఏ మాత్రం కలిసి రావు. వ్యాపారం బాగా జరుగుతున్నదని, దురాశ పడి అదనపు పెట్టుబడి పెట్టవద్దు. కొద్దిగా చెడు జరిగే అవకాశములు అధికం. అప్పులు విపరీతంగా పెరగవచ్చు. అయితే ఏదో ఒక రోజు సమస్యల నుంచి బయటపడతారు. ఎవరో ఒక రూపంలో కానీ, ఏదో ఒక రూపంలో కానీ వీరి సమస్య పరిష్కారం అయ్యేలా సహాయం చేస్తారు.

ఆగ్నేయ కోణం గా పెరిగిన ఈశాన్యం మూల గృహాలు మంచి ఫలితాలను ఇస్తాయా?

ఆగ్నేయ పెరిగిన ఈశాన్య మూల గృహం – వాస్తు శాస్త్ర లోపాన్ని చూపించే చిత్రంఈశాన్య మూల గృహం వాస్తు శాస్త్రంలో ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగినది. కానీ, ఈ గృహంలో ఆగ్నేయ కోణం (తూర్పు-దక్షిణ) విస్తరించి ఉండటం వల్ల కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. వాస్తు ప్రకారం, ఆగ్నేయం ఎక్కువ విస్తారంలో ఉండటం కుటుంబ సభ్యుల ఆర్థిక పరిస్థితిపై, శాంతి పై, ప్రతికూల ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా ఈ గృహస్తులకు కొద్దిగా శాడిస్ట్ మెంటాలిటీ ఉండవచ్చు అచ్చ తెలుగులో చెప్పుకోవాలంటే వక్రబుద్ధి ఉండవచ్చు. ఆగ్నేయ విస్తరణ కారణంగా అనవసర ఖర్చులు పెరగడం, పెట్టుబడులలో నష్టాలు కలగడం వంటి ఆర్థిక సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదే కాకుండా, ఆరోగ్య సమస్యలు కూడా ఎదురుకావచ్చు, ముఖ్యంగా కుటుంబ సభ్యులలో గుండె సంబంధిత సమస్యలు లేదా మానసిక ఆందోళనలు ఎక్కువవుతాయి. ఏదో ఒక కారణం చేత కుటుంబ సభ్యుల మధ్య ఉద్రిక్తతలు పెరగడానికి కారణమవుతాయి, ముఖ్యంగా మహిళలు ఇలాంటి ప్రభావాలను ఎక్కువగా అనుభవించే అవకాశం ఉంటుంది. ఈ సమస్యల పరిష్కారం కోసం ఆగ్నేయం విస్తరించిన భాగాన్ని తగ్గించటం చేసి సమతుల్యం చేయడం వంటి నిర్మాణ మార్పులను చెయ్యవచ్చు, అయితే, తప్పనిసరిగా అనుభవమున్న వాస్తు శాస్త్రవేత్త పర్యవేక్షణలో మాత్రమే జరగాలి. ఇలాంటి వాస్తు లోపాలు ఉండే గృహాలలోని ప్రతికూలతలను తగ్గించేందుకు వాస్తు నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.

తూర్పు ఆగ్నేయం పెరిగిన ఈశాన్య మూల ఇంటిని కొనవచ్చునా ?

ఆగ్నేయ పెరిగిన ఈశాన్య మూల గృహం – వాస్తు శాస్త్ర లోపాన్ని చూపించే చిత్రంఈ చిత్రంలో మీకు స్పష్టంగా తూర్పు ఆగ్నేయం పెరిగిన ఇంటిని చూడవచ్చు. మామూలుగా ఇటువంటి గృహాలు ఇంటిలో నివసించే వారికి కొన్ని రకాలైనటువంటి సమస్యలను సృష్టించవచ్చు. ఈ గృహంలో ఉండే వారి వృత్తిని బట్టి కూడా ఫలితాలలో కూడా కొన్ని మార్పులు సంభవించే అవకాశం ఉంది. ఉదాహరణకు ఇటువంటి గృహంలో ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు అనుకుందాము., అతని మీద అభాండాలు పడే అవకాశం ఉంది. లేదా అతనికి వచ్చే మంచి అవకాశాన్ని ఇతరులు లాక్కోవాలని శతధా ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఈ గృహస్తులకు ఏదో ఒక రీతిలో విజయం లభించే అవకాశం అధికము. ఉదాహరణకు ఒక ఉద్యోగస్తుడు ఈ గృహంలో ఉన్నట్లయితే, అతనిపై లంచాలు తీసుకున్నాడనే అపవాదు వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా ఇటువంటి గృహాల్లో చిన్నపాటి దొంగతనాలు కావడం, లేదా చిన్నపాటి అగ్నిప్రమాదాలు కావడం, లేదా చిన్నపాటి యాక్సిడెంట్ లాంటివి, జరిగే అవకాశం అయితే ఉంది. ఏ చెడు జరిగినా చిన్నగా అయ్యే అవకాశమే ఉంది, విపరీత స్థాయులలో ఏ నస్టాలు జరగవు. ఒకవేళ గృహములో వాస్తుకు వ్యతిరేకంగా బలమైన నిర్మాణం జరిగినట్లయితే, దోష ప్రభావాలు మరింత అధికం అయ్యే అవకాశం మెండు. జాగ్రత్తలు తీసుకోవడం వలన నివాసితులకే మంచిది.
ఈ స్థలానికి తూర్పు ఆగ్నేయం పెరగడమే కాకుండా ఒక చిన్న పార్టీ తూర్పు ఆగ్నేయ వీధి పోటు కూడా ఈ గృహమునకు కలదు, కొన్ని సమయాలలో తన ప్రభావమును చూపించే అవకాశం ఉన్నది. ఈ వీధి గృహములో నివసించేవారికి మంచిచేసేది కాదు. ఇంకొక విషయం ఏమిటంటే, ఈ సమస్యలను సులభంగా పరిష్కరించుకోవచ్చు. ముందుగా పెరిగిన ఆగ్నేయమును కోత పెట్టుకోవాలి. ఆ తరువాత ఈ చిన్నపాటి వీధి పోటు గురించి ఆలోచన చెయ్యాలి.

ఈశాన్య గృహానికి తూర్పు ఆగ్నేయ వీధిపోటు – జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?

తూర్పు–ఉత్తర రహదారి కలయికతో ఉన్న ఈశాన్య మూల గృహం – తూర్పు ఆగ్నేయ వీధి పోటు ప్రభావం మరియూ ఫలితాలుఈ గృహం కూడా ఈశాన్య మూల గృహమే. తూర్పు రహదారి ఉత్తరానికి సాగిపోతున్నది. ఉత్తర రహదారి మాత్రం తూర్పు రహదారి దగ్గర ఆగిపోతున్నది. ఇలాగ ఎన్నో కలయికలు వాస్తు శాస్త్రం లో ఉంటాయి. ఒక్క ఈశాన్య మూల గృహం అనగానే అన్ని గృహాలు ఒకేరీతిలో ఉంటాయి అని అనుకోకూడదు. ఈ గృహం అత్యుత్తమమైన ఈశాన్య గృహం కోవకు చెందినది కాదు. అలాగని చెడు ఫలితాలు ఇవ్వదు. మంచి ఫలితాలే ఇస్తుంది. 100 కు 100 మార్కులు రావడం వేరు, 100 కు 50 మార్కులు రావడం వేరు. ఇద్దరూ ఉతీర్ణులే, అయితే తేడా స్పష్టంగా కనిపిస్తున్నది కదా. అలాగే అన్ని ఈశాన్యం గృహాలు 100 కు 100 మార్కులు ఇవ్వవు. ఈ గృహమును జాగ్రత్తగా గమనించండి, తూర్పు ఆగ్నేయం నుండి ఒక రహదారి ఈ గృహమునకు తగులుతున్నది. దీని ఫలితాలు కూడా ఈ గృహమునకు వర్తిస్తాయి. ఈ వీధి పోటు వలన ఈ గృహస్థులకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నది. ఈ సమస్యకు పరిష్కారం ఉన్నది. వీధి పోటు పడుతున్న ప్రదేశంలో బాగా చెట్లను పెంచుకోవటం, లేదా advertisement బోర్డు లను ఏర్పాటుచేసుకోవటం, carshed ను ఏర్పాటు చేసుకోవటం, ఇతరత్రా కొన్ని మార్గాల ద్వారా సమస్యల నుండి బయట పడవచ్చును. మొత్తంమీద, ఈ గృహస్థులు సమస్యలనుండి బయట పడతారు.

ఈశాన్య గృహానికి ఆగ్నేయ వీధిపోటు ఉంటే దాని ప్రభావం ఎలా ఉంటుంది?

ఆగ్నేయ వీధి పోటు ఉన్న ఈశాన్య మూల గృహం చిత్రంఈ చిత్రపటమును జాగ్రత్తగా గమనించండి. ఇది కూడా ఈశాన్య మూల గృహమే. ఉత్తరం రహదారి తూర్పుకు సాగిపోయినది, మరియు తూర్పు రహదారి ఉత్తరమునకు సాగిపోయినది. సాధారణంగా ఇటువంటి గృహాలు చాలా మంచి ఫలితాలు ఇవ్వాలి. అయితే ఈ గృహమునకు ఆగ్నేయ భాగం నుంచి ఒక వీధి వచ్చి తగులుతున్నది, అనగా ఈ గృహమునకు ఆగ్నేయ వీధి పోటు కలదు. సాధారణంగా ఆగ్నేయ వీధి పోటు అనునది గృహస్థులకు పరిష్కారం కాని సమస్యలను సృష్టిస్తుంది. తద్వారా గృహస్తులు ఎల్లవేళలా ఆ సమస్యను పరిష్కారం చేయడం కోసం నానా యాగి పడుతుంటారు. దేవస్థానాల చుట్టూ తిరుగుతారు జ్యోతిష్యుల చుట్టూ తిరుగవచ్చు. ఇలాగ గృహస్తులు నానా తిప్పలు పడుతూ ఉంటారు. ఈ గృహమునకు ఆగ్నేయ వీధి పోటు ఉన్ననూ, అదృష్టవశాత్తు ఇది ఈశాన్యం మూల గృహము అయినందువల్ల ఆగ్నేయ వీధి పోటు ఫలితాలు బలమైన చెడును కలిగించకుండా ఈశాన్యం నిరోధిస్తుంది. అనగా ఈ గృహస్తులకు పరిష్కారం లభిస్తుంది. సమస్యలు అయితే వస్తాయి, కానీ పరిష్కారం కూడా లభిస్తుంది.
ఈ ఆగ్నేయ వీధి పోటు యొక్క దోష నివారణ కొన్ని పరిస్థితుల్లో చేయడానికి అవకాశం ఉంటుంది, కొన్ని పరిస్థితుల్లో గృహస్తులు నివారణ ఉపాయాలు ఎన్ని పాటించినా సత్ఫలితాలు రావు. కారణాలు అనేకం ఉన్నా కూడా పరిష్కార మార్గాలు కొత్తగా ఏమున్నాయో వెతకవలసిరావచ్చు. ఇటువంటి గృహాలలో శాడిస్ట్ లు ఉండే అవకాశం ఉంది. తమ వక్రబుద్ధి బయటపడకుండా వక్రంగా ఆలోచన చేస్తూ ఇతరుల కీడు కోరే వ్యక్తులు కూడా ఇటువంటి గృహాల్లో ఉండే అవకాశం ఉంది బాగా అనుభవమున్న ఒక వాస్తు శాస్త్రవేత్త ద్వారా గృహ పరిశీలన కావించుకొని తగిన ఉపాయాన్ని పొందడం ఉత్తమం. ఒకవేళ ఇటువంటి గృహాన్ని కొనవలసి వస్తే, వాస్తు శాస్త్రవేత్తకు చూపించుకొని మాత్రమే నిర్ణయం తీసుకోండి. స్వతహాగా తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో అనుకున్న మంచి చెయ్యకపోవచ్చును.

ఈశాన్య గృహానికి ఉత్తర-వాయవ్య వీధిపోటు ఉంటే ఫలితాలు ఎలా ఉంటాయి?

ఉత్తర వాయవ్య (NNW) వీధి పోటు ఉన్న గృహం వాస్తు నిర్మాణ చిత్రంఈ గృహానికి ఉత్తర వాయవ్య (NNW) వీధి పోటు ఉండటం వాస్తు శాస్త్రం ప్రకారం మిశ్రమ ప్రభావాలను కలిగించవచ్చు. ఉత్తర దిశ సాధారణంగా కుబేరుని దిశగా భావించబడుతుంది, ఇది ధనసంపత్తి, ఆర్థిక స్థిరత్వం, మరియు అభివృద్ధికి అనుకూలంగా ఉంటుంది. అయితే, ఈ గృహానికి ఉత్తరవాయవ్య వీధి పోటు ఉండటం వల్ల కొన్నిసార్లు ఆర్థిక నష్టం, నిర్ణయాల్లో తొందరపాటు, వ్యాపారాల్లో లాభనష్టాలు, మరియు స్థిరమైన అభివృద్ధి లోపించడం వంటి సమస్యలు ఎదురుకావచ్చు. ముఖ్యంగా, ఈ రకమైన వీధి పోటు గల ఇళ్లలో వ్యక్తిగత జీవితంలో స్థిరత లేకపోవడం, అనవసర ఖర్చులు పెరగడం, మరియు అవకాశాలు వచ్చినా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోవడం వంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇంకా ఇది కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు . కొంతమంది గృహస్థులు మానసికంగా స్థిరంగా లేకపోవడం, అనవసర ఆందోళనలతో ఉండటం, లేదా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకబడటం వంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. అలాగే, ఇంటిలో శాంతి లోపించడం, కుటుంబ సభ్యుల మధ్య అనవసరమైన వివాదాలు కలుగడం, నిద్రలేమి సమస్యలు ఎక్కువగా ఉండడం, మరియు అనవసర భయాలు, అనిశ్చితి భావన పెరగడం వంటి పరిస్థితులు కూడా కనిపించవచ్చు.
చాలా సందర్భాల్లో ఈ సమస్యకు పరిష్కారం అనేది చాలా తేలికగా అమలు చేయవచ్చు. అయితే, అసలు సమస్యను సమగ్రంగా విశ్లేషించకుండా ఏదో ఒక ఉపాయాన్ని వెంటనే అమలు చేయడం సరైనది కాదు. సమస్యను పూర్తిగా అర్థం చేసుకుని, దాని ప్రభావాలను గమనించి, తగిన ప్రణాళికతోనే పరిష్కారం దిశగా ముందుకెళ్లాలి. చెట్లు నాటడం, సైన్‌బోర్డులు పెట్టడం, ఒక షాపు ఏర్పాటు చేయడం లేదా కారు షెడ్ నిర్మించడం వంటి ఉపాయాలు ఉపయోగకరమే అయినా, అవి నిజంగా సమస్యను తగ్గిస్తాయా లేదా అనే విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. కొన్ని మార్పులు తక్షణ ప్రయోజనం కలిగించవచ్చు, కానీ దీర్ఘకాలికంగా చూస్తే, అవి సమస్యను మరింత పెంచే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే, పరిష్కార చర్య తీసుకునే ముందు దాని ప్రభావాలను విశ్లేషించి, అవసరమైన మార్పులను మాత్రమే అమలు చేయడం అత్యవసరం.

ఈ గృహాన్ని వాస్తవంగా ఈశాన్య గృహంగా పరిగణించవచ్చునా?

ఈశాన్య మరియు ఆగ్నేయ రహదారులు కలిగిన ఈశాన్య గృహ నిర్మాణం చిత్రంఈ గృహం ఈశాన్య గృహమా? కొన్ని సంఘటనలను ఇక్కడ తెలియ చెయ్యాల్సి ఉన్నది, అయితే కొన్ని ప్రత్యేక కారణాల వలన, కొందరి వివరాలను ఇవ్వలేకపోతున్నాము. భవిష్యత్తులో కొందరి అనుభవాలను ఇక్కడ పంచుకుందాం. ఈ గృహమునకు రెండువైపులా రహదారులు ఉన్నాయి. ఈశాన్య రహదారి, ఆగ్నేయ రహదారి. ఈశాన్యం వైపున ముఖద్వారం ఉంటే ఫలితాలు ఉత్తమంగా ఉంటాయి. సాధారణంగా, తూర్పు ముఖ గృహాలు చాలా శుభప్రదమైనవి, ఇది ఆరోగ్యం, బుద్ధి, మరియు విజయానికి సహాయపడుతుంది. ఒకవేళ ముఖద్వారం ఆగ్నేయం దిక్కుకు ఉంటే, కుటుంబంలో ఆగ్రహాన్ని, ఆర్థిక ఒడిదుడుకులను, మరియు అనవసరమైన ఖర్చులను పెంచే అవకాశం ఉంది, ఇంట్లో ఉండే వ్యక్తులకు మానసిక ఉత్కంఠ, నిర్ణయాలలో అస్పష్టత, మరియు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో, కుటుంబ సభ్యుల మధ్య ఒప్పంద లోపం, చిన్న చిన్న సమస్యలు పెద్దవిగా మారడం, అలాగే అనవసరమైన తగాదాలు తలెత్తడం వంటి సమస్యలు చోటుచేసుకోవచ్చు. అయితే, ఇంటి నిర్మాణం మరియు స్థల నిర్మాణ పరంగా సరైన మార్పులు చేస్తే, ఈ సమస్యలను తగ్గించుకోవచ్చు.
గృహస్థులు ఇంటి లోపల నిర్మాణం విషయంలో మరింత శ్రద్ధ తీసుకుంటే, మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఎంతో అనుభవమున్న వాస్తు శాస్త్రవేత్త చే గృహాన్ని, లేదా గృహ నమూనా పటమును పరిశీలింప చేయించుకోండి. వారు మీకు తప్పకుండా తగిన సహాయం చేస్తారు. ఒకవేళ గ్యారేజ్ (garage ) ఈశాన్యం లో ఉండి, ముఖద్వారం ఆగ్నేయంలో ఉంటే?, ఎలా చెయ్యాలి, ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి?. ఒక ఒకవేళ గ్యారేజ్ (garage ) ఆగ్నేయంలో ఉండి, ముఖద్వారం ఈశాన్యం లో ఉంటే?, ఎలా?, ఇటువంటి పరిస్థితులలో తమరు అపార్థం చేసుకోకపోతే, బాగా అనుభవమున్న ఒక వాస్తు శాస్త్రవేత్తచే ప్రతివిషయం పరిశీలింప చేయించుకొని ఆ పిదప తగిన నిర్ణయం తీసుకోవడం మేలు.

ఈ ఇంటిని ఈశాన్య గృహంగా అభివర్ణించడంలో వాస్తు నిపుణులు ఏమంటారు?

వాయవ్య–ఈశాన్య రహదారులు కలిగిన గృహ స్థానం వాస్తు చిత్రంఈ గృహానికి వాయవ్య-ఈశాన్య రహదారులు కలవు. ఇది వాస్తు శాస్త్రం ప్రకారం మిశ్రమ ప్రభావాలను కలిగించగలదు. ముఖ్యంగా ఇటువంటి స్థలముల నందు, ద్వారం అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. ముఖద్వారం విషయంలో గృహస్థులు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ముఖద్వారం ఇంటి శుభ-అశుభ ఫలితాలను ప్రభావితం చేయగల ముఖ్యమైన అంశం. ఈశాన్యం దిశ సాధారణంగా శుభప్రదమైనదిగా భావించబడుతుంది, ఎందుకంటే ఇది ఆరోగ్యం, ధనం, విజయం, మరియు ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించే దిశ. వాయువ్య దిశ, ఇది కొన్ని సందర్భాల్లో మానసిక స్థిరత్వాన్ని, సంబంధాల్లో అనుమానాన్ని, మరియు ఆర్థిక అనిశ్చితిని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ఈశాన్యం శక్తిని పూర్తిగా ఉపయోగించుకోగలిగితే, గృహస్థులకు అదృష్టం, అభివృద్ధి మరియు ప్రశాంతత లభించవచ్చు. కానీ వాయువ్య లో ముఖద్వారం ఏర్పాటుచేసుకున్నట్లయితే వ్యతిరేక ప్రభావం చూపించే అవకాశం అధికంగా ఉంది. కొన్ని సందర్భాల్లో గృహస్తులు ఆర్థిక ఒడిదుడుకులు, మానసిక ఒత్తిడులు, మరియు కుటుంబ విభేదాలు అనుభవించే అవకాశం ఉంది. ఈ రకమైన గృహాల్లో గృహ ద్వారం స్థానం ఎంతో కీలకం. ఈశాన్యం వైపు ముఖద్వారం ఉంటే , ఇది మంచి ఫలితాలను అందించగలదు.
గృహస్థులు ఇంటి లోపల నిర్మాణం విషయంలో మరింత శ్రద్ధ తీసుకుంటే, మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఎంతో అనుభవమున్న వాస్తు శాస్త్రవేత్త చే గృహాన్ని, లేదా గృహ నమూనా పటమును పరిశీలింప చేయించుకోండి. వారు మీకు తప్పకుండా తగిన సహాయం చేస్తారు. ఒకవేళ గ్యారేజ్ (garage ) ఈశాన్యం లో ఉండి, ముఖద్వారం ఆగ్నేయంలో ఉంటే?, ఎలా చెయ్యాలి, ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి?. ఒక ఒకవేళ గ్యారేజ్ (garage ) ఆగ్నేయంలో ఉండి, ముఖద్వారం ఈశాన్యం లో ఉంటే?, ఎలా?, ఇటువంటి పరిస్థితులలో తమరు అపార్థం చేసుకోకపోతే, బాగా అనుభవమున్న ఒక వాస్తు శాస్త్రవేత్తచే ప్రతివిషయం పరిశీలింప చేయించుకొని ఆ పిదప తగిన నిర్ణయం తీసుకోవడం మేలు.

ఈశాన్య మూలలో గృహం మరియు చుట్టూ ఖాళీ స్థలాల ప్రభావం - వాస్తు విశ్లేషణ

తూర్పు మరియు ఉత్తర రహదారులు కలిగిన ఈశాన్య మూలలో ఉన్న నీలి రంగు గృహం చిత్రంఈ చిత్రం లోని నీలి రంగు గృహం, ఈశాన్య మూల (Northeast Corner) లో ఉంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఈశాన్యం మూల గృహం అత్యంత శుభప్రదమైనది. ఈశాన్య మూల గృహాలు సాధారణంగా శుభఫలితాలను అందిస్తాయి. తూర్పు మరియు ఉత్తర రహదారులు కలిగి ఉండటం వాస్తు శాస్త్రం ప్రకారం మంచి లక్షణం. ఇది ఇంట్లో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని, ఆర్థిక స్థిరత్వాన్ని మరియు కుటుంబ సభ్యుల మధ్య మంచి సంబంధాలను ప్రోత్సహించగలదు . ఈ మొత్తం స్థలాలలో ఒక్క గృహం మాత్రమే ఈశాన్య మూలలో నిర్మించబడింది , మిగిలిన అన్ని ప్లాట్లు / స్థలాలు ఖాళీగా ఉన్నాయి. ఈశాన్య గృహానికి దక్షిణం మరియు పడమర వైపు ఎక్కువ ఖాళీ స్థలం ఉండటం వాస్తు దృష్ట్యా ప్రతికూల ప్రభావాలు కలిగించవచ్చు. ఇది ఆర్థిక నష్టం, అనిశ్చితి, అనారోగ్యాలు, మరియు కుటుంబ సభ్యుల మధ్య ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది. ఈ స్థలాన్ని కొనుగోలు చేయాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవడం సులభం కాదు. ఈశాన్య మూలలో గృహం ఉండటం శుభప్రదమైనదే అయినా , దక్షిణం మరియు పడమర వైపు ఖాళీ స్థలం ఎక్కువగా ఉండడం వల్ల ప్రతికూలతలు లేకుండా ఉండేందుకు వాస్తు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. స్వంత నిర్ణయం భవిష్యత్తులో బలమైన ఇబ్బందులను కలిగించవచ్చును.

ఆగ్నేయ ముఖ ద్వారం ఉన్న ఈశాన్య గృహం – వాస్తు శాస్త్రం ఏమంటుంది?

ఆగ్నేయ ముఖ ద్వారం కలిగిన ఈశాన్య గృహ నిర్మాణం వాస్తు చిత్రంఆగ్నేయ ముఖ ద్వారం ఉన్న ఈశాన్య గృహం. వాస్తు శాస్త్రం ప్రకారం మిశ్రమ ప్రభావాలను కలిగించగలదు. సాధారణంగా ఈశాన్యం దిశ ఇంటి నిర్మాణానికి అత్యంత శుభప్రదమైనదిగా భావించబడుతుంది, ఇది ఆరోగ్యం, ధనం, విజయం, మరియు శాంతిని ప్రోత్సహిస్తుంది. కానీ, ఆగ్నేయ ముఖద్వారం కలిగి ఉండటం వల్ల కొన్నిసార్లు బలమైన ప్రతికూల ప్రభావాలు కనిపించే అవకాశం ఉంటుంది. ఆగ్నేయం అగ్ని తత్వానికి సంబంధించినది , కాబట్టి, ఈ తలుపు కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఒడిదుడుకులు, మానసిక ఒత్తిడులు, మరియు కుటుంబంలో విభేదాలు, అశాంతి, అసౌకర్యాలు, కలిగించే అవకాశముంది. ఇంట్లో మహిళల ఆరోగ్యం ప్రభావితమయ్యే అవకాశముంది. ఈ రకమైన గృహాల్లో ఆకస్మిక ఖర్చులు అధికంగా ఉండటం, కుటుంబ సభ్యుల్లో అధిక ఆగ్రహ భావాలు పెరగడం, మరియు నిద్రలేమి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే, ఇంటి అంతర్గత వాస్తు నిర్మాణం సరైన విధంగా ఉంటే, చెడు ప్రభావాలను కొంతవరకు నియంత్రించుకోవచ్చు. ఈశాన్య గృహానికి తగిన ముఖద్వారం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం, ఇంటి నిర్మాణాన్ని సరైన రీతిలో ప్లాన్ చేయడం, మరియు వాస్తు నిపుణుల సూచనలు పాటించడం ద్వారా శుభప్రభావాలను పొందడం సాధ్యమవుతుంది.

తూర్పు రహదారి ఉత్తరానికి సాగిపోయిన ఈశాన్య గృహం

తూర్పు మరియు ఉత్తర రహదారులు కలిగిన ఈశాన్య గృహ చిత్రంఈ ఇంటికి తూర్పు మరియు ఉత్తర రహదారులు కలవు. ఈ గృహం కూడా ఈశాన్య గృహమే. ఈ గృహమును మరియు రహదారులను చాలా జాగ్రత్తగా గమనించండి తూర్పు రోడ్డు ఉత్తరానికి సాగిపోయింది, ఉత్తరం రోడ్డు తూర్పు రోడ్డు దగ్గరకు వచ్చి ఆగిపోయింది. ఈ విషయాన్ని మీరు శ్రద్ధగా గమనించి మనసులో పెట్టుకోండి. ఇలాగా ఉత్తరం రోడ్డు ఆగిపోయి తూర్పు రోడ్డు ఉత్తరానికి సాగినప్పుడు మహాద్భుతమైన ఫలితాలైతే ఆశించవద్దు. ఈ గృహం మంచి ఫలితాలే ఇస్తుంది, కానీ అత్యంత విశేషమైన వాస్తు ప్రయోజనాలను ఆశించడం అనవసరం. మనం పరిసరాల వాస్తు గురించి మాట్లాడడం లేదు, కేవలము ఈ ఈశాన్యం ప్లాట్ / ఇల్లు గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాము. దయచేసి ఒక్క విషయం గమనించండి ప్రతి ఒక్క ఈశాన్యం మూలలో నిర్మించిన గృహాము అద్భుతమైన ఫలితాలు ఇస్తాయని లేదా ప్రతి ఒక్క ఈశాన్య మూల గృహం కూడా సమమైన ఫలితాలు ఇస్తాయని చాలామంది అపోహ పడుతుంటారు. ఈ లింక్ నందలి విషయాలు చదివిన తరువాత ఎన్నో అపోహలు తొలగిపోవచ్చు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే, మమ్మల్ని సంప్రదించడానికి సంకోచించకండి.

ఉత్తర రహదారి తూర్పుకు సాగిపోయిన ఈశాన్య గృహము – వాస్తు ప్రభావాలు, ఫలితాలు

ఉత్తర రహదారి తూర్పు దిశకు సాగి, తూర్పు రహదారి ఉత్తరంలో ఆగే ఈశాన్య గృహ స్థానం చిత్రంఈ ఇంటికి కూడా తూర్పు మరియు ఉత్తర రహదారులు కలవు. ఈ గృహం కూడా ఈశాన్య గృహమే. రహదారులను చాలా జాగ్రత్తగా గమనించండి ఉత్తరం రోడ్డు తూర్పుదిక్కుకు సాగిపోయింది. తూర్పు రోడ్డు ఉత్తర రహదారి దగ్గర ఆగిపోయింది. చాలా చిన్న మార్పు, అయితే, ఫలితాల విషయం లో తేడాలు గమనించవచ్చును. ఇలాగా ఉత్తరం రోడ్డు తూర్పుదిక్కుకు సాగిపోయి, తూర్పు రోడ్డు ఉత్తరం రోడ్డు దగ్గర ఆగిపోయినప్పుడు, ఫలితాలు బాగా ఉంటాయి. ఈ గృహం మంచి ఫలితాలే ఇస్తుంది, విశేషమైన వాస్తు ప్రయోజనాలను ఆశించవచ్చు, (ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి, లేదా రాష్ట్రపతి కావాలి అనే కోరికలైతే నెరవేరవు) మనం పరిసరాల వాస్తు గురించి మాట్లాడడం లేదు, కేవలము ఈ ఈశాన్యం ఇల్లు గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాము. చూశారుగా ఎంత చిన్న మార్పు, అయితే ఫలితాల విషయంలో స్పష్టంగా తేడాలు గమనిస్తున్నాము. వాస్తు శాస్త్రంలో అత్యంత చిన్న మార్పు కూడా ఫలితాల విషయంలో తారుమారు చేయవచ్చు. మాది కూడా ఈశాన్యం గృహమే అయితే మాకు మంచి ఫలితాలు రావడం లేదు అనేవారు కొందరు ఉంటారు, అటువంటి వారికి ఈ లింకులోని విషయాలు చూపిస్తే తమ గృహంలో తేడా ఎక్కడుందో తెలుసుకోగలరు.

తూర్పు - ఉత్తర రహదారులు సాగిపోయిన ఈశాన్య గృహ వాస్తు ప్రభావాలు

ఉత్తర రహదారి తూర్పు దిశకు సాగి, తూర్పు రహదారి ఉత్తరంలో ఆగే ఈశాన్య గృహ స్థానం చిత్రందయచేసి ఒక్కసారి పైన కనబరిచిన రెండు చిత్రపటములను మరియు ఈ చిత్రపటంను ఒకటికి రెండుసార్లు గమనించండి. పై రెండు చిత్రపటంలోని ఈశాన్య గృహం కన్నా ఈ చిత్రపటంలో కనపరచిన ఈశాన్య గృహం మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ చిత్రపటం నందు ఉత్తర రహదారి మరియు తూర్పు రహదారి రెండూ కూడా ముందుకు సాగిపోతున్నాయి. ఈ రెండు కలిసిన ప్రాంతమును ఈశాన్యము అంటారని మీకు తెలుసు కదా. చిత్రపటంలో ఈశాన్య గృహము చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. ఇటువంటి ఈశాన్య గృహాలు వాస్తు శాస్త్రం ప్రకారం శుభప్రదమైన గృహాలుగా పరిగణింపబడతాయి. ఇటువండి నిలయాలు సాధారణంగా మంచి ఆరోగ్యాన్ని, ఆర్థిక స్థిరత్వాన్ని, విజయాన్ని, విద్యను, అభివృద్ధిని , ఆనందమును మరియు శాంతిని ప్రసాదిస్తాయి. ఇటువంటి గృహాలలో ముఖద్వారము ఉత్తమమైన దిశలో ఏర్పాటు చేసుకున్నట్లయితే గృహస్తుల జీవితాలు బాగా ప్రకాశిస్తాయి. ఈశాన్య దిశలో బోరువెల్, నీటి తొట్టెలు, పూజా గది లాంటి నిర్మాణాలు ఉంటే , ఇది ఇంటి శుభశక్తిని మరిం ఉన్నత స్థితికి చేరే దానికి అవకాశం అధికంగా ఉంటుంది.
నిర్మాణం చేసుకునే సమయంలోనే తూర్పు మరియు ఉత్తర దిక్కులలో ఎక్కువ ఖాళీ స్థలం వదులుకోవడం మరియు దక్షిణ మరియు పశ్చిమ వైపున తక్కువ ఖాళీ స్థలం వదులుకోవడం వల్ల ఫలితాలు ఇంకాస్త ఆనందకరంగా ఉంటాయి. ఈశాన్య ప్లాట్ నుండి మీరు ఎంత ఉన్నత స్థితిని ఆశిస్తాలో, అలాగే గృహమును కూడా వాస్తు శాస్త్రరీత్యా నిర్మాణం చేసుకున్నట్లయితే ఫలితాలలో లోపం లేకుండా, జీవితం ఆనందంగా గడిచిపోతుంది.

ఉత్తర ఈశాన్యం పెరిగిన ఈశాన్య గృహం, ఫలితాలు ఎలా ఉంటాయి?

ఉత్తర ఈశాన్యం పెరిగిన ఈశాన్య గృహముఈ చిత్రం లోని గృహం ఈశాన్య మూల (Northeast Corner) గృహం , ఇది వాస్తు శాస్త్రం ప్రకారం శుభప్రదమైన గృహంగా పరిగణించబడుతుంది. మీకు అవకాశం ఉన్నట్లయితే, దయచేసి ఒక్కసారి పైన చూపించిన మూడు చిత్రపటములను మరియూ ఈ చిత్రపటమును ఒకసారి గమనించండి. చిన్న చిన్న మార్పులు కానీ ఫలితాల విషయంలో కొన్ని తేడాలను మనము చూడవచ్చు. ఈ గృహమునకు తూర్పు రహదారి సాధారణమైన రీతిలో ఉత్తర రహదారిని దాటి ఉత్తరానికి వెళ్లినది, అయితే ఉత్తర రహదారి ఈ గృహమునకు ఈశాన్యమును పెంచుతూ తూర్పు రహదారిని దాటుతున్నది. తద్వారా గృహమునకు ఉత్తర ఈశాన్యం పెరిగినది. ఈ ఒక్కటి పెరగడం వల్ల ఆర్థిక అభివృద్ధి కలగడం, గృహంలో సంతోషం, దూర ప్రాంత ప్రయాణాలు, కాస్త ఖర్చులు అధికమైనను ప్రయోజనకారిగా ఉండడం, ఇంట ఆరోగ్యం బాగుండడం, స్త్రీలు సుఖపడడం లాంటి ఎన్నో ప్రయోజనకరమైన ఫలితాలు అందుతాయి. ఇంటికి ముఖద్వార స్థానం అత్యంత ముఖ్యమైనది. ముఖద్వారం తూర్పు ఈశాన్యం, లేదా ఉత్తర ఈశాన్యం దిశల్లో ఉంటే మంచి ఫలితాలను అందిస్తుంది. కానీ, తూర్పు ఆగ్నేయం లేదా ఉత్తర వాయవ్యంలో ముఖద్వారం ఉంటే ప్రతికూల ప్రభావం కనిపించవచ్చు.
ఒకవేళ ముఖద్వారం ఉత్తర వాయువ్య భాగంలో ఉన్నట్లయితే అనవసరమైనటువంటి ఆర్థిక సమస్యలు, రాకూడని ప్రదేశం నుంచి ధనం రావడం అనగా వ్యతిరేకమైన విధాలలో ధనం రావడం, ఇతరులకు పూచి పడి ఇంట ఉన్న ధనమును నష్టపోవడం, మానసిక అశాంతి, అనారోగ్యాల పాలు కావడం తదితరాలు జరిగే అవకాశం ఉన్నది, న్యాయస్థానాల చుట్టూ తిరగడం జరగవచ్చు. గృహమును వాస్తు శాస్త్రం ప్రకారం నిర్మిస్తే మెరుగైన ఫలితాలను పొందగలరు. ఇంటి నిర్మాణం సరైన రీతిలో ఉంటే, కుటుంబ సభ్యులకు శ్రేయస్సు, ఆనందం మరియు శాంతిని అందించగలదు . కాబట్టి, ఇలాంటి స్థలాన్ని కొనుగోలు చేసేటప్పుడు, లేదా ఇంటి నిర్మాణం కాక మునుపే కష్టపడే మనస్తత్వమున్న, భాద్యత తెలిసిన వాస్తు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

తూర్పు, ఈశాన్యం పెరిగిన గృహం - అదృష్టానికి మార్గమా లేదా సమస్యకు కారణమా?

తూర్పు ఈశాన్యం పెరిగిన ఈశాన్య గృహముదయచేసి తమరు ఏమీ అనుకోకుండా ఒక్కసారి పైన చూపించిన నాలుగు చిత్రపటములను గమనించి ఆ తర్వాత ఈ చిత్రపటం చూడండి. జాగ్రత్తగా చూసినట్లయితే తూర్పు రహదారి ఈ గృహమునకు తూర్పు ఈశాన్యం పెంచుతూ ఉత్తరానికి సాగిపోయినది. సాధారణంగా ఇటువంటి గృహాలు నివాసితులకు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. తూర్పు ఈశాన్యం పెరిగినటువంటి స్థలములలో గృహమును వాస్తు శాస్త్ర రీత్యా నిర్మించినట్లయితే గృహస్తులు అద్భుతమైన ఫలితాలను పొందగలరు. పిల్లలకు విద్య బాగా వస్తుంది, కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగా ఉంటుంది, జీవితంలో స్థిరత్వం ఉంటుంది, సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు కలిగి ఉంటారు, సంఘంలో వీరి మాట చెల్లుతుంది, ఆర్థిక అభివృద్ధి బాగా ఉంటుంది, ఇతరుల మీద, ఈ గృహ నివాసితులకు కొంచెం జాలి దయ అనేవి ఉంటాయి. దయచేసి గమనించండి, ముఖ ద్వారం ఏర్పాటు చేసిన ప్రదేశం అనేది అత్యంత ముఖ్యమైనది. ఒకవేళ ఇటువంటి గృహాలకు ముఖ ద్వారము వ్యతిరేక దిశలలో ఏర్పాటు చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు బాగా తగ్గి, చెడు ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంది.
ఉదాహరణకి తూర్పు ఈశాన్యం పెరిగినటువంటి గృహమునకు తూర్పు ఆగ్నేయ భాగంలో ముఖ ద్వారం ఉన్నట్లయితే, చెడు వ్యసనాలు, విద్య సరిగా రాకుండా పోవడం, చెడ్డ పేరు, అనవసరమైన ఖర్చులు అధికం కావడం, ఇతరత్రా వ్యతిరేక ప్రభావాలు ఉండవచ్చు. అనవసరంగా ఇతరులతో తగాదాలు పడడం, కుటుంబ సభ్యుల పై ఏదో ఒక సమస్యను తీసుకురావడం. సమస్యల నుంచి బయటపడడానికి ఇంటి పెద్ద ముప్పు తిప్పలు పడి వారిని వీరిని పట్టుకుని సమస్య నుంచి బయటపడడం, లేదా ఊహించని విధంగా కొన్ని దుస్సంఘటనలు జరగడం, వాటిని సరిదిద్దే క్రమంలో అనవసరమైన ఖర్చులు అపనిందలు, అలసిపోవడాలు, జరిగే అవకాశం ఉన్నది.

తూర్పు, ఉత్తర ఈశాన్యం పెరిగిన గృహాలు ఆనందాన్ని ఇస్తాయా, లేక విషాదాన్ని ఇస్తాయా?

ఈశాన్యం పెంపు కలిగిన ఈశాన్య గృహంఈ గృహానికి తూర్పు మరియు ఉత్తర రహదారులు ఈశాన్యం వైపుగా విస్తరించడం (Extending Towards Northeast) వాస్తు శాస్త్రం ప్రకారం అత్యంత శుభప్రదమైన లక్షణం. ఈశాన్యం దిశ ఇంటికి ఆధ్యాత్మిక శక్తిని, ఆరోగ్యాన్ని, విద్యను, మరియు ఆర్థికాభివృద్ధిని అందించే శక్తివంతమైన స్థానం. ఈ రకమైన గృహ నిర్మాణం సాధారణంగా మంచి ఫలితాలను , ముఖ్యంగా కుటుంబ సభ్యులకు శాంతిని, అభివృద్ధిని అందిస్తుంది. ఈ రహదారి విస్తరణ వల్ల ఇంటిలో పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా చేరుతుంది, దీని ద్వారా గృహంలో నివసించే వారికి ఆలోచనా శక్తి ద్విగుణీ కృతం కావడం, మానసిక ప్రశాంతత, ఆరోగ్యంగా ఉండే అవకాశాలు పెరుగుతాయి, పిల్ల పాపలతో గృహం కళకళలాడుతుంది, ఇంట్లో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని తీసుకురాగలదు, ఆర్థికంగా బలమైన స్థితిని అందించే అవకాశం ఉంటుంది, విదేశీ పర్యటనలు, దూరప్రాంత పర్యటనలు చేసే అవకాశం మెండుగా ఉన్నది. ఇలాంటి గృహాల్లో ఈశాన్యం వైపు ముఖద్వారం ఏర్పాటు చేస్తే, వాస్తు పరంగా ఇది మరింత శుభప్రదంగా మారుతుంది . అలాగే, ఈశాన్య మూలలో బోరువెల్, నీటి తొట్టెలు, లేదా పూజా గది ఏర్పాటుచేస్తే , ఇంటికి శుభశక్తిని పెంచే అవకాశాలు మెరుగవుతాయి.
ఈశాన్యం విస్తరించిన రహదారులు గల గృహం వాస్తు ప్రకారం చాలా గొప్పదిగా పరిగణించబడుతుంది. ఇంటి అంతర్గత నిర్మాణం కూడా సరైన వాస్తు ప్రణాళికతో ఉన్నప్పుడు పైన చెప్పుకున్నటువంటి ఉత్తమ ఫలితాలను గృహస్తులు అనుభవించగలరు. ఈశాన్య మూల గృహములలో ఇటువంటి గృహమును “రాజు” లాగా పరిగణించవచ్చు. ఇటువంటి గృహాలలో కూడా చాలామందికి మంచి ఫలితాలు రావడం లేదు. దీనికి కారణం ఏమిటంటే వీరు ముఖ ద్వారమును కానీ లేదా ప్రహరీ సరిహద్దు ద్వారం (main entrance gate) ను, ప్రహారికి సమంగా ఏర్పాటు చేసుకుంటారు, తద్వారా, తూర్పు ఈశాన్యంలో ఏర్పాటు చేసుకున్న గేటు తూర్పు ఆగ్నేయమును చూస్తుంది, ఉత్తర ఈశాన్యంలో ఏర్పాటు చేసుకున్న గేటు ఉత్తర వాయవ్యాన్ని చూస్తుంది, దీనివలన ఊహించిన ఫలితాలు రాక గృహస్తులు మదనపడుతుంటారు. ఒక చిన్న పొరపాటు చాలు మొత్తం వ్యవహారం తలకిందులు కావడానికి.
విజ్ఞప్తి : - ఇక్కడ ప్రచురించిన విషయాలు కొన్ని నిర్దిష్ట పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. కొన్ని ప్రత్యేక సందర్భములు లేదా భిన్న పరిస్థితులలో, ఫలితములు అనూహ్య మార్పులకు లోనయ్యే అవకాశముంది. వాస్తు శాస్త్రం ఒక సంక్లిష్టమైన శాస్త్రం, అనేక సూత్రాలతో, దృఢమైన నిబంధనలతో ముడిపడి ఉన్నది. వాస్తవం ఏమిటంటే, వాస్తు గ్రంథాలు, దృశ్యశ్రవణం (వీడియోలు) ఆధారంగా మార్పులు చేసుకొని ప్రయోజనం పొందిన వారికన్నా, అపాయకరమైన ఫలితాలను అనుభవించినవారే అధికంగా ఉన్నారు. స్వీయ నిర్ణయములను తీసుకోవద్దు. అనుభవజ్ఞులైన వాస్తు నిపుణుల సలహా తీసుకున్న తరువాత మాత్రమే నిర్ణయములు తీసుకోవలసినది. ఇక్కడ ఉద్దేశించేది కేవలం "వాస్తు విషయాలపై పరిజ్ఞానాన్ని" పెంపొందించడమే గానీ, అనుసరించమని సూచన కాదు. "ద య చే సి" ఈ విషయాన్ని గమనించగలరు.

సాంకేతిక నిపుణుల సహాయం కావలెను

ఇప్పటివరకు మీరు చదివినది వాస్తు శాస్త్రంలో ఈశాన్యం యొక్క వివరాలను ఒక్కశాతమునకు (1%) సమానమైన విషయాలు మాత్రమే, ఇక తెలుసుకోవలసినది 99% ఉంది. దీనిని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు వాస్తు శాస్త్రం అనునది ఎంత పెద్ద సబ్జెక్టు అనేది. పెద్ద వెబ్సైట్లను తయారు చేసే సమయంలో కొన్ని పరిమితులు ఉంటాయి, తప్పనిసరిగా వాటిని పాటించాలి, ఒక పుస్తకంలో రాసినంత వివరాలను ఒక వెబ్ పేజీలో ఇవ్వడం వల్ల చాలా సమస్యలు ఉత్పన్నమవుతాయి. అందుకోసం సంపూర్ణమైన వివరాలు అందించలేకపోతున్నాము. పుస్తకంలో రాసినంత విపులంగా వివరాలను ఇస్తే టెక్నికల్ గా కొన్ని సమస్యలు వస్తున్నాయి (page length restrictions as per Search engines). అందుకోసం మేము అనుకున్న రీతిలో వివరాలను ఇవ్వలేకపోతున్నాము. మీలో ఎవరైనా టెక్నికల్ నాలెడ్జి వున్నవారు తగిన సలహా ఇస్తే మేము తప్పకుండా ఈ వెబ్ పేజీ ని ఇంకాస్త వివరాలతో విపులీకరంగా తెలియచేస్తాము.

– : దాతల సమాచారం : –

ఎంతోమంది గృహస్థులకు తమకు జన్మనిచ్చి, ఉన్నతంగా తీర్చిదిద్దిన తమ తల్లిదండ్రుల పేర్లను లేదా తమ పెద్దల పేర్లను చిరస్థాయిగా ఈ సమాజంలో నిలిచిపోయెందుకు భారీ ప్రయత్నాలు చేస్తుంటారు. ఇది చాలా మంచి పరిణామము, మరియు వీరి ఆలోచన అద్భుతం, అపూర్వ సృజనాత్మకత. ఒక వేళ మీకంటూ ఇటువంటి ఆలోచన ఉన్నట్లయితే మీ లోకల్ లాంగ్వేజ్ లో వెబ్సైట్ తయారవుతున్నది. మీరు మీ పెద్దల పేర్లను చిరస్థాయిగా ఈ సమాజంలో నిలిపి ఉంచడానికి, వారి పేర్లు, పేర్లతో పాటుగా చిత్రపటములను కూడా ముద్రిస్తాము. ఈ వెబ్సైటు ఉన్నంతకాలం మీ పేరు, లేదా మీ తల్లితండ్రుల పేర్లు చిరస్థాయిగా నిలిచిపోతాయి. మొత్తం వెబ్ సైట్ అంతయు మీరు స్పాన్సర్ చేయవచ్చు. లేదా ఒక ప్రత్యేకమైన పేజీ ను స్పాన్సర్ చేయవచ్చు. సింగల్ టైం పేమెంట్ మాత్రమే. ప్రతి సంవత్సరం కట్టాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ మీకు స్పాన్సర్ చేయాలని అనిపిస్తే ఈ లింకు ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు, తదుపరి మిగిలిన సమాచారంను అందజేయగలము. https://www.subhavaastu.com/contact-us.html

– : SPONSORSHIP : –

Many residents are committed to honoring the names of their parents, grandparents, or elders, with the aim of keeping their legacy vibrant in their respective societies. This admirable effort is truly heartening. If you feel a connection to this endeavor, our website, thoughtfully crafted in your native language, offers a supportive platform while deeply respecting your sentiments. We are dedicated to helping you ensure that the names of your loved ones are remembered with respect and fondness. You have the option to sponsor either the entire website or a specific page, all with a single payment, freeing you from the concern of annual fees. In doing so, the names of those dear to you will be cherished and celebrated for as long as our website continues to exist. If you’re interested in this meaningful tribute, please contact us for more information : https://www.subhavaastu.com/contact-us.html

- : ప్రత్యేక ధన్యవాదములు : - పి కోటేశ్వర రావు - హైదరాబాద్